క్రైమ్‌ థ్రిల్లర్‌గా వస్తోన్న ద్రోహి.. ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ రిలీజ్! | Drohi Movie First Look Poster Released By Director Krish Jagarlamudi | Sakshi
Sakshi News home page

Drohi Movie: ‘ద్రోహి’ మూవీ ఫస్ట్‌ లుక్‌ .. క్రిష్‌ చేతుల మీదుగా రిలీజ్!

Published Fri, Sep 8 2023 9:32 PM | Last Updated on Sat, Sep 9 2023 9:31 AM

Drohi Movie First Look Poster Released By Director Krish Jagarlamudi - Sakshi

సందీప్‌ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ద్రోహి’. ది క్రిమినల్‌ అన్నది ఉపశీర్షిక.  గుడ్‌ ఫెల్లోస్‌ మీడియా ప్రొడక్షన్స్‌, సఫైరస్‌ మీడియా, వెడ్‌నెస్‌డే ఎంటర్టైన్మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి  విజయ్‌ పెందుర్తి దర్శకత్వం వహిస్తున్నారు.  శ్రీకాంత్‌ రెడ్డి, విజయ్‌ పెందుర్తి, రాజ శేఖర్ అర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి విడుదల చేశారు.

ఈ సందర్భంగా క్రిష్‌ మాట్లాడుతూ.. 'సినిమాకు సంబంధించిన లుక్‌, గ్లింప్స్‌ చూశా. చాలా బాగుంది. ఈ సినిమాకు చక్కని విజయాన్ని సాధించి సినిమాకు పని చేసిన నటీనటులు, సాంకేతికి నిపుణులు అందరూ మంచి పేరు రావాలి. ఈ సినిమా టీమ్‌ అందరికీ శుభాకాంక్షలు' అని అన్నారు. 

దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. 'చక్కని థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు చిత్రంలో ఉంటాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాక ఈ నెలలో సినిమాను విడుదల చేస్తాం' అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో సందీప్‌ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ, డెబి, షకలక శంకర్‌, నిరోజ్‌, శివ, మహేష్‌ విట్ట, మెహ్బూబ్‌,  చాందినీ గొల్లపూడి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement