
మనకు ఆర్తీ అగర్వాల్ తెలుసు. ఆ తర్వాత కాజల్ అగర్వాల్ వచ్చారు. ఇప్పుడు మరో అగర్వాల్ తెలుగు తెరకు పరిచయం కానున్నారని సమాచారం. పేరు నిధి అగర్వాల్. ఈ కన్నడ బ్యూటీ నాగచైతన్య సరసన ‘సవ్యసాచి’లో కథానాయికగా నటించనున్నారని వినికిడి. చందూ మొండేటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. నిధి ఇప్పటికే హిందీలో ‘మున్నా మైఖేల్’ అనే సినిమాలో కథానాయికగా నటించారు. క్యూట్‌గా ఉండటంతో పాటు బాగా డ్యాన్స్ కూడా చేయగలుగుతారట. ‘మున్నా మైఖేల్’లో ఆమె క్లబ్ డ్యాన్సర్ పాత్ర చేశారు. నటిగా కూడా ఓకే అట. అందుకే ‘సవ్యసాచి’కి తీసుకోవాలనుకున్నారని భోగట్టా.
Comments
Please login to add a commentAdd a comment