‘ప్లాంట్‌ మ్యాన్‌’ మూవీ రివ్యూ | Plant Man Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Plant Man Movie Review: ‘ప్లాంట్‌ మ్యాన్‌’ మూవీ రివ్యూ

Published Fri, Jan 5 2024 8:18 PM | Last Updated on Fri, Jan 5 2024 8:18 PM

Plant Man Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: ‘ప్లాంట్‌ మ్యాన్‌’
నటీనటులు: చంద్రశేఖర్‌, సోనాలి పాణిగ్రాహి, అశోక్‌ వర్థన్‌, బేబీ ప్రేక్షిత, అక్కం బాలరాజు, చలపతిరావు, తడివేలు, బాలరాజ్‌, లక్ష్మీకిరణ్‌, శేఖర్‌, వీరభద్రం, శ్రీకుమారి, మురళీకృష్ణ, వాణిశ్రీ, బిందు, సరస్వతి, జగపతి తదితరులు
నిర్మాణ సంస్థ: డి.ఎం. యూనివర్సల్‌ స్టూడియోస్‌
నిర్మాత-దర్శకత్వ పర్యవేక్షణ: పన్నా రాయల్‌
దర్శకత్వం: కె.సంతోష్‌బాబు
సంగీతం: ఆనంద బాలాజీ
విడుదల తేది: జనవరి 5, 2023

ప్లాంట్‌ మ్యాన్‌ కథేంటంటే..
చారి (చందు)కి ఓ ప్రైవేట్‌ కంపెనీలో పాతిక లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వస్తుంది. అయినా కూడా ఆ ఉద్యోగాన్ని వదులుకొని తనకెంతో ఇష్టమైన ఆర్గానిక్‌ వెజిటబుల్స్‌ బిజినెస్‌ రన్‌ చేస్తుంటాడు. కొడుక్కి పెళ్లి చేయాలని చారి పెరెంట్స్‌ తెగ ప్రయత్నాలు చేస్తారు. అయితే చారి మాత్రం తన పెళ్లిని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ ఉంటాడు. చివరకు ఓ పెళ్లి చూపులకెళ్లి చందు(సోనాలి)ని ఇష్టపడతాడు. చందు కూడా చారిని ఇష్టపడుతుంది. దీంతో ఇరుకుటుంబాలు కలిసి త్వరలోనే పెళ్లి జరిపించాలకుంటారు. అయితే చందు చిన్ననాటి స్నేహితుడు చింటు(అక్కం బాలరాజు)కి ఆమె అంటే చాలా ఇష్టం. ప్రేమ విషయాన్ని చెప్పలేక చందుకు వచ్చి పెళ్లి సంబంధాలన్నీ చెడగొడుతుంటాడు. చారిని కూడా అలానే బెదిరించేందుకు ప్రయత్నిస్తాడు కానీ అది వర్కౌట్‌ కాదు. ఎలాగైన చందు, చారిల పెళ్లి చెడగొట్టాలని ట్రై చేస్తాడు.

కట్‌ చేస్తే..  చింటూ తండ్రి ఓ సైంటిస్ట్‌ . ఎడారిలో సైతం మొక్కలు మొలిపించేందుకు 30 ఏళ్లుగా పరిశోధనలు చేస్తుంటాడు. ఓరోజు అతని పరిశోధన విజయవంతమై ఓ మందు కనుగొంటాడు. ఆ రసాయనం నేల మీద జల్లితే నిమిషాల్లో మొక్కలు పుట్టుకొస్తాయి. అది తెలుసుకున్న చింటూ ఆ మందును చారి మీద ప్రయోగిస్తాడు. దాంతో చారికి ఒళ్ళంతా మొక్కలు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? ప్లాంట్‌ మ్యాన్‌గా మారిన చారికి ఎదురైన సమస్యలు ఏంటి?  ఒంటి నిండా వచ్చిన మొక్కలతో అతను ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? చివరికి అతను ఆ సమస్య నుంచి ఎలా బయటపడి మామూలు మనిషిగా మారాడు? చందుతో పెళ్లి సంగతి ఏమైంది? తదితర విషయాలు తెలియాలంటే ప్లాంట్‌ మ్యాన్‌ సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
ఓ వ్యక్తి శరీరంపై మొక్కలు మొలకెత్తుతే ఎలా ఉంటుంది? ఇది వినడానికే విచత్రంగా ఉంది కదా? అలాంటి సరికొత్త పాయింట్‌తో తెరకెక్కిన సినిమానే ‘ప్లాంట్‌ మ్యాన్‌’. దర్శకుడు కె.సంతోష్‌బాబు ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని సరికొత్త పాయింట్‌ని ఎంచుకున్నాడు..కానీ దాన్ని అంతే కొత్తగా, ఆసక్తికరంగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. సినిమా మొత్తాన్ని కామెడీ వేలోనే నడించాడు. హీరో మూములు మనిషి నుంచి ప్లాంట్‌ మ్యాన్‌గా మారడం, ఆ ప్రాసెస్‌లో జరిగే ఇన్సిడెంట్స్‌ని ఇవన్నీ ఫన్నీగా సాగుతాయి. హద్దు మీరని హాస్యంతో ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్‌ చేసే విధంగా  ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు. ప్రతి సన్నివేశం అందరూ నవ్వుకునేలా తియ్యడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు కానీ ఎమోషనల్‌ సీన్స్‌ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేకపోయాడు.

కథ ప్రారంభం కాస్త నెమ్మదిగా ఉంటుంది. హీరోహీరోయిన్ల పెళ్లి చూపుల తర్వాత ఆసక్తికరంగా సాగుతుంది. హీరో ఫ్రెండ్‌ చేసే వాట్సాప్‌ చాటింగ్‌ నవ్వులు పూయిస్తుంది. ఒకవైపు హీరోహీరోయిన్ల లవ్‌స్టోరీ..మరోవైపు మొక్కలపై సైంటిస్ట్‌ చేసే ప్రయోగాన్ని చూపిస్తూ..ఈ రెండింటికి ఎక్కడో లింక్‌ ఉంటుందనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలిగించేలా చేశాడు. ఫస్టాఫ్‌లో కథ పెద్దగా ఉండదు కానీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. హీరో ఒంటినిండా మొక్కలు మొలకెత్తడం.. దాని వల్ల అతనికి ఎదురయ్యే సమస్యలు అన్నీ హ్యాస్యాన్ని పంచడంతో పాటు ఆలోచింపజేస్తాయి. ఈ సినిమాలో అంతర్లీనంగా మొక్కలు అనేవి మానవ జీవితానికి ఎంతో అవసరం అనే సందేశం కూడా ఉంది. అయితే పేరున్న నటీనటులు ఉండి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.

ఎవరెలా చేశారంటే..
హీరోహీరోయిన్లుగా నటించిన చందు, సోనాలికి ఇది తొలి సినిమానే అయినా ఎక్కడా తడబాటు లేకుండా చక్కగా నటించారు.కామెడీ, ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా తమ నటనతో మంచి మార్కులు తెచ్చుకున్నారు. హీరో ఫ్రెండ్‌గా నటించిన అశోక్‌వర్థన్‌ వేసిన పంచ్‌లు బాగా పేలాయి. అతను తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశాడు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ప్రేక్షిత రాయలసీమ యాసలో చెప్పిన డైలాగ్స్‌ అందర్నీ నవ్వించాయి. ఇక యూట్యూబ్‌లో ఎంతో పాపులర్‌ అయిన అక్కం బాలరాజు కూడా తనదైన శైలిలో హాస్యాన్ని పండిరచాడు. మిగతా క్యారెక్టర్స్‌లో నటించిన నటీనటులు కూడా వారి పరిధి మేరకు బాగానే చేశారు. సాంకేతిక విషయాలకొస్తే.. మణికర్ణన్‌ అందించిన ఫోటోగ్రఫీ  బాగుంది. వినోద్‌ యాజమన్య అందించిన బీజీఎం, ఆనంద బాలాజీ అందించిన మెలోడీ సాంగ్స్‌ సినిమాకు ప్లస్‌. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement