'ఈ సినిమాకు ఒలింపిక్ మెడల్‌ ఇవ్వాల్సిందే'.. మను భాకర్ పోస్ట్‌ వైరల్! | Kartik Aaryan reacts as Manu Bhaker says he deserves a medal | Sakshi
Sakshi News home page

Kartik Aaryan: ఆ సినిమాపై ఒలింపిక్ విజేత పోస్ట్‌.. రియాక్ట్ అయిన హీరో!

Published Wed, Aug 14 2024 9:41 AM | Last Updated on Wed, Aug 14 2024 11:32 AM

Kartik Aaryan reacts as Manu Bhaker says he deserves a medal

ఇటీవల పారిస్‌లో ముగిసిన ఒలింపిక్స్‌లో ఏకంగా రెండు పతకాలు సాధించిన భారత  స్టార్ షూటర్ మను భాకర్. తొలిసారి రెండు కాంస్య పతకాలు గెలిచి అందరి మనసులను గెలుచుకుంది. తాజాగా ఆమె ఓ సినిమాపై ప్రశంసలు కురిపించారు. నేను ఊహించిన దానికంటే అద్భుతంగా ఉందంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేశారు. ఒక అథ్లెట్‌ పాత్రలో నటించడం అంత సులభం కాదని ఆమె అన్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి? హీరో ఎవరు? అనే వివరాలేంటో చూద్దాం.

బాలీవుడ్ స్టార్‌ కార్తీక్ ఆర్యన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'చందు ఛాంపియన్'. మొదటి పారాలింపిక్‌ స్వర్ణపతక విజేత మురళీకాంత్‌ పేట్కర్‌ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కించారు. జూన్‌ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.88 కోట్లకు పైగా రాబట్టింది. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా చందు ఛాంపియన్ వీక్షించిన మనుభాకర్ ఎమోషనల్ పోస్ట్ చేసింది. 

అయితే మను భాకర్ చేసిన పోస్ట్‌కు హీరో కార్తీక్ ఆర్యన్ రిప్లై ఇ‍చ్చారు. మీలాంటి నిజమైన ఛాంపియన్‌ మా సినిమాపై ప్రశంసలు కురిపించడం అద్భుతమన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఒలింపిక్స్‌లో రాణించారని కొనియాడారు. ప్యార్‌ కా పంచనామా సినిమాతో కెరీర్‌ కార్తీక్ ఆర్యన్ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement