దంపతులపై పోలీసుల దాడి, పబ్కి వెళ్లలేదు... | police attack on couple in hyderabad | Sakshi
Sakshi News home page

దంపతులపై పోలీసుల దాడి, పబ్కి వెళ్లలేదు...

Dec 27 2014 9:04 AM | Updated on Jul 10 2019 7:55 PM

దంపతులపై పోలీసుల దాడి, పబ్కి వెళ్లలేదు... - Sakshi

దంపతులపై పోలీసుల దాడి, పబ్కి వెళ్లలేదు...

భాగ్యనగరంలో రోడ్లు ప్రజల ప్రాణాలకు ముప్పును తెచ్చిపెడుతున్నాయి. బేగంపేటలో చంద్రబాబు, జ్యోతి అనే దంపతులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

హైదరాబాద్ : భాగ్యనగరంలో రోడ్లు ప్రజల ప్రాణాలకు ముప్పును తెచ్చిపెడుతున్నాయి. బేగంపేటలో చంద్రబాబు, జ్యోతి అనే దంపతులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. తమ రెండేళ్ల కుమారుడితో కలిసి స్కూటీపై వస్తుండగా బేగంపేట లైఫ్ స్టైల్ సమీపంలో రోడ్డుపై ఉన్న గుంత కారణంగా పడిపోయారు.

గాయపడ్డ వారు...  జీహెచ్ఎంసీ అధికారుల తీరును నిరసిస్తూ దంపతులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ జాం అయ్యింది. ఇది గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాత్రాంతా వారిని పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఈ క్రమంలో పోలీసులు, దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. గత రాత్రి ఈ సంఘటన జరిగింది.

ఈ విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు పంజాగుట్ట పీఎస్కు వెళ్లగా.... చందూ తాగి,  పోలీసులతో ఘర్షణ పడినందుకే తాము అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ వెంకటేశ్వరరావు  వివరణ ఇచ్చారు. తమను అన్యాయంగా పోలీసులు కొట్టారని బాధితురాలు జ్యోతి కన్నీటిపర్యంతమైంది. తాము పబ్కో మరెక్కడకో వెళ్లిలేదని... బల్కంపేటలో ఉయ్యాల ఫంక్షన్కు వెళ్లి వస్తున్నామని జ్యోతి తెలిపారు.

పడిపోయిన తమను...ఏం జరిగిందో అడగకుండానే కానిస్టేబుల్ రావటం ...రావటమే  దాడి చేశాడని ఆమె పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్కు తీసుకు వచ్చిన తర్వాత కూడా తన భర్తను పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని, అడ్డు వెళ్లిన తనపై కూడా ప్రతాపం చూపారని జ్యోతి కన్నీటిపర్యంతమయ్యారు. బాధలో తన భర్త ...పొరపాటును మాట జారి ఉండవచ్చని...దానికి పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించటం బాధాకరమన్నారు. గతంలోనూ ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయని, అప్పుడు కూడా పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించేవారని పలువురు విమర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement