Jyothi
-
కిల్లర్‌తో వస్తోన్న టాలీవుడ్ డైరెక్టర్.. ఆసక్తిగా పోస్టర్స్!
శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ లాంటి డిఫరెంట్ సినిమాలతో అలరించిన డైరెక్టర్ సుక్కు పూర్వాజ్. తాజాగా మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన డైరెక్షన్లో కిల్లర్ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్ కీలక పాత్రలో కనిపించనుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్స్ చూస్తుంటే కిల్లర్ మూవీపై అంచనాలు పెంచేస్తున్నాయి. పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చేతిలో రివాల్వర్‌తో కనిపిస్తోన్న ఈ పోస్టర్స్ మూవీ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమానుఏయు అండ్ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో థింక్ సినిమా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Venkata Suresh Kumar Kuppili (@poorvaaj) -
Peruri Jyoti Varma: పవర్ ఫుల్
విరామం అంటే వెనక్కి తగ్గడం కాదు, పరాజయం అంతకంటే కాదు. విత్తనం నాటిన రోజు నుంచి అది పచ్చగా మొలకెత్తడానికి మధ్య కూడా విరామం ఉంటుంది. ఒకప్పుడు హ్యాండ్‌బాల్ గేమ్ నేషనల్ ప్లేయర్ అయిన జ్యోతి పెళ్లి తరువాత కుటుంబ బాధ్యతల వల్ల ఆటలకు విరామం ఇవ్వాల్సి వచ్చింది. విరామం తర్వాత మళ్లీ ఆటల ప్రపంచంలోకి అడుగుపెట్టిన పేరూరి జ్యోతి పవర్ లిఫ్టింగ్‌లో తక్కువ సమయలోనే సాధన చేసి గోవాలో జరిగిన బెంచ్‌ప్రెస్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో 45 కిలోల బరువు ఎత్తి కాంస్యం సాధించింది. నిజానికి అది పతకం కాదు... అపూర్వమైన ఆత్మవిశ్వాసం...జ్యోతి స్వస్థలం మహారాష్ట్రలోని నాగ్‌పూర్. పెళ్లికిముందు హ్యాండ్‌బాల్ గేమ్‌లో నేషనల్ ప్లేయర్. 1994లో ‘విజ్ఞాన్ యూనివర్శిటీ’లో ప్రొఫెసర్‌గా చేస్తున్న డాక్టర్ పిఎల్ఎన్ వర్మతో వివాహం జరగడంతో గుంటూరుకు వచ్చింది. కుటుంబ బాధ్యతల వల్ల ఆటలకు దూరంగా ఉండక తప్పలేదు. అయితే వ్యాయామాలకు, యోగ సాధనకు విరామం ఇవ్వలేదు. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, మగ్గం పని... వంటి అభిరుచుల పట్ల మక్కువను విడవలేదు. మనం అడుగుపెట్టే స్థలాలు కూడా భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి అంటారు. జ్యోతి విషయంలో అలాగే జరిగింది.ఏడాది క్రితం స్థానిక ‘ఇన్ఫినిటీ జిమ్’లో చేరి రకరకాల వ్యాయామాలు చేసేది. ఆమె ఉత్సాహం, పట్టుదల చూసి కోచ్ రమేష్ శర్మ ‘మీరు పవర్ లిఫ్టింగ్‌లో అద్భుతాలు సాధించగలరు’ అన్నారు. ఆమె నవ్వుతూ ఊరుకుంటే ఆ కథ అక్కడితో ముగిసేది. కోచ్ మాటలను ఆమె సీరియస్‌గా తీసుకుంది. ‘ఒకసారి ఎందుకు ప్రయత్నించకూడదు’ అనుకున్నది. అలా అనుకోవడంలో పతకాలు సాధించాలనే ఆశయం కంటే... ఆటల పట్ల చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టమే కారణం. ఆరు నెలల క్రితం పవర్ లిఫ్టింగ్‌లో సాధన మొదలుపెట్టింది. ఇది చాలామందికి ఆశ్చర్యంగా అనిపించింది. ‘ఇంకా నువ్వు కాలేజీ స్టూడెంటే అని అనుకుంటున్నావా’ లాంటి వెటకారాలు వినిపించాయి. అయితే ఈ వెటకారాలు, మిరియాలు ఆమె సాధన ముందు నిలవలేకపోయాయి. మరింత దీక్షతో సాధన చేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన మాస్టర్స్ నేషనల్స్‌లో కొద్దితేడాతో పతకం మిస్ అయింది. ‘పతకంతో తిరిగి వస్తావనుకున్నాం’ అన్నారు మిత్రులు. ‘వంద పతకాలతో తిరిగి వచ్చాను’ అన్నది జ్యోతి నవ్వుతూ. ఆమె చెప్పిన వంద పతకాలు... ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసంతోనే గోవాలో జరిగిన బెంచ్‌ప్రెస్ నేషనల్స్ చాంపియన్ షిప్లో రికార్డు స్థాయిలో 45 కేజీలు బరువు ఎత్తి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. నిజానికి ఇదిప్రారంభం మాత్రమే. ఆమె ఉత్సాహం, పట్టుదల చూస్తుంటే మరిన్ని విజయాలు ఆమె ఖాతాలో పడతాయని నిశ్చయంగా చెప్పవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే...ఏదైనా సాధించాలంటే మన విలువ మనం ముందుగా గుర్తించాలి. నిత్య వ్యాయామంతోనే ఆరోగ్యం సాధ్యం అవుతుంది. నాకు ఆరోగ్య సమస్యలున్నాయి. హైపో థైరాయిడ్, స్పాండిలైటిస్ నన్ను ఇబ్బంది పెట్టినా వాటిని అధిగమించి ముందుకు వెళ్తున్నాను. రోజూ యోగ, జిమ్, మెడిటేషన్, గార్డెనింగ్ చేస్తాను.– పేరూరి జ్యోతి– దాళా రమేష్‌బాబు, సాక్షి, గుంటూరుఫొటోలు: మురమళ్ల శ్రీనివాసరావు. -
సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని జీడిమెట్ల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం నిందితులకు సహకరించిన జ్యోతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమెను మేడ్చల్ కోర్టులో హాజరుపరిచారు. సబ్ రిజిస్ట్రార్ జ్యోతికి 14 రోజులు పాటు రిమాండ్ విధించింది మేడ్చల్ కోర్టు.కాగా సుభాష్ నగర్లో 200 గజాల స్థలాన్ని నకిలీ పత్రాలతో పద్మాజా రెడ్డి అనే మహిళ కబ్జా చేసింది. అయితే అప్పట్లో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన జ్యోతి ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం పద్మజా రెడ్డికి సహకరించింది. ఇటీవల పోలీసులు పద్మజా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను రిమాండ్‌కు తరలించారు. తాజాగా ఈ కేసులో సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని సైతం అరెస్ట్ చేశారు. -
జ్యోతి పూర్వజ్ కొత్త సినిమా ప్రకటన
తెలుగు బుల్లితెరపై పలు సూపర్ హిట్ సీరియల్స్‌తో పాటు సినిమాల్లో నటించి వీక్షకుల ఆదరణ పొందడంతో పాటు సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న నటి జ్యోతి పూర్వజ్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన మరో కొత్త సినిమా రానుంది. శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తాజాగా 'కిల్లర్' అనే సెన్సేషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని వారు అనౌన్స్ చేశారు. మూవీ టైటిల్‌తో పాటు మోషన్ పోస్టర్ లాంఛ్ చేశారు మేకర్స్.పవర్ ఫుల్ లేడీ, గన్, చెస్ కాయిన్స్‌తో ఆల్ట్రా మోడరన్‌గా డిజైన చేసిన 'కిల్లర్' మూవీ మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్‌పై పూర్వాజ్, ప్రజయ్ కామత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . ఈ కొలాబ్రేషన్ లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది. పూర్వాజ్ 'కిల్లర్' చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు. View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) -
నా బిడ్డను బతికించండి
గాందీ ఆస్పత్రి: ప్రాణాపాయస్థితి కొట్టుమిట్టాడుతున్న తన కుమార్తెకు మెరుగైన వైద్యసేవలు అందించి కాపాడాలని ఓ కన్నతల్లి ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ అయింది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో సరైన వైద్యం అందడంలేదని, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి చేరే వరకు ఫార్వర్డ్ చేయాలని వేడుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం మండపేట గ్రామం తాటిపూడికి చెందిన ఇల్ల శ్రీనివాస్, సుశీల దంపతులు. కొంతకాలం క్రితం నగరానికి వచ్చి అంబర్‌పేట తిరుమల నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. వీరి కుమార్తె జ్యోతి (25) తల్లితండ్రులకు చేదోడువాదోడుగా ఉంటోంది. ఈ నెల 18న ప్రమాదవశాత్తు అపార్ట్మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందపడటంతో జ్యోతి తల, వెన్నెముక, కాళ్లు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఎంఎల్సీ (మెడికో లీగల్ కేసు) నమోదు చేసి అంబులెన్స్‌లో గాందీఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ప్రాథమిక వైద్యం అందించి, జూడాల సమ్మె కారణంగా అత్యవసర శస్త్ర చికిత్స చేయడం కుదరదని.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కావడంతో ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతూ గాంధీ వైద్యులు చేతులెత్తేశారని బాధితురాలి తల్లి సుశీల పేరిట సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అయింది. సీఎం రేవంత్‌రెడ్డికి చేరేవరకూ పోస్ట్‌ను ఫార్వర్డ్ చేయాలని వేడుకుంది. తాము పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో సోమవారం వైరల్ కావడంతో అప్పటివరకు పట్టించుకోని గాంధీ వైద్యులు స్పందించారని, న్యూరోసర్జరీ, ఇతర విభాగాలకు చెందిన వైద్యులు చికిత్సలు అందిస్తున్నారని బాధితురాలి బంధువు రవిశంకర్ మీడియాకు తెలిపారు. కాగా.. గాంధీ అత్యవసర విభాగంలో మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నామని, వైరల్ అయిన పోస్ట్‌లో వాస్తవం లేదని గాంధీ సూపరింటెండెంట్ సీహెచ్ రాజకుమారి స్పష్టంచేశారు. జ్యోతికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. -
ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతికి 14 రోజుల రిమాండ్
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఇన్చార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ఈ) కె.జగజ్యోతిని ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు.. జ్యోతికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మార్చ్ 6 వరకు జ్యోతికి రిమాండ్ విధిస్తున్నట్లు ఏసీబీ కోర్టు పేర్కొంది. జ్యోతిని చంచల్గూడా మహిళా జైలుకు తరలించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. మరోవైపు రిమాండ్ ఆపాలని జ్యోతి తరపు న్యాయవాది ఏసీబీ కోర్టును కోరారు. జ్యోతిని అరెస్ట్ చేసి 24 గంటలు గడిచిపోయిందని జజ్యోతి తరపు నన్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టు అనుమతి తీసుకున్నారని ఏసీబీ న్యాయమూర్తి తెలిపారు. దీంతో జ్యోతికి 14 రోజుల రిమాండ్ విధింస్తున్నామని కోర్టు తెలిపింది. వివరాల్లోకి వెళితే... గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో నిజామాబాద్ పట్టణంలో ఒక నిర్మాణ పనిని, గాజుల రామారంలో జువెనైల్ బాయిస్ హాస్టల్ నిర్మాణపనులను బొడుకం గంగన్న అనే లైసెన్స్డ్ కాంట్రాక్టర్ చేపట్టారు. వాటికి సంబంధించిన బిల్లుల చెల్లింపుల విషయమై కాంట్రాక్టర్‌ను ఆ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఇన్చార్జ్ సూపరింటెండెంట్ కె.జగజ్యోతి లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంట్రాక్టర్ నుంచి రూ.84 వేల లంచం తీసుకుంటుండగా సోమవారం హైదరాబాద్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ(డీఎస్ఎస్) భవన్లో జగజ్యోతిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.65 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. కార్యాలయంలోనూ కొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈఈ స్థాయి అధికారి అయిన జగజ్యోతి ఇన్‌ఛార్జి హోదాలో ఎస్ఈ బాధ్యతలూ నిర్వర్తిస్తుండటం గమనార్హం. చదవండి: ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి అరెస్ట్ -
10 కోట్ల ఆస్తి.. 4 కేజీల బంగారం.. మైండ్ బ్లాక్ అయ్యేలా జ్యోతి ఆస్తులు
-
జ్యోతి ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు
-
ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి జ్యోతి అరెస్ట్
-
బిగ్‌బాస్ కంటెస్టెంట్ భార్య గొప్పమనసు.. వారి కోసం అలా!
బిగ్‌బాస్ కంటెస్టెంట్, కొరియాగ్రాఫర్ ఆట సందీప్ ఈ సీజన్లో తన ఆటతీరుతో అభిమానులను ఆకట్టుకున్నారు. తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-7లో మొదటి నుంచి హౌస్‌లో గట్టి పోటీదారునిగా నిలిచారు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ఫస్ట్ సీజన్లో విజేతగా నిలిచి ఫేమ్ సంపాదించాడు. అప్పటినుంచి ఈయన పేరు ఆట సందీప్‌గా స్థిరపడిపోయింది. అయితే ఆయన భార్య జ్యోతిరాజ్ కూడా మంచి డ్యాన్సరే అని తెలిసిందే. ఆమె సైతం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఆమె చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో ఆరుబయటే నిద్రిస్తున్న వారికోసం తనవంతు సాయంగా ముందుకు కదిలారు. రోడ్డు పుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వారికి దుప్పట్లు అందించారు. తన ఫ్రెండ్‌తో కలిసి ఆమె రోడ్ల పక్కన నిద్రిస్తున్న ఉన్నవారికి అందజేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్స్ ప్రశంసలు కురిస్తున్నారు. మీరు ఇలాగే మరికొంత మందికి సాయం చేయాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Jyoti Raj (@jyothiraj_sandeep) -
కాంగ్రెస్ నేతలపై దాడి.. జ్యోతి పటేల్ సంచలన ఆరోపణలు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ నమోదైంది. అత్యధికంగా 76 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల కాంగ్రెస్-బీజేపీ నేతలు బాహాబాహీకి దిగారు. ఇక, తాజాగా బీజేపీ మంత్రి గోపాల్ భార్గవపై కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతి పటేల్ సంచలన ఆరోపణలు చేశారు. తన మద్దతుదారుల వాహనాలపై దాడి చేసి వారిని చంపే ప్లాన్ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసిన తర్వాత పలు చోట్ల ఉద్రిక్తకర పరిస్థితులు చోటుచేసుకుంది. సాగర్ జిల్లాలోని గఢకోట్ల వద్ద కాంగ్రెస్ మద్దతుదారులపై శుక్రవారం అర్ధరాత్రి దాడి జరిగింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతి పటేల్ మాట్లాడుతూ..‘బీజేపీ మంత్రి గోపాల్ భార్గవ, ఆయన కుమారుడు అభిషేక్ భార్గవ కలిసి కాంగ్రెస్ నేతలపై దాడులకు పాల్పడ్డారు. నాపై, నా మద్దతుదారులపై దాడులకు వారు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ నేతల వాహనాలపై రాళ్లతో దాడులు చేశారు. కాల్పులకు తెగబడ్డారు. బీజేపీ నేతల దాడుల్లో నేను చనిపోయినా, గాయపడినా వారిద్దరే బాధ్యులు’ అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ మద్దతుదారులు దాడులు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. BIG BREAKING: #MPElections2023 📍Madhya Pradesh Narendra Modi says "Beti Bachao" But today, goons, gangsters of BJP minister Gopal Bhargava attacked, open fired, threatened Rehli Congress candidate Jyoti Patel. Sources says, Gopal Bhargava's son Abhishek Bhargava is present… pic.twitter.com/8GIH9s5Slq — Liz/Barsha (@debunk_misinfos) November 18, 2023 మరోవైపు.. కాంగ్రెస్ నేతల వాహనాలపై రాళ్ల దాడులు జరగడంతో హస్తం పార్టీ నేతలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో, బీజేపీ-కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. రెండు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఘర్షణ నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ లోకేష్ సిన్హా స్పందించారు. రెండు పార్టీల నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
జ్యోతి సురేఖకు స్వర్ణం, రజతం
బ్యాంకాక్: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ రెండు పతకాలు గెలిచింది. గురువారం ముగిసిన ఈ టోర్నీలో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో రజతం, టీమ్ విభాగంలో స్వర్ణం సాధించింది. వ్యక్తిగత విభాగం ఫైనల్లో జ్యోతి సురేఖ 145–145 (8/9) ‘షూట్ ఆఫ్’లో భారత్‌కే చెందిన పర్ణీత్ కౌర్ చేతిలో ఓడిపోయింది. నిర్ణీత 15 బాణాల తర్వాత ఇద్దరి స్కోర్లు సమంగా నిలిచాయి. విజేతను నిర్ణయించేందు ఇద్దరికి ఒక్కో షాట్ అవకాశం ఇచ్చారు. జ్యోతి సురేఖ బాణం 8 పాయింట్ల వృత్తంలోకి వెళ్లగా... పంజాబ్‌కు చెందిన 18 ఏళ్ల పర్ణీత్ కౌర్ 9 పాయింట్ల షాట్‌తో తొలి అంతర్జాతీయ వ్యక్తిగత స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్‌లతో కూడిన భారత బృందం కాంపౌండ్ టీమ్ ఫైనల్లో 234–233తో చైనీస్ తైపీని ఓడించి పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఇప్పటి వరకు ఏడుసార్లు ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న జ్యోతి సురేఖ ఓవరాల్‌గా 5 స్వర్ణాలు, 5 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించింది. మరోవైపు కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో అదితి–ప్రియాంశ్ జోడీ 156–151తో కనోక్నాపుస్–నవాయుత్ (థాయ్‌లాండ్) జంటను ఓడించి స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం కాంస్య పతక మ్యాచ్‌లో అభిషేక్ వర్మ 147–146తో జూ జేహూన్ (దక్షిణ కొరియా)ను ఓడించాడు. -
రెండు స్వర్ణాలపై జ్యోతి సురేఖ గురి
బ్యాంకాక్: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ రెండు స్వర్ణ పతకాల కోసం విజయం దూరంలో నిలిచింది. విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీ ఫైనల్లో జ్యోతి సురేఖ 148–145తో హువాంగ్ జౌ (చైనీస్ తైపీ)పై నెగ్గింది. నేడు జరిగే ఫైనల్లో భారత్‌కే చెందిన పర్ణీత్ కౌర్‌తో సురేఖ ఆడుతుంది. రెండో సెమీఫైనల్లో పర్ణీత్ కౌర్ 147–145తో విక్టోరియా లియాన్ (కజకిస్తాన్)ను ఓడించింది. భారత్‌కే చెందిన ప్రపంచ చాంపియన్ అదితి స్వామి ప్రిక్వార్టర్ ఫైనల్లో 145–146తో బొన్నా అక్తర్ (బంగ్లాదేశ్) చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. మహిళల కాంపౌండ్ టీమ్ సెమీఫైనల్లో జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు 228–217తో థాయ్‌లాండ్ జట్టును ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో చైనీస్ తైపీ జట్టుతో సురేఖ బృందం ఆడుతుంది. మరోవైపు పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో అభిõÙక్ వర్మ, ప్రియాంశ్, ప్రథమేశ్‌లతో కూడిన భారత జట్టు కాంస్య పతకం గెలిచింది. -
ఆర్చరీలో ‘డబుల్’ ధమాకా
పారిస్: భారత ఆర్చర్లు ప్రపంచకప్ స్టేజ్–4 ఈవెంట్లో పసిడి పంట పండించారు. కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలతో ‘డబుల్’ ధమాకా సాధించాయి. రికర్వ్ జట్లు కాంస్య పతకాలు గెలిచాయి. పురుషుల కాంపౌండ్ ఈవెంట్లో అభిషేక్ వర్మ, ఓజస్ ప్రవీణ్, ప్రథమేశ్ జౌకర్‌లతో కూడిన భారత జట్టు శని వారం జరిగిన ఫైనల్లో 236–232 స్కోరుతో క్రిస్ షాఫ్, జేమ్స్ లుజ్, సాయెర్ సలైవాన్‌లతో కూడిన అమెరికా జట్టుపై ఘన విజయం సాధించింది. మూడు రౌండ్లు ముగిసేసరికి ఇరు జట్లు సమంగా నిలవగా, కీలకమైన చివరి రౌండ్లో భారత్ పైచే యి సాధించింది. పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో సెమీస్‌లో ఓడిన భారత జట్టు కాంస్య పతక పోరులో స్పెయిన్ టీమ్‌పై గెలిచింది. ధీరజ్ బొమ్మదేవర, అతాను దాస్, తుషార్‌లతో కూడిన భారత్ 6–2తో స్పానిష్ టీమ్‌ను ఓడించి కాంస్యం గెలుచుకుంది. మహిళల రికర్వ్ టీమ్ విభాగంలో భజన్ కౌర్, అంకిత భకత్, సిమ్రాన్‌జీత్ కౌర్‌లు ఉన్న భారత త్రయం కాంస్య పతక పోరులో 5–4తో మెక్సికో జట్టుపై గెలిచింది. అమ్మాయిల జట్టు పైచేయి మహిళల కాంపౌండ్‌లో జ్యోతి సురేఖ, అదితి గోపీచంద్, పర్నీత్ కౌర్‌లతో కూడిన భారత బృందం 234–233తో మెక్సికో జట్టుపై గెలిచి పసిడి పతకం చేజిక్కించుకుంది. తొలి రౌండ్లో 59–59తో అండ్రియా బెకెరా, అనా సోఫియా, డాఫ్నే క్వింటెరోలతో కూడిన మెక్సికో జట్టుతో భారత్ స్కోరు సమంచేసింది. రెండో రౌండ్లో 59–58తో స్వల్ప ఆధిక్యం కనబరిచింది. 118–117 తో మూడో రౌండ్లోకి దిగిన భారత ఆర్చర్లు 57–59తో వెనుకబడ్డారు. 175–176తో ఆధిక్యం మెక్సికోవైపు మళ్లింది. ఈ దశలో నాలుగో రౌండ్‌పై దృష్టిపెట్టిన ఆర్చర్లు 59 స్కోరు చేస్తే... మెక్సికన్ అమ్మాయిలు 57 స్కోరే చేయడంతో పాయింట్ తేడాతో భారత్ (234–233) స్వర్ణ పతకం గెలుపొందింది. జ్యోతి సురేఖ @ 50 ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ అంతర్జాతీయ పోటీల్లో పతకాల ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. ఈ టోర్నీకి ముందు 48 పతకాలు సాధించిన ఆమె శనివారం కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం సాధించింది. అనంతరం వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలుచుకోవడంతో 50వ పతకం ఆమె ఖాతాలో చేరింది. సెమీస్‌లో ఓడిన ఆమె మూడో స్థానం కోసం కొలంబియాకు చెందిన సారా లోపెజ్‌తో తలపడింది. స్కోరు 146–146తో సమం కాగా, షూటాఫ్‌లోనూ 10–10తో సమంగా నిలిచారు. అయితే లక్ష్యబిందువుకు అతి సమీపంగా కచ్చితత్వంతో కూడిన బాణాలు సంధించిన జ్యోతినే విజేతగా ప్రకటించడంతో కాంస్యం లభించింది. జ్యోతి సురేఖ వివిధ అంతర్జాతీయ టోర్నీల్లో కలిపి గెలిచిన మొత్తం 50 పతకాల్లో 17 స్వర్ణాలు, 18 రజతాలు, 15 కాంస్యాలున్నాయి. -
నేను ఏ తప్పు చేయలేదు, భయపడేది లేదు: నటి జ్యోతి
డ్రగ్స్ కేసులో అరెస్టయిన తెలుగు నిర్మాత కేపీ చౌదరితో ఫోన్ కాల్స్ వ్యవహారంపై నటి జ్యోతి స్పందించారు. తాను ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అవ్వలేదంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని పోస్ట్ చేశారు. కేపీ చౌదరితో తనకు కేవలం స్నేహం మాత్రమే ఉందని, ఫ్యామిలీ బాండింగ్ తప్ప డ్రగ్స్‌తో తనకు సంబంధం లేదన్నారు. ఎలాంటి విచారణకు అయినా తాను సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తన ఫోన్ కూడా పోలీసుకు ఇవ్వడానికి సిద్ధమేనని జ్యోతి స్పష్టం చేశారు. తను ఎప్పుడూ డ్రగ్స్ వాడలేదని, అవసరమైతే నార్కోటిక్ టెస్ట్‌కి సిద్దమన్నారు. ఏ తప్పు చేయలేదని, ఎవరికి భయపడేది లేదని చెప్పారు. కేపీ హైదరాబాద్ వచ్చినప్పుడు వారి అబ్బాయిని తన ఇంట్లో డ్రాప్ చేసి వెళ్లేవాడని, తన కుమారుడు, కేపీ కుమారుడు కలిసి ఆడుకునే వారని జ్యోతి తెలిపారు. ఇలా ఫ్యామిలీ బాండింగ్ తప్ప కేపీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇక నుంచైనా తనపై దుష్ప్రచారం చేయొద్దని జ్యోతి కోరారు. (చదవండి: డ్రగ్స్ కేసు విషయంలో వాస్తవం ఇదే.. స్పందించిన అషూరెడ్డి) కాగా, డ్రగ్స్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కేపీ చౌదరిని పోలీసులు రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ కేసులో కొంతమంది ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. దీంతో సెలబ్రిటీలను కూడా విచారించే చాన్స్ ఉంది. అయితే కేపీ చౌదరి నిర్మాతగా ఉన్నారు కాబట్టి తమ మధ్య ఫోన్ కాంటాక్టులు సహజమని సినీ ప్రముఖులు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Jyoti Labala (@jyothiactress) -
MasterChef India 7: Nayanjyoti Saikia: వంటకోసం ప్రాణం ఇస్తాడు
వంట అమ్మ చేయాలి.. అది రూలట. తర్వాత అమ్మాయి చేయాలి.. అది పెంపకం అట. కాని అబ్బాయి చేస్తే? అబ్బాయి నేర్చుకుంటే? వంట ద్వారానే విజేతగా మారితే? అస్సాంలో టీ తోటల్లో కార్మికుడిగా ఉన్న నయన్జ్యోతి సైకియా వంట మీద ధ్యాస పెట్టాడు. మునివేళ్ల మంత్రం నేర్చాడు. మాస్టర్ చెఫ్ పోటీలో విజేతగా నిలిచి 25 లక్షల ప్రైజు సాధించాడు. అమ్మ ఊరికెళితే కర్రీ పాయింట్ వైపు అడుగులు వేసే పుత్రరత్నాలు ఇతని నుంచి నేర్చుకోవాల్సింది ఉంది. 27 ఏళ్ల నయన్జ్యోతి సైకియాకు రాని వంట లేదు. మూడు నెలల పాటు ముంబైలో ‘మాస్టర్ షెఫ్’ రియాలిటీ షో కోసం ఉండి, రకరకాల వంటలు చేసి, భేష్ అనిపించుకుని, వారం క్రితం 25 లక్షల రూపాయల మొదటి ప్రైజ్ గెలిచాక ఎగువ అస్సాంలో ఉండే అతని ఊరి ప్రజలు ఉత్సవం జరుపుకుంటూ, ట్రోఫీతో తిరిగి వస్తున్న అతనికి స్వాగతం చెప్పడానికి రకరకాల వంటలు చేయిస్తూ ‘ప్రత్యేకంగా ఏం చేయించమంటావ్’ అని అడిగితే నయన్జ్యోతి సైకియా ‘ఏం వద్దు... మా ఇంట్లో చేసే టొమాటో చేప కూర చాలు’ అన్నాడు. దాదాపు రెండు వేల మంది అతనికి స్వాగతం చెప్పడానికి ఊరిలో జమ అయితే ఈ కూర నాలుకకు తగిలాకే ‘అమ్మయ్య... ఇప్పటికి మన ఊరు చేరినట్టయ్యింది’ అని నవ్వాడు. ఇవాళ నయన్జ్యోతి సైకియాను అస్సాం అంతా తనవాడు అని గర్వంగా చెప్పుకుంటోంది. అతను ఆస్కారో నోబెలో తేలేదు. కేవలం వంట ద్వారానే తన ప్రాంతం తల ఎత్తుకు తిరిగేలా చేశాడు. మెకానికల్ ఇంజనీర్ నయన్జ్యోతి సైకియా సొంత ఊరు తిన్ సుకియ. ఇది గౌహతికి 490 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సైకియా తండ్రి టీ ఎస్టేట్లలో పని చేస్తాడు. రైతు. 2018లో గౌహతిలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సైకియా ఊరికి తిరిగి వచ్చి టీ ఎస్టేట్‌లో తండ్రి పనికి సాయంగా ఉంటూ వచ్చాడు. నిజానికి చిన్నప్పటి నుంచి ఇంట్లో వంట విషయంలో సాయం చేస్తూ వచ్చిన సైకియాకు వంట మీద రోజు రోజుకీ ఆసక్తి పెరిగిపోయిందని ఇంటి వాళ్లు గుర్తించలేదు. అది ఒక ముఖ్య ఉపాధి అని కూడా భావించలేదు. కాని సైకియా మాత్రం తన బెడ్రూమ్లో ఒక మూల చిన్న స్టవ్‌ను ఏర్పాటు చేసుకొని రకరాల వంటలు తయారు చేయడం మొదలుపెట్టాడు. ఇంటర్ వరకూ ఇది కొంత రహస్యం గా సాగినా ఇంజనీరింగ్ కోసం గౌహతికి వెళ్లాక ఆ నాలుగేళ్లు అతని ప్రయోగాలకు అడ్డు చెప్పేవారు లేకపోయారు. ఇంటర్నెట్ గురువు ‘నాకు గురువులు లేరు. వంట శాస్త్రం కాలేజీకి వెళ్లి చదువుకోలేదు. నాకు వచ్చిందంతా ఇంటర్నెట్లో రకరకాల షెఫ్‌లను ఫాలో అయి నేర్చుకున్నదే. నేను మంచి ఫొటోగ్రాఫర్‌ని. నేను చేసిన వంటలను చాలా ఆకర్షణీయంగా ఫొటోలు తీసి ఇన్‌స్టాలో పెట్టేవాణ్ణి. అలా అందరి దృష్టి నా మీద పడింది. ప్రఖ్యాత షెఫ్ వికాస్ ఖన్నా నా ఇన్‌స్టా పేజీలో నా వంటలను చూసి నన్ను వెతుక్కుంటూ అన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి మా ఊరు వచ్చారు. మా ఇంట్లో మా సంప్రదాయ వంటలు వండి చూపించారు. నన్ను మాస్టర్ షెఫ్ ప్రోగ్రాంలో పార్టిసిపెంట్‌గా తీసుకెళతానని అడిగారు. గట్టిపోటీలో ఈశాన్య రుచులు చూపి ‘మాస్టర్ షెఫ్’ రియాలిటీ షో అంటే మాటలు కాదు. కొమ్ములు తిరిగిన పార్టిసిపెంట్లు వస్తారు. అనుభవం సంపాదించుకున్నవారు వారిలో ఉంటారు. వారందరితో తలపడి మొదటి స్థానానికి వెళ్లడం చాలా గొప్ప. అదీ గాక జడ్జీలను మెప్పించాలి. ఈ షోకు జడ్జీలుగా వచ్చిన రణ్వీర్ బ్రార్, గరిమ అరోర, వికాస్ ఖన్నాను ఆకట్టుకున్నాడు సైకియా. ‘అందుకు కారణం నేను నా వంటల్లో మా ఊరి దినుసులను దాదాపుగా వాడటం. వాటితో ప్రయోగాలు చేయడం.’ అంటాడు సైకియా. ఎన్నో అడ్డంకులున్నా ఇంత విజయం సాధించాక పెద్ద పెద్ద రెస్టరెంట్లే అతణ్ణి భాగస్వామిని కమ్మని అడుగుతున్నాయి. విజయం అంటే ఇది. కోరుకున్న కలను ఛేదించాలంటే ఇలాంటి పట్టుదలే ఉండాలి. ‘నేను జీవితంలో ఇప్పటికీ పెద్ద రెస్టరెంట్‌కు వెళ్లలేదు. మా ఊళ్లో లేకపోవడం వల్ల. అంత డబ్బు లేకపోవడం వల్ల. కాని పెద్ద రెస్టరెంట్లలో చేసేవన్నీ నేను అంతకన్నా బాగా చేయడం నేర్చుకున్నాను’ నార్త్ ఈస్ట్ అంటే మాంసాహారం అని ఎక్కువమంది అనుకుంటారు. నేను శాకాహారం రెసిపీలు కూడా చేసి చూపించాను. మణిపూర్ నల్లబియ్యంతో సంగటి వొండితే వారికి బాగా నచ్చింది. ఇక రకరకాల పాస్తాలు చేయడంలో నన్ను మించినవారు లేరు. – నయన్జ్యోతి సైకియా -
Story: ఆమె జ్యోతి.. తన ‘కథ’ తెలుసుకున్న రాణి తిరిగి వస్తుందా?
‘మేడంగారూ ఇవాళ మీ కథ చెప్తానన్నారు కదా?’ మేడంగారి పేరు జ్యోతిర్మయి. అందరూ జ్యోతిమేడం అంటారు. కథ అడిగినావిడ పేరు రాణి. ఇలా రాణి అడిగినప్పుడు అప్పుడే బెంగాల్ కాటన్ కనకాంబరం రంగు చీర కుచ్చిళ్ళు సవరిస్తూ గదిలో నుంచి వచ్చింది జ్యోతి. ‘మీరు చీర కట్టుకుంటే మేడంగారూ రెప్పేయబుద్ధి కాదంటే నమ్మండి.’ రాణి మాటకి జ్యోతి మేడం ముసి ముసిగా నవ్వుకుంది. ‘ఎంతైనా అందంలో మనోళ్ళని మించినాళ్ళు వుండర్లెండి.’ ఈ మాట అన్న రాణి వైపు కోపంగా చూసింది జ్యోతి. ఆమె ఒక రెసిడెన్షియల్ స్కూల్లో పాతికేళ్ళుగా తెలుగు టీచర్‌గా పనిచేస్తోంది. భర్త జర్నలిస్టు. ఇద్దరిదీ ప్రేమ వివాహం. నలభై ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు. ఇప్పుడు ఏభైలో పడింది టీచర్. ఇంటి పనీ, బయటి పనీ ఆమె వల్ల కావడం లేదు. అందుకే రాణిని వంటకోసం పెట్టుకున్నారు. రాణి వయసూ టీచరమ్మ వయసూ ఇంచుమించూ ఒకటే అవ్వడం వల్ల ఆమెను రాణిగారూ అంటుంది ఈ టీచర్ గారు. రాణి పదోతరగతి దాకా చదువుకుంది. భర్త తాగుబోతు. కొడుకు ప్రయోజకుడై, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి విషయంలో కంటే వాడి ప్రయోజకత్వం పెళ్ళానికే ఎక్కువ పనిచేసినట్టుంది. అంత బతుకూ బతికి వంట పనిచేసుకుని పొట్ట పోసుకోవలసి వస్తోంది రాణికి. పాపం అందుకే జ్యోతికి రాణి అంటే సానుభూతి. ఎంతైనా స్త్రీ హృదయం కదా. కానీ రాణి దగ్గర నచ్చని విషయం ఏంటంటే మాటి మాటికీ మనాళ్ళూ మనాళ్ళూ అంటూ సాగదీస్తుంది. జ్యోతి ఒడ్డూ పొడుగూ పొందిక అన్నీ చూసి టీచరమ్మ తమ కులమే అని నిర్ధారించేసుకుంది. పనిలో చేరిన రెండో రోజునే ‘మేం ఫలానా అండి టీచర్ గారూ’ అంటూ గొప్పగా తమ ఇంటి పేరు చెప్పింది. మరి మీరో అన్నట్టుగా ఉంది ఆ మాట. మేం ‘బలపాల వారమండి రాణిగారూ’ అంది జ్యోతి . దీంతో టీచరమ్మ మా వాళ్ళమ్మాయే అని పూర్తి నమ్మకంతో అన్నీ ఓపెన్‌గా మాట్లాడేస్తుంది రాణి. ‘మీరు బలపాలవారా మరి చెప్పేరు కదేమండి టీచర్‌గారూ. మన వాళ్ళలో బలపాల వారు చాలా బలిసిన వారే ఉన్నారుగా. అదీ సంగతి. మిమ్మల్ని చూసిన మొదటి రోజే అనుకున్నాను.’ ఈ మాటలకు ఒళ్ళంతా కంపరం పుట్టింది జ్యోతికి. కులంతో వచ్చిన అహంకారంతో మాట్లాడుతుందా, లేక అమాయకంగా మాట్లాడుతుందా అన్న తర్జనభర్జన చాలానే జరిగింది జ్యోతిలో. రాణి కుటుంబ నేపథ్యం, ఆమె పడిన అష్టకష్టాలు, బాధలు, ఆమె మనస్తత్వం అన్నీ బాగా స్టడీ చేశాక, ‘పాపం పిచ్చిది ఏదో అలా వాగేస్తుంది అంతే’ అని నిర్ధారించుకుంది. జీవితమంతా దేహానికి అంటుకున్న ముళ్ళను విదిల్చుకుంటూ మనిషితనంతో గుబాళించడమే తెలిసిన జ్యోతికి రాణి వాలకం పెద్ద బాధ కలిగించ లేదు. కానీ రాణికి తన కథ చెప్పి తీరాలన్న కోరిక జ్యోతి మనసులో ఒకానొక ఘడియలో చిన్నగా మొలకెత్తి రాను రాను అది వటవృక్షమై బయటపడాలని హడావుడి చేస్తోంది. అయితే అసలు విషయం తెలిస్తే రాణి ఎక్కడ పారిపోతుందో అని ఒక ఆందోళన. కానీ ఆమెకు తన కథ చెప్తే గానీ తనలో ఏభై ఏళ్ళుగా పేరుకుని గడ్డకట్టి బండబారి కొండలా మారిన నిజం, ముక్క ముక్కలై కరిగి కరిగి నీరై ఆవిరయ్యే అవకాశం లేదని టీచరమ్మ ఆలోచన. చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఊహ తెలిసినప్పటి నుంచి తన మనసులోనే పడిన ఘర్షణ ఒకటే. అదే తన కులం పేరు. తల్లిదండ్రులు ఇద్దరూ టీచర్లు కావడం వల్ల సంఘంలో కొద్దో గొప్పో గౌరవం, మర్యాదా దొరికాయి. కానీ తన కులం పేరు చెప్తే ఆ గౌరవాలూ ఆ మర్యాదలూ ఎక్కడ పోతాయో అని జ్యోతి బడిలో దోస్తుల్ని ఎవరినీ చిన్నప్పుడు తమ వాడలోకి రానిచ్చేది కాదు. వస్తే వాడలో వాతావరణం చూసి తనతో స్నేహం చేయరేమో అని అనుమానం. కాలేజీ రోజుల్లో.. యూనివర్సిటీ రోజుల్లో.. ఉద్యోగం చేస్తున్న రోజుల్లో బతుకంతా ఇదే బరువు. ఒకటే మోత. ఎవరికీ తెలియని అనంత భారం. ఇలా ఏభయ్యేళ్ళ పాటు కులం అనేది ఆమెను లోపల్లోపల తగలబెడుతూ వచ్చింది. ఆ బూడిదలోంచి తాను తిరిగి పుడుతూ వచ్చింది జ్యోతి. కానీ ఇంతకాలానికి తన కులం పేరు బ్రహ్మాండం బద్దలయ్యేట్లు చెప్పాలన్న కోరిక జ్యోతికి కలిగింది. ‘రాణిగారూ మీరు ఎవరి దగ్గర పనిచేస్తున్నారో తెలుసా’ అని అన్నప్పుడు రాణిగారి మొహంలో కులానికి ఎన్ని రంగులుంటాయో అన్ని రంగులూ చూడాలని టీచరమ్మ ఉబలాటం. జ్యోతి స్కూలుకి వెళ్ళి సెలవు పెట్టి వచ్చింది. కేవలం తన కథ రాణిగారికి చెప్పాలనే. రాణిగారు కూడా కుతూహలంతో ఎదురు చూస్తోంది. జ్యోతి తీరుబడిగా కుర్చీలో కూర్చుంది. రాణి కింద ప్లాస్టిక్ పీట మీద కూర్చుని కూరగాయలు తరుగుతోంది. అలా చూసినప్పుడు భూమి పైకి లేచినట్టు, ఆకాశం కిందకి కూలినట్టు అనిపిస్తుంది జ్యోతికి. యుగాలుగా కింద కూర్చున్న జాతి పైకి, పైన కూర్చున్న జాతి కిందకీ తల్లకిందులైనట్టు అనిపించినప్పుడు జ్యోతిర్మయిలో యుగాలుగా మండుతున్న కసి ఏదో కొంచెం కొంచెం చల్లారుతున్న భావన గొప్ప ఉపశాంతినిచ్చింది. ఈ దృశ్యాన్ని ఏ చిత్రకారుడైనా చిత్రించాలని, దాన్ని పట్టుకుని తన బాల్యపు గతం నుంచి తిరిగి ప్రయాణం మొదలు పెట్టి వర్తమానం దాకా ఊరేగాలని ఆమెకు అప్పుడప్పుడూ అసాధ్యమైన ఊహలు కూడా కలుగుతాయి. అంతలోనే జ్యోతిలోని బౌద్ధ భిక్షుకి నిద్ర లేస్తుంది. ‘పాపం రాణి ఒక చిన్న పిల్లలాంటిది’ అంటూ. ‘కరుణామయులైన వారు తమను మాత్రమే గాక, ఇతరులనూ విముక్తి చేయాలని కోరుకుంటారు.’ బుద్ధుని బోధనల్లో చాలా విలువైన ఈ పంక్తులను తాను మాటి మాటికీ స్మరించుకుంటుంది. అందుకే తనను దహించే అగ్నిని తానే చల్లార్చుకుని రాణిని ఎప్పటిలా ప్రేమిస్తుంది. చిన్న పిల్లల మీద ఎవరైనా కసి తీర్చుకోవాలనుకుంటారా? ఇదీ జ్యోతి అంతరంగం. ‘రాణిగారూ మీకు కులం గురించి ఏం తెలుసు?’ అమాయకంగా మొహం పెట్టిన రాణి వైపు చూసి జ్యోతి నవ్వుకుంది. మీకొక కథ చెప్పనా అని సమాధానం రాకుండానే చెప్పింది. ‘ గౌతముడు తన దగ్గరకు వచ్చిన సునీత అనే అంటరాని కులస్తుడిని తన సంఘంలో చేర్చుకున్నాడు. అతని వృత్తి వీధులు ఊడ్వడం. నువ్వు మా సంఘంలో ఏం చేస్తావు అని ఒక సాటి భిక్షువు అతడ్ని అడిగాడట. అప్పుడు సునీత అనే అతను ఏం చెప్పాడో తెలుసా? ‘ నేను ఇన్నాళ్ళూ వీధులు ఊడ్చాను. ఇప్పుడు మనుషుల మనో వీధులు శుభ్రం చేస్తాను’ అన్నాడట. ఎంత బాగా చెప్పాడో కదా?’ అంటూ రాణి మొహంలోకి చూసింది జ్యోతి. రాణి.. పాఠం అర్థం కాని పిల్లలా మొహం పెట్టింది. అప్పుడు మళ్ళీ ఇలా అంది.. ‘రాణిగారూ కులానికి ఏ విలువా లేదు. వ్యక్తి చేసే పనికే విలువ వుంటుంది. ఒకసారి అశోకుడితో ఆయన మంత్రి.. ప్రభూ మీరు అన్ని రకాల కులాలకు చెందిన భిక్షువులకు సాష్టాంగపడి, పాదాభివందనం చేయడం సబబుగా లేదు అన్నాడు. దానికి అశోక చక్రవర్తి ఏమన్నాడో తెలుసా రాణిగారూ?’ ‘ ఏమన్నారండీ?’ ‘ఉచితంగా ఇచ్చినా ఎవ్వరూ ఆశించని విలువ లేని వస్తువు ఈ నా శిరస్సు. దీనిని ఓ పవిత్రకార్యానికి వినియోగించే అవకాశమే నేను భిక్షువులకు చేసే పాదాభివందనం అని అశోకుడు బదులిచ్చాడు. ఎంత గొప్ప మాట ఇది రాణిగారూ! అర్థమైందా?’ ‘ఏమోనమ్మా. అన్నట్టు అశోకుడు మన వాడేనంటగా ఎవరో అంటే విన్నాను.’ ఈ మాటతో తల పట్టుకుంది టీచరమ్మ. ఈమెకు ఎలా వివరించి చెప్పాలబ్బా అని తనలో తనే తెగ ఘర్షణ పడింది. ఒక మనిషి గొప్పతనం పుట్టుకతో రాదని, రంగుతో రాదని, కులంతో రాదని, అతని ఆచరణతోనే వస్తుందని తాను చదివిన బౌద్ధ బోధనల్లోని సారాన్ని కథలు కథలుగా చెప్పాలని ప్రయత్నించింది. కానీ ఆమెకు ఎక్కడా ఎక్కలేదు. ‘మేడంగారూ మీ ఊరి కథ చెప్పండి బాబూ ఇవన్నీ నాకెందుకు’ అనేసింది. ‘ సరే చెప్తాను వినండి. మా ఊరి కథలోనే నా కథ కూడా వుందన్నాను కదా. అర్థం చేసుకోండి మరి. అసలు నిజానికి నూజివీడు అనేది ముందు నువ్వు చేల వీడు. ఒకసారి ఉయ్యూరు నుంచి దొరగారు వచ్చి ఆ నువ్వు చేల వనాన్ని చూశాడట. అక్కడ తోడేలు, మేకపోతూ భయంకరంగా కొట్లాడుకోవడం చూసి ఆశ్చర్యపోయాడట. ఇదేదో పౌరుషం గల నేలలా వుందే అనుకుని అక్కడ కోట కట్టించుకున్నాడట. ఆయనతో పాటు మరి కొందరు దొరలు కూడా వచ్చారు. అది క్రమంగా నువ్వుచేలవీడు, నూజేలవీడు అయ్యి.. చివరికి నూజివీడు అయ్యింది.’ ‘భలే కథండి టీచర్‌గారూ, ఇంతకీ మీ కథేంటో మరి..!’ ‘అక్కడికే వస్తున్నాను మరి. దొరలకు సేవకులు కూడా అవసరమే కదా.. బలాపాముల అనే ఊరి నుంచి ఇద్దరు బలమైన పొడవైన వ్యక్తుల్ని తమ కోటకు తెచ్చుకున్నారట. ఆ ఇద్దరు వ్యక్తుల సంతాన వారసత్వమే మేము.’ ‘అదేంటండీ మనోళ్ళు దొరలకు సేవ చేయడానికి వచ్చారా? అబ్బే నాకేం నచ్చలేదు ఈ కథ.’ తరుగుతున్న కూరగాయల్ని పక్కనే పెట్టి రాణి, గోడకి చేరబడి రెండు మోకాళ్ళూ మునగదీసుకుని రెండు చేతులతో వాటిని పట్టుకుని ‘సరే చెప్పండి తర్వాతేమైందో ’ అన్నది. ‘ఆగండి రాణి గారూ. అప్పుడే కంగారెందుకు? మీరు కంగారు పడాల్సిన విషయాలు చాలా వున్నాయి’ అంటూ తిరిగి కథ అందుకుంది. ‘మా తాతలు ఇద్దరు ఎంత పొడగరులంటే తాటి చెట్లను రెండు చేతులతో పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళిపోగలరు’ జ్యోతి మాటలకి నోరు వెళ్ళబెట్టింది రాణి. ‘చెట్లనే కాదండీ, పశువుల కళేబరాలను కూడా ఒంటిచేత్తో ఈడ్చి పారేసేవారు.’ ఈ మాట విన్నది విన్నట్టే రాణి, గోడకు అతుక్కుపోయి నోరు తెరిచింది. వెంటనే తేరుకోని ‘అదేంటి మేడంగారూ కళేబరాలేంటి? మనోళ్ళకి అదేం ఖర్మ?’ అంది ‘అవును అది మా తాతల వృత్తి మరి.’ ఆ మాటతో గోడకు జారబడ్డ రాణి ఎవరో మంత్రించినట్టు ఉన్నట్టుండి శిలావిగ్రహంలా మారిపోయింది. ఏదో అనాలని నోరు తెరవబోయింది. జ్యోతి, ‘ఆగు. ఏం మాట్లాడకు. చెప్పేది విను’ అని హూంకరించింది. ఎప్పుడూ రాణిగారూ అనే మేడం ఒక్కసారిగా ఏకవచన సంబోధన చేసిన విషయం కూడా గమనించలేదు రాణి. జ్యోతి చెప్పుకుంటూ వెళ్లింది.. ‘అవును మా ముత్తాతలు ఆ పనే చేసేవారు. ఒకరు పెద రామయ్య, ఒకరు చినరామయ్య. దొరల సంతానం కోటలో పెరిగింది. మా తాతల సంతానం పేటలో పెరిగింది. గొడ్ల కోతలో, చెప్పుల చేతలో వారిని కొట్టే వారు రాజమహేంద్రం దాకా విస్తరించిన నూజివీడు జమీనులో ఒక్కడూ లేడంట. అంత గొప్పోళ్ళు మా తాతలు. జాగ్రత్తగా విను’ ఇక గారు అనడం మర్చిపోయింది జ్యోతి. ‘ వింటున్నావా..?’ ‘ ఆ.. ఆ.. ’ అని తడబడుతూ తలూపింది రాణి. ‘మా తాతల కళా నైపుణ్యం గురించి చాలా చెప్పాలి. గొడ్లను కోసి వాటి చర్మాలను ఇంటికి తెచ్చినప్పుడు ఏదో రాజ్యాన్ని జయించి భుజం మీద ఆ రాజ్యాన్ని మోసుకు వస్తున్నంత గర్వంగా కనపడేవారట అందరికీ. ఆ తర్వాత చాలా కాలం ఆ వృత్తి మా వాళ్ళు చేశారు. మా మేనమామ, ఆయన పిల్లలూ ఆ పని చేయడం నేను దగ్గరగా చూశాను. నాకు ఆ పనులన్నీ చూడ్డం ఇష్టమే కాని, వాటిని నా స్నేహితులు చూడ్డం ఇష్టం ఉండేది కాదు. అందుకే ఎవరినీ రానిచ్చే దాన్ని కాదు మా ఇంటికి. చర్మాన్ని నేల మీద పరచి కత్తితో గీరి, ఉప్పు రాసి సున్నం నీటిలో తంగేడు చెక్క, కరక్కాయలు వేసి మూడు నాలుగు రోజులు నానబెట్టేవారు. అబ్బా ఆ కంపు భరించలేక చచ్చేవాళ్ళం’ఇలా అని రాణి వంక కసిగా చూసింది జ్యోతి. వాసనేదో వస్తున్నట్టే అనిపించినా ముక్కు మూసుకోవాలన్న స్పృహ కూడా లేకుండా అలాగే కూర్చుని వింటోంది రాణి. జ్యోతిని చూడ్డానికి భయం కూడా వేస్తోంది ఆ సమయంలో. ‘నానబెట్టిన చర్మాన్ని తీసి, వెంట్రుకలన్నీ గీకి, దాన్ని నేల మీద గట్టిగా లాగి నాలుగు వైపులా మేకులు కొట్టి ఎండబెట్టేవారు. అప్పుడు వాళ్ళు ఆకాశాన్ని నేల మీద పరిచినంత సంబరపడిపోయేవారు. ఎండిన చర్మాన్ని గంజి రాసి రోల్ చేసి మడత పెట్టి, కొన్ని రోజుల తర్వాత ఆ చర్మాన్ని అనేకానేక రూపాల్లో కత్తిరించి చెప్పులు తయారు చేసేవారు. దొరల పాదాల కింద తరించడానికి తమ జీవితాలనే కత్తిరించుకున్నంత సంతృప్తి పడేవారు. ఇప్పుడు అర్థమైందా మా ఊరి కథ.. నా కథ..? అర్థమైందా నేనెవరో?’ గద్దించినట్టు జ్యోతి అనేటప్పటికి ఉలిక్కిపడింది రాణి. రాతి బొమ్మలో చలనం వచ్చినట్లయింది. జ్యోతి కూడా ఉన్నట్టుండి ఉలిక్కిపడింది. తానెక్కడికో వెళ్ళిపోయింది. స్పృహలోకి వచ్చినట్టు ఒకసారి కలయజూసింది. రాణిగారూ రాణిగారూ అని కలవరించినట్టు అరిచింది సన్నగా. మేడంగారూ మేడంగారూ అని రాణి కూడా కలవరించింది. జ్యోతికి అంతలోనే రాణి మీద జాలి, కరుణ ప్రేమ తన్నుకొచ్చాయి. ‘సారీ అండీ రాణిగారూ. నాలో ఎవరో పూనినట్టున్నారు. నా గురించి నేను మనసారా చెప్పుకోవాలన్న జీవితకాలపు కోరికలో నన్ను నేనే మరిచిపోయి చాలా వికృతమైన ఆనందాన్ని పొందాను. సారీ. ఏమీ అనుకోకండి.’ ‘అయ్యో.. అంత మాటెందుకు మేడంగారూ. నా పిచ్చి మాటలతో వెన్నపూసలాంటి మిమ్మల్ని ఎంత కోతపెట్టానో పిచ్చి ముండని. పిచ్చి ముండని’ అనుకుంటూ తనలో తనే ఏదో గొణుక్కుంటూ వంట ఏదో అయ్యిందనిపించి త్వరగా వెళ్ళిపోయింది రాణి. ఉదయమే వచ్చింది. వస్తూ వెంట ఎవరినో తీసుకొచ్చింది. ‘ మీకు వంటకి ఇబ్బంది కలక్కూడదని ఈమెను తీసుకు వచ్చా మేడంగారూ. నేను కాశీకి పోతున్నాను. గంగలో మునిగితేనే గానీ నా పాపానికి విరుగుడు లేదు. పాపిష్టి దాన్ని మీ మనసెంత నొప్పించానో. నా కడుపుకింత కూడు పెట్టిన మిమ్మల్ని కులం కులం అని ఎంత క్షోభ పెట్టానో. వస్తానమ్మా.. బతికి బాగుంటే మళ్ళీ మీ దగ్గరకే వస్తాను టీచర్‌గారూ. మీరు క్షమిస్తారు. మీ మనసు నాకు తెలుసు. ఆ గంగమ్మ క్షమిస్తుందో లేదో..’ కథలూ సీరియల్సూ చదివే అలవాటున్న రాణి తనకు తెలిసిన భాషలో ఏదో అనేసి విసురుగా వెళ్ళిపోయింది. జ్యోతినుంచి సమాధానం కూడా వినలేదు. జరిగిందంతా రాత్రికి సహచరుడు సురేష్‌కి చెప్పి కొంత ఉపశమనం పొందింది జ్యోతి. రాణి మనసు గాయపరచానేమో అని దిగులుపడిపోతోంది. ‘జీవితమంతా ఒక కొండను లోపల మోసుకుంటూ తిరిగావన్న మాట. నాక్కూడా ఎప్పుడూ చెప్పనే లేదు. పోన్లే ఇప్పటికైనా బరువు దించుకున్నావు. ఆమె గురించి ఆలోచించకు. తానేదో పాపం చేసిందని, ఆ పాపం కడుక్కోవడానికి కాశీకి వెళ్ళిందని ఆమె చెప్తే నువ్వు నమ్ముతున్నావు. కానీ ఆమె నీ దగ్గర పనిచేసి పాపపంకిలమైనందుకు ప్రాయశ్చిత్తం చేసుకోడానికి వెళ్లిందని నేను అనుకుంటున్నాను. వదిలేయ్. పడుకో. ఇన్నేళ్ళూ నువ్వు కోల్పోయిన నిద్రను ఈ రాత్రికి సంపూర్ణంగా ఆస్వాదించు’ అని కళ్ళు మూసుకున్నాడు సురేష్. జ్యోతికేవేవో జ్ఞాపకాలు గుండెల్లో సుడులు తిరిగాయి. తనకు ప్రమేయం లేని తన పుట్టుక తన బతుకంతా ఒక కొండలా కాళ్ళకి ఎలా చుట్టుకుందో, ఎవరికీ కనపడని ఆ బరువును ఈడ్చుకుంటూ ఎలా నడిచిందో.. తలుచుకుంటూనే భయపడిపోయింది. ఎన్నో ఘటనలు.. ఎంతో కన్నీరు. ఒంటె తన అవసరానికి మంచి నీళ్లను దేహంలో దాచుకుంటుందట. జ్యోతి కన్నీళ్ళు దేహంలో దాచుకునే విద్యను చిన్నప్పుడే అభ్యసించింది. ‘ఏమో ఆమె తిరిగి వస్తుందనే నా నమ్మకం’ జ్యోతి తనలో తాను అనుకుంటూనే పైకి అనేసింది. ‘అది నీ పిచ్చి నమ్మకం జ్యోతీ..’ ‘కొన్నిసార్లు సిద్ధాంతంతో కూడిన సందేహం కంటే ప్రేమతో కూడిన నమ్మకమే గెలుస్తుంది సురేష్!’ ‘నేను మాత్రం రాణి తిరిగి వస్తుందంటే ససేమిరా నమ్మను. ఆమె కులం ఆమెను రానివ్వదు’అన్నాడు. ‘ఏమో సురేష్ , ఆమె వస్తుందనుకుంటే నా మనసుకు రిలీఫ్‌గా వుంది.’ ‘చూద్దాం అంటే చూద్దాం’ అని ఇద్దరూ చెరో వైపూ తిరిగి కళ్ళు మూసుకున్నారు. జ్యోతి కన్నుల మీద రాత్రంతా గంగానది ప్రశాంతంగా ప్రవహిస్తూనే వుంది. ఆ అలల మీద ఒకే ప్రశ్న తేలియాడుతోంది. ‘ఇంతకీ ఆమె వస్తుందా..?’ చదవండి: కథ: కొత్త బట్టలు.. మా యమ్మ ఫోన్ సేసి అడిగినప్పుడ్నుంచి ఏడుచ్చా పనుకున్యా! -
మహిళ కష్టం చూసి చలించిన సీఎం జగన్
-
తల్లీకూతుళ్ల సజీవ దహనం కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి..
సాక్షి, కోనసీమ(అల్లవరం): తల్లీకుమార్తెల సజీవ దహనం కేసు మిస్టరీ వీడింది. మాజీ ప్రియుడ్ని తన వైపు తిప్పుకునే క్రమంలో ఓ మహిళ పన్నాగానికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తేల్చారు. అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో ఈ నెల 2వ తేది తెల్లవారుజామున సాధనాల మంగాదేవి, మేడిశెట్టి జ్యోతి సజీవదహనమైన సంగతి తెలిసిందే. అమలాపురం రూరల్ సీఐ వీరబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొమరగిరిపట్నానికి చెందిన సురేష్, జ్యోతి ప్రేమించుకుని ఈ ఏడాది ఫిబ్రవరి 10న పెళ్లి చేసుకుని గోడితిప్పలో నివసిస్తున్నారు. అంతకుముందు సురేష్‌కు నాగలక్ష్మి అనే వివాహితతో వివాహేతర సంబంధముండేది. పెళ్లయిన తర్వాత ఆమెకు దూరమవడంతో నాగలక్ష్మి ఎలాగైనా జ్యోతి సురేష్లను విడదీయాలనుకుంది. ఇందులో భాగంగా సురేష్ ఇంటి వద్ద ఆకాశరామన్న ఉత్తరాలు రాసి పడేసేది. ఇందుకు తన సవతి కుమార్తెలు సౌజన్య, దివ్య హరితలను వినియోగించుకునేది. ఆ ఉత్తరాలలో జ్యోతికి అక్రమ సంబంధం ఉన్నట్లు రాసేవారు. వాటిని చదివినా సురేష్ ఆమెతో ప్రేమగానే ఉండేవాడు. ఇలా కాదని జ్యోతిని హతమారిస్తే సురేష్ తనకు దగ్గరవుతాడని భావించింది. ఇదే సమయంలో జ్యోతి తన పుట్టింటికి వెళ్లింది. చదవండి: (తీరని శోకం: రెండు కుటుంబాలు.. నలుగురు బిడ్డలు..) ఈనెల 2వ తేదీ రాత్రి తన తల్లి సాధనాల మంగాదేవితో కలిసి పడుకుంది. ఇదే అదునుగా నాగలక్ష్మి తన సవతి కుమార్తెలిద్దరినీ ఉసి గొల్పింది. నిద్రిస్తున్న తల్లీ కూతుళ్లపై పెట్రోలు పోయాలని చెప్పింది. వారు ఇంట్లోకి వెళ్లి తల్లీకూతుళ్లపై పెట్రోలు పోసి బయటకు వచ్చి నిప్పంటించారు. కాసేపటికే మంటలు ఎగసిపడుతుండటంతో జ్యోతి తండ్రి లింగన్న మేల్కొన్నాడు. మంటలను ఆర్పేందుకు విఫలయత్నం చేశాడు. అప్పటికే మంగాదేవి, జ్యోతి సజీవ దహనమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి చురుగ్గా దర్యాప్తు చేశారు. ఈ హత్యతో సంబంధమున్న నాగలక్ష్మ, సౌజన్య, దివ్య హరితలను బుధవారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. వీరికి న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. నిందితులనురాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. దర్యాప్తులో ఎస్సై ప్రభాకరరావు, కానిస్టేబుళ్లు ధర్మరాజు, సుభాకర్, క్రైం పార్టీకి చెందిన కానిస్టేబుల్ బాలకృష్ణ, రామచంద్రరావు, జి.కృష్ణసాయి, డి.అర్జున్ కీలక భూమిక పోషించారు. చదవండి: (ఏఈ హత్య కేసు: భార్యే కుంటలో వేసి తొక్కి.. ఏమీ ఎరగనట్లు) -
ఆఖరుసారిగా బన్నీతో గడుపుతానంటూ.. ఏకాంతంగా ఉండగా..
సాక్షి, సిటీబ్యూరో/నాగోలు: నగర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్న కొలిపాక శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. హతురాలు అతడికి రెండో భార్య అని, ఆమె ప్రియుడితో గడపడానికి అంగీకరించినట్లు నటించి ఇద్దరినీ అంతం చేశాడని పోలీసులు తేల్చారు. ఏసీపీ కె.పురుషోత్తమ్‌రెడ్డితో కలిసి గురువారం డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ వివరాలు వెల్లడించారు. ఏడాది క్రితం నగరానికి వలసవచ్చి.. విజయవాడలోని పాయకాపురం సుందరయ్య కాలనీకి చెందిన కొలిపాక శ్రీనివాసరావు మొదటి భార్య ముగ్గురు పిల్లలు పుట్టిన అనంతరం అనారోగ్యంతో చనిపోయింది. దీంతో సత్యవతి అలియాస్ జ్యోతిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు తొమ్మిది, పదో తరగతి చదువుతున్నారు. ఐదుగురు సంతానంలో ఇద్దరికి వివాహాలు కాగా... మిగిలిన ముగ్గురూ విజయవాడలో నానమ్మ ఇంట్లో ఉంటున్నారు. ఏడాది క్రితం బతుకుదెరువు నిమిత్తం శ్రీనివాసరావు తన భార్య జ్యోతితో కలిసి నగరానికి వలస వచ్చాడు. స్క్రాప్ వ్యాపారం చేస్తున్న ఇతడు ఆరు నెలలు పార్శిగుట్టలో ఉండి ఆపై వారాసిగూడకు మారాడు. నామాలగుండులో ఉంటున్న సమయంలో బౌద్ధనగర్‌కు చెందిన యడ్ల యశ్వంత్ అలియాస్ బన్నీతో జ్యోతికి పరిచయం ఏర్పడింది. గతంలో బన్నీ క్యాబ్ డ్రైవర్‌గా పని చేసేవాడు. ఓ సందర్భంలో జ్యోతి అతడి క్యాబ్ బుక్ చేసుకోవడంతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ వినకపోవడంతో ‘వదిలించుకోవాలని’... వారి మధ్య వివాహేతర సంబంధం విషయం కొన్నాళ్ల క్రితమే శ్రీనివాసరావుకు తెలిసింది. మందలించినప్పటికీ జ్యోతి తన ప్రవర్తన మార్చుకోలేదు. కొన్ని సందర్భాల్లో ఇద్దరూ తన ఇంట్లోనే ఏకాంతంగా గడుపుతున్నారని తెలిసి శ్రీనివాసరావు ఆవేశంతో రగిలిపోయాడు. మాట వినని జ్యోతితో పాటు ఆమెను లోబర్చుకున్న బన్నీని అంతం చేయాలని నిర్ణయించుకుని సరైన సమయం కోసం వేచి చూశాడు. తొలుత జ్యోతిని తీసుకుని విజయవాడకు కాపురం మారిస్తే పరిస్థితులు సద్దుమణుగుతాయని భావించాడు. ఇదే విషయం ఆమెకు చెప్పిన శ్రీనివాసరావు గత వారమే సామాన్లు పంపేశాడు. ఆదివారం బైక్‌పై ఇద్దరూ విజయవాడ వెళ్లాల్సి ఉంది. ఆ సందర్భంలో జ్యోతి ఆఖరుసారిగా బన్నీతో గడుపుతానంటూ శ్రీనివాసరావుతో చెప్పింది. ఇలాంటి సందర్బం కోసమే ఎదురు చూస్తున్న అతడు వెంటనే అంగీకరించి ఆమెతోనే బన్నీకి ఫోన్ చేయించి తన ఇంటికి రప్పించాడు. నగర శివార్లకు వెళ్లిన తర్వాత అనువైన ప్రాంతంలో ఇద్దరూ ఏకాంతంగా గడపాలని, ఆపై తాము విజయవాడ వెళ్లిపోతామని, నువ్వు వెనక్కు వచ్చేయమంటూ బన్నీకి చెప్పాడు. సుత్తితో కొట్టి, స్క్రూడ్రైవర్‌తో పొడిచి... దీంతో నామాలగుండు నుంచి శ్రీనివాసరావు, జ్యోతి ఒక వాహనంపై బన్నీ తన సోదరుడి వాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో మద్యం, బిర్యానీ ప్యాకెట్లు కొనుక్కున్నారు. అనంతరం ముగ్గురూ అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, కొత్తగూడెం గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కగా నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడి పొదల మధ్యలో శ్రీనివాసరావు మద్యం తాగుతుండగా... కాస్త దూరంలో జ్యోతి, బన్నీ ఏకాంతంగా గడుపుతున్నారు. ఇద్దరూ నగ్నంగా ఉన్న సమయంలో తన వాహనంలో నుంచి సుత్తి, స్క్రూడ్రైవర్ తీసుకుని వెళ్లి వారిపై దాడి చేశాడు. తేరుకునే లోపే ఇద్దరి తలపై కొట్టాడు. ఆపై స్క్రూడ్రైవర్‌తో విచక్షణారహితంగా పొడిచాడు. సమీపంలో ఉన్న రాయితో బలంగా మోది చంపేశాడు. అక్కడ నుంచి జ్యోతి సెల్‌ఫోన్ తీసుకుని తన వాహనంపై విజయవాడకు వెళ్లిపోయాడు. మంగళవారం ఈ హత్యలు వెలుగులోకి రావడంతో అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణాలో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ వి.స్వామి, ఎస్సై డి.కరుణాకర్‌రెడ్డి, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ బి.అంజిరెడ్డి నిందితుడిని గురువారం అరెస్టు చేశారు. ఇతడి నుంచి వాహనంతో పాటు హత్యకు వినియోగించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. -
యర్రాజి జ్యోతికి స్వర్ణం
కోజికోడ్: జాతీయ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి యర్రాజి జ్యోతి పసిడితో మెరిసింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాన్ని అందుకుంది. 13.08 సెకన్ల టైమింగ్‌తో ఆమె రేస్‌ను పూర్తి చేసింది. నిజానికి జ్యోతి నమోదు చేసిన టైమింగ్‌కు జాతీయ రికార్డుగా గుర్తింపు దక్కాలి. 2002లో అనురాధ బిశ్వాల్ నమోదు చేసిన 13.38 సెకన్లను ఆమె సవరించింది. అయితే నిబంధనల ప్రకారం గాలి వేగంలో ఉండే మార్పుతో అదనపు ప్రయోజనం కలిగే అవకాశం ఉండటం వల్ల (టెయిల్ విండ్) దానిని అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. టెయిల్ విండ్ను 2 మీటర్/సెకన్ వరకు అనుమతిస్తుండగా, ఈ రేస్ సమయంలో అది 2.1 మీటర్/సెకన్‌గా నమోదు కావడంతో జ్యోతికి నిరాశ తప్పలేదు. మహేశ్వరికి కాంస్యం... మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో తెలంగాణ అథ్లెట్ జి. మహేశ్వరి కాంస్యం గెలుచుకుంది. 10 నిమిషాల 47.30 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసిన మహేశ్వరి మూడో స్థానంలో నిలిచింది. -
అంతర్జాతీయ మారథాన్లలో వరంగల్ ‘జ్యోతి’
సాక్షి, వరంగల్: పాప జన్మించిన సమయంలో ఆమెకు థైరాయిడ్ సమస్య నిర్ధారణ అయింది. మందులతోనే సమస్య తగ్గదన్న వైద్యుడి సూచన మేరకు తొలుత యోగా, వాకింగ్ మొదలుపెట్టిన ఆమె.. ఆ తరువాత పరుగుపై దృష్టిపెట్టింది. ఆమె ప్రారంభించిన పరుగు 46వ ఏట పూర్తిస్థాయిలో పట్టాలెక్కింది. తొలుత భారత్‌లో జరిగిన మారథాన్లలో పరుగులు పెట్టిన ఆమె కాళ్లు...అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఉన్న ఐదు మారథాన్లను చుట్టివచ్చాయి. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భార్య, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి వయస్సు 51 ఏళ్లు. ఆమె ఇటీవల లండన్ మారథాన్‌లో లక్ష్యాన్ని పూర్తి చేసి మెడల్ దక్కించుకొని వరంగల్ ఖ్యాతిని ఇనుమడింపచేసింది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. నమ్మకాన్ని పెంచిన ముంబై మారథాన్ 23 ఏళ్ల వయసులో థైరాయిడ్ వచ్చింది. బరువు పెరిగి ఏ పని చేయాలన్నా శరీరం సహకరించలేదు. మందులతోపాటు వ్యాయామం చేస్తే ఫలితాలు ఉంటాయని వైద్యులు చెప్పారు. కొన్నాళ్ల పాటు ఇంటి పరిసరాల్లోనే యోగా, వాకింగ్ చేసేదాన్ని. అయితే కొన్నాళ్ల తర్వాత హైదరాబాద్ కేబీఆర్ పార్కుకు వాకింగ్ వెళ్లా. ఆ సమయంలో మారథాన్ క్లబ్ గురించి తెలుసుకొని వారి వద్ద శిక్షణలో చేరా. ఇందుకోసం అత్యంత కష్టమైన ట్రెక్కింగ్ కూడా చేశాను. వారానికి రెండుసార్లు లాంగ్‌రన్‌లు, నిత్యం వ్యాయామం చేశా. విశాఖపట్నం, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లో ఎక్కడా మారథాన్ నిర్వహించినా వెళ్లి పాల్గొన్నా. 2016 మేలో శిక్షణ ప్రారంభించిన ఏడాదిలోనే విశాఖపట్నంలో జరిగిన హాఫ్ మారథాన్ పూర్తి చేశా. 2017 జనవరిలో ముంబైలో జరిగిన 42.2 కిలోమీటర్ల మారథాన్‌ను 4.55 గంటల్లో పూర్తి చేయగలిగా. అప్పుడు నాకు నమ్మకం బాగా పెరిగింది. 2018లో హైదరాబాద్‌లో జరిగిన 55 కిలోమీటర్ల అల్ట్రా మారథాన్‌లో రెండో స్థానం సాధించా. వీటన్నింటి తర్వాత నా దృష్టి విదేశాల్లో జరిగే మారథాన్లపై పడింది. మేజర్ మారథాన్లలో పాల్గొంటూ.. జర్మనీలోని బెర్లిన్, అమెరికాలో బోస్టన్, షికాగో, న్యూయార్క్, లండన్, జపాన్‌లోని టోక్యోలో అంతర్జాతీయ మారథాన్లు జరుగుతాయి. విపరీతమైన వేడి ఉండే దుబాయ్ మారథాన్‌లో ఐదు గంటలపాటు పరిగెత్తాను. ఉక్కపోతతో పరుగు తీయడం కష్టంగా మారినా లక్ష్యాన్ని చేరుకున్నా. 2018 నుంచి 2019లోపు వరల్డ్ మేజర్ మారథాన్‌లైన బెర్లిన్, బోస్టన్, షికాగో, న్యూయార్క్ మారథాన్లలో దిగ్విజయంగా పరుగులు పెట్టా. ఇటీవల లండన్‌లో జరిగిన మారథాన్‌లో 42.6 కిలోమీటర్లను ఐదు గంటల 15 నిమిషాల్లో చేరా. జపాన్‌లోని టోక్యోలో జరిగే మారథాన్‌లో పాల్గొంటే నా కల పూర్తిగా సాకారమవుతుంది. వరంగల్లోనూ మారథాన్ నిర్వహించేలా పరుగు కోసం చాలా సమయం కేటాయించాలి. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే మరోవైపు మారథాన్‌లో పాల్గొనడంపై దృష్టి సారించా. హైదరాబాద్ రన్నర్స్ ఏటా మారథాన్ నిర్వహిం చినట్టుగా వరంగల్‌తోపాటు భూపాలపల్లిలోనూ 5కే, 10కే రన్ నిర్వహించాలనుకుంటున్నా. టోక్యో లో మారథాన్ పూర్తిచేశాకే దీనిపై దృష్టిసారించి యువతకు ఆరోగ్యంపై అవగాహన కలిగిస్తా. -
బిగ్‌బాస్: మెరుపుతీగలా వచ్చిపోయింది వీళ్లే!
Telugu Bigg Boss, 1st Week Eliminated Contestants: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అంటే ఇదేనేమో.. బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టే ఛాన్స్ వచ్చినా ప్రేక్షకులు కనికరించకపోవడంతో మొదటివారమే ఇంటిబాటపట్టారు చాలామంది సెలబ్రిటీలు. బిగ్‌బాస్ ఆడే నాటకంలో వారం రోజులకే ఎలిమినేట్ అవక తప్పలేదు. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఇప్పటివరకు ఐదుగురు సెలబ్రిటీలు అందరి కంటే ముందే షోలో ఎలిమినేట్ అయ్యారు. వారెవరన్నది చూసేద్దాం.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్ తొలి సీజన్లో నటి జ్యోతి అందరికంటే ముందుగా ఎలిమినేట్ అయింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించిన రెండో సీజన్లో సంజన అన్నె షోలో అడుగు పెట్టిన వారం రోజులకే అందరికీ వీడ్కోలు పలుకుతూ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. కింగ్ నాగ్ బిగ్‌బాస్ హోస్టింగ్‌ను భుజానికెత్తుకున్న మూడో సీజన్లో నటి హేమ మొదటివారమే ఎలిమినేట్ అయింది. నాలుగో సీజన్లో సూర్య కిరణ్‌ను ఎలిమినేట్ చేయగా తాజా సీజన్లో సరయూ ఫస్ట్ వీక్‌లోనే బయటకొచ్చింది. అయితే వీరిలో కొందరు కోపం, కొట్లాటల కారణంగానే ముందుగా ఎలిమినేట్ అయ్యారనేది తెలిసిన విషయమే. కాకపోతే ఒక్కవారంలోనే కంటెస్టెంట్లను జడ్జ్ చేయడం సరికాదని బిగ్‌బాస్ వీక్షకులు అభిప్రాయపడుతున్నారు. పైగా నామినేషన్స్‌లోకి వచ్చినవారిలో కొందరిని బిగ్‌బాస్ కావాలని నెగెటివ్‌గా చూపిస్తారనేది కూడా కొంతమంది వాదన. మరికొందరినేమో కనీసం తెర మీద కూడా చూపించకుండా మాయ చేస్తాడనేది మరో విమర్శ. అందుకే ఎన్నో ఆశలతో బిగ్‌బాస్ షోలో అడుగు పెట్టే కంటెస్టెంట్లకు వారేంటో నిరూపించుకునేందుకు ఒక్క అవకాశం కల్పిస్తే బాగుంటుందనేది చాలామంది అభిప్రాయం. ఇందుకుగానూ తొలివారం ఎలిమినేషన్‌ను ఎత్తేస్తే బాగుంటుందని బుల్లితెర అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారు? -
అయ్యో జ్యోతి: అప్పట్లో సంచలనం.. ఇప్పుడు విషాదం
తండ్రి ఆరోగ్యం బాగోలేదు. పైగా లాక్డౌన్ కష్టాలు. అందుకే ఆ కూతురు సాహసానికి పాల్పడింది. వారంపాటు 1200 కిలోమీటర్లపైగా సైకిల్ మీద తండ్రిని ఇంటికి చేర్చింది. సైకిల్ జ్యోతి కుమారి సాహసానికి, ధైర్యానికి అప్పట్లో సర్వత్రా ప్రశంసలు కురిసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఇంట విషాదం నెలకొంది. పాట్నా: సైకిల్ గర్ల్ జ్యోతి కుమారి తండ్రి మోహన్ పాశ్వాన్ సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయాన్ని జిల్లా మెజిస్ట్రేట్ త్యాగరాజన్ ప్రకటించారు. ఏ తండ్రి కోసమైతే జ్యోతి కుమారి అంత కష్టానికి ఓర్చిందో.. ఆ తండ్రే ఇక లేరని, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని త్యాగరాజన్ అన్నారు. అంతేకాదు ఆ కుటుంబానికి అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు కూడా. కాగా, జ్యోతి కుటుంబ స్వస్థలం బిహార్‌లోని దర్బంగా. యాక్సిడెంట్ తర్వాత.. జ్యోతి తండ్రి మోహన్ పాశ్వాన్ ఆటో డ్రైవర్. బతుకు దెరువు కోసం ఢిల్లీలోని గురుగ్రామ్‌కు వెళ్లాడు. ఇక పదో తరగతి ఫెయిల్ అయిన పెద్దకూతురు జ్యోతి కూడా ఆయతో పాటే వెళ్లింది. మోహన్ భార్య మిగిలిన పిల్లలతో ఊరిలో ఉండేది. పోయినేడాది ఓ రోడ్డు ప్రమాదంలో మోహన్ గాయపడ్డాడు. దీంతో ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. సరిగ్గా అదే టైంలో లాక్డౌన్ వచ్చి పడింది. ఇంటి కిరాయి కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఓనర్ ఖాళీ చేయమన్నాడు. దీంతో తండ్రి ఆరోగ్య దృష్ట్యా ఊరికి వెళ్లాలని జ్యోతి అనుకుంది. సైకిల్‌పై తండ్రిని కూర్చోబెట్టుకుని ఇంటి బాట పట్టింది. వారం కష్టం జబ్బు పడిన తండ్రి మోహన్‌ను సైకిల్ పై కూర్చోబెట్టుకుని ప్రయాణం మొదలుపెట్టింది జ్యోతి. రోజూ ముప్ఫై నుంచి నలభై కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కింది. మధ్య మధ్యలో కొందరు ట్రక్ డ్రైవర్లు లిఫ్ట్, భోజనం ఇచ్చి సాయపడ్డారు. మొత్తానికి వారం తర్వాత ఇంటికి చేరుకుంది. జ్యోతి ప్రయత్నానికి అప్పట్లో దేశమంతా సలాం కొట్టింది. అంత చిన్న వయసులో ఏమాత్రం అధైర్యపడకుండా... ఎక్కడా అలసిపోకుండా... అంత సుదీర్ఘ దూరం ఆమె సైకిల్‌పై ప్రయాణించడం అప్పట్లో అంతా మెచ్చుకున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం జ్యోతి తెగువకు హ్యాట్సాఫ్ చెబుతూ బాలపురస్కార్ ప్రకటించారు. ఇవాంక ట్రంప్ సహా పలువురు సెలబ్రిటీలు కూడా సైకిల్ జ్యోతి సాహసంపై స్పందించారు. అయితే ఆ టైంలో కొంత సాయం అందినప్పటికీ.. ఆర్థికంగా ఆ కుటుంబం నిలదొక్కుకోలేదని తెలుస్తోంది. జ్యోతి కుటుంబానికి సాయం జ్యోతి కథనాల తర్వాత అధికారులు ఆమెకు కొంత సాయం అందించారు. అప్పట్లో సైక్లింగ్ ఫెడరేషన్ కూడా జ్యోతిని సైకిల్ రైడర్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించింది. అయితే జ్యోతి తల్లి మాత్రం కూతురి చదువే మొదటి ప్రాధాన్యంగా పేర్కొంది. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన జ్యోతి కుటుంబం ఇప్పుడు విషాదంలో మునిగిపోయింది. దీంతో సాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. -
పవన్ కల్యాణ్ నాపై ఏకంగా కవిత్వం రాశారు: నటి
బిగ్‌బాస్ తెలుగు మొదటి సీజన్ కంటెస్టెంట్, నటి జ్యోతి పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె.. షూటింగ్ సెట్స్‌లో అందరూ తన వెనకాలే పడేవారని, రకరకాల ప్రయత్నాలు చేస్తూ తనకు ట్రై చేసేవారని పేర్కొంది. ఈ సందర్భంగా ఆమె పవన్ గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చింది. ‘అందరూ షూటింగ్ సెట్లో పవన్ కల్యాణ్ ఎవరితో మాట్లాడరని, ఆయన పని ఆయన చేసుకుంటారని చెబుతుంటారు. కానీ షూటింగ్ సెట్స్‌లో ఆయన నాతో చాలా సరదాగా ఉండేవారు. విరామ సమయంలో నాతో ఎక్కువగా మాట్లాడేవారు. అంతేకాదు ఆయన నాపై ఓ కవిత్వం కూడా రాశారు’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా పవన్‌తో జ్యోతి గుడుంబా శంకర్ మూవీ నటించిన సంగతి తెలిసిందే. హంగామా, ఎవడి గోల వాడిది, మహాత్మ, పెళ్లాం ఊరెళితే వంటి సినిమాల్లో నటించిన జ్యోతికి ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గాయి. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన తెలుగు బిగ్‌బాస్ మొదటి సీజన్లో ఆమె పాల్గోనే అవకాశం వచ్చింది. దీంతో బిగ్‌బాస్ హౌజ్ అడుగు పెట్టిన ఆమె తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది. ఇక అప్పటి నుంచి జ్యోతి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటు అప్పడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. చదవండి: నాకో ప్రియుడు కావాలి, డేటింగ్‌కు వెళ్తా: జ్యోతి హాట్ టాపిక్‌గా మారిన పవన్ కల్యాణ్ రెమ్యూనరేషన్