chandu
-
'ఈ సినిమాకు ఒలింపిక్ మెడల్ ఇవ్వాల్సిందే'.. మను భాకర్ పోస్ట్ వైరల్!
ఇటీవల పారిస్‌లో ముగిసిన ఒలింపిక్స్‌లో ఏకంగా రెండు పతకాలు సాధించిన భారత స్టార్ షూటర్ మను భాకర్. తొలిసారి రెండు కాంస్య పతకాలు గెలిచి అందరి మనసులను గెలుచుకుంది. తాజాగా ఆమె ఓ సినిమాపై ప్రశంసలు కురిపించారు. నేను ఊహించిన దానికంటే అద్భుతంగా ఉందంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఒక అథ్లెట్ పాత్రలో నటించడం అంత సులభం కాదని ఆమె అన్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి? హీరో ఎవరు? అనే వివరాలేంటో చూద్దాం.బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'చందు ఛాంపియన్'. మొదటి పారాలింపిక్ స్వర్ణపతక విజేత మురళీకాంత్ పేట్కర్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కించారు. జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.88 కోట్లకు పైగా రాబట్టింది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా చందు ఛాంపియన్ వీక్షించిన మనుభాకర్ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అయితే మను భాకర్ చేసిన పోస్ట్‌కు హీరో కార్తీక్ ఆర్యన్ రిప్లై ఇచ్చారు. మీలాంటి నిజమైన ఛాంపియన్ మా సినిమాపై ప్రశంసలు కురిపించడం అద్భుతమన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఒలింపిక్స్‌లో రాణించారని కొనియాడారు. ప్యార్ కా పంచనామా సినిమాతో కెరీర్ కార్తీక్ ఆర్యన్ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. -
పవిత్రతో గత ఐదేళ్లుగా... చందు భార్య శిల్ప
'త్రినయని' సీరియల్ నటి పవిత్రా జయరాం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కొన్నిరోజుల క్రితం కారు యాక్సిడెంట్లో ఈమె ప్రాణాలు కోల్పోగా, తాజాగా ఉరివేసుకుని నటుడు చందు చనిపోయాడు. పవిత్ర గురించి గత రెండు మూడు రోజుల నుంచి గుర్తు చేసుకుంటున్న ఇతడు ఇప్పుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే చందు భార్య శిల్ప బయటకొచ్చింది. తన భర్త గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది.(ఇదీ చదవండి: బుల్లితెర నటి పవిత్రా జయరాం కేసులో ట్విస్ట్.. ప్రియుడు చందు సూసైడ్!)'స్కూల్ వయసులోనే నా వెంటపడిన చందు.. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేనే చందుకి సీరియల్లో మొదటి అవకాశం ఇప్పించాను. ఆ తర్వాత వరసగా ఛాన్సులు వచ్చాయి. 'త్రినయని' సీరియల్ చేస్తున్నప్పటి నుంచి పవిత్రతో చందుకు సంబంధం మొదలైంది. ఆమె మోజులో పడి నన్ను, పిల్లల్ని వదిలేశాడు. పవిత్ర మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు. ఆమె మాయలో పడి చందు ఇలా అయిపోయాడు. మాకు మా పిల్లలకు న్యాయం జరగాలి' అని చందు భార్య శిల్ప ఆవేదన వ్యక్తం చేసింది.ఇకపోతే పవిత్రతో కలిసి 'త్రినయని' సీరియల్ చేస్తున్న చందు.. 'కార్తికదీపం'లోనూ నటిస్తున్నాడు. ఇప్పుడు ఇలా రోజుల వ్యవధిలో పవిత్ర-చందు మృతి చెందడం చాలామందిని షాక్‌కి గురిచేస్తోంది. ఇప్పుడు చందు భార్య శిల్ప చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారిపోయాయి.(ఇదీ చదవండి: కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!) -
బుల్లితెర నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటుడు చందు బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ కాలనీలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. చందు ప్రస్తుతం త్రినయిని, రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం లాంటి సీరియల్స్‌లో నటించారు. కాగా.. 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్న చందుకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.కాగా.. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరాం మృతి చెందిన సంగతి తెలిసిందే. గత ఆరేళ్లుగా చందుకు టీవీ నటి పవిత్ర జయరాంతో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే పవిత్ర పుట్టినరోజు సందర్భంగా తనను రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఓ యూట్యూబ్ ఛానెల్‌తో తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని వెల్లడించారు. కాగా.. పవిత్రతో సహజీవనం చేసిన చందు ఆమెను గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలో చందు సూసైడ్ చేసుకోవడం ఒక్కసారిగా టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనతో సీరియల్ నటి పవిత్ర జయరాం యాక్సిడెంట్ కేసు కీలక మలుపులు తిరగనుంది. -
అబ్బాయిలకు రక్షణ లేదు, నా కడుపు మీద కొట్టారు: పక్కింటి కుర్రాడు
సోషల్ మీడియా వచ్చాక ఫేమస్ అవ్వడం చాలా ఈజీ అయిపోయింది. కానీ ఆ పాపులారిటీని కాపాడుకోవడం మాత్రం అంత ఈజీ కాదు. పొరపాటున నోరు జారినా, ఏదైనా తప్పు చేసినా, ఏదేని కేసులో ఇరుక్కున్నా అప్రతిష్ట మూటగట్టుకుంటారు. నలుగురిలో నవ్వులపాలు అవుతారు. ప్రముఖ యూట్యూబర్, నటుడు చందుసాయికి ఇదే పరిస్థితి ఎదురైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దాదాపు నెల రోజులు జైలు శిక్ష అనుభవించిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. విపరీతంగా ఏడ్చా.. చేయని తప్పుకు.. తాజాగా అతడు ఈ కేసు గురించి మాట్లాడుతూ.. ఏం జరిగిందనే విషయాలను ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. చందు మాట్లాడుతూ.. 'ఎవరిమీదైనా పగ తీర్చుకోవడానికి మరీ ఇంత దూరం వెళ్లకూడదు. ఉన్నది చెప్తే ఓకే కానీ లేనిది కల్పించడం అవసరమా? తప్పు కదా.. నా కుటుంబ సభ్యుల మీద కేసు పెట్టారు. అదింకా పెద్ద తప్పు. వాళ్లు ఎంత బాధపడతారు? 27 రోజులు జైల్లో ఉన్నాను. మొదటి మూడు రోజులు విపరీతంగా ఏడ్చేశాను. నిజం ఎప్పటికైనా తెలుస్తుందని బాధను దిగమింగుకుని బతుకుతున్నాను. రిలేషన్‌ను కాపాడుకోవాలనుకున్నా.. నిజంగానే నేను అమ్మాయిని ప్రేమించాను, తనతో రిలేషన్లో ఉన్నాను. కానీ సహజీవనం అనేది వేస్ట్ అని ఆలస్యంగా తెలిసొచ్చింది. నేను నా రిలేషన్‌షిప్‌ను కాపాడుకోవడానికి ఎంతో చేశాను, అక్కడ నేను ఏ తప్పూ చేయలేదు. అయినా చివరకు నాకే దిమ్మతిరిగేలా చేసి కేసు పెట్టారు. ఎంతో కష్టపడి పక్కింటి కుర్రాడిగా పేరు సంపాదించుకున్నాను. నా కడుపు మీద కొట్టారు. ఈ కేసు వల్ల ఓ సినిమా పోయింది. నేను దోషిని కాదు, అలా చూడకండి నా మీద కేసు ఫైల్ అయిందే తప్ప దోషినని రుజువు కాలేదు. దయచేసి ఎవరూ నన్నలా చూడకండి. అయినా అబ్బాయిలకు సమాజంలో రక్షణ లేదు. తప్పు జరిగితే అది ఇద్దరూ చేస్తారు. కానీ శిక్ష ఒక్కరికే పడుతుంది. ఈ విషయంలో అబ్బాయిలు చాలా జాగ్రత్తలు ఉండాలి' అని చెప్పుకొచ్చాడు చందు. చదవండి: 'విడాకులిచ్చేశా.. బిజీగా ఉన్నాను కాబట్టి లైట్..', జీవితం చాలా చిన్నది.. -
‘ప్లాంట్ మ్యాన్’ మూవీ రివ్యూ
టైటిల్: ‘ప్లాంట్ మ్యాన్’ నటీనటులు: చంద్రశేఖర్, సోనాలి పాణిగ్రాహి, అశోక్ వర్థన్, బేబీ ప్రేక్షిత, అక్కం బాలరాజు, చలపతిరావు, తడివేలు, బాలరాజ్, లక్ష్మీకిరణ్, శేఖర్, వీరభద్రం, శ్రీకుమారి, మురళీకృష్ణ, వాణిశ్రీ, బిందు, సరస్వతి, జగపతి తదితరులు నిర్మాణ సంస్థ: డి.ఎం. యూనివర్సల్ స్టూడియోస్ నిర్మాత-దర్శకత్వ పర్యవేక్షణ: పన్నా రాయల్ దర్శకత్వం: కె.సంతోష్‌బాబు సంగీతం: ఆనంద బాలాజీ విడుదల తేది: జనవరి 5, 2023 ప్లాంట్ మ్యాన్ కథేంటంటే.. చారి (చందు)కి ఓ ప్రైవేట్ కంపెనీలో పాతిక లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వస్తుంది. అయినా కూడా ఆ ఉద్యోగాన్ని వదులుకొని తనకెంతో ఇష్టమైన ఆర్గానిక్ వెజిటబుల్స్ బిజినెస్ రన్ చేస్తుంటాడు. కొడుక్కి పెళ్లి చేయాలని చారి పెరెంట్స్ తెగ ప్రయత్నాలు చేస్తారు. అయితే చారి మాత్రం తన పెళ్లిని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ ఉంటాడు. చివరకు ఓ పెళ్లి చూపులకెళ్లి చందు(సోనాలి)ని ఇష్టపడతాడు. చందు కూడా చారిని ఇష్టపడుతుంది. దీంతో ఇరుకుటుంబాలు కలిసి త్వరలోనే పెళ్లి జరిపించాలకుంటారు. అయితే చందు చిన్ననాటి స్నేహితుడు చింటు(అక్కం బాలరాజు)కి ఆమె అంటే చాలా ఇష్టం. ప్రేమ విషయాన్ని చెప్పలేక చందుకు వచ్చి పెళ్లి సంబంధాలన్నీ చెడగొడుతుంటాడు. చారిని కూడా అలానే బెదిరించేందుకు ప్రయత్నిస్తాడు కానీ అది వర్కౌట్ కాదు. ఎలాగైన చందు, చారిల పెళ్లి చెడగొట్టాలని ట్రై చేస్తాడు. కట్ చేస్తే.. చింటూ తండ్రి ఓ సైంటిస్ట్ . ఎడారిలో సైతం మొక్కలు మొలిపించేందుకు 30 ఏళ్లుగా పరిశోధనలు చేస్తుంటాడు. ఓరోజు అతని పరిశోధన విజయవంతమై ఓ మందు కనుగొంటాడు. ఆ రసాయనం నేల మీద జల్లితే నిమిషాల్లో మొక్కలు పుట్టుకొస్తాయి. అది తెలుసుకున్న చింటూ ఆ మందును చారి మీద ప్రయోగిస్తాడు. దాంతో చారికి ఒళ్ళంతా మొక్కలు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? ప్లాంట్ మ్యాన్‌గా మారిన చారికి ఎదురైన సమస్యలు ఏంటి? ఒంటి నిండా వచ్చిన మొక్కలతో అతను ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? చివరికి అతను ఆ సమస్య నుంచి ఎలా బయటపడి మామూలు మనిషిగా మారాడు? చందుతో పెళ్లి సంగతి ఏమైంది? తదితర విషయాలు తెలియాలంటే ప్లాంట్ మ్యాన్ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఓ వ్యక్తి శరీరంపై మొక్కలు మొలకెత్తుతే ఎలా ఉంటుంది? ఇది వినడానికే విచత్రంగా ఉంది కదా? అలాంటి సరికొత్త పాయింట్‌తో తెరకెక్కిన సినిమానే ‘ప్లాంట్ మ్యాన్’. దర్శకుడు కె.సంతోష్‌బాబు ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని సరికొత్త పాయింట్‌ని ఎంచుకున్నాడు..కానీ దాన్ని అంతే కొత్తగా, ఆసక్తికరంగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. సినిమా మొత్తాన్ని కామెడీ వేలోనే నడించాడు. హీరో మూములు మనిషి నుంచి ప్లాంట్ మ్యాన్‌గా మారడం, ఆ ప్రాసెస్‌లో జరిగే ఇన్సిడెంట్స్‌ని ఇవన్నీ ఫన్నీగా సాగుతాయి. హద్దు మీరని హాస్యంతో ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చేసే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు. ప్రతి సన్నివేశం అందరూ నవ్వుకునేలా తియ్యడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కానీ ఎమోషనల్ సీన్స్‌ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేకపోయాడు. కథ ప్రారంభం కాస్త నెమ్మదిగా ఉంటుంది. హీరోహీరోయిన్ల పెళ్లి చూపుల తర్వాత ఆసక్తికరంగా సాగుతుంది. హీరో ఫ్రెండ్ చేసే వాట్సాప్ చాటింగ్ నవ్వులు పూయిస్తుంది. ఒకవైపు హీరోహీరోయిన్ల లవ్‌స్టోరీ..మరోవైపు మొక్కలపై సైంటిస్ట్ చేసే ప్రయోగాన్ని చూపిస్తూ..ఈ రెండింటికి ఎక్కడో లింక్ ఉంటుందనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలిగించేలా చేశాడు. ఫస్టాఫ్‌లో కథ పెద్దగా ఉండదు కానీ ఎంటర్టైన్ చేస్తుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. హీరో ఒంటినిండా మొక్కలు మొలకెత్తడం.. దాని వల్ల అతనికి ఎదురయ్యే సమస్యలు అన్నీ హ్యాస్యాన్ని పంచడంతో పాటు ఆలోచింపజేస్తాయి. ఈ సినిమాలో అంతర్లీనంగా మొక్కలు అనేవి మానవ జీవితానికి ఎంతో అవసరం అనే సందేశం కూడా ఉంది. అయితే పేరున్న నటీనటులు ఉండి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. హీరోహీరోయిన్లుగా నటించిన చందు, సోనాలికి ఇది తొలి సినిమానే అయినా ఎక్కడా తడబాటు లేకుండా చక్కగా నటించారు.కామెడీ, ఎమోషనల్ సీన్స్‌లో కూడా తమ నటనతో మంచి మార్కులు తెచ్చుకున్నారు. హీరో ఫ్రెండ్‌గా నటించిన అశోక్‌వర్థన్ వేసిన పంచ్‌లు బాగా పేలాయి. అతను తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశాడు. చైల్డ్ ఆర్టిస్ట్ ప్రేక్షిత రాయలసీమ యాసలో చెప్పిన డైలాగ్స్ అందర్నీ నవ్వించాయి. ఇక యూట్యూబ్‌లో ఎంతో పాపులర్ అయిన అక్కం బాలరాజు కూడా తనదైన శైలిలో హాస్యాన్ని పండిరచాడు. మిగతా క్యారెక్టర్స్‌లో నటించిన నటీనటులు కూడా వారి పరిధి మేరకు బాగానే చేశారు. సాంకేతిక విషయాలకొస్తే.. మణికర్ణన్ అందించిన ఫోటోగ్రఫీ బాగుంది. వినోద్ యాజమన్య అందించిన బీజీఎం, ఆనంద బాలాజీ అందించిన మెలోడీ సాంగ్స్ సినిమాకు ప్లస్. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
యూట్యూబర్, 'పక్కింటి కుర్రాడు' చందు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ యూట్యూబర్, నటుడు చందుసాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు అతడిని శుక్రవారం అరెస్ట్ చేశారు. యువతి ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. నార్సింగికి చెందిన యువతికి యూట్యూబర్ చందుసాయి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. 2021 ఏప్రిల్ 25న బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు పిలిచి ఆమెపై అత్యాచారం చేశాడు. పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేశాడు. అతడి చేతిలో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు చందుపై అత్యాచారం, మోసం కింద కేసులు నమోదు చేశారు. చందుతో పాటు అతడి తల్లిదండ్రులు సహా మరో ఇద్దరిపైనా కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. కాగా చందు అసలు పేరు చంద్రశేఖర్ సాయి కిరణ్. యూట్యూబ్‌లో చందుగాడు పేరుతో ఫేమస్ అయ్యాడు. చందుగాడు , పక్కింటి కుర్రాడు యూట్యూబ్ ఛానల్స్‌లో వీడియోలు చేస్తూ డబ్బు, పేరు సంపాదించుకున్నాడు. అతడు చేసే కామెడీ, ఎంటర్టైన్మెంట్ వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. చందుగాడు యూట్యూబ్ ఛానల్‌కు ఐదున్నర లక్షల పైచిలుకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చదవండి: ప్రముఖ డైరెక్టర్‌తో ప్రభు కూతురి రెండో పెళ్లి.. విశాల్ స్వీట్ వార్నింగ్.. -
ఐతారం నాడు లగ్గం.. అర్సుకునేటోల్లు వీళ్లే
పెళ్లి.. ఇప్పుడు పెద్ద ఇవెంట్‌గా మారిపోయింది. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం అంతా ఇప్పుడు వెరైటీ వైపు పరుగులు పెడుతున్నారు. తమ పెళ్లి ఇతరుల కంటే భిన్నంగా.. చాలా చాలా క్రియేటీవ్‌గా ఉండాలని భావిస్తున్నారు. ఎంగేజ్మెంట్ మొదలు.. రిసెప్షెన్ వరకు ఇతరుల కంటే భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక తాజాగా ఓ వ్యక్తి మాత్రం తన శుఖలేఖనే వైరైటీగా ముద్రించాడు. బహుశా ఈ రీతిలో శుభలేఖ ఉండడం ఇదే మొదటిసారి కావచ్చు. ఎందుకంటే ఇది అచ్చమైన తెలంగాణ భాషలో ఉంది. ఇందులో పలానా వారి పెండ్లి పిలుపు, ఆహ్వానించువారు, విందు, స్వస్తిశ్రీ చాంద్రమాన సంవత్సర, ఆదివారం, కనిష్ఠ పుత్రుడు, గరిష్ఠ పుత్రిక, కల్యాణ వేదిక’’ వంటి పదాలేం లేవు. అంతా తెలంగాణ వాడుక భాషలోనే ‘‘లగ్గం పిలుపు, పిలిశెటోళ్లు, బువ్వ, ఐతారం అంబటాల్లకు 11.37 గొట్టంగ, మా సిన్న పిల్లగాడు, తొలుసూరి బిడ్డ, లగ్గం యాడనో ఎర్కనా’’ వంటి పదాలతో వినూత్నంగా రూపుదిద్దిన ఈ శుభలేఖ తెలంగాణ యాసను ప్రతిబింబించేలా ఉంది. ఇంతకీ పెళ్లి ఎవరిదంటే... ఈ వినూత్న శుఖలేఖ రాయించింది మై విలేజ్ షో’లో ఓ ఆర్టిస్ట్ అయిన చంద్రమౌళి (చందు). కరీంనగర్ జిల్లా మాల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన కొందరు యువకులు మై విలేజ్ షో అనే యూ ట్యూబ్ ఛానెల్ నడిపే సంగతి తెలిసిందే. ఇందులో వచ్చే షార్ట్ ఫిల్ముల్లో చందు నటిస్తుంటారు. తన వివాహానికి ఇలా శుభలేఖను తయారు చేయించుకొని చందు మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇక ఈ శుఖలేఖను చూసిన నెటిజన్లు చందుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.‘అన్న, లగ్గం పత్రిక మస్తుగున్నదే’, ‘మన తెలంగాణ యాస, బాషాలో, ఇప్పటి దాక ఇట్లాంటి లగ్గం పత్రిక సూడలేదు’, ‘లగ్గం కారట మస్తుగుంది తమ్మి’ అంటూ తెలంగాణ భాషలో కామెంట్లు పెడుతూ చందుకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఒల్లదో అనుకునేరు నాదే😜 pic.twitter.com/LmXnkWtaQJ — chandu_myvillageshow (@chandu_mvs) December 31, 2020 -
పిట్ట కథకూ నాకూ లింక్ ఉంది
‘ఈ సినిమాతో నాకు ఓ చిన్న లింక్ ఉంది. అదేంటంటే నాకు ఈ చిత్రకథ తెలియటమే. కథ విన్నప్పుడు ఆసక్తిగా అనిపించింది. దీనికి ఎలాంటి టైటిల్ పెట్టాలి అనే ఆలోచన వచ్చినప్పుడు దర్శకుడికి రెండు, మూడు పేర్లు వచ్చాయి. వాటిలో ‘ఓ పిట్టకథ’ టైటిల్ నాకు బాగా నచ్చింది. ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ అని క్యాప్షన్ పెట్టమని సలహా ఇచ్చాను. అదే ఈ సినిమాకు నా కంట్రిబ్యూషన్’’ అన్నారు దర్శకుడు త్రివిక్రమ్. చందు ముద్దు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ సంస్థపై ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘ఓ పిట్టకథ’. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను త్రివిక్రమ్ విడుదల చేశారు. నిర్మాత ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘స్టార్ హీరోలతో చాలా కమర్షియల్ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలు చేస్తున్నాను. అలాగే మళ్లీ కొత్తవాళ్లతో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు దర్శకుడు చందు చెప్పిన చిన్న కథకు ఎగ్జయిట్ అయ్యాను. వెంటనే ఈ కథను సెట్స్ మీదకు తీసుకెళ్లాను. ఈ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసిన త్రివిక్రమ్‌కు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సాగే సినిమా ఇది. షూటింగ్ పూర్తయింది. మార్చిలో సినిమాని విడుదల చేస్తాం’’ అని ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి అన్నారు. ‘‘ఒక పల్లెటూరిలో జరిగే కథ ఇది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు ఏం జరుగుతుందనే ఆసక్తిని రేకిత్తించే సినిమా’’ అన్నారు చందు ముద్దు. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు, నిత్యాశెట్టి తదితరులు నటించారు. -
పాత్ర కోసం మార్పు
ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో ‘డ్రీమ్’ ఫేమ్, ప్రవాసాంధ్రుడు భవానీశంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘క్లైమ్యాక్స్’. నాషా సింగ్, రమేష్, చందు కీలక పాత్రధారులు. పి. రాజేశ్వర్ రెడ్డి, కె.కరుణాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా భవానీ శంకర్ మాట్లాడుతూ– ‘‘ఇందులో రాజేంద్రప్రసాద్‌గారి పాత్ర పేరు మోడీ. ఆయన పాత్రకు మోడీ అనే పేరు ఎందుకు పెట్టాం అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ పాత్ర కోసం రాజేంద్రప్రసాద్ కొత్తగా మారారు’’ అన్నారు. ‘పొలిటిక్ సెటైర్ నేపథ్యంలో నడిచే మర్డర్ మిస్టరీ ఇది. మా సంస్థకు గొప్ప పేరు తెచ్చిపెట్టే సినిమా అవుతుంది’’ అన్నారు పి. రాజేశ్వర్‌రెడ్డి. ఈ సినిమాకు రాజేష్ సంగీతం అందిస్తున్నారు. -
డూప్ హీరోల సందడి
బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ డూప్‌లు భాస్కర్, శివ, చందు హీరోలుగా హాబీబ్ తెరకెక్కించిన చిత్రం ‘కథానాయకులు’. సి.రామాంజనేయులు నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 2న విడుదల కానుంది. హబీబ్ మాట్లాడుతూ – ‘‘ఒక మల్టీస్టారర్ మూవీ చూస్తున్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ వినోదంగా సెకండాఫ్ థ్రిల్‌కు గురి చేసే విధంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఓ మంచి సినిమా నిర్మించినందుకు సంతోషంగా ఉంది. పెద్ద హీరోల ఫ్యాన్స్ ఎక్కడా నొచ్చుకోకుండా చేశాం’’ అన్నారు నిర్మాత రామాంజనేయులు. ఈ చిత్రానికి కెమెరా: జో అండ్ శివ. -
లుక్ మార్చేస్తున్న యంగ్ హీరో
హిట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న యంగ్ హీరో మంచు మనోజ్. మంచు వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ యువ కథానాయకుడు స్టార్ ఇమేజ్ అందుకోవటంలో ఫెయిల్ అవుతున్నాడు. కమర్షియల్ ఎంటర్టైనర్లతో పాటు ప్రయోగాత్మక చిత్రాలతో కూడా ఫెయిల్ అయిన మనోజ్, త్వరలో ఓ రొమాంటిక్ లవ్ స్టోరితో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కొత్త దర్శకుడు చందు డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ మేలో ప్రారంభం కానుంది. ఎక్కువ భాగం న్యూయార్క్ లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో మనోజ్ స్లిమ్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే వెయిట్ తగ్గేందుకు మనోజ్ జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడట. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ లవ్ స్టోరీ అయినా మనోజ్‌కు సక్సెస్ ఇస్తుందేమో చూడాలి. -
చైతూతో నిధి..!
మనకు ఆర్తీ అగర్వాల్ తెలుసు. ఆ తర్వాత కాజల్ అగర్వాల్ వచ్చారు. ఇప్పుడు మరో అగర్వాల్ తెలుగు తెరకు పరిచయం కానున్నారని సమాచారం. పేరు నిధి అగర్వాల్. ఈ కన్నడ బ్యూటీ నాగచైతన్య సరసన ‘సవ్యసాచి’లో కథానాయికగా నటించనున్నారని వినికిడి. చందూ మొండేటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. నిధి ఇప్పటికే హిందీలో ‘మున్నా మైఖేల్’ అనే సినిమాలో కథానాయికగా నటించారు. క్యూట్‌గా ఉండటంతో పాటు బాగా డ్యాన్స్ కూడా చేయగలుగుతారట. ‘మున్నా మైఖేల్’లో ఆమె క్లబ్ డ్యాన్సర్ పాత్ర చేశారు. నటిగా కూడా ఓకే అట. అందుకే ‘సవ్యసాచి’కి తీసుకోవాలనుకున్నారని భోగట్టా. -
ఆ బుడ్డోడు మగాడ్రా బుజ్జీ!
అర్ధరాత్రి సమయంలో కుక్కలు కాసింత మొరుగుతూనే గుండెలు గుబేల్‌మంటాయి. అలాంటిది ఏకంగా ఐదు కుక్కలు చుట్టుముట్టి దాడికి సిద్ధపడితే.. పెద్దవాళ్ల గుండెలు సైతం జారిపోతాయి. ఇలాంటి విషమపరిస్థితిలోనూ ఓ బుడ్డోడు మొక్కవోని తెగువను ప్రదర్శించాడు. ఉత్త చేతులతో కుక్కలు అదిలించి.. బెదిరించి.. ఒక్క కాటు కూడా పడకుండా అక్కడినుంచి సురక్షితంగా బయటపెట్టాడు. ఆడు మగాడ్రా బుజ్జీ అనే రేంజ్లో వీరోచితంగా గ్రామసింహాలకు గుబులు పుట్టించాడు. వీడేం పిల్లడ్రా బాబు అని శునకాలే విస్తుపోయేలా హీరోయిజం ప్రదర్శించిన ఆ బుడతడే చందు.. ఇప్పుడు స్థానికంగా అతను హీరోగా మారిపోయాడు. గత శనివారం రాత్రి హైదరాబాద్ మూసాపేట్‌లోని ఆంజనేయనగర్ కాలనీలో రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారిపోయింది. మీడియాలోనూ ప్రముఖంగా వచ్చింది. దీంతో చందు సాహసం తెలుసుకొని కుటుంబసభ్యులు, బస్తీవాసులు కొనియాడుతున్నారు. శ్రీకాకుళం ఇచ్చాపురానికి చెందిన కృష్ణ కొడుకు చందు. కృష్ణ కుటుంబం ముసాపేటలోని శ్రీకాకుళం బస్తీలో ఉంటోంది. మూసాపేట్‌లోని శ్రీకాకుళం బస్తీలో శనివారం రాత్రి ఓ పెళ్లి జరిగిందని, ఆ సమయంలో తన చెల్లి కూతురు పూజతో కలిసి చందు వెళుతుండగా ఈ ఘటన జరిగిందని తండ్రి కృష్ణ చెప్పాడు. తమ ఇంటికి సమీపంలోని చిన్న గల్లీలో పూజ-చందు వెళుతుండగా.. ఓ వీధికుక్కల గుంపు చుట్టుముట్టిందని, వాటిని ధైర్యంగా తరిమేసి.. చందు సురక్షితంగా బయటపడగలిగాడని చెప్పాడు. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ వీధికుక్కలతో పోరాడి బుడతడు చందు సురక్షితంగా బయటపడిన ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో నగరంలో నిత్యం వేధిస్తున్న కుక్కల బెడద విషయంలో ఎక్కడ విమర్శలు వస్తాయోనని జీహెచ్ఎంసీ రంగంలోకి దిగింది. వీధుల్లో విహారం చేస్తున్న కుక్కలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను జీహెచ్ఎంసీ నగరంలోని పలు ప్రాంతాల్లో రంగంలోకి దింపింది. -
ఆ బుడ్డోడు మగాడ్రా బుజ్జీ!
-
చిన్నారిని మింగిన నీటిపాత్ర
చెన్నేకొత్తపల్లి (రాప్తాడు) : నీటిపాత్ర ఓ చిన్నారిని మింగేసింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. ఈ విషాద ఘటన చెన్నేకొత్తపల్లి మండలం హరియాన్‌చెరువులో జరిగింది. గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, కిష్టప్ప దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, వారిని అవ్వ వద్ద మంగళవారం సాయంత్రం వదిలేసి దంపతులిద్దరూ గొర్రెలను చూసొచ్చేకి వెళ్లారని గ్రామస్తులు తెలిపారు. రెండో సంతానమైన చందు(2)ఆడుకుంటూ వెళ్లి కొళాయి వద్ద గల నీటి పాత్రలో ప్రమాదవశాత్తు పడిపోయాడన్నారు. కాసేపటికి గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారొచ్చి బిడ్డను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రాత్రి బాగా పొద్దుపోయింది. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికే బిడ్డ మరణించి ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో కన్నవారు కన్నీరుమున్నీరయ్యారు. -
మాజీ మావోయిస్టు దారుణ హత్య
విశాఖపట్నం: జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టును గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమర్చారు. ఈ సంఘటన విశాఖ కాంతిహిల్స్ అటవీ ప్రాంతంలో శుక్రవారం వెలుగుచూసింది. మావోయిస్టు ఇంటిలీజెన్స్ చీఫ్‌గా పని చేసిన టి. అనిల్ అలియాస్ చందు ఏడాదిన్నర క్రితం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కాగా.. గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు అతనిని దారుణంగా హతమార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మావోయిస్టులే చందును హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
లవర్బాయ్తో చిట్ చాట్
-
నిమజ్జనానికి వెళ్లి..విగతజీవిగా మారి..
హత్యకు గురైన యువకుడు భట్టుపల్లి శివారు కోట చెరువు మత్తడి వద్ద ఘటన మడికొండ : గణపతి నిమజ్జనానికి వెళ్తున్నానని చెప్పి ఇంటినుంచి బయలుదేరిన యువకుడు.. దారుణ హత్యకు గురైన ఘటన నగర పరిధిలోని 33వ డివిజన్ భట్టుపల్లి శివారు కోటచెరువు మత్తడి వద్ద జరిగింది. పోలీసులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం..దర్గా కాజీపేటకు చెందిన పులిగిల్ల చందు (20) నగరంలోని చైతన్య డిగ్రీ కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం కాలేజీకి వెళ్లి వచ్చి రాత్రి దర్గా కాజీపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎర్పాటు చేసిన వినాయక నిమజ్జనంలో పాల్గొనేందుకు వెళ్లాడు. రాత్రి 11.30 గంటలకు చందు తల్లి నిర్మల, అక్క శ్వేత వినాయక మండపం వద్దకు వెళ్లి ఇంటికి రమ్మని పలువగా నిమజ్జనం తర్వాత వస్తానన్నాడు. రాత్రి ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో తండ్రి యాదగిరి చందుకు పోన్ చేయగా సెల్ పని చేయలేదు. గురువారం ఉదయం భట్టుపల్లి గ్రామస్తులు కోటచెరువు వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు మడికొండ ఎస్సై విజ్ఞాన్‌రావుకు సమచారం అందించారు. ఎస్సై సిబ్బందితో అక్కడికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించారు. మృతుడి ప్యాంట్ జేబులో ఉన్న సెల్ పోన్ ఆధారంగా దర్గా కాజీపేటకు చెందిన చందుగా గుర్తించి తండ్రి ఏఆర్ కానిస్టేబుల్ యాదగిరికి సమచారం అందించారు. ఘటనా స్థలాన్ని కాజీపేట ఏసీపీ జనార్దన్, సీఐ ఎల్.రమేశ్‌బాబు పరిశీలించారు. మృత దేహంపై 9 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. క్లూస్ టీం బృందం అధారాలు సేకరించింది. కాగా చందుకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని, ఎవరితోనూ శత్రుత్వం లేదని బంధువులు పేర్కొన్నారు. తంల్లిదండ్రులు కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజ్ఞాన్‌రావు తెలిపారు. -
ఉత్కంఠకు గురి చేసేలా...
టాలీవుడ్లో ఇప్పుడు హారర్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతోంది. తాజాగా ‘ఎవరు’ పేరుతో మరో హారర్ చిత్రం తెరకెక్కింది. తారకరత్న, శేఖర్, యామిని, చందు ప్రధాన పాత్రల్లో రమణ సెల్వ దర్శకత్వంలో ముప్పా అంకమ్మ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం విలేకరులతో మాట్లా డారు. ముఖ్య అతిథిగా హాజరైన హీరో నారా రోహిత్ మాట్లాడుతూ-‘‘సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. వరుసగా హారర్ చిత్రాలు వచ్చి విజయం సాధిస్తున్నాయి. ఈ చిత్రం కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించే అంశాలు చాలా ఉంటాయి’’ అని నిర్మాత పేర్కొన్నారు. ‘‘చాలా రోజుల తర్వాత ఓ మంచి చిత్రం చేశాననే ఫీలింగ్ కలిగింది’’ అని తారకరత్న చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: లింగ శ్రీనివాసరావు. -
మద్యం మత్తులో స్నేహితుడి హత్య
మద్యం మత్తులో ప్రాణ స్నేహితుడినే పొడిచి చంపిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రహ్మత్‌నగర్ చేపల మార్కెట్ సమీపంలో నివాసం ఉండే కల్కొడ సంధ్యారాజ్(28), అదే ప్రాంతంలో నివసిస్తున్న ఆవుల చంద్రశేఖర్ అలియాస్ చందు(29), రమేష్ అలియాస్ బిజ్జు (28) మంచి స్నేహితులు. ఈ ముగ్గురూ కలిసి గురువారం రాత్రి స్థానికంగా ఓ వైన్‌షాప్ వద్ద మద్యం తాగారు. అయితే, తాగిన మద్యం సరిపోలేదని మళ్లీ తాగుదామని నిర్ణయించుకున్నారు. డబ్బుల్లేకపోవటంతో రాత్రి 9.30 గంటల ప్రాంతంలో చందు తన ఇంట్లో సిలిండర్‌ను సమీపంలో ఉన్న ఓ హోటల్లో తనఖా పెట్టి వెయ్యి రూపాయలు తీసుకున్నాడు. ఆ డబ్బుతో మద్యం కొనుగోలు చేసి, తన ఇంట్లోనే స్నేహితులతో కలసి తాగటం మొదలు పెట్టారు. ఈ సమయంలో బిజ్జు, సంధ్యారాజ్ గొడవపడ్డారు. పరస్పరం కొట్టుకున్నారు. మద్యం మత్తులో ఉన్న బిజ్జు బాటిల్ పగలగొట్టి సంధ్యారాజ్ను పొడిచాడు. చెవి నుంచి తీవ్రంగా రక్తస్రావం అయింది. చేతులు, కడుపులో కూడా గాట్లు పడ్డాయి. అనంతరం చందు, బిజ్జు అక్కడి నుంచి పరారయ్యారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు కుటుంబ సభ్యులు చూసేసరికి పైన రక్తపుమడుగులో సంధ్యారాజ్ విగతజీవిగా పడి ఉన్నాడు. పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పరారీలో ఉన్న చందు, బిజ్జులను అరెస్ట్ చేశారు. అకారణంగా గొడవపడ్డారని మాటామాటా పెరిగి ఘటన దాడికి దారి తీసిందని పోలీసులు వెల్లడించారు. నిందితులపై హత్య కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుని ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామానికి చెందిన చందు(22) అనే యువకుడు పురుగుల మందు తాగి శనివారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. -
వనస్థలిపురంలో కిడ్నాప్ కలకలం
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో ఓ విద్యార్థి కిడ్నాప్ కలకలం రేపింది. గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న విద్యార్థి చందూని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన కిడ్నాపర్లు అక్కడ చందూ పై దాడి చేసి చితక బాదారు. చందూ కిడ్నాప్ కు గురైనట్టు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు సకాలంలో చందూ ఆచూకీ కనిపెట్టారు. కిడ్నాపర్ల దాడిలో తీవ్రగాయాలపాలైన చందూను హాస్పటిల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పాత గొడవల నేపథ్యంలో చందూ ని కిడ్నాప్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి
ఖమ్మం: ప్రమాదవశాత్తూ ఇద్దరు చిన్నారులు నీటికుంటలో పడి మృతిచెందారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరులో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీలోని గుత్తికోయలో నివాసముంటున్న కొత్తూరు బంజర తండాకు చెందిన ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తూ కుంటలో పడి మృతిచెందారు. తండాకు చెందిన చందు (9), కిరణ్ (8) ఆదివారం మధ్యాహ్నం ఆడుకోవడానికి వెళ్లి కుంటలో మునిగి చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని దర్యాప్తు ప్రారంభించారు. -
పట్టాలపై రూపాయి బిళ్ల పెట్టబోయి..
వరంగల్: రైలు పట్టాలపై రూపాయి బిళ్ల పెట్టి.. రైలు వచ్చి వెళ్లిన తర్వాత గుండ్రటి రేకులా మారుతుండడంతో తనూ అలాంటి రూపాయి కోసం పట్టాలపైకి వెళ్లి ఓ విద్యార్థి మృత్యువాత పడిన సంఘటన వరంగల్ జిల్లా కేంద్రంలో బుధవారం జరిగింది. వివరాలు.. జిల్లాలోని గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలికి చెందిన మంద చందు(14) బుధవారం ధర్మారంలో పదో తరగతి పరీక్ష రాసేందుకు వచ్చాడు. అయితే, చందు.. మరికొందరు విద్యార్థులు సరదాగా రైలు పట్టాలపై రుపాయి బిళ్ల పెట్టి.. అది వెడల్పు అయిన తర్వాత తీసుకోవాలని భావించారు. ఈ క్రమంలో పట్టాలపై రూపాయి బిళ్ల పెట్టేందుకు చందు వెళ్లగా.. అదే సమయంలో వరంగల్- విజయవాడ మార్గంలో రైలు వస్తోంది. అయితే చందు తప్పుకోవడానికి ప్రయత్నించగా, పట్టాల పక్కనే ఎర్త్ కోసం పెట్టిన ఇనుప పట్టీ కాలికి తట్టుకొంది. కాలు తీసే ప్రయత్నం చేస్తుండగా, రైలు వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. -
రైలు ఢీకొని విద్యార్థి మృతి
వరంగల్: పదో తరగతి పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థి ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డాడు.ఈ సంఘటన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారంలో బుధవారం చోటుచేసుకుంది. మండలంలోని ఎలుకుర్తి గ్రామానికి చెందిన మండా చందు(15) పదో తరగతి పరీక్ష రాయడానికి ధర్మారం వచ్చాడు. దారిలో ఉన్న రైల్వే గేటు దాటుతున్న సమయంలో రైలు ఢీకొనడంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
దంపతులపై పోలీసుల దాడి, పబ్‌కి వెళ్లలేదు...
హైదరాబాద్ : భాగ్యనగరంలో రోడ్లు ప్రజల ప్రాణాలకు ముప్పును తెచ్చిపెడుతున్నాయి. బేగంపేటలో చంద్రబాబు, జ్యోతి అనే దంపతులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. తమ రెండేళ్ల కుమారుడితో కలిసి స్కూటీపై వస్తుండగా బేగంపేట లైఫ్ స్టైల్ సమీపంలో రోడ్డుపై ఉన్న గుంత కారణంగా పడిపోయారు. గాయపడ్డ వారు... జీహెచ్ఎంసీ అధికారుల తీరును నిరసిస్తూ దంపతులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ జాం అయ్యింది. ఇది గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాత్రాంతా వారిని పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఈ క్రమంలో పోలీసులు, దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. గత రాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు పంజాగుట్ట పీఎస్‌కు వెళ్లగా.... చందూ తాగి, పోలీసులతో ఘర్షణ పడినందుకే తాము అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ వెంకటేశ్వరరావు వివరణ ఇచ్చారు. తమను అన్యాయంగా పోలీసులు కొట్టారని బాధితురాలు జ్యోతి కన్నీటిపర్యంతమైంది. తాము పబ్కో మరెక్కడకో వెళ్లిలేదని... బల్కంపేటలో ఉయ్యాల ఫంక్షన్‌కు వెళ్లి వస్తున్నామని జ్యోతి తెలిపారు. పడిపోయిన తమను...ఏం జరిగిందో అడగకుండానే కానిస్టేబుల్ రావటం ...రావటమే దాడి చేశాడని ఆమె పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చిన తర్వాత కూడా తన భర్తను పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని, అడ్డు వెళ్లిన తనపై కూడా ప్రతాపం చూపారని జ్యోతి కన్నీటిపర్యంతమయ్యారు. బాధలో తన భర్త ...పొరపాటును మాట జారి ఉండవచ్చని...దానికి పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించటం బాధాకరమన్నారు. గతంలోనూ ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయని, అప్పుడు కూడా పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించేవారని పలువురు విమర్శిస్తున్నారు. -
నాని బుజ్జి బంగారం మూవీ స్టిల్స్
-
'24/లవ్' ఆడియో ఆవిష్కరణ
-
బతుకు తెరువుకు వలస వస్తే..
తోట్లవల్లూరు (కృష్ణా), న్యూస్‌లైన్ : బతుకు తెరువు కోసం దూర ప్రాంతం నుంచి వలస వచ్చిన గర్భిణి మూడు రోజుల్లోనే తిరిగిరాని లోకానికి వెళ్లిపోయింది. తోట్లవల్లూరులో గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన స్థానికులను కలవరపరిచింది. వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం ధర్మవరానికి చెందిన మొగసాల వెంకట నాగేశ్వరరావు తునికి చెందిన చందు(23)ను ఎనిమిది నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. నాగేశ్వరరావు మొదటి భార్య చనిపోవడంతో చందును రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భిణి. తమలపాకు తోటల్లో పని చేసేందుకు నాగేశ్వరరావు దంపతులు మూడు రోజుల క్రితం తోట్లవల్లూరు వలస వచ్చారు. ఇక్కడ ఓ ఇంట్లో అద్దెకు దిగారు. నాగేశ్వరరావు అద్దెకున్న గదిలో గురువారం రాత్రి 10.30 గంటలైనా లైటు వెలుగుతూనే ఉంది. లైటు తీయమని ఇంటి యజమాని చిట్టిబాబు భార్య ఎన్ని కేకలు వేసినా స్పందన లేదు. దీంతో ఆమె కిటికీలోంచి చూడగా, చందు చీరతో ఉరికి వేలాడుతూ కనిపించింది. నాగేశ్వరరావు మద్యం మత్తులో నిద్రపోతున్నాడు. చిట్టిబాబు చుట్టుపక్కల వారి సాయంతో నాగేశ్వరరావును నిద్ర లేపారు. భార్య ఎలా చనిపోయిందో తనకు తెలియదని, తానూ చనిపోతానంటూ హడావుడి చేశాడు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈస్ట్ ఏసీపీ మహేశ్వరరాజు రాత్రి 12 గంటల సమయంలో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం చందు తల్లిదండ్రులు, బంధువులు వచ్చి ఆమె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేయవద్దని, మృతదేహాన్ని అప్పగిస్తే చాలని పోలీసులను కోరారు. నిబంధనల ప్రకారం కేసు నమోదు తప్పదని ఎస్సై డి.సురేష్ వారికి వివరించారు. తహశీల్దార్ రాజకుమారి ఆధ్వర్యంలో ఆర్ఐ ధనలక్ష్మి, వీఆర్ఓ నాగేశ్వరరావు పంచనామా నిర్వహించారు. అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేష్ తెలిపారు. -
భద్రాచలం మాదే
కామారెడ్డి, న్యూస్‌లైన్ : రాజ్యాన్నే ధిక్కరించి కంచర్ల గోపన్న (రామదాసు) రాములోరి గుడి నిర్మించిన భద్రాచలం ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమంటున్నారు తెలంగాణ విద్యార్థులు. భద్రాచలాన్ని తెలంగాణ ప్రాంతం నుంచి వేరుచేసే కుట్రలను నిరసిస్తూ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డిలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందు మాట్లాడుతూ పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఇస్తామన్న సీడబ్ల్యూసీ, యూపీఏ తీర్మానాలను విస్మరిస్తూ కేంద్రమంత్రి జైరాం రమేశ్ భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలని సూచించడం గర్హనీయమన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నేతలు సంతోష్, సుమన్, రాజు, నిరం జన్, ప్రవీన్, మహేశ్, ప్రభాకర్, విఠల్, అశోక్ పాల్గొన్నారు. -
కృష్ణానదిలో ఇద్దరు గల్లంతు
విజయవాడ, న్యూస్‌లైన్ : ఈత సరదా ఇద్దరిని బలిగొంది. రణదీవె నగర్ కరకట్ట ప్రాంతంలో ఆరుగురు యువకులు వినాయక చవితి పందిరి వేశారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వినాయకుడుకి పూజలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ ఆరుగురు యువకులు కృష్ణానదిలో స్నానంచేసివచ్చి యథావిధిగా వినాయకుడికి పూజ చేయాలని నిర్ణయించుకున్నారు. వీరంతా వారధి కింద స్నానానికి దిగారు. స్నానాలు ముగించుకుని తిరిగి వస్తుండగా, వరుసకు అన్నదమ్ములైన పినెటి రాజు (19), కెల్ల చందు(16) మరికొద్దిసేపు ఈత కొడదామని మరలా వెనక్కి వెళ్లారు. అంతే ఇక తిరిగి రాలేదు. నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో 32,33 ఖానాల వరకు కొట్టుకుపోయారు. నదిలో స్నానం చేస్తున్న చందు, రాజు ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఒడ్డున ఉన్న మిగతా నలుగురికి అనుమానం వచ్చి నదిలో పరికించి చూడగా ఇరువురి చేతులు కనపడ్డాయి. దీంతో వారు కుటుంబసభ్యలకు సమాచారం అందించారు. వెంటనే కొంతమంది నదిలో దూకి చందూ, రాజుల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే వారు మృతిచెందారు. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కృష్ణలంక సీఐ టిఎస్ఆర్కె.ప్రసాద్ వివరాలు సేకరించారు. కుటుంబానికి అండగా ఉంటానని వచ్చి...... శ్రీకాకుళానికి చెందిన పినెటి అప్పన్న, దుర్గంబలకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు. పేదరికంలో ఉన్న కుటుంబానికి సాయపడాలని పెద్ద కుమారుడైన పినెటి రాజు (19) తల్లిదండ్రులను వదలి నగరానికి వచ్చాడు. రణదీవెనగర్‌లో నివాసముంటున్న మేనమామ కీర్తి రాజీనాయుడు దగ్గరకు చేరాడు. తాపీపని చేసి జీవనయానం సాగిస్తున్నాడు. అలాగే అదే ప్రాంతంలో నివాసముంటూ కూలిపని చేసుకుంటూ జీవనం సాగించే కెల్ల దుర్గారావు, నర్సమ్మలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమారుడు చందు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఫోన్లో సమాచారం.... కృష్ణానదిలో రాజు గల్లంతైన విషయం శ్రీకాకుళంలోని రాజు తల్లిదండ్రులకు, అతని మేనమామ రాజీనాయుడు ఫోన్లో సమాచారం అందించారు. వార్తను విన్న వారు హుటాహుటిన నగరానికి బయలుదేరారు. చేతికి అంది వచ్చిన కొడుకు చనిపోయాడని తెలుసుకున్న రాజు తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నట్లు రాజీనాయుడు తెలిపారు. కాగా చందూ కృష్ణానదిలో మునిగి పోవడంతో అతని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
'ప్రేమ ఒక మైకం' సినిమా రివ్యూ!
గ్లామర్ పాత్రలతో రాణించి, స్టార్ హోదాను సంపాదించుకున్న హీరోయిన్లు తమలోని అదనపు టాలెంట్‌ను ప్రూవ్ చేసుకోవడానికి ప్రస్తుతం వేశ్య పాత్రలపై కన్నేశారు. వేదంలో అనుష్క, పవిత్రలో శ్రీయలు వేశ్య పాత్రలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అనుష్క, శ్రీయల దారినే ఛార్మి ఎంచుకున్నట్టు కనిపించింది, ఇక టాప్ హీరోయిన్ రేసులో వెనుకబడిన ఛార్మి, టాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఓ ప్రయత్నం చేసింది. ఇక టెన్త్ క్లాస్, నోట్ బుక్ విజయాల తర్వాత మరో విజయాన్ని సొంతం చేసుకునేందుకు దర్శకుడు చందు ‘ప్రేమ ఒక మైకం’ ద్వారా మరోసారి ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మల్లిక ఓ ప్రొఫెషనల్ వేశ్య. ఎప్పుడూ మద్యం మత్తులో జీవితాన్ని గడుపుతూ నచ్చిన కస్టమర్తోనే వ్యాపారం చేస్తూ.. వేశ్య జీవితాన్ని గడుపుతుంటుంది. విలాసవంతమైన జీవితాన్ని మల్లిక అనుకోని పరిస్థితులో ఓ యాక్సిడెంట్ చేస్తుంది. యాక్సిడెంట్ గురైన లలిత్‌ను హస్పిటల్‌కు చేర్చి.. బ్రతికించి చేరదీసి తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తుంది. అయితే యాక్సిడెంట్లో లలిత్ చూపు కోల్పోతాడు. కొన్ని సంఘటనల ద్వారా జీవితానికి అర్ధం తెలుసుకున్న మల్లిక.. ఒకానొక సందర్భంలో యాక్సిడెంట్‌కు గురైన లలిత్ డైరీని చదువుతుంది. దాంతో డైరీ తర్వాత ఆతని జీవితం గురించి తెలుసుకున్న మల్లిక ఎలాంటి నిర్ణయం తీసుకుంది. లలిత్ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలేమిటి. లలిత్ ఎదురైన సమస్యలకు పరిష్కారం దొరికిందా అనే ప్రశ్నలకు సమాధానమే ’ప్రేమ ఒక మైకం’. మల్లిక పాత్ర ద్వారా వేశ్యగా కనిపించిన చార్మి పాత్ర పరిధిమేరకు పర్వాలేదనిపించింది. తన గ్లామర్ ద్వారా అభిమానులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. వేశ్య పాత్రలో పాటించాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మల్లిక పాత్ర ప్రభావం చూపలేకపోయింది. ఈ చిత్ర కథ మల్లిక పాత్ర చుట్టే తిరిగినా ఓ ప్యాకేజ్‌గా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం చార్మికి పూర్వవైభవం తెచ్చిపెడుతుందా అనే ప్రశ్నకు సమాధానం కష్టమే. ఈ చిత్రంలో మిగితా పాత్రల గురించి చెప్పుకోవాల్సి వస్తే లలిత్ (రాహుల్, హ్యపీడేస్ ఫేం) పాత్ర. చాలా రోజులుగా తెరపై కనిపించని రాహుల్‌ను లలిత్ పాత్ర వెతుక్కుంటూ వచ్చిందనే చెప్పాలి. మల్లిక పాత్ర తర్వాత ఎక్కువ నిడివి, ప్రాధాన్యత ఉన్న పాత్ర లలిత్దే అని చెప్పవచ్చు. లలిత్ పాత్రను రాహుల్ సద్వినియోగం చేసుకోలేదని చెప్పవచ్చు. లలిత్ ప్రేయసిగా, గాయనిగా నటించిన స్వాతి (శరణ్య) పాత్రపై కూడా ప్రేక్షకుల్లో రిజిస్టర్ కాలేకపోయింది. రావు రమేష్, చంద్రమోహన్, రవిబాబుల గురించి గొప్పగా చెప్పుకోవాల్సిందేమిలేదు. టెన్త్ క్లాస్, నోట్ బుక్ చిత్రాలతో దర్శకుడు చందు టాలీవుడ్లో తనకంటూ ఓ క్రేజ్‌ను సంపాదించుకున్నారు. 'ప్రేమ ఒక మైకం' కథలో క్లారిటీ ఉన్నా.. తెరకెక్కించడంలో తడబాటుకు గురైనట్టు కనిపించింది. ఈ చిత్రంలో చార్మి తప్ప.. మిగితా ప్రాతలకు నటీనటులను ఎంపిక చేసుకోవడంలో దర్శకుడు శ్రద్ద వహించలేదనే చెప్పుకోవచ్చు. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే ప్రేమకథలో మరో ప్రేమకథను జొప్పించి కన్ఫ్యూజ్ క్రియేట్ చేశారు. రాంగోపాల్ వర్మ డూప్ కారెక్టర్, తాగుబోతు రమేష్, బామ్మ కామెడీతో పూర్తిస్థాయిలో వినోదం పండించలేకపోయారు. పాత్రికేయుడు పులగం చిన్నారాయణ తొలిసారి ఈ చిత్రానికి మాటలు రాశారు. తొలి చిత్రంతోనే పులగం తన మాటలతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రం విజయం సాధించడం అనేది ప్రేక్షకులు ఆదరించడం మీదే ఆధారపడి ఉంటుంది.