కిల్లర్‌తో వస్తోన్న టాలీవుడ్‌ డైరెక్టర్‌.. ఆసక్తిగా పోస్టర్స్! | Tollywood Director Poorvaj Latest Movie First Look Poster Out Now | Sakshi
Sakshi News home page

Killer Movie: కిల్లర్‌తో వస్తోన్న టాలీవుడ్‌ డైరెక్టర్‌.. ఆసక్తిగా పోస్టర్స్!

Published Fri, Nov 22 2024 4:18 PM | Last Updated on Fri, Nov 22 2024 6:00 PM

Tollywood Director Poorvaj Latest Movie First Look Poster Out Now

శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ లాంటి డిఫరెంట్ సినిమాలతో అలరించిన డైరెక్టర్ సుక్కు పూర్వాజ్. తాజాగా మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన డైరెక్షన్‌లో కిల్లర్ అనే  యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్ కీలక పాత్రలో కనిపించనుంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్స్‌ చూస్తుంటే కిల్లర్ మూవీపై అంచనాలు పెంచేస్తున్నాయి. పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చేతిలో రివాల్వర్‌తో కనిపిస్తోన్న ఈ పోస్టర్స్ మూవీ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను
ఏయు అండ్ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో  థింక్ సినిమా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement