నలుగురు చూసే షోలో ఉన్నప్పుడు కాస్త ఆచితూచి ప్రవర్తించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బిగ్‌బాస్ 8లో ఆడుతున్న పృథ్వీకి అలాంటి లక్షణాలు అసలు లేవనిపిస్తుంది. ఎందుకంటే గతవారం అవినాష్ భార్య గురించి చీప్ కామెంట్స్ చేశాడు. నామినేషన్స్‌లో ప్రేరణని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు రోహిణితో గలీజుగా ప్రవర్తించాడు.
(ఇదీ చదవండి: ప్లేటు తిప్పేసిన మణికంఠ.. ఎలిమినేషన్ తర్వాత కూడా)
ఏడో వారం మణికంఠ ఎలిమినేట్ అయిపోవడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఎప్పటిలానే ఎనిమిదో వారం నామినేషన్స్ మొదలయ్యాయి. దిష్టిబొమ్మకు కుండ పెట్టి పగలగొట్టాలని బిగ్‌బాస్ చెప్పాడు. మణికంఠ విషయంలో మెహబూబ్‌కి పాయింట్ ఇవ్వకుండా ఉండాల్సిందనే కారణంతో విష్ణుప్రియ.. నిఖిల్‌ని నామినేట్ చేసింది. ఫుడ్ విషయంలో ప్రేరణని కూడా నామినేట్ చేసింది.
అనంతరం పృథ్వీని నామినేట్ చేసిన రోహిణి.. రూల్స్ అసలు వినట్లేదని, చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నావని కారణాలు చెప్పింది. గతవారం జరిగిన ఓవర్ స్మార్ట్ గేమ్ గురించి ప్రస్తావించి కేబుల్ మొదట్లోనే మడతపెట్టి జేబులో పెట్టేస్తా ఎలా? అని ప్రశ్నించింది. అది నా స్ట్రాటజీ అని పృథ్వీ చెప్పడంతో.. అలాంటప్పుడు గేమ్ ఎక్కడ మొదలవుతుంది, గేమ్ ఆడకుండా స్ట్రాటజీ అంటే ఎలా? అని వరసగా సరైన కౌంటర్లు వేసేసరికి పృథ్వీ సైలెంట్ అయిపోయాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 24 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)
తనవంతు వచ్చేసరికి రోహిణిని పృథ్వీ నామినేట్ చేశాడు. ఆటలో మీరు జీరో అనిపిస్తున్నారని కారణం చెప్పాడు. ఆటలో ఎఫర్ట్స్ పెట్టట్లేదా? అని రోహిణి అడిగితే.. అలా కాదని అన్నాడు. ఇదంతా చూస్తుంటే పృథ్వీ పగతో చేసిన నామినేషన్‌లా అనిపించింది తప్పితే సరైన కారణమే కనిపించలేదు. చివర్లో మాటామాటా పెరిగిన టైంలో రోహిణిని పై నుంచి కిందవరకు పృథ్వీ ఆదో రకంగా చూశాడు. అలా చూడటం నాకు నచ్చలేదని చెప్పి రోహిణి పెద్ద గొడవే పెట్టుకుంది.
బిగ్‌బాస్ షోలో పృథ్వీ ప్రవర్తన రోజురోజుకీ దిగజారుతోంది. గతవారం అవినాష్‌తో మాట్లాడుతూ మీ భార్యనే షోకి పంపాల్సింది అనడం గానీ.. తను నామినేట్ అయ్యేలా చేసిందని చెప్పి ప్రేరణని మానసికంగా వేధించడం గానీ చూస్తుంటే పృథ్వీకి ఏమైనా మానసిక సమస్యలు ఉన్నాయా అనిపిస్తుంది. అసలు ఇతడిని బిగ్‌బాస్ నిర్వహకులు ఇన్నాళ్లు ఎందుకు భరిస్తున్నారా అనే సందేహం కలుగుతోంది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: నాగమణికంఠ పారితోషికం ఎంతంటే?)
Comments
Please login to add a commentAdd a comment