పెళ్లి.. ఇప్పుడు పెద్ద ఇవెంట్‌గా మారిపోయింది. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం అంతా ఇప్పుడు వెరైటీ వైపు పరుగులు పెడుతున్నారు. తమ పెళ్లి ఇతరుల కంటే భిన్నంగా.. చాలా చాలా క్రియేటీవ్‌గా ఉండాలని భావిస్తున్నారు. ఎంగేజ్‌మెంట్ మొదలు.. రిసెప్షెన్ వరకు ఇతరుల కంటే భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక తాజాగా ఓ వ్యక్తి మాత్రం తన శుఖలేఖనే వైరైటీగా ముద్రించాడు. బహుశా ఈ రీతిలో శుభలేఖ ఉండడం ఇదే మొదటిసారి కావచ్చు. ఎందుకంటే ఇది అచ్చమైన తెలంగాణ భాషలో ఉంది. ఇందులో పలానా వారి పెండ్లి పిలుపు, ఆహ్వానించువారు, విందు, స్వస్తిశ్రీ చాంద్రమాన సంవత్సర, ఆదివారం, కనిష్ఠ పుత్రుడు, గరిష్ఠ పుత్రిక, కల్యాణ వేదిక’’ వంటి పదాలేం లేవు. అంతా తెలంగాణ వాడుక భాషలోనే ‘‘లగ్గం పిలుపు, పిలిశెటోళ్లు, బువ్వ, ఐతారం అంబటాల్లకు 11.37 గొట్టంగ, మా సిన్న పిల్లగాడు, తొలుసూరి బిడ్డ, లగ్గం యాడనో ఎర్కనా’’ వంటి పదాలతో వినూత్నంగా రూపుదిద్దిన ఈ శుభలేఖ తెలంగాణ యాసను ప్రతిబింబించేలా ఉంది.
ఇంతకీ పెళ్లి ఎవరిదంటే...
ఈ వినూత్న శుఖలేఖ రాయించింది మై విలేజ్ షో’లో ఓ ఆర్టిస్ట్ అయిన చంద్రమౌళి (చందు). కరీంనగర్ జిల్లా మాల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన కొందరు యువకులు మై విలేజ్ షో అనే యూ ట్యూబ్ ఛానెల్ నడిపే సంగతి తెలిసిందే. ఇందులో వచ్చే షార్ట్ ఫిల్ముల్లో చందు నటిస్తుంటారు. తన వివాహానికి ఇలా శుభలేఖను తయారు చేయించుకొని చందు మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇక ఈ శుఖలేఖను చూసిన నెటిజన్లు చందుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.‘అన్న, లగ్గం పత్రిక మస్తుగున్నదే’, ‘మన తెలంగాణ యాస, బాషాలో, ఇప్పటి దాక ఇట్లాంటి లగ్గం పత్రిక సూడలేదు’, ‘లగ్గం కారట మస్తుగుంది తమ్మి’ అంటూ తెలంగాణ భాషలో కామెంట్లు పెడుతూ చందుకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఒల్లదో అనుకునేరు నాదే😜 pic.twitter.com/LmXnkWtaQJ
— chandu_myvillageshow (@chandu_mvs) December 31, 2020
Comments
Please login to add a commentAdd a comment