బాలీవుడ్‌లోకి శ్రీలీల ఎంట్రీ.. ఆ స్టార్ హీరో కొడుకుతో కలిసి! | Sreeleela Bollywood Debut Movie With Saif Ali Khan's Son | Sakshi
Sakshi News home page

Sreeleela: హిందీపై కాన్సట్రేట్ చేసిన శ్రీలీల.. ఫస్ట్ మూవీ ఎవరితో అంటే?

Published Sat, Jun 8 2024 4:41 PM | Last Updated on Sat, Jun 8 2024 5:00 PM

Sreeleela Bollywood Debut Movie With Saif Ali Khan's Son

శ్రీలీల.. టాలీవుడ్‌లోకి వచ్చి వరసపెట్టి సినిమాలు చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతానికైతే తెలుగు వరకు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. తెలుగు వరకు అయితే ఈమె చేతిలో 'ఉస్తాద్ భగత్ సింగ్' మాత్రమే ఉంది. మరోవైపు తమిళంలోనూ ఆఫర్స్ వచ్చాయని అంటున్నారు. కానీ ఇంకా ఫైనల్ అయినట్లు లేదు. ఇప్పుడు ఇవన్నీ కాదన్నట్లు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేస్తుందని టాక్ బయటకొచ్చింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

అమెరికాలో పుట్టి పెరిగిన శ్రీలీల.. తెలుగు-కన్నడ మూలాలున్న ఫ్యామిలీలో పుట్టింది. టీనేజ్‌లో ఉండగానే కన్నడ సినిమాతో హీరోయిన్ అయిపోయింది. 'పెళ్లి సందD' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది హిట్ కానప్పటికీ కేక పుట్టించే డ్యాన్సింగ్ స్కిల్స్ ఉండటంతో వరస ఛాన్సులు వరించాయి. అలా అరడజనుకు పైగా మూవీస్ చేసింది. కానీ 'ధమాకా' తప్పితే చెప్పుకోదగ్గర హిట్ ఈమెకు పడలేదు.

రీసెంట్‌గా తమిళ స్టార్ అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయిందని అన్నారు. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయిపోయిందంటున్నారు. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం 'దిలర్' మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా అనుకుంటున్నారట. ఇది కన్ఫర్మ్ అయి, హిట్ కొడితే మాత్రం శ్రీలీల పంట పండినట్లే!

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ షోలో లవ్‌, పెళ్లి.. నాలుగేళ్లకే విడాకులు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement