బాలీవుడ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకర్స్‌లో కరణ్ జోహార్ ఒకరు. దర్శకుడు, నిర్మాతగా చాలా సినిమాలు చేశారు. పలు దక్షిణాది సినిమాల్ని హిందీలో రిలీజ్ చేసి, డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ తన మార్క్ చూపించారు. అలాంటిది గత కొన్నిరోజులుగా ఈయన తన నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌ని అమ్మేస్తున్నాడనే పుకార్లు వచ్చాయి. ఇప్పుడు అవి నిజమని తేలిపోయింది.
(ఇదీ చదవండి: పృథ్వీ వంకర చూపులు.. బిగ్‌బాస్‌లో గలీజు ప్రవర్తన!)
కరణ్ జోహార్ నిర్మాణ సంస్థలోని కొంత వాటాని రిలయన్స్ కొనుగోలు చేయొచ్చని అన్నారు. కానీ ప్రముఖ పారిశ్రామికవేత్త అడర్ పునావాలాకి చెందిన సెరెన్ ప్రొడక్షన్స్ 50 శాతం వాటా దక్కించుకుంది. ఈ మేరకు రూ.1000 కోట్ల మేర నిర్మాణ సంస్థలో ఇన్వెస్ట్ చేయనుంది. అంటే క్రియేటివ్ పనులన్నీ కరణ్ జోహర్ చూసుకుంటారు. నిర్మాణ వ్యవహారాల్లో పునావాలా భాగమవుతుందని తెలుస్తోంది.
కరోనాకు ముందు పర్లేదు గానీ ఈ వైరస్ వచ్చిన తర్వాత మాత్రం బాలీవుడ్ పరిస్థితి దారుణంగా తయారైంది. కరణ్ జోహార్ లాంటి సక‍్సెస్ రేట్ ఉన్న నిర్మాత కూడా కుదేలైపోయాడు. ఈ ఏడాది కరణ్ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. రీసెంట్‌గా రిలీజైన ఆలియా భట్ 'జిగ్రా'.. కరణ్ నిర్మించింది. దీనికి దారుణమైన కలెక్షన్స్ వస్తున్నాయి. కొన‍్నేళ్లుగా సక్సెస్ రేటు తగ్గిపోవడంతో భారీ ఆర్థిక నష్టాలు వచ్చాయి. ఈ క్రమంలోనే సగం వాటా అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 24 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)
Comments
Please login to add a commentAdd a comment