![Tamil Movie Released In Telugu With the name Paa Paa First look Poster - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/20/telugu.jpg.webp?itok=SpkJBDHh)
తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన మూవీ 'దా...దా..'. ఈ చిత్రాన్ని ఒలింపియా మూవీస్ సంస్థ ఎస్ అంబేత్ కుమార్ సమర్పించారు. తెలుగులో ఈ చిత్రాన్ని నీరజ సమర్పణలో పాన్ ఇండియా మూవీస్, జేకే ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఎమ్మెస్ రెడ్డి నిర్మాతగా తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు శ్రీకాంత్ నూనెపల్లి, శశాంక్ చెన్నూరు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
(ఇది చదవండి: ఒక్క ఫైట్ సీన్.. ఆ హీరో జీవితాన్నే ముగించింది!)
ఈ సందర్బంగా నిర్మాత ఎంఎస్ రెడ్డి మాట్లాడుతూ.. 'తమిళంలో మంచి యూత్‌ఫుల్, లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచి కొన్ని కోట్ల రూపాయలు వసూళ్లు చేసిన చిత్రం దా...దా... తెలుగువారి కోసం పా...పా..పేరుతో తీసు కొస్తున్నాం. ఎన్నో పెద్ద సంస్థలు పోటీ పడినా.. తెలుగులో ఇలాంటి సినిమాని మా సంస్థ తీసుకురావాలని రెడీ అయ్యాము. ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాం. అతి త్వరలో గ్రాండ్‌గా ట్రైలర్ లాంఛ్ ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ప్రోత్సహించడంలో ముందుంటారు. అలానే పా...పా... చిత్రాన్ని తెలుగులో మంచి బ్లాక్ బస్టర్ చెయ్యాలని చేస్తారని ఆశిస్తున్నాం.' అని అన్నారు. ఈ చిత్రంలో కవిన్, అపర్ణా దాస్, మోనికా చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ, వి టి వి గణేష్ ప్రధాన పాత్రల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment