
సినిమా సెలబ్రిటీలు బయటకు నవ్వుతూ కనిపిస్తుంటారు. కానీ అప్పుడప్పుడు అభిమానుల వల్ల ఇబ్బంది పడుతూనే ఉంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లకు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి పరిస్థితి శ్రీలీలకు (Sreeleela) ఎదురైంది. కొందరు అభిమానులు ఈమెని గట్టిగా పట్టి లాగేశారు.
(ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఎందుకింత సన్నమైపోయాడు? కారణం అదేనా)

కొన్నాళ్ల ముందు వరకు వరస తెలుగు సినిమాలు చేసిన శ్రీలీల.. ప్రస్తుతం బాలీవుడ్ లో మూవీస్ చేస్తోంది. కార్తీక్ ఆర్యన్(Karthik Aryan)తో ఓ ప్రేమకథలో నటిస్తోంది. నిన్నటివరకు డార్జిలింగ్ లో షూటింగ్ చేశారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కార్తిక్, శ్రీలీల నడిచి వస్తుండగా.. పక్కనే ఉన్న కొందరు శ్రీలీలని పట్టి లాగేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన శ్రీలీల ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మరీ ఇలా ప్రవర్తిస్తున్నారేంట్రా అని అనుకుంటున్నారు. ఇకపోతే కార్తిక్ ఆర్యన్ తో శ్రీలీల డేటింగ్ అని కూడా కొన్నిరోజుల క్రితం రూమర్స్ వచ్చాయి. అయితే ఇవన్నీ మూవీపై బజ్ పెంచేందుకేనని కొందరు నెటిజన్లు అంటున్నారు.
(ఇదీ చదవండి: దెయ్యం నవ్వు హీరోయిన్.. డైరెక్టర్ విచిత్రమైన కామెంట్స్)
Manhandling actresses in public places has to stop tf #Sreeleela pic.twitter.com/TdMjPLQHlT
— Aryan (@Pokeamole_) April 6, 2025