
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం రాబిన్‌హుడ్‌తో ప్రేక్షకులను పలకరించనుంది. నితిన్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఉగాది కానుకగా మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీతో పాటు బాలీవుడ్‌లోనూ ఎంట్రీకి సిద్ధమైంది శ్రీలీల. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తోన్న చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఇటీవలే విడుదల చేశారు.
తాజాగా ఈ ముద్దుగుమ్మ కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీ ఈవెంట్‌లో మెరిసింది. హిందీ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఆమెతో పాటు కార్తీక్ ఆర్యన్ సైతం స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన సోదరి కృతిక తివారీ కోసం ఈ వేడుక ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె సాధించిన విజయాలను సెలబ్రేట్ చేసుకున్నారు. మరోవైపు వీరిద్దరి కెమిస్ట్రీ చూసిన నెటిజన్స్ డేటింగ్‌లో ఉన్నారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే కార్తీక్ ఆర్యన్ గతేడాది సూపర్‌హిట్ చిత్రం భూల్ భూలైయా- 3లో కనిపించాడు. మరోవైపు శ్రీలీల పుష్ప-2 చిత్రంలో ప్రత్యేక సాంగ్‌లో మెప్పించింది.
Comments
Please login to add a commentAdd a comment