సౌత్‌లో దూసుకెళుతున్న శ్రీలీల(Sreeleela) బాలీవుడ్ ఎంట్రీ(Bollywood entry) గురించి కొన్నాళ్లుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ప్రచారంలో ఉన్న వార్త విషయానికొస్తే... బాలీవుడ్‌లో ఓ బడా బేనర్ అయిన ధర్మ ప్రొడక్షన్స్( Dharma Productions) ద్వారా శ్రీలీల హిందీ చిత్రపరిశ్రమ అరంగేట్రం జరగనుందట.
ఈ సంస్థ అధినేత కరణ్ జోహార్ ‘తూ మేరీ మై తేరా... మై తేరా తూ మేరీ’ అనే చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్(Kartik Aaryan) హీరోగా నటించనున్నారు. ఈ హీరో సరసన శ్రీలీలను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారని సమాచారం. ఇక అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం అని బాలీవుడ్ టాక్. ఈ ఏడాది మధ్యలో ఈ చిత్రం షూట్ ఆరంభం అవుతుందట. ఈ చిత్రానికి సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించనున్నారు. మరి... బడా బేనర్ ద్వారా శ్రీలీల(Sreeleela) బాలీవుడ్ ఎంట్రీ (Bollywood entry) జరుగుతుందా? అంటే... వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment