krish jagarlamudi
-
రెండో పెళ్లి చేసుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి.. అమ్మాయి ఎవరంటే? (ఫోటోలు)
-
రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ క్రిష్
తెలుగు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ప్రీతి చల్లా అనే డాక్టర్‌తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. ఈమెది హైదరాబాద్. గతంలోనే ఈమెకు వివాహం జరిగినప్పటికీ.. పలు కారణాల వల్ల భర్తతో విడాకులు తీసుకుంది. ఈమెకు 11 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడట. ఇద్దరి పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇప్పుడు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.2008లో వచ్చిన 'గమ్యం' సినిమాతో దర్శకుడిగా మారిన క్రిష్.. వేదం, కొండపొలం, గౌతమిపుత్ర శాతకర్ణి తదితర చిత్రాలు తీశాడు. 16 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ హిట్స్ అయితే కొట్టలేకపోయాడు. మధ్యలో రమ్య అనే డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ బంధం ఎంతో కాలం నిలబడలేదు. విభేదాల కారణంగా వీళ్లిద్దరూ విడిపోయారు. రమ్య.. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని యూఎస్‌లో సెటిల్ అయిపోయింది.(ఇదీ చదవండి: కన్నడ బ్యాచ్ కన్నింగ్ గేమ్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు?)చాన్నాళ్ల క్రితం క్రిష్ పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. హీరోయిన్ అనుష్కని పెళ్లి చేసుకుంటాడని అన్నారు. కానీ ఇప్పుడు ప్రీతి చల్లాని పెళ్లి చేసుకోవడంతో వాటికి ఎండ్ కార్డ్ పడింది. అలానే కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన క్రిష్‌కి పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.పవన్‌తో 'హరిహర వీరమల్లు' సినిమాని క్రిష్ డైరెక్ట్ చేయాలి. కానీ ప్రాజెక్ట్ లేట్ అవుతూ ఉండేసరికి తప్పుకొన్నాడు. ప్రస్తుతం అనుష్కతో 'ఘాటీ' చేస్తున్నాడు. త్వరలో ఈ మూవీ రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?) -
అనుష్క శెట్టి బర్త్ డే.. అరుంధతిని మరిపిస్తోన్న గ్లింప్స్!
టాలీవుడ్ స్వీటీ అనుష్క బాహుబలి తర్వాత పెద్దగా సినిమాలు చేయడం లేదు. గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ద్వారా ప్రేక్షరులను పలకరించింది. ఆ తర్వాత మళ్లీ ఏ ప్రాజెక్ట్‌లోనూ కనిపించలేదు. దీంతో అనుష్క ఫ్యాన్స్ సినిమాలకు గుడ్ బై చెప్పేయనుందా అన్న డైలామాలో పడ్డారు.అయితే ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా అనుష్క ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. ఆమె నటిస్తోన్న తాజా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి ఘాటీ అనే టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. దాదాపు 47 సెకన్ల పాటు ఉన్న గ్లింప్స్ అనుష్క ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చేతిలో కొడవలి పట్టుకున్న అనుష్క ఫుల్ మాస్ యాక్షన్‌తో అదరగొట్టేశారు. ఈ సినిమాను మహిళ ఓరియంటెడ్ కథగానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో అనుష్క పాత్ర చూస్తుంటే ఓ రేంజ్లో ఉండనుందని గ్లింప్ల్తోనే అర్థమవుతోంది. మరోసారి అరుంధతి రేంజ్ నటనను ఘాటీ గుర్తుకు తెచ్చేలా కనిపిస్తోంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. -
Krish Jagarlamudi : మళ్లీ పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్!
-
కొత్త సినిమాతో అనుష్క.. భయపెట్టేలా ఫస్ట్ లుక్
'బాహుబలి' తర్వాత అనుష్క సినిమాలు చేయడంలో పూర్తిగా నెమ్మదించింది. ఒకటి అరా మూవీస్ చేస్తూ వస్తోంది. గతేడాది సెప్టెంబరులో 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో హిట్ కొట్టింది. కానీ ఆ తర్వాత ఏమైపోయిందో, ఏం చేస్తుందో తెలియదు. ఇప్పుడు ఈమె పుట్టినరోజు సందర్భంగా కొత్త మూవీ డీటైల్స్ బయటకొచ్చాయి. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' కోసం తమన్.. 'కాంతార' మ్యూజిక్ డైరెక్టర్ కూడా?)'హరిహర వీరమల్లు' లేట్ అవుతూ వచ్చేసరికి ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేసిన డైరెక్టర్ క్రిష్.. అనుష్కని లీడ్ రోల్‌గా పెట్టి సినిమా తీస్తున్నాడు. దీనికే ఇప్పుడు 'ఘాటీ' టైటిల్ నిర్ణయించారు. అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. బాధితురాలే క్రిమినల్ అయితే? అనే కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.తల, చేతికి రక్తంతో చుట్ట తాగుతూ.. భయపెట్టేలా అనుష్క ఫస్ట్ లుక్ ఉంది. సాయంత్రం 4:05 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేస్తారు. ఇది పాన్ ఇండియా మూవీనే. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దీన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. బహుశా ఫిబ్రవరి లేదా మార్చిలో థియేట్రికల్ రిలీజ్ ఉండొచ్చేమో?(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు) -
డైరెక్టర్ క్రిష్ భారీ స్కెచ్..తప్పించుకునేందుకు ప్రయత్నాలు ?
-
డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ అరెస్ట్ ?
-
పాజిటివ్ వస్తే అరెస్ట్..
-
డ్రగ్స్ కేసులో అనూహ్య మలుపు.. విచారణకు వచ్చిన క్రిష్
డ్రగ్స్ కేసులో అనుమానితుడిగా ఉన్న సినీ డైరెక్టర్ క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పై హైకోర్టులో విచారణ జరగ్గా.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. దీంతో అనూహ్యంగా క్రిష్ శుక్రవారం సైబరాబాద్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. వాస్తవానికి విచారణకు వస్తానని చెప్పి ఆయన ముందస్తు బెయిల్‌కు వెళ్లడంతో ఆయనపై అనుమానాలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో బెయిల్ పిటిషన్ వాయిదా పడటం.. ఆయన విచారణకు రావడం వంటి పరిణామాలు జరిగాయి. అత్యంత గోప్యంగా పోలీసుల ముందుకొచ్చిన క్రిష్‌ను పోలీసులు కొద్దిసేపు విచారించిన అనంతరం రక్త, మూత్ర నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. డ్రగ్స్ అంశాలపై క్రిష్ రియాక్ట్ అయ్యారు.. తాను ముంబయిలో ఉన్నానని, పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని తెలిపారు. ప్రధాన నిందితుడిగా ఉన్న గజ్జల వివేకానంద్, నిర్భయ్, కేదార్నాథ్ రక్త నమూనాలు పాజిటివ్‌గా రావడంతో ఈ కేసు కీలక పరిణామంగా మారింది. హోటల్‌పై పోలీసులు దాడి చేసిన సమయంలో డ్రగ్స్ దొరక్కపోవడంతో ప్రధాన నిందితుడి జ్యుడిషియల్ రిమాండుకు అనుమతి లభించలేదు. మరోవైపు ఈ కేసులో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న లిషి, సందీప్, శ్వేత, నీల్ ఇప్పటి వరకు పోలీసుల విచారణకు రాలేదు. వారు డ్రగ్స్ తీసుకోకుంటే భయం ఎందుకు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆలస్యం చేసేకొద్దీ మూత్ర విశ్లేషణలో డ్రగ్స్ ఆనవాళ్లు తొలగిపోతాయనే కారణంతోనే వారు కాలయాపన చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో వారిని వీలైనంత త్వరగా గుర్తించాలని పోలీసులు భావిస్తున్నారు. నీల్ విదేశాలకు వెళ్లినట్లుగా అనుమానిస్తుండటంతో అతడిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విచారణకు రాని వారందరీ ఇళ్లకు 160 సీఆర్పీసీ నోటీసులు అంటించారు. -
డ్రగ్స్ కేసులో పోలీసులకు ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్ క్రిష్
-
ముందస్తు బెయిల్ కోసం క్రిష్ పిటిషన్ .. విదేశాలకు నిర్మాత కుమారుడు
డ్రగ్స్ కేసులో అనుమానితుడిగా ఉన్న సినీ డైరెక్టర్ క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ కేసులో అనుమానితులుగా ఉన్న రఘు చరణ్ అట్లూరి, సందీప్‌లు కూడా హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. మిగిలిన అనుమానితులు కూడా ముందస్తు బెయిల్ తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కొకైన్ తీసుకున్నారన్న కేసులో మంజీరా గ్రూపు డైరెక్టర్ వివేకానందతో పాటు నిర్భర్, కేదార్, డ్రగ్ పెడ్లర్ అబ్బాస్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అనుమానితులుగా ఉన్న డైరెక్టర్ క్రిష్‌తో పాటు చరణ్, సందీప్, లిషీ, శ్వేత, నీల్ ఇళ్లకు 160 సీఆర్పీసీ నోటీసులు అంటించారు. బెంగళూరులో ఉన్న రఘు చరణ్ అట్లూరి గురువారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో విచారణకు హజరయ్యారు. ఆయనను వైద్య పరీక్షలకు తరలించారు. కాగా, లిషీ సోదరి నటి కుషిత గచ్చిబౌలి స్టేషన్‌కు వచ్చి తన సోదరి లిషీ ఇంటికి రావడం లేదని పోలీసులకు తెలిపింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు హాజరు కావాలని, దీనిపై లిషీకి సమాచారం ఇవ్వాలని పోలీసులు కుషితకు చెప్పినట్టు సమాచారం. సందీప్, శ్వేతల ఫోన్లు స్విచ్చాఫ్ ఉన్నాయని, ఇప్పటి వరకు వారు అందుబాటులోకి రాలేదని పోలీసులు పేర్కొంటున్నారు. విదేశాలకు నీల్! ఇదిలా ఉండగా సైంధవ్ సినిమా నిర్మాత వెంకట్ బోయినపల్లి కుమారుడు నీల్ (ఏ9) విదేశాలకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అమెరికా పౌరసత్వం ఉన్న ఆయనను కొకైన్ తీసుకున్నట్లు అనుమానితుల జాబితాలో చేర్చడంతో దేశం విడిచి పారిపోయినట్లు పోలీసులు చెపుతున్నారు. మరో డ్రగ్ పెడ్లర్ అరెస్ట్ రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్ పార్టీ కేసులో మరో పెడ్లర్, పాతబస్తీకి చెందిన మీర్జా వాహెద్‌ను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట డ్రగ్ పెడ్లర్ అబ్బాస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తరువాత వివేకానంద డ్రైవర్ గద్దల ప్రవీణ్‌ను కూడా అరెస్ట్ చేశారు. దీంతో డ్రగ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. -
Drugs Case: గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్
హైదరాబాద్: గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో శనివారం రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. రాడిసన్ హోటల్లో 200 సీసీ కెమెరాలు ఉండగా కేవలం 16 కెమెరాలు మాత్రమే పని చేస్తున్నట్లు నిర్ధారించారు. డ్రగ్స్ పార్టీ నిర్వహణ కోసమే కెమెరాలు మాయం చేసినట్లు తెలిసింది. కాగా డ్రగ్స్ తీసుకున్న అనుమానితుల జాబితాలో డైరెక్టర్ క్రిష్ ఉన్న సంగతి తెలిసిందే! ఈయన డ్రగ్స్ పార్టీ జరిగిన గదిలో అరగంట పాటు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ పార్టీ కోసం డ్రగ్ సరఫరా చేసిన (పెడ్లర్) సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
డ్రగ్ పార్టీలో డైరెక్టర్ క్రిష్
గచ్చిబౌలి: గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో శనివారం రాత్రి జరిగిన డ్రగ్ పార్టీలో ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ పాల్గొన్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ తెలిపారు. అయితే కొకైన్ వాడారా? లేదా? అనేది తెలియాల్సి ఉందన్నారు. ఈ పార్టీ కోసం డ్రగ్ సరఫరా చేసిన (పెడ్లర్) సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీని అరెస్టు చేశామని చెప్పారు. రాడిసన్ హోటల్లో గజ్జల వివేకానంద్‌కు 10 సార్లు మాదకద్రవ్యాలు సప్లయ్ చేసినట్లుగా అబ్బాస్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడని వివరించారు. చాలాసార్లు డ్రగ్ పార్టీలు చేసుకున్నట్లు చెప్పాడని మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ డీసీపీ తెలిపారు. రెండురోజుల్లో క్రిష్‌ను విచారిస్తాం క్రిష్ రెండురోజుల్లో విచారణకు వస్తారని, ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని డీసీపీ చెప్పారు. వివేకానంద్‌ను కలిసేందుకు మాత్రమే వచ్చినట్లు క్రిష్ చెబుతున్నాడని, వైద్య పరీక్షలు చేస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. కేదార్, నిర్భయ్ అనే కామన్ ఫ్రెండ్స్ ద్వారా సినిమా వాళ్లు వివేకానంద్‌కు పరిచయం అయ్యి ఉండవచ్చని తెలిపారు. డ్రగ్‌కు బానిస కావడంతోనే తరచుగా పార్టీలు నిర్వహించి ఉండవచ్చని అన్నారు. డ్రగ్ హైదరాబాద్‌లోనే కొనుగోలు చేసినట్లు అబ్బాస్ చెబుతున్నాడని, అయితే ఎక్కడి నుంచి సరఫరా అయ్యిందో విచారణలో తేలుతుందని చెప్పారు. కొకైన్ సరఫరా చేసిన ప్రతిసారీ రెండు నుంచి నాలుగు గ్రాములు వివేకానంద్‌కు అందించాడన్నారు. వివేకానంద్ ఎంత మొత్తంలో డబ్బులు చెల్లించాడో త్వరలో చెబుతామని చెప్పారు. పరారీలో శ్వేత, సందీప్ కేసులో అనుమానితులుగా ఉన్న శ్వేత, సందీప్‌లు పరారీలో ఉండగా బెంగళూరులో ఉన్న చరణ్ అక్కడే విచారణకు వస్తున్నట్లు తెలిపారు. డ్రగ్ పార్టీ నిర్వహించిన వారితో పాటు హోటల్ నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని డీసీపీ స్పష్టం చేశారు. హోటల్లో కొన్ని సీసీ కెమెరాలు పని చేయడం లేదని, శనివారం రాత్రి 12.30 గంటలకు వెళ్లే సరికే అందరూ పార్టీ నుంచి వెళ్లిపోయారని వివరించారు. డ్రగ్ పార్టీలకు రెగ్యులర్‌గా ఎవరు వస్తున్నారు, డ్రగ్ సప్లయ్ చైన్ తదితర అంశాలపై విచారణ చేపడతామన్నారు. ఇప్పటికి పార్టీలో 10 మంది ఉన్నట్లు గుర్తించగా ముగ్గురికి డ్రగ్ పాజిటివ్‌గా వచ్చిందని, మిగిలిన వారిని కూడా విచారించి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. శ్వేత బెంగళూరు డ్రగ్ కేసులో కూడా నిందితురాలిగా ఉందంటూ మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, ఆ వివరాలు సేకరిస్తామని, గతంలో రాడిసన్ హోటల్ మేనేజర్ డ్రగ్‌తో పట్టుబడిన కేసు వివరాలు కూడా సేకరిస్తామని అన్నారు. సయ్యద్ అరెస్టుతో రాడిసన్ డ్రగ్ పార్టీ కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేసినట్లయ్యింది. -
డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్.. కీలక వ్యాఖ్యలు చేసిన మాదాపుర్ డీసీపీ
రాడిసన్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరికి కొకైన్ విక్రయించిన అబ్బాస్ అలీని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు పోలీసులు నిర్వహించిన దాడుల్లో మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానంద్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వివేకానంద్ నిర్వహించిన పార్టీలో క్రిష్, కేదార్, నిర్భయ్, నీల్, లిషి, శ్వేత, సందీప్, రఘుచరణ్‌లు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో వివేకానంద్, కేదార్, నిర్భయ్‌లను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేయగా.. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే డీసీపీ డాక్టర్ వినీత్ స్పందించారు. అసలేం జరిగింది? ఏం జరుగుతుందనేది వివరించారు. (ఇదీ చదవండి: పరారీలో క్రిష్.. స్పందించిన టాలీవుడ్ డైరెక్టర్!) 'రాడిసన్ హోటల్లో కొకైన్ సేవించిన కేసులో డ్రగ్ సరఫరా చేసిన సయ్యద్ అబ్బాస్‌ని అరెస్ట్ చేశాం. ఇతడు ఇచ్చిన స్టేట్మెంట్లో ఇప్పటివరకు 10 సార్లు గజ్జెల వివేకానంద్‌కు డెలివరీ చేసినట్లు చెప్పాడు. ఇదే హోటల్లో గతంలో కూడా పార్టీ చేసుకున్నట్లు మాకు తెలిసింది. శ్వేత, సందీప్ పరారీలో ఉన్నారు. చరణ్.. బెంగళూరులో ఉన్నానని, వస్తున్నానని చెప్పాడు. డ్రగ్స్ తీసుకున్న అనుమానితుల జాబితాలో డైరెక్టర్ క్రిష్ ఉన్నారు. ఇతడు డ్రగ్ టెస్ట్‌కి వస్తున్నానని చెప్పాడు' 'హోటల్ నిర్వాహకులపై కూడా కేసులు పెడతాం. అబ్బాస్ పదిసార్లు డ్రగ్స్ తెచ్చాడు, ఇన్నిసార్లు ఎక్కడి నుండి తెస్తున్నాడో విచారిస్తున్నాం. సరఫరా చేసిన ప్రతిసారి 4 గ్రాముల కొకైన్ తెచ్చాడని తెలిసింది. అలానే డైరెక్టర్ క్రిష్‌ని విచారిస్తాం. డ్రగ్ పరీక్షలు కూడా చేస్తాం. రక్త, మూత్ర పరీక్షలు చేస్తే అసలు నిజమేంటనేది తెలుస్తుంది. దీంతో పాటు వివేకానంద్ డ్రగ్ పార్టీలు ఎందుకు చేస్తున్నాడో విచారిస్తాం' అని డీసీపీ వినీత్ చెప్పారు. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన కొత్త వాచ్.. రేటు తెలిస్తే మైండ్ బ్లాకే) -
అనుష్క- క్రిష్.. ఓ ఒడిశా అమ్మాయి!
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఈ రంగంలో రాణించాలంటే.. ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ప్రస్తుతం ఆ అదృష్టానికి అనుష్క, క్రిష్ దూరమయ్యారు. ఇద్దరు మంచి ప్రతిభావంతులే. కానీ కాలం కలిసిరాకపోవడంతో కెరీర్ పరంగా కొంతవరకూ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల అనుష్క నటించిన.. క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. దీంతో ఈ ఇద్దరు టాలెంటెడ్ వ్యక్తులు కలిని ఓ సినిమా చేయబోతున్నారు.ఎలాంటి గాసిప్ లేకుండా వీరిద్దరి సినిమా పట్టాలెక్కడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అనుష్కని మెయిన్ లీడ్‌లో పెట్టి ఏకంగా ఓ పాన్ ఇండియా సినిమానే తెరకెక్కిస్తున్నాడట క్రిష్. పడిపోయిన అనుష్క గ్రాఫ్‌ని లేపడానికి యూవీ క్రియేషన్స్ ఈ బాధ్యతలను తీసుకున్నట్లు తెలుస్తోంది. లేడి ఓరియెంటెండ్ చిత్రాలు అనుష్కకి కొత్తేమి కాదు. అరుధంతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి లాంటి చిత్రాలెన్నో చేసింది. ఇవన్నీ కెరీర్ పరంగా అనుష్క స్థాయిని పెంచిన చిత్రాలే. అయితే చివరకు అలాంటి లేడి ఓరియెంటెండ్ చిత్రమే అనుష్క గ్రాఫ్‌ని పడిపోయేలా చేసింది. అదే జీరో సైజ్ మూవీ. ఈ మూవీ కోసం అధిక బరువు పెరిగింది ఈ యోగా టీచర్. ఆ తర్వాత బరువు తగ్గించుకోవడం కోసం నానాపాట్లు పడినా.. మళ్లీ మునుపటి అనుష్క మాత్రం తెరపై కనిపించలేదు. చాలా కాలం తర్వాత ఆ మధ్య మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమాతో తెరపై కాస్త అందంగా కనిపించింది. ఇక క్రిష్ సంగతి కూడా అంతే.. గమ్యం, వేదం, కంచె లాంటి సినిమాలతో టాలెంటెండ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2017లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణ వరకు క్రిష్‌కి మంచి గుర్తింపు ఉంది. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్స్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు క్రిష్ గ్రాఫ్‌ని కిందకు దించాయి. దీనికి తోడు మణికర్ణిక సినిమా విషయంలో కంగనా రనౌత్‌తో జరిగిన గొడవ క్రిష్‌కి మైనస్ అయింది. ఆ గొడవ వల్ల క్రిష్ బాలీవుడ్‌కి దూరమయ్యాయి. 2021లో కొండపొలం అనే సినిమా వచ్చేవరకు క్రిష్ పేరు ఎక్కడా వినిపించలేదు. అయితే కొండపొలం కూడా డిజాస్టర్ కావడంతో క్రిష్ ఢీలా పడ్డాడు. హరిహర వీరమల్లు చిత్రంతో గ్రాండ్ రీఎంట్రీ ఇద్దామనుకున్నాడు. కానీ ఆ చిత్రం మూడేళ్లుగా షూటింగ్ జరుపుకుంటునే ఉంది. ఇలా కెరీర్ పరంగా ఢీలా పడ్డ ఇద్దరు మోస్ట్ టాలెంటెడ్ వ్యక్తులు కలిసి ఓ పవర్ఫుల్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఒడిశాలో ఓ అమ్మాయి జీవితంలో చోటు చేసుకున్న యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం. తనకు జరిగిన ఓ అన్యాయంపై ఓ ఒడిశా అమ్మాయి ఎలా పోరాటం చేసిందనే నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఒడిశాలో జరుగుతుంది. అక్కడ అనుష్కపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఒడిశాకి చెందిన అమ్మాయి కథే కాబట్టి అక్కడ షూటింగ్ చేస్తున్నారని అంటున్నారు. మహిళా లోకం మొత్తం ఆలోచింపజేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట క్రిష్. మరి ఈ చిత్రంతో కెరీర్ పరంగా ఇద్దరు సక్సెస్ బాట పడతారో లేదో చూడాలి. -
కన్నతల్లి.. నేలతల్లి ఒకటే తనకీ.. రైతు పాట విన్నారా?
గేయరచయిత వేణు గుడిపెల్లి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘యువరైతు’. ఆర్పీఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాగుల ప్రసాదరావు నిర్మించాడు. ప్రభాకర్ దమ్ముగారి సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తన ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థలో మధుర ఆడియో ద్వారా విడుదల చేసారు. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ... రైతుకి కన్నతల్లి.. నేల తల్లి ఇద్దరూ ఒక్కటే అని... కష్టమైనా నష్టమైనా విడువడు ఎన్నటికి అని.. వ్యవసాయాన్ని, సాయాన్ని సరికొత్తగా అభివర్ణించారని మెచ్చుకున్నారు. అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చిన ప్రభాకర్ దమ్ముగారిని, సాహిత్యాన్ని అందించిన దర్శకుడు వేణు గుడిపెల్లి గారిని ప్రత్యేకంగా అభినందించారు. వ్యవసాయ పట్టభద్రుడి అందమైన హృద్యమైన ప్రేమ కథ ఇదని దర్శకుడు వేణు గుడిపెల్లి వివరించారు. భూమిని నమ్ముకున్న నాన్న చనిపోయాక.. అదే భూమిని నమ్మిన కొడుకు ఏం చేశాడు? అనేదే సినిమా కథ అని చెప్పారు. ప్రస్తుత సమాజంలో రైతు విలువని గుర్తు చేసే చిత్రమిదన్నారు. నిర్మాత రాగుల ప్రసాద్ రావు మాట్లాడుతూ... ఈ సినిమా ప్రతీ రైతుదే కాదు, అన్నం విలువ తెలిసిన ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్నారు. సంగీత దర్శకుడు ప్రభాకర్ దమ్ముగారి మాట్లాడుతూ... "ఇందులో ఉన్న భావోద్వేగాలు అద్భుతమని, ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్ళే సినిమా" అని తెలిపారు. చదవండి: ప్రశాంత్‌ను కారు దిగనివ్వని పోలీసులు.. రైతుబిడ్డను అన్నా.. ఇట్ల చేస్తే ఎలా? -
క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తోన్న ద్రోహి.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!
సందీప్ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ద్రోహి’. ది క్రిమినల్ అన్నది ఉపశీర్షిక. గుడ్ ఫెల్లోస్ మీడియా ప్రొడక్షన్స్, సఫైరస్ మీడియా, వెడ్నెస్డే ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి విజయ్ పెందుర్తి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి, విజయ్ పెందుర్తి, రాజ శేఖర్ అర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ.. 'సినిమాకు సంబంధించిన లుక్, గ్లింప్స్ చూశా. చాలా బాగుంది. ఈ సినిమాకు చక్కని విజయాన్ని సాధించి సినిమాకు పని చేసిన నటీనటులు, సాంకేతికి నిపుణులు అందరూ మంచి పేరు రావాలి. ఈ సినిమా టీమ్ అందరికీ శుభాకాంక్షలు' అని అన్నారు. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. 'చక్కని థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు చిత్రంలో ఉంటాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాక ఈ నెలలో సినిమాను విడుదల చేస్తాం' అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో సందీప్ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ, డెబి, షకలక శంకర్, నిరోజ్, శివ, మహేష్ విట్ట, మెహ్బూబ్, చాందినీ గొల్లపూడి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ప్రభాస్-అనుష్క ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
ప్రభాస్- అనుష్క టాలీవుడ్ సినీ హిస్టరీలో వారిది హిట్ పెయిర్ అనే చెప్పవచ్చు. మిర్చి,బిల్లా,బాహుబలి సీరిస్‌లతో మెప్పించిన ఈ జోడి తెలుగు ప్రేక్షలపై చెరగని ముద్ర వేసింది. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా నుంచి హాలీవుడ్ రేంజ్‌కు చేరుకున్నాడు. అనుష్క మాత్రం జీరో సైజ్ సినిమా దెబ్బతో ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయి. తాజాగా అనుష్క.. నవీన్ పొలిశెట్టితో ఓ సినిమాలో నటిస్తుంది. త్వరలో ఆ సినిమా కూడా విడుదల కానుంది. ఈ సినిమాతో సినీ కెరీయర్‌కు ఫుల్స్టాప్ పెడుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే మరోక అదిరిపోయే వార్త ఒకటి ఇండస్ట్రీలో నడుస్తోంది. (ఇదీ చదవండి: ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’మూవీ రివ్యూ) ప్రభాస్- అనుష్క కాంబోలో ఒక సినిమా రాబోతున్నుట్లు చాలా రోజుల నుంచి జరుగుతున్న ప్రచారమే మళ్లీ జోరందుకుంది. కానీ ఈసారి కొంచెం బలంగానే ఈ టాపిక్ వైరల్ అవుతుంది. ఎందుకంటే అనుష్క సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకుందట. ఇదే విషయాన్ని తెలుసుకున్న డైరెక్టర్ మారుతి.. ప్రభాస్‌తో తను తెరకెక్కిస్తున్న సినిమాలో నటించాలని అనుష్కను కోరారట. అందులో ఆమెను హీరోయిన్గా కాకుండా సినిమాకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న పాత్ర కోసం మారుతి అడిగారట. అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కానీ అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. కల్కి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చే సినిమా మారుతీదే కావడం విశేషం. (ఇదీ చదవండి: ఇంట్లో వాళ్లను కాదని యంగ్ డైరెక్టర్‌తో డేర్ చేస్తున్న నిహారిక ) ఇదిలా ఉంటే.. అనుష్క- ప్రభాస్ కాంబోలో మరో పిరియాడికల్ సినిమా తీసేందుకు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఓ కథను రెడీ చేశారట. ఇదే స్టోరీని బాహుబలి నిర్మాతలైన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలకు కూడా ఆయన కథను వినిపించారట. వారికి స్టోరీ నచ్చడంతో ఈ ప్రాజెక్టు నిర్మించడానికి ముందుకొచ్చినట్టుగా బలమైన ప్రచారం జరుగుతుంది. అటు ప్రభాస్ నుంచి కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మళ్లీ ప్రభాస్- అనుష్క జంటను బిగ్ స్క్రీన్‌పై వారిద్దరి ఫ్యాన్స్ చూడవచ్చు. ఒక విధంగా ప్రభాస్,అనుష్క ఫ్యాన్స్‌కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. -
‘హరి హర వీరమల్లు’లో బాలీవుడ్ స్టార్.. స్పెషల్ వీడియో వైరల్
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పవన్ లుక్కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సెట్లో మరో స్టార్ హీరో అడుగుపెట్టాడు. ప్రముఖ హిందీ నటుడు బాబీ డియోల్ నేడు ఈ చారిత్రాత్మక చిత్ర బృందంలో అధికారికంగా చేరారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తున్న ఆయన.. చిత్రీకరణలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చారు. కీలకమైన ఈ షెడ్యూల్ కోసం ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి 17వ శతాబ్దానికి చెందిన భారీ దర్బార్ సెట్ ను రూపొందించారు. పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను ఈ దర్బార్ సెట్ లో చిత్రీకరించనున్నారు. బాబీ డియోల్ కి ఘన స్వాగతం పలుకుతూ హరి హర వీర మల్లు బృందం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. అందులో ఆయన లుక్ ఆకట్టుకుంటోంది. -
ఫ్యాన్స్‌కు పండగే..'హరిహర వీరమల్లు' నుంచి పవర్ గ్లాన్స్ వచ్చేసింది..
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నటిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ ఫిక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. నేడు(శుక్రవారం)పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి పవర్ గ్లాన్స్‌ను శుక్రవారం ఉదయం విడుదల చేసింది. చదవండి: పవన్ కళ్యాణ్ బర్త్‌డే.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ మెడల్ని వంచి కథల్ని మార్చి కొలిక్కితెచ్చే పెట్టుకొని తొడకొట్టాడో .. తెలుగోడు అనే పాటతో పవన్ ఫైట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక భీమ్లా నాయక్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై లెజండరీ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుందిఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం,కననడం, మలయళం,హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. చదవండి: థియేటర్‌పై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రాళ్లదాడి.. అద్దాలు ధ్వంసం -
పవన్ కళ్యాణ్ బర్త్‌డే.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజాచిత్రం 'హరిహర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై లెజండరీ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. రేపు(శుక్రవారం)పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది మూవీ టీం. 'స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం' అనే క్యాప్షన్‌తో దర్శకుడు క్రిష్ ఈ పోస్టర్‌ను షేర్ చేశాడు. అంతేకాకుండా రేపు సాయంత్రం 5.45గంటలకు పవర్ గ్లాన్స్ పేరుతో ఓ పవర్ ఫుల్ వీడియో ను విడుదల చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. -
వేశ్య పాత్రలో యాంకర్ అనసూయ..!
Anasuya As Prostitute In Kanyasulkam Web Series: బుల్లితెర బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అటు యాంకరింగ్‌తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో అలరిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుంది. 'రంగస్థలం'లో 'రంగమ్మత్త'గా నటించి ప్రశంసలు దక్కించుకుంది. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్'లో దాక్షాయణిగా చేసి మరింత పేరు తెచ్చుకుంది. ఇప్పుడు చిరంజీవి 'గాడ్ ఫాదర్' చిత్రంలో మరో ప్రత్యేకమైన రోల్లో ఆకట్టుకునేందుకు రెడీగా ఉంది. తాజాగా మరో క్రేజీ పాత్రలో అనసూయ నటించనున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. గురజాడ అప్పారావు రచించిన క్లాసిక్ నాటకం కన్యాశుల్కం ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కథతో స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఒక వెబ్‌సిరీస్‌ను రూపొందించనున్నాడట. ఈ వెబ్ సిరీస్‌కు ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇస్తూ కథ-కథనం స్క్రిప్ట్ బాధ్యతలన్నీ క్రిష్ చూసుకోనున్నాడని తెలుస్తోంది. ఈ సిరీస్‌లో మధురవాణి అనే వేశ్య పాత్రలో అనసూయ నటించనున్నట్లు సమాచారం. ఈ రోల్లో నటించేందుకు అనసూయ సైతం ఓకే చెప్పిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కన్యాశుల్కం నాటకంలో మధురవాణి పాత్రకు ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్‌లో అనసూయ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. చదవండి: బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్ వైరల్ అందుకు నాకు అర్హత లేదు: మహేశ్ బాబు -
డైరెక్టర్ క్రిష్ వదిలిన 'టాక్సీ'.. ఆసక్తిగా ట్రైలర్
Director Krish Launched Taxi Movie Trailer: 'కర్త కర్మ క్రియ' సినిమాతో తెలుగు హీరోగా పరిచయం అయ్యాడు వసంత్ సమీర్ పిన్నమరాజు. వసంత్ హీరోగా హెచ్ అండ్ హెచ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై హరిత సజ్జా నిర్మిస్తున్న థ్రిల్లర్ చిత్రం 'టాక్సీ'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద డైరెక్షన్ విభాగంలో పనిచేసిన హరీశ్ సజ్జా ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అల్మాస్ మోటీవాల, సూర్య శ్రీనివాస్, సౌమ్యా మీనన్, ప్రవీణ్ యండమూరి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మార్క్ రాబిన్ సంగీతం అందించిన ఈ సినిమాకు బిక్కీ విజయ్ కుమార్ నిర్మాత. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ ప్రచార చిత్రాన్ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. 1 నిమిషం 59 సెకన్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంత ఇంటెన్స్‌గా ఆకట్టుకుంది. కాలిఫోర్నియమ్ 252 అనే అరుదైన హ్యూమన్ మేడ్ మెటల్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉన్నట్లు తెలుస్తోంది. డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. చదవండి: ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ? -
సాప్ట్వేర్ బ్లూస్ అంటే లక్షల్లో శాలరీలు, అమ్మాయిలు, పబ్బులు కాదు
శ్రీరాం, భావన, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కేయస్ రాజు, బస్వరాజ్ ముఖ్య తారలుగా ఉమా శంకర్ దర్శకత్వంలో సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘సాఫ్ట్వేర్ బ్లూస్’. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా రిలీజ్ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. ‘‘సాప్ట్వేర్ బ్లూస్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు లక్షలలో శాలరీలు, అమ్మాయిలు... పబ్బులు కాదు ..’ అనే డైలాగ్‌తో ఉన్న ఈ ట్రైలర్ చాలా హిలేరియస్‌గా ఉంది. సాఫ్ట్వేర్ జాబ్‌లో జరిగే చిన్న చిన్న గమ్మత్తులు, వారి జీవితాల గురించి ఉమాశంకర్ తెరకెక్కించిన ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు క్రిష్. ‘‘సాఫ్ట్వేర్ బ్యాక్‌డ్రాప్‌లో అవుట్ అండ్ అవుట్ కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా మా సినిమా ఉంటుంది’’ అన్నారు సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ వీకే రాజు. చదవండి: తన సినిమాకు తనే పాట రాసిన డైరెక్టర్.. అదిరిపోయిందిగా! -
ముగ్గురు ఖైదీలు, మూడు దొంగతనాలు.. '9 అవర్స్' రివ్యూ
టైటిల్: 9 అవర్స్ (వెబ్ సిరీస్) నటీనటులు: తారక రత్న, మధుశాలిని, అజయ్, రవిప్రకాశ్, వినోద్ కుమార్, బెనర్జీ, సమీర్ తదితరులు మూల కథ: మల్లాది కృష్ణమూర్తి 'తొమ్మిది గంటలు' నవల సమర్పణ, స్క్రీన్‌ప్లే: క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం: నిరంజన్ కౌషిక్, జాకబ్ వర్గీస్ సంగీతం: శక్తికాంత్ కార్తీక్ సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి విడుదల తేది: జూన్ 2, 2022 (డిస్లీ ప్లస్ హాట్‌స్టార్) ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన 'తొమ్మిది గంటలు' నవల ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ '9 అవర్స్'. ఈ వెబ్ సిరీస్‌కు క్రిష్ స్క్రీన్‌ప్లే అందించగా, నిరంజన్ కౌషిక్, జాకబ్ వర్గీస్ దర్శకత్వం వహించారు. చాలా గ్యాప్ తర్వాత తారక రత్న ఈ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చాడు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్పెషల్స్‌గా వచ్చిన ఈ వెబ్ సిరీస్‌ను క్రిష్ తండ్రి జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మించారు. హాట్‌స్టార్‌లో జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ '9 అవర్స్' వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. కథ: ఈ వెబ్ సిరీస్ కథ 1985 కాలంలో జరుగుతుంది. ముగ్గురు చొప్పున తొమ్మిది మంది మూడు బ్యాంక్‌లను దొంగతనం చేసేందుకు వెళ్తారు. ఈ మూడు దొంగతనాలకు రాజమండ్రి సెంట్రల్ జైలులోని ముగ్గురు ఖైదీలు ఒక్కో బ్రాంచ్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. అయితే వాటిలో రెండు దొంగతనాలు విజయవంతగా పూర్తి చేస్తారు. కానీ కోఠి బ్రాంచ్‌లో రాబరీ జరుగుతున్నట్లు పోలీసులకు తెలియడంతో దొంగలు చిక్కుల్లో పడతారు. మరీ ఆ దొంగలు పోలీసుల నుంచి ఎలా బయటపడ్డారు ? బంధీలుగా ఉన్న బ్యాంక్ ఉద్యోగులు, కస్టమర్లు తప్పించుకోడానికి ఏం చేశారు ? ఈ దొంగతనాల వెనుక అసలు ఎవరున్నారు ? అనేది తెలియాలంటే కచ్చితంగా ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: 1985లో జరుగుతున్న దొంగతనం బ్యాక్‌డ్రాప్‌కు తగినట్లుగా సినిమాటోగ్రఫీ బాగుంది. ఒకేసారి మూడు చోట్ల మూడు దొంగతనాలు జరగడం అనే అంశం ఆసక్తిగా ఉంటుంది. జైలు నుంచి వెళ్లిన ఖైదీలు 9 గంటల్లో మూడు రాబరీలు చేసుకుని మళ్లీ జైలుకు రావాలి. అయితే ఈ 9 గంటలను 9 ఎపిసోడ్స్‌గా మలిచారు. ఒకేసారి మూడు రాబరీలు చేయాలన్న కాన్సెప్ట్ బాగున్నా సిరీస్ ప్రారంభం ఎపిసోడ్స్ కొంచెం బోరింగ్‌గా ఉంటాయి. బ్యాంకు ఉద్యోగులు, దొంగతనానికి వచ్చిన వారి జీవిత కథలు ఒక్కో ఎపిసోడ్లో చూపించారు. అవి అక్కడక్కడ సాగదీతగా అనిపిస్తాయి. భర్త చనిపోతే వితంతు పరిస్థితి ఎలా ఉంటుంది ? భార్యభర్తల బంధం తదితర అంశాలను ఆకట్టుకునేలా చూపించారు. అప్పడప్పుడు వచ్చే ట్విస్ట్‌లు చాలా ఆకట్టుకుంటాయి. బంధీలుగా ఉన్న ఉద్యోగులు బయటపడే మార్గాలు, పోలీసుల అంచనాలను పటాపంచలు చేసే దొంగల తెలివి చాలా బాగా చూపించారు. ఈ సీన్లు బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్గా సాగుతున్న కథనంలో అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్లు కావాలని జొప్పించినట్లే ఉంటాయి. సిరీస్‌లో అనేక అంశాలను టచ్ చేశారు. అందుకే కథనం చాలా స్లోగా అనిపిస్తుంది. అక్కడక్కడ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. టైటిల్ 9 అవర్స్ కాబట్టి ఎపిసోడ్లను కూడా 9గా చేశారు. అదే మైనస్ అయింది. అలా కాకుండా 5 ఎపిసోడ్స్‌లో సిరీస్ ముగిస్తే సూపర్ థ్రిల్లింగ్‌గా ఉండేది. ఎవరెలా చేశారంటే? చాలా కాలం తర్వాత తారక రత్నకు మంచి పాత్రే దొరికందని చెప్పవచ్చు. కానీ ఆ పాత్ర హైలెట్‌గా నిలిచే సన్నివేశాలు ఎక్కడా లేవు. జర్నలిస్ట్‌గా మధుశాలిని పాత్ర కూడా అంతంతమాత్రమే. కానీ రాబరీలో బంధీలుగా ఉన్న పాత్రధారులు ఆకట్టుకున్నారు. దొంగతనంలో కూడా తన కామవాంఛ తీర్చుకునే సహోద్యోగి పాత్రలో గిరిధర్ మెప్పించాడు. అజయ్, వినోద్ కుమార్, బెనర్జీ, ప్రీతి అస్రానీ, సమీర్, అంకిత్ కొయ్య, రవివర్మ, జ్వాల కోటి, రవిప్రకాష్ వారి నటనతో బాగానే ఆకట్టుకున్నారు. ఒక్కొక్క అంశాన్ని, జీవిత కథలను చెప్పే కథనం స్లోగా సాగిన మలుపులు, రాబరీ ప్లానింగ్ ఆశ్చర్యపరుస్తాయి. ఓపికతో చూస్తే మంచి డీసెంట్ వెబ్ సిరీస్ ఇది. అయితే ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నారు అనే తదితర విషయాలపై ముగింపు ఇవ్వలేదు. దీన్ని బట్టి చూస్తే ఈ సిరీస్‌కు సెకండ్ సీజన్ రానున్నట్లు తెలుస్తోంది.