
ముంబై: ముంబైలోని తన నివాసంలో గత ఏడాది జరిగిన పార్టీలో బాలీవుడ్ ప్రముఖ యువనటులు డ్రగ్స్ వాడారంటూ వస్తున్న వార్తలపై దర్శక–నిర్మాత కరణ్ జోహార్ గట్టిగా స్పందించారు. అవన్నీ తప్పుడు, నిరాధార ఆరోపణలని కొట్టిపారేశారు. తాను ఎన్నడూ డ్రగ్స్ వాడలేదనీ, వాటిని వాడాలంటూ ఎవరినీ ప్రోత్సహించలేదని స్పష్టం చేశారు. తను, తన కుటుంబం, సన్నిహితులు, తన బ్యానర్ ధర్మా ప్రొడక్షన్‌పై జరుగుతున్న ప్రచారం విద్వేషపూరితం, అసంబద్ధం అని తెలిపారు. డ్రగ్స్ కేసులో ఎన్‌సీబీ శుక్రవారం ధర్మా ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్, అనుభవ్ చోప్రాలను ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీనిపైనా కరణ్ జోహార్ స్పందించారు. వీరిద్దరిలో ఎవరితోనూ తనకు వ్యక్తిగతంగా పరిచయం లేదన్నారు. ‘ఈ వ్యవహారంలో మీడియా సంయమనం పాటించాలని కోరుతున్నా’అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment