నిజమేనా? | Sreeleela Bollywood Entry: Sreeleela joins Sidharth Malhotra in Mitti | Sakshi
Sakshi News home page

నిజమేనా?

Aug 16 2024 3:43 AM | Updated on Aug 16 2024 3:57 AM

Sreeleela Bollywood Entry: Sreeleela joins Sidharth Malhotra in Mitti

తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా దూసుకెళుతున్న  శ్రీలీల బాలీవుడ్‌ ఎంట్రీ గురించి అప్పడప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. వరుణ్‌ ధావన్, ఇబ్రహీం అలీ ఖాన్‌ (సైఫ్‌ అలీఖాన్‌ తనయుడు) హీరోలుగా రూపొందుతున్న హిందీ సినిమాల్లో శ్రీలీల హీరోయిన్‌ అనే టాక్‌ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. కానీ ఈ విషయాలపై ఆయా చిత్రబృందాలు ఇప్పటివరకూ అధికారిక ప్రకటన చేయలేదు. కాగా శ్రీలీలకు మరో హిందీ చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం లభించిందట.

హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా, దర్శకుడు బల్వీందర్‌ సింగ్‌ కాంబినేషన్‌లో ఓ హిందీ సినిమా రానుందని సమాచారం. ఈ చిత్రంలోని హీరోయిన్‌ పాత్రకు మేకర్స్‌ శ్రీలీల పేరును పరిశీలిస్తున్నారని, త్వరలో ఈ విషయంపై స్పష్టత రానుందని టాక్‌. మరి.. సిద్ధార్థ్‌ మల్హోత్రాతో శ్రీలీల జోడీ కట్టనున్నారనే వార్త నిజమేనా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement