బిగ్‌బాస్ షో నాకు ఎంత ముఖ్యమో మీకు తెలియదు, నా పెళ్లాంబిడ్డలు తిరిగి రావాలన్నా, అత్తామామ దగ్గర గౌరవం దక్కాలన్నా ఈ షో గెలవాలి అని నాగమణికంఠ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎవరైనా నామినేట్ చేస్తే చాలు ఆ వారమంతా తెగ టెన్షన్ పడిపోయేవాడు. తను హౌస్‌లో ఉండాలని తపించిపోయాడు. ప్రతి గేమ్‌లో తానే ఉండాలనుకున్నాడు. కానీ ఈ వారం సీన్ మారిపోయింది. హౌస్‌లో ఉండలేనన్నాడు. ఇంటికి వెళ్లిపోతానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన మైండ్ పని చేయట్లేదన్నాడు.
పారితోషికం..
శరీరం కూడా సహకరించలేదన్నాడు. దీంతో డాక్టర్ దగ్గరకు కూడా పంపించగా వాళ్లు బాగానే ఉందని సర్టిఫికెట్ ఇచ్చేశారు. అయినా సరే మణి హౌస్‌లో సర్దుకోలేకపోయాడు. అతడు కోరుకున్నట్లుగానే ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు. అతడి పారితోషికం విషయానికి వస్తే.. వారానికి రూ.1.20 లక్షల చొప్పున మేర సంపాదించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఏడువారాలకుగానూ రూ.8.40 లక్షలు వెనకేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment