ఉడి, మన్‌మర్జియాన్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విక్కీ కౌశల్. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘‘భూత్: ది హాంటెడ్ షిప్’’. ఈ సినిమాలో విక్కీ సర్వేయింగ్ ఆఫీసర్ పృథ్వీగా కనిపించనున్నాడు. భాను ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసింది.
ముంబై సముద్రతీరంలో మిస్టరీగా ఉన్న సీ బర్డ్ అనే షిప్‌నకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు పృథ్వీ ఒంటరిగా అందులోకి వెళ్లడంతో మొదలైన ట్రైలర్.. సీ బర్డ్‌లో చోటుచేసుకునే భయంకరమైన సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. షిప్‌లో ఆత్మలు సంచరించడం... హీరోను చుట్టుముట్టి అతడిని ఈడ్చిపడేయడం వంటి సన్నివేశాలు భీతిగొల్పుతాయి. ఇక ఇప్పటికే భూత్ ప్రమోషన్లను ముమ్మరం చేసిన చిత్ర బృందం ఫిబ్రవరి 21న సినిమాను విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment