Dharma Productions
-
సినిమాల్లోకి ‘సీరమ్’!
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్‌తో చిరపరిచితమైన వ్యాక్సిన్ల తయారీ దిగ్గజం సీరమ్ ఇన్స్టిట్యూట్ సినిమాల నిర్మాణంలోకి ప్రవేశిస్తోంది. కంపెనీ సీఈవో అదార్ పూనావాలా ఏర్పాటు చేసిన సిరీన్ ప్రొడక్షన్స్ కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్‌లో 50 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 1,000 కోట్లు వెచ్చించనుంది. ధర్మ ప్రొడక్షన్స్, ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్లలో రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సిరీన్ ప్రొడక్షన్స్ వెల్లడించింది. దీంతో ధర్మలో 50 శాతం వాటాను సిరీన్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకోనుంది. మిగిలిన 50 శాతం వాటాతోపాటు యాజమాన్యాన్ని కరణ్ జోహార్ కలిగి ఉంటారని సిరీన్ స్పష్టం చేసింది. వెరసి పూనావాలా పెట్టుబడులు ధర్మ విలువను రూ. 2,000 కోట్లుగా నిర్ధారించాయి. ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా ధర్మ, సిరీన్ సంస్థల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటైనట్లు సిరీన్ పేర్కొంది. సినిమాల నిర్మాణంలో ధర్మకున్న నైపుణ్యం, అదార్ పూనావాలాకున్న వనరులు ఇందుకు తోడ్పాటునివ్వగలవని అభిప్రాయపడింది. ధర్మ మరింత పురోభివృద్ధిని సాధిస్తుందని, మరింత ఎత్తుకు ఎదుగుతుందని ఆశిస్తున్నట్లు తాజా పెట్టుబడులపై స్పందిస్తూ పూనావాలా పేర్కొన్నారు. భవిష్యత్ దృక్పథ వ్యూహాలు, నైపుణ్యంతోకూడిన సినిమాల నిర్మాణాల సక్రమ కలయికను తాజా భాగస్వామ్యం ప్రతిఫలిస్తున్నదని కరణ్ జోహార్ వ్యాఖ్యానించారు. బాధ్యతలు ఇలా: కంపెనీ నూతన ఏర్పాటులో భాగంగా ధర్మకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో కరణ్ జోహార్ సృజనాత్మక కార్యక్రమాలను రూపొందిస్తారు. సీఈవోగా అపూర్వ మెహతా వ్యూహాత్మక మార్గదర్శకుడిగా కరణ్‌తో కలిసి బాధ్యతలు నిర్వహిస్తారు. కంటెంట్ నిర్మాణం, పంపిణీ, ఆధునిక టెక్నాలజీలను ఏకీకృతం చేయడం, ప్రొడక్షన్ విధానాలను మెరుగుపరచడం, ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం తదితర కార్యకలాపాలపై దృష్టి పెట్టనున్నట్లు సిరీన్ వివరించింది. దేశీయంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో తాజా డీల్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. -
సంస్థలో సగం వాటా అమ్మేసిన ప్రముఖ నిర్మాత
బాలీవుడ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకర్స్‌లో కరణ్ జోహార్ ఒకరు. దర్శకుడు, నిర్మాతగా చాలా సినిమాలు చేశారు. పలు దక్షిణాది సినిమాల్ని హిందీలో రిలీజ్ చేసి, డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ తన మార్క్ చూపించారు. అలాంటిది గత కొన్నిరోజులుగా ఈయన తన నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌ని అమ్మేస్తున్నాడనే పుకార్లు వచ్చాయి. ఇప్పుడు అవి నిజమని తేలిపోయింది.(ఇదీ చదవండి: పృథ్వీ వంకర చూపులు.. బిగ్‌బాస్‌లో గలీజు ప్రవర్తన!)కరణ్ జోహార్ నిర్మాణ సంస్థలోని కొంత వాటాని రిలయన్స్ కొనుగోలు చేయొచ్చని అన్నారు. కానీ ప్రముఖ పారిశ్రామికవేత్త అడర్ పునావాలాకి చెందిన సెరెన్ ప్రొడక్షన్స్ 50 శాతం వాటా దక్కించుకుంది. ఈ మేరకు రూ.1000 కోట్ల మేర నిర్మాణ సంస్థలో ఇన్వెస్ట్ చేయనుంది. అంటే క్రియేటివ్ పనులన్నీ కరణ్ జోహర్ చూసుకుంటారు. నిర్మాణ వ్యవహారాల్లో పునావాలా భాగమవుతుందని తెలుస్తోంది.కరోనాకు ముందు పర్లేదు గానీ ఈ వైరస్ వచ్చిన తర్వాత మాత్రం బాలీవుడ్ పరిస్థితి దారుణంగా తయారైంది. కరణ్ జోహార్ లాంటి సక్సెస్ రేట్ ఉన్న నిర్మాత కూడా కుదేలైపోయాడు. ఈ ఏడాది కరణ్ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. రీసెంట్గా రిలీజైన ఆలియా భట్ 'జిగ్రా'.. కరణ్ నిర్మించింది. దీనికి దారుణమైన కలెక్షన్స్ వస్తున్నాయి. కొన్నేళ్లుగా సక్సెస్ రేటు తగ్గిపోవడంతో భారీ ఆర్థిక నష్టాలు వచ్చాయి. ఈ క్రమంలోనే సగం వాటా అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 24 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్) -
నాన్న వల్ల ఆర్థిక ఇబ్బందులు.. అమ్మ, నాన్నమ్మలే కాపాడారు: కరణ్ జోహార్
కరణ్ జోహార్ సాధించిన ప్రతి విజయం వెనుక తన కృషితోపాటు ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. బాలీవుడ్లో రెండున్నర దశాబ్దాలకుపైగా రాణిస్తున్నారు.దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, గత కొద్ది కాలంగా దర్శకత్వానికి స్వస్తి పలికి నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్నారు. ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్న కరణ్ తన గతాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.నాన్న మిగిల్చిన నష్టాలను నాన్నమ్మ తీర్చిందికరణ్ జోహార్ తండ్రి యష్ జోహార్ కూడా టాప్ ప్రొడ్యూసర్ అని తెలిసిందే. 1980 సమయంలో తన తండ్రి నిర్మించిన 5 సినిమాలు వరుసుగా ఫ్లాప్ కావడంతో తన కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి తాజాగా కరణ్ మాట్లాడాడు. ఇబ్బందుల నుంచి సక్సెస్ కోసం తాను ఎంత కష్టపడ్డారో ఆయన తెలిపారు.కరణ్ జోహార్ తండ్రి యష్ జోహార్ బాలీవుడ్లో దోస్తానా, అగ్నిపథ్, డూప్లికేట్, కుచ్ కుచ్ హోతా హై వంటి సినిమాలను నిర్మించి టాప్ నిర్మాతల లిస్ట్‌లో చేరిపోయారు. అయితే, దోస్తానా (1980) తర్వాత యష్ జోహార్ నిర్మించిన 5 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ దారుణమైన నష్టాలను మిగిల్చాయి. దీంతో తన నాన్నగారు చాలా ఆస్థులను అమ్మేశారని కరణ్ తెలిపారు.'మా నాన్నగారు మొదటి చిత్రం ఫ్లాప్ అయినప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. డబ్బును ఫైనాన్సర్లకు తిరిగి చెల్లించడానికి మా నాన్నమ్మ తన ఇంటిని అమ్మేసి ఆ డబ్బును చెల్లించింది. ఆ తర్వాత మరో సినిమా నిర్మిస్తే అదికూడా నిరాశపరిచింది. ఆప్పుడు మా అమ్మ తన నగలను విక్రయించింది. ఆపై కుటుంబ వారసత్వంగా వస్తున్న ఢిల్లీలోని కొన్ని ఆస్తులను కూడా నాన్న అమ్మేశారు.' అని కరణ్ జోహార్ గుర్తుచేసుకున్నారు.కరణ్ జోహార్ తండ్రి నిర్మాత అయినప్పటికీ, తమది సంపన్న కుటుంబమనే అపోహను తొలగించారు. వారిది మధ్యతరగతి, ఉన్నత-మధ్యతరగతి కుటుంబమని చెప్పారు. కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చినా రాకుమారుడిలా తనని పెంచారని గుర్తుచేసుకున్నారు.కరణ్ జోహార్ అంత డబ్బు ఎలా సంపాదించాడు..?కరణ్ జోహార్ నేడు అత్యంత సంపద కలిగిన నిర్మాతల లిస్ట్‌లో టాప్‌లో ఉంటారు. తన తండ్రి యష్ జోహార్ డబ్బు సంపాధించకపోయినప్పటికీ మంచిపేరు ఉంది. తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కరణ్ ఊహించలేనంత విజయాలను సొంతం చేసుకున్నారు. కెరీర్లో నేడు ఈ స్థాయికి చేరుకోవడానికి అవిశ్రాంతంగా ఎలా పనిచేశాడో ఆయన తెలిపారు. అదృష్టవశాత్తూ, దర్శకుడిగా తన మొదటి మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని ఆయన అన్నారు. తన తండ్రి మరణించిన తర్వాతే ధర్మ ప్రొడక్షన్స్ నుంచి పలు సినిమాలు నిర్మించినట్లు ఆయన అన్నారు.జీవితంలో తను ఎంత కష్టపడ్డారో కరణ్ ఇలా చెప్పుకొచ్చారు. 'మా కుటుంబం ఆనందంగా ఉండాలని నాన్న ఎంతో కష్టపడ్డారు. కానీ, అంతగా కలిసిరాలేదు. ఆయన కలలకు నేను ఎలాగైనా జీవం పోయాలని అనుకున్నాను. ఈ క్రమంలో నేను ముందుగా దర్శకుడిగా పలు సినిమాలు తీశాను. దేవుడి ఆశీర్వాదంతో అవి సూపర్ హిట్ అయ్యాయి. చేతిలోకి సరిపడా డబ్బు వచ్చింది. నా కష్టంతో నాన్న కలను నిజం చేశాను. అందుకోసం నేను రోజుకు 18 గంటలు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఆదివారం, జాతీయ సెలవు దినాలలో కూడా నేను పని చేస్తాను. నా జీవితంలో శెలవు అనే పదానికి చోటు లేదు. నేను కేవలం ఐదు గంటలు మాత్రమే నిద్రపోతాను.' అని కరణ్ చెప్పారు.దర్శకుడిగా కరణ్ జోహార్ చివరి చిత్రం రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ. 2023లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, అలియా భట్ నటించారు. విమర్శకుల చేత కూడా ఈ చిత్రం ప్రశంసలు అందుకుంది. భారీ లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్18 స్టూడీయోస్ సంయుక్తంగా నిర్మించాయి. -
నాపై ట్రోలింగ్‌కు ఆ నిర్మాతే కారణం: జాన్వీ కపూర్
మరాఠీ బ్లాక్‌బస్టర్ మూవీ సైరాట్ హిందీలో ధడక్‌గా రీమేక్ అయి సూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రంతోనే వెండితెర అరంగ్రేటం చేసింది హీరోయిన్ జాన్వీ కపూర్. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మించాడు. ఆ తర్వాత కరణ్ నిర్మించిన పలు సినిమాల్లో తళుక్కున మెరిసింది జాన్వీ. ఇదే ఆమెకు విమర్శలు తెచ్చిపెట్టింది. తనను కరణ్ జోహార్ లాంచ్ చేయడం వల్లే తనపై ఇంత విద్వేషం చిమ్ముతారంటొంది జాన్వీ. తాజాగా బాలీవుడ్ లైఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'గొప్ప నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్ హౌస్ నన్ను ఇండస్ట్రీలో లాంచ్ చేసింది. ఇదే నాపై ట్రోలింగ్‌కు కారణమనుకుంటా. ఐకానిక్ ధర్మ ప్రొడక్షన్స్ నన్ను ద్వేషించేందుకు ఓ మార్గాన్ని కల్పించింది. దీనివల్ల ఒత్తిడికి లోనవుతాను, కానీ క్షణం కూడా పశ్చాత్తాపపడను. ఎందుకంటే.. కరణ్ జోహార్, అతడికి సంబంధించిన ధర్మ ప్రొడక్షన్ హౌస్ సృజనాత్మక నిర్ణయాల గురించి మీకు తెలియదు. వాళ్ల బ్యానర్లో పని చేసినందుకు నేను అదృష్టవంతురాలిగా ఫీలవుతున్నా. అన్నింటికీ మించి కరణ్ వంటి నిర్మాత నుంచి నాకు ప్రేమ, విశ్వాసం, మార్గదర్శకత్వం లభించింది' అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఇటీవలే మిలి చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది జాన్వీ. ప్రస్తుతం ఆమె బవాల్, మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాలు చేస్తోంది. చదవండి: ఎట్టకేలకు ఓటీటీలో కాంతార ఆ హీరోతో డేటింగ్, ఇదేం పాడుపని అన్నారు -
కాపీ కొట్టి ఆ సినిమా తీశారు.. స్క్రీన్‌షాట్స్ వైరల్
బీటౌన్ దర్శక నిర్మాతల్లో ప్రముఖంగా చెప్పుకునే వారిలో ఒకరు కరణ్ జోహార్. ఆయన ధర్మ ప్రొడక్షన్స్ పేరిట తాజాగా నిర్మించిన చిత్రం 'జుగ్‌జుగ్ జీయో'. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ అనిల్ కపూర్, నీతూ కపూర్, వరుణ్ ధావన్, కియరా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూన్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది. పుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా అలరించేందుకు రెడీ అయిన తరుణంలో తాజాగా నిర్మాత కరణ్ జోహార్‌కు షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలకు ముందే తమకు చూపించాలని రాంచీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విషయం ఏంటంటే.. తను పంపించిన పాయింట్స్‌ను కాపీ కొట్టి 'జుగ్‌జుగ్ జీయో' సినిమాను నిర్మించారని రాంచీకి చెందిన రచయిత విశాల్ సింగ్ ఆరోపించారు. దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్స్ కూడా తన వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చాడు. 'బన్నీ రాణీ' అనే టైటిల్‌తో కొన్ని పాయింట్స్‌ను ధర్మ ప్రొడక్షన్స్‌కు పంపించినట్లు ఆయన తెలిపాడు. తర్వాత ఆ సంస్థ నుంచి రిప్లై కూడా వచ్చిందని, అయితే ఆ పాయింట్స్‌ను సినిమాగా రూపొందిస్తున్నట్లు ధర్మ ప్రొడక్షన్స్ తనతో చెప్పలేదని, తీరా చూస్తే ఆయన పాయింట్స్‌తో ఈ మూవీ వచ్చినట్లుగా పేర్కొన్నాడు. ఈ విషయంపై రాంచీ కోర్టులో దావా వేశారు విశాల్. పిటిషన్ స్వీకరించిన రాంచీ కమర్షియల్ కోర్టు సినిమా విడుదలకు ముందే తమకు చూపించాలని ఉత్తర్వులు జారీ చేసింది. స్క్రీనింగ్ తర్వాత ఇరువైపులా వాదనలు విని, కాపీ రైట్ ఉల్లంఘన జరిగిందో, లేదో చెబుతామని వెల్లడించింది. చదవండి: లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్.. బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ అయితే ఇప్పటివరకు ఈ విషయంపై కరణ్ జోహార్ అధికారికంగా స్పందించలేదు. కాగా 'జనవరి 2020లో బన్నీ రాణీ టైటిల్‌తో కథ రిజిస్టర్ చేసుకున్నా. 2020 ఫిబ్రవరిలో సహా నిర్మాతగా వ్యవహరించే అవకాశం కోసం ధర్మ ప్రొడక్షన్స్‌కు మెయిల్ చేశా. నాకు రిప్లై కూడా ఇచ్చారు. తర్వాత వాళ్లు నా స్టోరీ తీసుకున్నారు. జుగ్‌జుగ్ జీయో సినిమాను తెరకెక్కించారు. ఇది సరికాదు కరణ్ జోహార్.' అని విశాల్ సింగ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌తోపాటు విశాల్ పంపించిన పాయింట్స్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
పార్టీలో హీరోయిన్‌తో విజయ్ ముచ్చట్లు.. వీడియో తీసిన చార్మీ
Liger Stars Vijay Deverakonda, Ananya Panday At Apoorva Mehta Birthday: బాలీవుడ్ అంతా ఇప్పుడు టాలీవుడ్ వైపే చూస్తుంది. ఇప్పటికే మన స్టార్స్ పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్నారు. ఇక టాలీవుడ్ అర్జున్‌రెడ్డి విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ చేస్తున్న 'లైగర్' సినిమా కోసం ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తుంది. ఓవైపు షూటింగ్లో బిజీగా ఉంటూనే, మరోవైపు పార్టీ మూడ్‌ని ఎంజాయ్ చేస్తుంది లైగర్ టీం. గురువారం ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా పుట్టినరోజు సందర్భంగా ముంబైలో గ్రాండ్ పార్టీ నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ పార్టీలో లైగర్ బ్యాచ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. బ్లాక్ అండ్ బ్లాక్‌లో అందరూ దుమ్మురేపారు. మోస్ట్ స్టైలిష్ లుక్‌తో మెస్మరైజ్ చేశారు. పార్టీ మొత్తంలో లైగర్ టీం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రసత్తుం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే..ధర్మ ప్రొడక్షన్స్- పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న లైగర్ సినిమా ఆగస్ట్25న ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) -
బంపర్ ఆఫర్? ధర్మ ప్రొడక్షన్స్‌లో రష్మికా సినిమా ఉంటుందా?
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా దూసుకెళుతున్న రష్మికా మందన్న బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన హిందీ చిత్రాలు ‘మిషన్ మజ్ను, గుడ్ బై’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈలోపు బాలీవుడ్ నుంచి మరిన్ని అవకాశాలు రష్మిక తలుపు తడుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ సినిమాలో నటించే బంపర్ ఆఫర్ రష్మికని వరించిందని తాజా బాలీవుడ్ టాక్. సోమవారం (జనవరి 24) ముంబయ్‌లోని కరణ్ జోహార్‌కి చెందిన ధర్మ ప్రొడక్షన్ కార్యాలయానికి రష్మిక వెళ్లడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. కరణ్ నిర్మించనున్న ఓ చిత్రంలో రష్మికను కథానాయికగా అనుకున్నారని, ఆ చిత్రానికి సంబంధించిన చర్చలు సంస్థ కార్యాలయంలో జరిగాయని టాక్. కాగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ‘పుష్ప’ చిత్రాన్ని సోషల్ మీడియా ద్వారా కరణ్ అభినందించిన విషయం తెలిసిందే. బహుశా ‘పుష్ప’లో రష్మిక నటన నచ్చి, తన సినిమాకి తీసుకోవాలనుకున్నారేమో. అసలు ధర్మ ప్రొడక్షన్స్‌లో రష్మిక సినిమా ఉంటుందా? ఆ విషయం తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. -
రాశీ ఖన్నాకు బంపర్ ఆఫర్.. కరణ్ జోహార్ సినిమాలో ఛాన్స్..!
సౌత్ క్రేజీ హీరోయిన్ రాశీ ఖన్నా కెరీర్ మెల్లిగా బాలీవుడ్‌లోనూ స్పీడందుకుంటోంది. ఇప్పటికే హిందీలో రెండు వెబ్ సిరీస్‌లను (షాహిద్ హీరోగా ‘సన్నీ’ (వర్కింగ్ టైటిల్), అజయ్ దేవగన్ ‘రుద్ర’) పూర్తి చేసిన రాశీ ఖన్నా ఇప్పుడు ఓ సినిమాలో లీడ్ క్యారెక్టర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ సమాచారం. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో యాక్షన్ ఫ్రాంచైజీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోనే ఓ లీడ్ క్యారెక్టర్‌కి రాశీ ఖన్నా అవకాశం దక్కించుకున్నారని టాక్. ఫ్రాంచైజీ అంటే కొన్ని భాగాలుగా సినిమాని తీస్తారని తెలిసిందే. ఒకవేళ ఈ సినిమాలో రాశీ కమిట్ అయిన వార్త నిజమే అయితే బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లే. సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా పటానీ ఇతర ప్రధాన తారాగణంగా కనిపించే ఈ యాక్షన్ ఫ్రాంచైజీకి ‘యోధ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని, పుష్కర్ ఓజా అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తారని బీ టౌన్ ఖబర్. ఇక సౌత్‌లో గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’, కార్తీ ‘సర్దార్’ చిత్రాల్లో రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. -
నెట్‌ఫ్లిక్స్, కరన్‌జోహార్ బంధానికి ఎండ్‌కార్డ్
Karan Johar Ended His Deal With Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన లస్ట్ స్టోరీస్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. లస్ట్ స్టోరీస్‌తో మొదలైన బాలీవుడ్ ఏస్ డైరెక్టర్ కరణ్ జోహార్ , నెట్‌ఫ్లిక్స్ బంధానికి తెరపడింది. 2019 నుంచి ఇండియాలో మార్కెట్ విస్తరణలో భాగంగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఒరిజనల్ కంటెంట్ అందించేందుకు కరణ్ జోహార్‌కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్‌తో 2019లో జత కట్టింది. దీని ప్రకారం ధర్మా ప్రొడక్షన్ హౌజ్‌కి చెందిన ధర్మాన్ నుంచి వచ్చే అన్ని వెబ్ సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్‌లోనే ప్రసారం చేయాల్సి ఉంటుంది. లస్ట్ స్టోరీస్ కరణ్ జోహార్, నెట్‌ఫ్లిక్స్ ఒప్పందంలో భాగంగా వచ్చిన లస్ట్ స్టోరీస్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక్కసారిగా నెట్‌ఫ్లిక్స్‌కి చందాదారుల సంఖ్య అమాంతం పెరిగింది. ఆ తర్వాత ఘోస్ట్ స్టోరీస్ కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. మొత్తంగా ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఈ రెండు సంస్థలు రెండేళ్ల పాటు పని చేశాయి. ఇక చాలు రెండేళ్ల కాంట్రాక్టు ముగిసిన తర్వాత దాన్ని పొడిగించేందుకు కరణ్ జోహార్ ఆసక్తి చూపించలేదు. తమ ధర్మ ప్రొడక్షన్ హౌజ్ నుంచి వచ్చె వెబ్ సిరస్‌లను ఒకే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌కే పరిమితం చేసేందుకు ఆయన సుముఖంగా లేరు. దీంతో రెండేళ్ల పాటు కలిసి చేసిన ప్రయాణానికి పులిస్టాప్ పెట్టేశారు. మరోవైపు ధర్మా ప్రొడక్షన్ హౌజ్‌కి సంబంధించిన సినిమాలు ఎక్కువగా అమెజాన్ ప్రైమ్‌వీడియోస్, డిస్నీ హాట్‌స్టార్‌లో ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. విస్తరిస్తున్న ఓటీటీ ఇండియాలో ఓటీటీ మార్కెట్ శర వేగంగా విస్తరిస్తోంది. లీడింగ్‌లో ఉన్న అమెజాన్ ప్రైమ్‌కి ప్రస్తుతం 1.80 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉండగా ఈ ఏడాది చివరి నాటికి 2.10 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు 2021 డిసెంబరు నాటికి 46 లక్షల మంది చందాదారులున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ దాన్ని 55 లక్షలకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. హాట్‌స్టార్, జీ 5, సోనీ, వూట్, ఆల్ట్ బాలాజీలు సరైతం చందాదారులను ఆకట్టుకునేందుకు వెబ్ సిరీస్, కొత్త సినిమా రిలీజ్‌పై దృష్టి పెట్టాయి. లాభసాటి వ్యవహారం ఓటీటీలకు యూత్ మహారాజ పోషకులుగా ఉన్నారు. దీంతో యూత్‌ను ఆకట్టుకునే వెబ్ సిరీస్‌లు నిర్మించే సంస్థలకు మంచి ఆఫర్లు ఇస్తున్నాయి. దీంతో ఒక్కో వెబ్ సిరీస్‌ని ఒక్కో ఓటీటీ ప్లాట్ఫార్మ్పై రిలీజ్ చేయడం ద్వారా ఇటు ఆర్థికంగా లాభసాటిగా ఉండటంతో పాటు బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుందనే యోచనలో కరణ్ జోహార్ ఉన్నారు. అందువల్లే నెట్‌ఫ్లిక్స్‌కి బై చెప్పారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. చదవండి : సమంతకు నెట్‌ఫ్లిక్స్ భారీ ఆఫర్.. వైరల్ అవుతోన్న రెమ్యునరేషన్! -
మరో వివాదంలో కరణ్ జోహార్
పనాజీ: బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ సిబ్బంది గత వారం గోవాలోని ఓ గ్రామంలో షూటింగ్ చేశారు. ఈ క్రమంలో పోగయిన చెత్తని ఆ గ్రామంలో పడేసి వెళ్లారు. ఈ ఘటన ఉత్తర గోవా నిరుల్‌లో చోటు చేసుకుంది. ప్రాంత వాసులు తమ ఏరియాలో చెత్త పడేయటాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. దాంతో ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పాల్సిందిగా గోవా ప్రభుత్వం కరణ్ ధర్మ ప్రొడక్షన్స్‌కి నోటీసులు జారీ చేసింది. అలానే విషయం తెలుసుకున్న ప్రభుత్వ ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా ధర్మ ప్రొడక్షన్స్ లైన్ ప్రొడ్యూసర్ దిలీప్ బోర్కర్‌కి మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో గోవా వ్యర్థ పదార్థాల నిర్వహణ మంత్రి మైఖేల్ లోబో మాట్లాడుతూ... ‘ధర్మ ప్రొడక్షన్స్ సిబ్బంది ఈ స్థలంలో చెత్త పడేసి తమ దారిన తాము పోయారు. శుభ్రం చేయలేదు. ఇందుకు గాను వారు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఫేస్బుక్ ద్వారా తమ తప్పును ఒప్పుకోవాలి.. క్షమాపణలు కోరాలి. లేకపోతే వారికి జరిమానా విధిస్తాం’ అని హెచ్చరించారు. ఈ చెత్తలో తారాగణం, సిబ్బంది ఉపయోగించిన పీపీఈ కిట్లు కూడా ఉన్నాయి. (చదవండి: మీడియాపై ఆగ్రహం.. కరణ్‌కు మద్దతు) ఇక ఈ సంఘటనపై లైన్స్ ప్రొడ్యూసర్ దిలీప్ బోర్కర్ స్పందించారు. ‘మేము నిరుల్ ప్రాంతంలో ఓ సినిమా షూటింగ్ చేశాం. ప్రతి రోజు చెత్తను సేకరించి స్థానిక పంచాయతీ తెలిపిన ప్రదేశంలో పడేసేవాళ్లం. కాంట్రాక్టర్ క్రమం తప్పకుండా చెత్తను సేకరిస్తాడు. కానీ ఆదివారం మాత్రం తీసుకెళ్లలేదు. దాంతో అది అక్కడే ఉంది. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు అని తెలిపాడు. ఈ చిత్రంలో దీపికా పదుకోనె ప్రధాన పాత్రలో నటించిందని సమాచారం. -
నాకు డ్రగ్స్ అలవాటు లేదు
ముంబై: ముంబైలోని తన నివాసంలో గత ఏడాది జరిగిన పార్టీలో బాలీవుడ్ ప్రముఖ యువనటులు డ్రగ్స్ వాడారంటూ వస్తున్న వార్తలపై దర్శక–నిర్మాత కరణ్ జోహార్ గట్టిగా స్పందించారు. అవన్నీ తప్పుడు, నిరాధార ఆరోపణలని కొట్టిపారేశారు. తాను ఎన్నడూ డ్రగ్స్ వాడలేదనీ, వాటిని వాడాలంటూ ఎవరినీ ప్రోత్సహించలేదని స్పష్టం చేశారు. తను, తన కుటుంబం, సన్నిహితులు, తన బ్యానర్ ధర్మా ప్రొడక్షన్‌పై జరుగుతున్న ప్రచారం విద్వేషపూరితం, అసంబద్ధం అని తెలిపారు. డ్రగ్స్ కేసులో ఎన్సీబీ శుక్రవారం ధర్మా ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్, అనుభవ్ చోప్రాలను ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీనిపైనా కరణ్ జోహార్ స్పందించారు. వీరిద్దరిలో ఎవరితోనూ తనకు వ్యక్తిగతంగా పరిచయం లేదన్నారు. ‘ఈ వ్యవహారంలో మీడియా సంయమనం పాటించాలని కోరుతున్నా’అని పేర్కొన్నారు. -
అసలు ఆ షిప్లో ఏం జరిగింది?
ఉడి, మన్మర్జియాన్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విక్కీ కౌశల్. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘‘భూత్: ది హాంటెడ్ షిప్’’. ఈ సినిమాలో విక్కీ సర్వేయింగ్ ఆఫీసర్ పృథ్వీగా కనిపించనున్నాడు. భాను ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసింది. ముంబై సముద్రతీరంలో మిస్టరీగా ఉన్న సీ బర్డ్ అనే షిప్‌నకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు పృథ్వీ ఒంటరిగా అందులోకి వెళ్లడంతో మొదలైన ట్రైలర్.. సీ బర్డ్‌లో చోటుచేసుకునే భయంకరమైన సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. షిప్లో ఆత్మలు సంచరించడం... హీరోను చుట్టుముట్టి అతడిని ఈడ్చిపడేయడం వంటి సన్నివేశాలు భీతిగొల్పుతాయి. ఇక ఇప్పటికే భూత్ ప్రమోషన్లను ముమ్మరం చేసిన చిత్ర బృందం ఫిబ్రవరి 21న సినిమాను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. -
సినీ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం..
ప్రముఖ సినీ దర్శక నిర్మాత కరణ్ జోహర్‌కు చెందిన ధర్మా ప్రొడక్షన్ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల ఆస్తి నష్టంతో పాటు ధర్మా ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కిన చిత్రాలకు సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలు బూడిదైనట్టుగా తెలుస్తోంది. ఎక్కువగా కాస్ట్యూమ్స్, సినిమా సెట్టింగ్‌లకు వినియోగించే వస్తువులు ఉండటంతో మంటలు త్వరగా వ్యాపించాయని భావిస్తున్నారు. 1976లో కరణ్ తండ్రి యశ్ జోహర్ ఈ స్టూడియోను ప్రారంభించారు. ప్రొడక్షన్ కు సంబంధించిన కెమెరాలు, సెట్ ప్రాపర్టీస్, కాస్ట్యూమ్స్, ఇతర విలువైన వస్తువులను ఇక్కడే భద్రపరుస్తుంటారు. ప్రమాదంలో కొన్ని స్క్రిప్ట్‌లు కాలిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ధర్మా ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాతో పాటు గుడ్ న్యూస్, సూర్యవంశీ, తక్త్ చిత్రాలు నిర్మాణదశలో ఉన్నాయి. -
మూడేళ్ల తర్వాత ఆ బేనర్లో...!
‘బాజీరావ్ మస్తానీ’ తర్వాత హిందీలో దీపికా పదుకొనే వేరే చిత్రాలు ఒప్పుకో లేదు. హాలీవుడ్ చిత్రం ‘త్రిబులెక్స్: రిటర్న్ ఆఫ్ గ్జాండర్కేజ్’ సినిమా చేస్తూ, బిజీగా ఉన్నారామె. ఇది చేస్తుండగానే మరో హాలీవుడ్ చిత్రానికి అవకాశం వచ్చిందనే వార్త ప్రచారమవుతోంది. దాంతో ఈ ఏడాదంతా ఆమె బాలీవుడ్‌కి దూరంగా ఉంటారని చాలామంది భావించారు. అయితే, హిందీలో దీపిక ఓ చిత్రం చేయనున్నారు. గతంలో కరణ్ జోహార్ నిర్మించిన ‘ఏ జవాని హై దివాని’ చిత్రంలో నటించిన దీపిక మళ్లీ ధర్మ ప్రొడక్షన్స్‌లో నటించనున్నారు. ఈ విషయాన్ని దర్శక, నిర్మాత కరణ్‌జోహార్ తన ట్విటర్ ద్వారా ప్రకటించారు. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ సంస్థలో దీపిక చేయనున్న చిత్రం ఇదే.