అబ్బాయిల‌కు ర‌క్ష‌ణ లేదు, నా క‌డుపు మీద కొట్టారు: ప‌క్కింటి కుర్రాడు | Pakkinti Kurradu Fame Chandoo Sai Reveals About His Life Struggles And Painful Days, Deets Inside - Sakshi
Sakshi News home page

Chandoo Sai Life Struggles: స‌హ‌జీవ‌నం వేస్ట్‌.. ఇద్ద‌రు త‌ప్పు చేసినా ఒక్క‌రికే శిక్ష‌!

Published Thu, Feb 22 2024 5:22 PM | Last Updated on Thu, Feb 22 2024 7:09 PM

Pakkinti kurradu Chandoo Sai About His Painful Days - Sakshi

సోష‌ల్ మీడియా వ‌చ్చాక ఫేమ‌స్ అవ్వ‌డం చాలా ఈజీ అయిపోయింది. కానీ ఆ పాపులారిటీని కాపాడుకోవ‌డం మాత్రం అంత ఈజీ కాదు. పొర‌పాటున నోరు జారినా, ఏదైనా త‌ప్పు చేసినా, ఏదేని కేసులో ఇరుక్కున్నా అప్ర‌తిష్ట మూట‌గ‌ట్టుకుంటారు. న‌లుగురిలో న‌వ్వుల‌పాలు అవుతారు.  ప్రముఖ యూట్యూబర్‌, నటుడు చందుసాయికి ఇదే ప‌రిస్థితి ఎదురైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత‌డిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దాదాపు నెల రోజులు జైలు శిక్ష అనుభ‌వించిన‌ త‌ర్వాత బెయిల్ మీద బ‌య‌ట‌కు వ‌చ్చాడు.

విప‌రీతంగా ఏడ్చా.. చేయ‌ని త‌ప్పుకు..
తాజాగా అత‌డు ఈ కేసు గురించి మాట్లాడుతూ.. ఏం జ‌రిగింద‌నే విష‌యాల‌ను ఓ ఇంటర్వ్యూలో బ‌య‌ట‌పెట్టాడు. చందు మాట్లాడుతూ.. 'ఎవ‌రిమీదైనా పగ తీర్చుకోవ‌డానికి మ‌రీ ఇంత దూరం వెళ్ల‌కూడ‌దు. ఉన్న‌ది చెప్తే ఓకే కానీ లేనిది క‌ల్పించ‌డం అవ‌స‌ర‌మా? త‌ప్పు క‌దా.. నా కుటుంబ స‌భ్యుల మీద కేసు పెట్టారు. అదింకా పెద్ద‌ త‌ప్పు. వాళ్లు ఎంత బాధ‌ప‌డ‌తారు? 27 రోజులు జైల్లో ఉన్నాను. మొద‌టి మూడు రోజులు విప‌రీతంగా ఏడ్చేశాను. నిజం ఎప్ప‌టికైనా తెలుస్తుంద‌ని బాధ‌ను దిగ‌మింగుకుని బ‌తుకుతున్నాను.

రిలేష‌న్‌ను కాపాడుకోవాల‌నుకున్నా..
నిజంగానే నేను అమ్మాయిని ప్రేమించాను, తన‌తో రిలేష‌న్‌లో ఉన్నాను. కానీ స‌హ‌జీవ‌నం అనేది వేస్ట్‌ అని ఆల‌స్యంగా తెలిసొచ్చింది.  నేను నా రిలేష‌న్‌షిప్‌ను కాపాడుకోవ‌డానికి ఎంతో చేశాను, అక్క‌డ నేను ఏ త‌ప్పూ చేయ‌లేదు. అయినా చివ‌ర‌కు నాకే దిమ్మ‌తిరిగేలా చేసి కేసు పెట్టారు. ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌క్కింటి కుర్రాడిగా పేరు సంపాదించుకున్నాను. నా క‌డుపు మీద కొట్టారు. ఈ కేసు వ‌ల్ల‌ ఓ సినిమా పోయింది.

నేను దోషిని కాదు, అలా చూడ‌కండి
నా మీద కేసు ఫైల్ అయిందే త‌ప్ప దోషిన‌ని రుజువు కాలేదు. ద‌య‌చేసి ఎవ‌రూ న‌న్న‌లా చూడ‌కండి. అయినా అబ్బాయిల‌కు స‌మాజంలో ర‌క్ష‌ణ లేదు. త‌ప్పు జ‌రిగితే అది ఇద్ద‌రూ చేస్తారు. కానీ శిక్ష ఒక్క‌రికే ప‌డుతుంది. ఈ విష‌యంలో అబ్బాయిలు చాలా జాగ్ర‌త్త‌లు ఉండాలి' అని చెప్పుకొచ్చాడు చందు.

చ‌ద‌వండి: 'విడాకులిచ్చేశా.. బిజీగా ఉన్నాను కాబ‌ట్టి లైట్‌..', జీవితం చాలా చిన్న‌ది..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement