బిగ్‌బాస్ 8లో విచిత్రమైన క్యారెక్టర్ అంటే మణికంఠనే. ఎప్పుడేం చేస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడనేది అస్సలు అర్థం కాదు. వచ్చిన కొత్తలో భార్యబిడ్డలు కావాలి అని నానా హంగామా చేశాడు. ఇప్పుడవన్నీ పక్కనబెట్టి సరిగా ఆడుతున్నాడేమో అనుకుంటే.. ఆరోగ్యం బాగోలేదని చెప్పి తనకు తానుగా బయటకొచ్చేశాడు. తీరా ఇప్పుడేమో మాటలు మార్చేస్తున్నాడు. బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలో ఏ ప్రశ్నకు తిన్నగా సమాధానం చెప్పకుండా అర్జున్‌కే ఝలక్స్ ఇచ్చాడు.
గెలవాలనే ఆలోచనతో వచ్చిన మీరు.. కనీసం చీఫ్ అవ్వకుండానే బయటకు ఎందుకొచ్చారు? అని హోస్ట్ అర్జున్ అడగ్గా.. విన్నర్ అవ్వాలనే ఆలోచనతో అయితే నేను రాలేదని అన్నాడు. దీంతో అర్జున్ నోరెళ్లబెట్టాడు. అదెంత పెద్ద కంటెంటో తెలుసా అని ఆశ్చర్యపోయాడు. 'నా పెళ్లాం బిడ్డ నాకు కావాలి. నా రెస్పెక్ట్ నాకు కావాలి' అని మణికంఠలా ప్రవర్తించి అర్జున్ చూపించాడు. అప్పటివరకు నవ్వు ముఖంతో ఉన్న మణికంఠ కాస్త దెబ్బకు డీలా పడిపోయాడు.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'కేరింత' సినిమా హీరో)
గోరంత దాన్ని కొండంత చేస్తావ్ అని హౌస్‌మేట్స్ అభిప్రాయం.. దీనిపై ఏమంటావ్ అని అడగ్గా.. నేను ఆలోచించే విధానం అలా ఉంటుంది కాబట్టి రియాక్ట్ అయ్యే విధానం కూడా అలానే ఉంటుందని మణికంఠ చెప్పాడు. సరే ఇవన్నీ కాదు గానీ హౌస్‌లో నువ్వు చేసిన పాజిటివ్ విషయం ఒకటి చెప్పు అని అర్జున్ అడగ్గా.. నేను నాలా ఉండటమే పాజిటివ్ అని మణికంఠ తలతిక్క సమాధానం చెప్పాడు.
నీకు సాయం చేసిన వాళ్లనే నువ్వు వెన్నపోటు పొడిచావ్ అంటే ఏమంటావ్? అని అడగ్గా.. ఇదైతే అస్సలు అంగీకరించను అని మణికంఠ ససేమిరా అన్నాడు. హౌస్‌లో డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయని మీకు అనిపించిందా? అంటే తడముకోకుండా నిఖిల్ పేరు చెప్పాడు. ఇక పృథ్వీ-విష్ణుప్రియ మధ్య రెండు వైపుల నుంచి ప్రేమ చిగురిస్తోందని చెప్పి షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. 'ఇది మాకు తెలీదయ్యో' అని హోస్ట్ అర్జున్ షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: నాగమణికంఠ పారితోషికం ఎంతంటే?)
Comments
Please login to add a commentAdd a comment