దర్శకుడు క్రిష్ జాగర్లమూడి
గమ్యం, వేదం లాంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రిష్, గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా ఘనవిజయం సాధించటంతో స్టార్ లీగ్‌లో చేరిపోయాడు. ప్రస్తుతం కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు క్రిష్. ఝాన్సీ లక్ష్మీ భాయ్ కథతో మణికర్ణిక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ఈ సినిమా తరువాత క్రిష్ ఓ బోల్డ్ కథతో సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. కన్నడ రచయిత బైరప్ప రాసిన పర్వ అనే నవలను సినిమాగా రూపొందించేందుకు క్రిష్ చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రిష్ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న టాక్ కూడా వినిపిస్తోంది.
మహాభారత గాథకు సంబంధించిన పాత్రల నేపథ్యంలో రాసిన పర్వలో పలు వివాదాస్పద విషయాలను ప్రస్తావించారు. ఇప్పుడు ఇదే కథతో సినిమా రూపొందించే ఆలోచనలో ఉన్నాడట క్రిష్. అయితే క్రిష్ తన తదుపరి ప్రాజెక్ట్‌గానే పర్వను ఎంచుకుంటాడా..? లేక మరో సినిమాను తెర మీదకు తీసుకువస్తాడా చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment