
గత కొన్నిరోజులుగా ప్రేక్షకుల మధ్య డిస్కషన్ కి కారణమైన మూవీ 'ఛావా'. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించిన ఈ పీరియాడికల్ సినిమాన ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తీశారు. ఫిబ్రవరిలో హిందీ వెర్షన్, మార్చి తొలివారంలో తెలుగు వెర్షన్ రిలీజైంది.
(ఇదీ చదవండి: తమ్ముడి పెళ్లిలో సాయిపల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్)
హిందీలో ఎలా అయితే హిట్ టాక్ వచ్చిందో తెలుగులోనూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో తొలి మూడు రోజులకే దాదాపు రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. శుక్రవారం వరకు కొత్త మూవీస్ ఏం లేవు కాబట్టి ఎన్ని కోట్లు వస్తాయో చూడాలి?
సరే ఈ సంగతులన్నీ పక్కనబెడితే 'ఛావా' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ రెండో వారం నుంచి అంటే 11వ తేదీన అలా నెట్ ఫ్లిక్స్ లోకి రానుందని సమాచారం. మరి దక్షిణాది భాషల్లోనూ డబ్ చేస్తారా లేదా అనేది చూడాలి.
(ఇదీ చదవండి: పెళ్లి రిసెప్షన్ లో ఫుల్ హ్యాపీగా సితార-నమ్రత-చరణ్)
Comments
Please login to add a commentAdd a comment