Adar Poonawalla
-
'నా భార్యకు నన్ను చూస్తూ ఉండటం ఇష్టం'
ప్రస్తుతం దేశం మొత్తం మీద పనిగంటలపై చర్చ జరుగుతోంది. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలని చెబితే.. వారానికి 90 గంటలు పనిచేయాలని ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రమణ్యన్ అన్నారు. ఈ వ్యాఖ్యపై పలువురు పారిశ్రామిక వేత్తలు స్పందించారు. ఇప్పుడు ఈ జాబితాలోకి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ 'అదార్ పూనావల్లా' (Adar Poonawalla) కూడా చేరారు.ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదు, ఎంత క్వాలిటీ వర్క్ చేశామన్నది ముఖ్యం. 10 గంటలు పని చేస్తే ప్రపంచాన్నే మార్చేయొచ్చన్న ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) మాటలతో.. అదార్ పూనావల్లా ఏకీభవించారు. నా భార్య కూడా నేను అద్భుతంగా ఉన్నాను అని అనుకుంటుంది. ఆమె ఆదివారాలు నన్ను చూస్తూ ఉండటానికి ఇష్టపడుతుందని ఆయన ట్వీట్ చేశారు.ఢిల్లీలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025 సదస్సులో, పని గంటల పొడిగింపుపై ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ తన అసమ్మతిని వ్యక్తం చేశారు. నారాయణ మూర్తి.. ఇతర కార్పొరేట్ నాయకుల పట్ల నాకు చాలా గౌరవం ఉంది. అయితే నా ఉద్దేశ్యం ఏమిటంటే, మనం పని గంటలపై కాకుండా.. పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. కాబట్టి 70 గంటలు & 90 గంటలు కాదు. నాణ్యమైన పని 10 గంటలు చేస్తే చాలు. ప్రపంచాన్నే మార్చేయొచ్చని ఆయన అన్నారు.ఇదీ చదవండి: 'సరిగ్గా 10 గంటలు.. ప్రపంచాన్ని మార్చేయొచ్చు': ఆనంద్ మహీంద్రాఇంట్లో కూర్చుని.. భార్యను ఎంత సేపు చూస్తారు. ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండని చెప్పిన ఎస్ఎన్ సుబ్రమణ్యన్ (Subrahmanyan) వ్యాఖ్యలపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. ‘నా భార్య ఎంతో మంచిది, ఆమెను తదేకంగా చూడటం నాకు చాలా ఇష్టం’ అని అన్నారు. ఎల్ అండ్ టీ చైర్మన్ వ్యాఖ్యలపై కేవలం పారిశ్రామిక దిగ్గజాలు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.Yes @anandmahindra, even my wife @NPoonawalla thinks i am wonderful, she loves staring at me on Sundays. Quality of work over quantity always. #worklifebalance pic.twitter.com/5Lr1IjOB6r— Adar Poonawalla (@adarpoonawalla) January 12, 2025 -
రూ.750 కోట్ల ఇంట్లో నివాసం.. బిలియనీర్‌తో వివాహం: ఎవరో గుర్తుపట్టారా? (ఫోటోలు)
-
ఇల్లు ఇంద్రభవనం.. కుబేరుడిలాంటి భర్త: ఎవరీ ఫ్యాషన్ ఐకాన్?
సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) సీఈఓ అదర్ పూనావాలా భార్య 'నటాషా పూనావాలా' (Natasha Poonawalla) గురించి బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె వ్యాపార రంగంలో కీలక పాత్ర పోషించడం మాత్రమే కాకుండా.. అనేక సామాజిక, దాతృత్వ కార్యక్రమాలు చేసే ముఖ్యమైన వ్యక్తులలో ఒకరుగా ప్రసిద్ధి పొందారు.నటాషా పూనావాలా.. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తూ.. వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలపై దృష్టి సారిస్తూనే, విల్లో పూనావల్లా ఫౌండేషన్‌కు అధ్యక్షత వహిస్తున్నారు.పూణేలో జననం1981 నవంబర్ 26న మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన నటాషా.. పాఠశాల విద్యను పూణేలోని సెయింట్ మేరీస్ స్కూల్లో, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయంలో పూర్తి చేసింది. తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందింది.750 కోట్ల భవనంనటాషా 2006లో అదర్ పూనావాలాను వివాహం చేసుకుంది. ఈ జంటకు సైరస్, డారియస్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు సుమారు 750 కోట్ల విలువైన విలాసవంతమైన భవనం లింకన్ హౌస్‌లో నివాసం ఉంటున్నారు. ఈ భవనం యూరోపియన్ స్టైల్లో ఉంది. దీనిని అదర్ పూనావాలా తండ్రి 2015లో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇది సుమారు 247 ఎకరాలలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: రూ. 10వేల అప్పుతో రూ.32000 కోట్ల సామ్రాజ్యం: ఎవరీ 'రవి మోదీ'?నటాషా వ్యాపారం.. దాతృత్వం రెండింటిలోనూ కీలక వ్యక్తిగా స్థిరపడింది. ఆమె నాయకత్వంలో, SII ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారులలో ఒకటిగా మారింది. ఇక ఫౌండేషన్ ద్వారా సామాజిక కార్యక్రమాలు చేపడుతూ.. నిరుపేద వర్గాల కోసం విద్య, ఆరోగ్య సంరక్షణ మొదలైనవాటిని అందిస్తోంది. నటాషా భర్త నికర విలువ రూ. 1 లక్ష కోట్ల కంటే ఎక్కువ. -
ఫ్యాషన్‌కే పాఠాలు చెప్పే ఫ్యాషన్ క్వీన్, బిజినెస్ మాగ్నేట్ భార్య (ఫోటోలు)
-
సినిమాల్లోకి ‘సీరమ్’!
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్‌తో చిరపరిచితమైన వ్యాక్సిన్ల తయారీ దిగ్గజం సీరమ్ ఇన్స్టిట్యూట్ సినిమాల నిర్మాణంలోకి ప్రవేశిస్తోంది. కంపెనీ సీఈవో అదార్ పూనావాలా ఏర్పాటు చేసిన సిరీన్ ప్రొడక్షన్స్ కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్‌లో 50 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 1,000 కోట్లు వెచ్చించనుంది. ధర్మ ప్రొడక్షన్స్, ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్లలో రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సిరీన్ ప్రొడక్షన్స్ వెల్లడించింది. దీంతో ధర్మలో 50 శాతం వాటాను సిరీన్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకోనుంది. మిగిలిన 50 శాతం వాటాతోపాటు యాజమాన్యాన్ని కరణ్ జోహార్ కలిగి ఉంటారని సిరీన్ స్పష్టం చేసింది. వెరసి పూనావాలా పెట్టుబడులు ధర్మ విలువను రూ. 2,000 కోట్లుగా నిర్ధారించాయి. ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా ధర్మ, సిరీన్ సంస్థల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటైనట్లు సిరీన్ పేర్కొంది. సినిమాల నిర్మాణంలో ధర్మకున్న నైపుణ్యం, అదార్ పూనావాలాకున్న వనరులు ఇందుకు తోడ్పాటునివ్వగలవని అభిప్రాయపడింది. ధర్మ మరింత పురోభివృద్ధిని సాధిస్తుందని, మరింత ఎత్తుకు ఎదుగుతుందని ఆశిస్తున్నట్లు తాజా పెట్టుబడులపై స్పందిస్తూ పూనావాలా పేర్కొన్నారు. భవిష్యత్ దృక్పథ వ్యూహాలు, నైపుణ్యంతోకూడిన సినిమాల నిర్మాణాల సక్రమ కలయికను తాజా భాగస్వామ్యం ప్రతిఫలిస్తున్నదని కరణ్ జోహార్ వ్యాఖ్యానించారు. బాధ్యతలు ఇలా: కంపెనీ నూతన ఏర్పాటులో భాగంగా ధర్మకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో కరణ్ జోహార్ సృజనాత్మక కార్యక్రమాలను రూపొందిస్తారు. సీఈవోగా అపూర్వ మెహతా వ్యూహాత్మక మార్గదర్శకుడిగా కరణ్‌తో కలిసి బాధ్యతలు నిర్వహిస్తారు. కంటెంట్ నిర్మాణం, పంపిణీ, ఆధునిక టెక్నాలజీలను ఏకీకృతం చేయడం, ప్రొడక్షన్ విధానాలను మెరుగుపరచడం, ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం తదితర కార్యకలాపాలపై దృష్టి పెట్టనున్నట్లు సిరీన్ వివరించింది. దేశీయంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో తాజా డీల్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. -
సంస్థలో సగం వాటా అమ్మేసిన ప్రముఖ నిర్మాత
బాలీవుడ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకర్స్‌లో కరణ్ జోహార్ ఒకరు. దర్శకుడు, నిర్మాతగా చాలా సినిమాలు చేశారు. పలు దక్షిణాది సినిమాల్ని హిందీలో రిలీజ్ చేసి, డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ తన మార్క్ చూపించారు. అలాంటిది గత కొన్నిరోజులుగా ఈయన తన నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌ని అమ్మేస్తున్నాడనే పుకార్లు వచ్చాయి. ఇప్పుడు అవి నిజమని తేలిపోయింది.(ఇదీ చదవండి: పృథ్వీ వంకర చూపులు.. బిగ్‌బాస్‌లో గలీజు ప్రవర్తన!)కరణ్ జోహార్ నిర్మాణ సంస్థలోని కొంత వాటాని రిలయన్స్ కొనుగోలు చేయొచ్చని అన్నారు. కానీ ప్రముఖ పారిశ్రామికవేత్త అడర్ పునావాలాకి చెందిన సెరెన్ ప్రొడక్షన్స్ 50 శాతం వాటా దక్కించుకుంది. ఈ మేరకు రూ.1000 కోట్ల మేర నిర్మాణ సంస్థలో ఇన్వెస్ట్ చేయనుంది. అంటే క్రియేటివ్ పనులన్నీ కరణ్ జోహర్ చూసుకుంటారు. నిర్మాణ వ్యవహారాల్లో పునావాలా భాగమవుతుందని తెలుస్తోంది.కరోనాకు ముందు పర్లేదు గానీ ఈ వైరస్ వచ్చిన తర్వాత మాత్రం బాలీవుడ్ పరిస్థితి దారుణంగా తయారైంది. కరణ్ జోహార్ లాంటి సక్సెస్ రేట్ ఉన్న నిర్మాత కూడా కుదేలైపోయాడు. ఈ ఏడాది కరణ్ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. రీసెంట్గా రిలీజైన ఆలియా భట్ 'జిగ్రా'.. కరణ్ నిర్మించింది. దీనికి దారుణమైన కలెక్షన్స్ వస్తున్నాయి. కొన్నేళ్లుగా సక్సెస్ రేటు తగ్గిపోవడంతో భారీ ఆర్థిక నష్టాలు వచ్చాయి. ఈ క్రమంలోనే సగం వాటా అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 24 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్) -
అదర్ పూనావాలా కొత్త కారు - ఫోటోలు
-
'అదర్ పూనావాలా' రూ.10.5 కోట్ల కారు ఇదే.. చూసారా!
సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ 'అదర్ పూనావాలా' ఇటీవల 'ఫెరారీ పురోసాంగ్యూ' కొనుగోలు చేశారు. దీని ధర దాదాపు రూ. 10.5 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.అదర్ పూనావాలా కొనుగోలు చేసిన కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారం.. ఇది ఇండియాలో కొనుగోలు చేసింది కాదని తెలుస్తోంది. నాలుగు డోర్స్ కలిగిన ఈ కారు నీరో డేటోనా షేడ్‌లో ఉండటం గమనించవచ్చు. ఎల్లో కలర్ బ్రేక్ కాలిపర్లు కలిగిన ఈ కారు బ్లాక్-అవుట్ ఎక్ట్సీరియర్ పొందుతుంది. ఇంటీరియర్ కూడా ఇదే బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కలయికతో ఉండటం చూడవచ్చు.అద్భుతమైన డిజైన్, ఫీచర్స్ కలిగిన ఈ కారు 6.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి.. 725 పీఎస్ పవర్, 716 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మార్కెట్లో లంబోర్ఘిని ఉరస్, ఆస్టన్ మార్టిన్ డీబీఎక్స్ కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ధర పరంగా ఫెరారీ కారు దాని ప్రత్యర్థుల కంటే ఎక్కువ.అదార్ పూనావాలా గ్యారేజిలో ఫెరారీ పురోసాంగ్యూ మాత్రమే కాకుండా.. రోల్స్ రాయిస్, ఫెరారీ 488 పిస్టా సూపర్‌కార్, బెంట్లీ బెంటెగా EWB, పోర్స్చే కయెన్, బీఎండబ్ల్యూ 7 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ ఎస్600, బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్ మొదలైన అన్యదేశ్య కార్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by Automobili Ardent India (@automobiliardent) -
బెజోస్ ప్రియురాలితో నటాషా పూనావాలా స్టెప్పులు; ఫోటోలు, వీడియో వైరల్
ప్రముఖ వ్యాక్సిన్ మేకర్ సీరంసీఈవో అదార్ పూనావాలా భార్య, సీరంఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నటాషాపూనావాలా మరోసారి ఒక అంతర్జాతీయ వేదికపై తళుక్కున మెరిసారు. ప్రముఖ గాయని సల్మా హాయక్ సహ-అధ్యక్షురాలిగా ఉన్న కెరింగ్ ఫౌండేషన్ 15వ వార్షికోత్సవానికి హాజరైనఅతిథులలో ఫ్యాషన్ మొగల్ నటాషా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ షియాపరెల్లి గౌనులో నటాషా తనదైన ఫ్యాషన్ స్టయిల్లో అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ గర్ల్‌ఫ్రెండ్ లారెన్ శాంచెజ్, సల్మాతో కలిసి స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించి వీడియోను, ఫోటోలను నటాషా పూనావాలా ఇన్‌స్టాలో షేర్ చేశారు. వీరితోపాటు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకు ఫోటోలు, వీడియోలను, సల్మా హాయక్ , లారెన్ శాంచెజ్ షేర్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. సెప్టెంబర్ 12న అమెరికాలో మాన్హాటన్లో సల్మా హాయక్ ఇచ్చిన కేరింగ్ ఫర్ ఉమెన్ డిన్నర్ ఈవెంట్లో పలువురుమహిళా ప్రముఖులు స్పెషల్ గెస్ట్‌లు విచ్చేశారు. ముఖ్యంగా నటి ఓప్రా విన్ఫ్రే తన ప్రసంగంతో ఆకట్టుకుంది. ఇంకా మలాలా, నికోల్ కిడ్మాన్, కిమ్ కర్దాషియాన్, ఒలివియా వైల్డ్ లారెన్ శాంటో డొమింగో, ఎల్సా కాలిన్స్, జూలియా గార్నర్, లియోనార్డో డికాప్రియో, కింబాల్ మస్క్, క్రిస్టియానా మస్క్, డెరెక్ బ్లాస్బర్గ్ లాంటి వారున్నారు. 'కేరింగ్ ఫర్ ఉమెన్' విందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా లింగ-ఆధారిత హింసను ఎదుర్కోవడానికి ,మహిళలు ,పిల్లలపై హింకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో కలిసి పనిచేయడం చాలా గౌరవంగా ఉందని పేర్కొంది. View this post on Instagram A post shared by Lauren Sanchez (@laurenwsanchez) View this post on Instagram A post shared by Salma Hayek Pinault (@salmahayek) View this post on Instagram A post shared by Natasha Poonawalla (@natasha.poonawalla) -
మళ్లీ కోవిషీల్డ్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: తగిన డిమాండ్ లేకపోవడం, కోవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో గతంలో ఆగిన కోవిషీల్డ్ కోవిడ్ టీకా ఉత్పత్తిని తాజాగా పునఃప్రారంభించామని దాని తయారీసంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా బుధవారం ప్రకటించారు. కొత్తగా కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుండటంతో వ్యాక్సిన్ ఉత్పత్తి మొదలుపెట్టినట్లు ఆయన వెల్లడించారు. ‘ ఇప్పటికే 60 లక్షల కోవోవ్యాక్స్ బూస్టర్ డోసులు అందుబాటులో ఉన్నాయి. వయోజనులు కచ్చితంగా బూస్టర్ డోసులు తీసుకోవాలి. ముందస్తు జాగ్రత్తగా ప్రజలు తమ ఐచ్ఛికంగా కోవిషీల్డ్నూ తీసుకోవచ్చు. వచ్చే 90 రోజుల్లో 60–70 లక్షల డోసుల కోవిషీల్డ్ అందుబాటులో ఉండేలా చూస్తాం. డిమాండ్‌కు తగ్గట్లు స్టాక్‌ను పెంచేందుకు తొమ్మిది నెలల సమయం పట్టొచ్చు’ అని పూనావాలా చెప్పారు. చివరిసారిగా కోవిషీల్డ్ ఉత్పత్తిని సీరమ్ సంస్థ 2021 డిసెంబర్లో నిలిపేసింది. -
కోవిడ్ కేసుల పెరుగుదల ఆందోళనకరమే.. కానీ: అదర్ పూనావాలా
పొరుగు దేశం చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయమేన్నారు వ్యాక్సిన్ మేకర సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈఓ అదర్ పూనావాలా. అయితే, ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ విస్తృతంగా చేపట్టడం, కేసుల కట్టడి వంటి ట్రాక్ రికార్డు గొప్పగా ఉందని పేర్కొన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని ట్విట్టర్ వేదికగా ప్రజలను కోరారు. ‘కరోనా కేసులు పెరుగుతున్నట్లు చైనా నుంచి వస్తున్న వార్తలు ఆందోళనకరమే. ఇప్పటికే మనం విస్తృత స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ చేయడం, మెరుగైన పనితీరు కారణంగా భయపడాల్సిన అవసరం లేదు. కేంద్రం, ఆరోగ్య శాఖ మార్గదర్శకాలపై నమ్మకం ఉంచి తప్పకుండా పాటించాలి.’అని ట్విట్టర్లో పేర్కొన్నారు సీరమ్ సీఈఓ అదర్ పూనావాలా. The news of rising COVID cases coming out of China is concerning, we need not panic given our excellent vaccination coverage and track record. We must continue to trust and follow the guidelines set by the Government of India and @MoHFW_INDIA. — Adar Poonawalla (@adarpoonawalla) December 21, 2022 కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ‘కోవిషీల్డ్’ అనే వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసింది. దేశంలో ఎక్కువ శాతం ఈ కోవిషీల్డ్‌నే ప్రజలకు అందించింది కేంద్రం. ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేశారు. చైనాతో పాటు అమెరికా, బ్రెజిల్ కొరియా సహా పలు దేశాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపుతూ కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు సూచించింది. అలాగే.. రద్ది ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరింది. ఇదీ చదవండి: కోవిడ్ కథ ముగియలేదు.. అప్రమత్తంగా ఉందాం: కేంద్రం -
అదర్ పూనావాలా పేరిట రూ.కోటి టోపీ
ముంబై: వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు రూ.కోటికి పైగా కాజేశారు. మహారాష్ట్రలోని పోలీసులు శనివారం ఈ మేరకు వెల్లడించారు. వెంటనే డబ్బు బదిలీ చేయాలంటూ పూనావాలా పేరిట సీరం సంస్థ డైరెక్టర్ సతీశ్ దేశ్‌పాండేకు సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌లో మెసేజ్ పంపించారు. కొన్ని బ్యాంకు ఖాతాల వివరాలను వాట్సాప్ చేశారు. దాంతో కంపెనీ సిబ్బంది ఆ ఖాతాల్లోకి రూ.1,01,01,554 బదిలీ చేశారు. ఆ మెసేజ్ పూనావాలా పంపలేదని తర్వాత గుర్తించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పుణే పోలీసులు చీటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీరం కంపెనీ కరోనా టీకా కోవిషీల్డ్‌తో సహా ఇతర వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తోంది. పుణే సమీపంలో సీరం ప్లాంట్ ఉంది. -
Monkeypox: మంకీపాక్స్‌తో సీరియస్ అయితే ఆ టీకా వాడొచ్చు
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కలవరపరుస్తున్న మంకీపాక్స్ వైరస్ నియంత్రణకు టీకాను అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ) అదర్ పూనావాలా చెప్పారు. ఆయన బుధవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. మంకీపాక్స్ వైరస్ సోకడం వల్ల అత్యవసర పరిస్థితి ఏర్పడితే సిడుబు అనే రోగానికి వాడే టీకాను వాడవచ్చని సూచించారు. మంకీపాక్స్ నియంత్రణకు త్వరలోనే టీకాను కనిపెట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. టీకాను కనిపెట్టడానికి గాను తాము నోవావాక్స్ సంస్థతో చర్చలు జరిపామని వెల్లడించారు. మంకీపాక్స్ టీకా కోవిడ్–19 టీకా కంటే భిన్నంగా ఉంటుందని పూనావాలా వివరించారు. ఈ టీకా నిల్వ, నిర్వహణకు ప్రత్యేక కంటైన్మెంట్ సౌలభ్యాలు అవసరం అవుతాయన్నారు. ప్రస్తుతం మంకీపాక్స్ వ్యాక్సిన్‌ను భారత్‌లో తయారు చేయడానికి సదుపాయాలు లేవని, కానీ పరిస్థితి మారవచ్చని తెలిపారు. మూడు నెలల్లో భారత్‌కు టీకాలు డెన్మార్క్‌లోని బవేరియన్ నార్డిక్ సంస్థ నుంచి మంకీపాక్స్ టీకాలను దిగుమతి చేసుకొనేందుకు చర్చలు జరుపుతున్నామని అదర్ పూనావాలా వెల్లడించారు. రెండు నుంచి మూడు నెలల్లో టీకాలు భారత్‌కు అందవచ్చని తెలిపారు. భారత్‌లో ఇప్పటిదాకా మంకీపాక్స్ కేసులో స్వల్ప సంఖ్యలోనే నమోదయ్యాయని గుర్తుచేశారు. -
'హే ఎలన్ మస్క్'..సీరమ్ సీఈఓ అథర్ పూనావాలా ఆసక్తికర వ్యాఖ్యలు!
ఎలన్ మస్క్ ట్విటర్ కొనుగోలు, భారత్‌లో టెస్లా కార్ల తయారీపై సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈవో అథర్ పూనావాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎలన్ మస్క్‌ను ఉద్దేశిస్తూ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వ్యాపార వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. అదార్ పూనావాలా ట్విట్టర్లో ఎలన్ మస్క్‌ను ట్యాగ్ చేశారు. “హే ఎలన్ మస్క్ మీరు ట్విటర్‌ను కొనుగోలు చేయనట్లైతే..భారీ ఎత్తులో నాణ్యమైన టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం భారత్‌లో కొంత మొత్తాన్ని పెట్టుబడులు పెట్టండి. ఇది మీరు చేసే అత్యుత్తమ పెట్టుబడి అవుతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను.” అని పూనావాలా ట్వీట్ చేశారు. Hey @elonmusk just in case you don't end up buying @Twitter, do look at investing some of that capital in INDIA for high-quality large-scale manufacturing of @Tesla cars. I assure you this will be the best investment you'll ever make. — Adar Poonawalla (@adarpoonawalla) May 8, 2022 కాగా, ఎలన్ మస్క్ గతేడాది కర్ణాటకలో టెస్లా కార్లను తయారు చేసేలా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. అదే సమయంలో మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తమిళనాడు' రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టాలంటూ ఎలన్ మస్క్‌ను ఆహ్వానించాయి. అయితే గత నెలలో ఎలన్ మస్క్ పెట్టుబడులు పెట్టాలంటూ ఆయా రాష్ట్రప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయంటూ వచ్చిన నివేదికలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. "ఇది చాలా సులభమైన ప్రత్యామ్నాయం. మనదేశంలో టెస్లా తయారు చేసేందుకు ఎలన్ మస్క్ సిద్ధంగా ఉంటే ఎటువంటి సమస్యలేదు. ఇక్కడ అన్నీ సౌకర్యాలున్నాయి. కొనుగోలు దారులూ ఉన్నారు. కానీ, ఎలన్ మస్క్ చైనాలో ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసి..భారత్‌లో అమ్మాలని చూస్తున్నారు. అది మంచి ప్రతిపాదన కాదు. మా నిబంధనకు అంగీకరిస్తే మేం అన్నీ విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చదవండి👉నితిన్ గడ్కరీ..మాటంటే మాటే! ఎలన్‌మస్క్‌కు బంపరాఫర్! -
రూ. 225కే కోవిడ్ ప్రికాషన్ డోస్
న్యూఢిల్లీ: నేటి నుంచి దేశవ్యాప్తంగా మొదలయ్యే కరోనా టీకా ప్రికాషన్ డోస్‌ను రూ.225కే ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లకు సరఫరా చేయనున్నట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ), భారత్ బయోటెక్ సంస్థలు ప్రకటించాయి. ‘కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత కోవిషీల్డ్ టీకా ఒక్కో డోస్ ధరను రూ.600 నుంచి రూ.225కు తగ్గించాలని నిర్ణయించాం’అని ఎస్ఐఐ సీఈవో అథర్ పూనావాలా శనివారం ట్విట్టర్లో తెలిపారు. అదేవిధంగా, ‘మా సంస్థ తయారు చేసే కోవాగ్జిన్ టీకా ఒక్కో డోస్‌ను ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.1,200కు బదులుగా రూ.225కే అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపేందుకు సంతోషిస్తున్నాం’అని భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా వెల్లడించారు. 18 ఏళ్లు నిండి, రెండో డోస్ తీసుకుని 9 నెలలు పూర్తయిన వారంతా 10వ తేదీ నుంచి ప్రైవేట్ టీకా కేంద్రాల్లో కోవిడ్ ప్రికాషన్ డోస్‌కు అర్హులని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. -
ప్రపంచం చూపు మనవైపు: మోదీ
న్యూఢిల్లీ: మన దేశంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతమైన నేపథ్యంలో ప్రపంచమంతా మనవైపు చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ విజయగాథలో టీకా ఉత్పత్తిదారులు పెద్ద పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన శనివారం కోవిడ్–19 వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో సమావేశమయ్యారు. టీకాపై తదుపరి పరిశోధనలతోపాటు పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ), భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, జైడస్ క్యాడిలా, బయోలాజికల్ ఈ, జెనోవా బయోఫార్మా, పనాసియా బయోటెక్ సంస్థల ప్రతినిధులు ప్రధానితో జరిగి సమావేశానికి హాజరయ్యారు. దేశంలో కేవలం 9 నెలల్లో 100 కోట్ల కరోనా టీకా డోసులు ప్రజలకు పంపిణీ చేయడం గొప్ప ముందడుగు అని, మోదీ నాయకత్వ పటిమతోనే ఈ ఘనత సాధ్యమైందని వారు ప్రశంసించారు. ప్రధానితో భేటీ అనంతరం ఎస్ఐఐ చైర్మన్ అదార్ పూనావాలా మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి దార్శనికతతో తక్కువ సమయంలోనే 100 కోట్ల డోసులు ఇవ్వడం సాధ్యమయ్యిందని తెలిపారు. దేశంలో ఫార్మా రంగం అభివృద్ధి, భవిష్యత్తులో తలెత్తబోయే మహమ్మారులు, వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నద్ధతపై మోదీతో చర్చించినట్లు తెలిపారు. ప్రతికూలతను అవకాశంగా మార్చుకోవడం ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకత అని భారత్ బయోటెక్ సంస్థ అధినేత కృష్ణా ఎల్లా పేర్కొన్నారు. స్వల్ప వ్యవధిలో 100 కోట్ల టీకా డోసులు ఇవ్వడం అనేది సాధారణ విషయం కాదని, మోదీ పట్టుదల, అంకితభావంతో ఇది అచరణ సాధ్యమయ్యిందని చెప్పారు. ఒక నాయకుడు తన దేశానికి చేయగలిగిన గొప్ప పని ఇది అని కొనియాడారు. డీఎన్ఏ ఆధారిత కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి వెనుక మోదీ కృషి ఎంతగానో ఉందని జైడస్ క్యాడిలా సంస్థ ప్రతినిధి పంకజ్ పటేల్ చెప్పారు. -
ఆ విద్యార్థులకు సీరం సీఈవో ఊరట
న్యూఢిల్లీ: విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థులకు రూ.10 కోట్ల ఆర్థికసాయం చేయనున్నట్లు వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో, సంస్థ అధిపతి అదార్ పూనావాలా గురువారం ప్రకటించారు. ఇక్కడి నుంచి వెళ్లే భారతీయ విద్యార్థులు కొన్ని దేశాల్లో అక్కడికెళ్లాక క్వారంటైన్లో ఉండాల్సిన పరిస్థితులున్నాయి. క్వారంటైన్లో భాగంగా వసతి, భోజనం తదితర ఖర్చులు విద్యార్థులే భరించాలి. వీరికి ఆర్థికసాయం చేసే నిమిత్తం రూ.10 కోట్లు కేటాయించినట్లు పూనావాలా చెప్పారు. ఆర్థికసాయం కోరే విద్యార్థులు ఈ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పూనావాలా గురువారం తన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. భారత్‌లో కోవిషీల్డ్ కోవిడ్ టీకా తీసుకున్న విద్యార్థులు తమ దేశంలో క్వారంటైన్లో ఉండాల్సిన పనిలేదని 16 యూరోపియన్ దేశాలు జూలైలో ప్రకటించాయి. కానీ, ఇంకొన్ని దేశాలు క్వారంటైన్ కాలం పూర్తయ్యాకే దేశ భూభాగంలోకి అనుమతిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్థికసాయానికి పూనావాలా ముందుకొచ్చారు. -
కొవిషీల్డ్ వ్యాక్సిన్ విషయంలో కొత్త ట్విస్ట్
న్యూఢిల్లీ: గ్రీన్ పాసుల జారీ విషయంలో ఈయూకు భారత్‌కు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈయూ అప్రూవల్‌కి కొంత టైం పట్టొచ్చని సీరమ్ సీఈవో అదర్ పూనావాలా ప్రకటించడం, కొవిషీల్డ్‌కు ఈయూలోని కొన్ని దేశాలు పరిమితులతో అనుమతించడంతో ఈ విషయం చల్లబడింది. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. కొవిషీల్డ్ ఆథరైజేషన్ కోసం సీరమ్ ఇండియా అసలు ఈయూ మెడికల్ బాడీకి రిక్వెస్ట్ అప్లికేషన్ పంపలేదని తేలింది!. ఈ మేరకు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. కొవిడ్ వ్యాక్సిన్ల తయారీదారులు ఫార్మాలిటీకి ఒక మార్కెటింగ్ ఆథరైజేషన్ అప్లికేషన్ పంపాల్సి ఉంటుందని, కానీ, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్‌కు సంబంధించి ఇంతవరకు ఎలాంటి అప్లికేషన్ మాకు అందలేద’ని స్పష్టం చేసింది. అలాగే ఈయూ దేశాల వ్యాక్సిన్లు, మెడిసిన్స్కు సంబంధించి మాత్రమే అంతిమ నిర్ణయాలు తమ చేతుల్లో ఉంటాయని ఈఎంఏ స్పష్టం చేసింది. For the #COVID19vaccine Covishield to be evaluated for use in the EU, the developer needs to submit a formal marketing authorisation application to EMA, which to date has not been received. #EMAPresser — EU Medicines Agency (@EMA_News) July 15, 2021 ఇదిలా ఉంటే ఇండియన్ వెర్షన్ ఆస్ట్రాజెనెకా ‘కొవిషీల్డ్’కు ఈయూ మెడిసిన్స్ ఏజెన్సీ మొదటి నుంచి డిజిటల్కొవిడ్ సర్టిఫికెట్(గ్రీన్ పాస్) ఇవ్వడంలేదు. తయారీలో స్వల్ఫ తేడాల వల్ల వ్యాక్సిన్ తుది ఫలితం వేరుగా ఉంటుందని, కాబట్టి, తమ అనుమతులు తప్పనిసరని ఈయూ ఇదివరకే స్పష్టం చేసింది. ఆ అనుమతుల కోసమే సీరం ఇండియా ఒక అప్లికేషన్ పంపాల్సి ఉండగా.. ఇంతవరకు పంపలేదని ఇప్పుడు తెలిసింది. దీంతో ఆయా దేశాలకు వెళ్లే భారత ప్రయాణికులు(కొవిషీల్డ్ తీసుకున్నవాళ్లు) కఠిన క్వారంటైన్ ప్రొటోకాల్స్‌ను పాటించాల్సి ఉంటుంది. అంతేకాదు ఈయూలోని కొన్ని దేశాలు అనుమతించకపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఆల్రెడీ అప్లికేషన్ పంపామని ప్రకటించిన సీరమ్ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో చూడాలి. -
దిగొచ్చిన ఈయూ.. కొవిషీల్డ్‌కు ఆ దేశాల అనుమతి!
న్యూఢిల్లీ: యూరప్ దేశాలకు వెళ్లే భారత ప్రయాణికులకు గుడ్ న్యూస్. గ్రీన్ పాసుల జారీ విషయంలో ఈయూకు భారత్‌కు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ పైచేయి సాధించింది. ఈయూలో సభ్యత్వం ఉన్న ఏడు దేశాలు భారతీయ ప్రయాణికులకు ఊరట ఇచ్చాయి. కొవిషీల్డ్ పేరును అప్రూవ్డ్ వ్యాక్సిన్ల లిస్ట్‌లో చేర్చినట్లు హడావిడిగా ప్రకటించాయి. స్విట్జర్లాండ్‌తో పాటు జర్మనీ, స్లోవేనియా, ఆస్ట్రియా, గ్రీస్, ఐల్యాండ్,, ఐర్లాండ్, స్పెయిన్, దేశాలు కొవిషీల్డ్‌ను అంగీకరించాయి. దీంతో ఆయా దేశాలకు వెళ్లే కొవిషీల్డ్ తీసుకున్న భారత ప్రయాణికులకు మార్గం సుగమం కానుంది. కాగా, తమ వ్యాక్సిన్ల(కొవాగ్జిన్, కొవిషీల్డ్) డిజిటల్ సర్టిఫికేట్ అనుమతించకపోతే.. ఈయూ దేశాల ప్రయాణికుల సర్టిఫికేట్లను ఒప్పుకోమని, పైగా కఠిన క్వారంటైన్ నిబంధనలను అమలు చేస్తామని భారత్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఈయూ ఎనిమిది దేశాలు కొవిషీల్డ్‌కు అనుమతి ఇవ్వడం విశేషం. తాజా పరిణామాలతో ఈయూ ఏజెన్సీ(27 దేశాల సమాఖ్య)లోని మిగతా దేశాలు కూడా త్వరగతిన స్పందించే అవకాశం ఉంది. ఏమిటి గ్రీన్‌పాస్ ఈయూ దేశాలకు వెళ్లే ప్రయాణికులకు జులై ఒకటి నుంచి గ్రీన్ పాస్ తప్పనిసరి చేశారు. దీనిని ఈయూ డిజిటల్ కొవిడ్ సర్టిఫికేట్ అని కూడా పిలుస్తారు. ఇది ఇమ్యూనిటీ డాక్యుమెంట్‌గా భావిస్తారు. ఇది ఉన్నవాళ్లకు(రెండు డోసులు తీసుకున్నవాళ్లు) తప్పనిసరి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తారు. చదవండి: గ్రీన్ పాస్‌పై ఈయూ వివరణ.. భారత్ ఫైర్ -
కోవీషీల్డ్‌కు గ్రీన్ పాస్ షాక్! సీరం సీఈవో స్పందన
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్న ధృవీకరణ పత్రాలను చాలా దేశాలు తప్పనిసరి చేసాయి. అయితే మన దేశంలో తయారైన కోవీషీల్డ్ టీకా తీసుకుని విదేశాలకు పయనం కాబోతున్నవారికి ఎదురవుతున్న గ్రీన్ పాస్ ఇబ్బందులపై శుభవార్త. కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుని ఈయూ దేశాలకు వెళుతున్న విమాన ప్రయాణీకులకు ఇబ్బందులపై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈవో అదార్ పూనావాలా స్పందించారు. కోవీషీల్డ్ కారణంగా ప్రయాణ సమస్యలను ఎదుర్కొంటున్న భారతీయుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని పూనావాలా ట్వీట్ చేశారు. ఈ త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆందోళన అవసరం లేదని హామీ ఇచ్చారు. (DRDO: 2-డీజీ డ్రగ్, కమర్షియల్ లాంచ్ ) కోవీషీల్డ్ టీకా తీసుకున్న చాలామంది భారతీయులు ఎదుర్కొంటున్న విదేశీ ప్రయాణ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నానంటూ భరోసా ఇచ్చారు. దీనిని ఆయా దేశాల అత్యున్నత అధికారులు, రెగ్యులేటర్లు, దౌత్య అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు. దీనికి త్వరలోనే పరిష్కారం లభించనుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. గ్రీన్ పాస్ నుంచి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను యూరోపియన్ యూనియన్ మినహాయించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. పూణేకు చెందిన సీరం దేశీయంగా తయారు చేస్తున్న కోవిషీల్డ్ టీకా తీసుకున్న ప్రయాణికులు యూరోపియన్ యూనియన్ (ఈయు) ‘గ్రీన్ పాస్’కు కోవిడ్-19 వ్యాక్సిన్ల జాబితా నుంచి తొలగించింది. ప్రస్తుతం, ఫైజర్, మెడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ , వాక్స్ జెర్విరా ఈ నాలుగు టీకాలను యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఆమోదించింది. I realise that a lot of Indians who have taken COVISHIELD are facing issues with travel to the E.U., I assure everyone, I have taken this up at the highest levels and hope to resolve this matter soon, both with regulators and at a diplomatic level with countries. — Adar Poonawalla (@adarpoonawalla) June 28, 2021 -
Novavax సెప్టెంబరుకే, పిల్లలపై ట్రయల్స్: సీరం కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అతి త్వరలోనే మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చే విషయంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ 'నోవావాక్స్' క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యే దశలో ఉన్నాయని, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సీరం సీఈవో అదార్ పూనావల్లా తెలిపారు. అంతేకాదు పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభించాలని యోచిస్తున్నట్టు కూడా వెల్లడించారు. నోవావాక్స్ టీకా ఒక మాదిరి నుంచి తత్రీవమైన వైరస్ బాధితుల్లో 100 శాతం రక్షణనిస్తోందని, సగటున నోవావాక్స్ వ్యాక్సిన్ 90 శాతం సమర్ధవంతమైందని పూనావల్లా వెల్లడించారు. అయితే ,గ్లోబల్ ట్రయల్స్ డేటా ఆధారంగా తాము లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు.నవంబర్ నాటికి ఇది అందుబాటులోకి రానుందని భావిస్తున్నామన్నారు. రెగ్యులేటరీ ఆమోదం పొందితే కంపెనీ సెప్టెంబరు నాటికి నోవావాక్స్ ఉత్పత్తిని ప్రారంభిస్తుందని చెప్పారు. అలాగే పిల్లలకు టీకా అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో నోవావాక్స్ క్లినికల్ ట్రయల్స్ ను జూలైలో ప్రారంభించాలని యోచిస్తున్నామనీ దీనిపై త్వరలోనే డ్రగ్ రెగ్యులేటరీ అనుమతినికోరనున్నామని పూనవల్లా తెలిపారు. కాగా నోవావాక్స్ అన్ని రకాల వేరియంట్లపై సమర్ధవంతంగా పనిచేస్తుందని కలుసుకుంది, నోవావాక్స్ ఇటీవల (జూన్ 14న) ప్రకటనలో తెలిపింది. అమెరికా, మెక్సికోలోని 119 సైట్లలో 29,960 మందిపై ట్రయల్స్ చేసినట్టు పేర్కొంది. నోవావాక్స్ టీకాలను సులువుగా నిల్వ చేయవచ్చు. రవాణా కూడా ఈజీగా ఉంటుందని నోవావాక్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టాన్లీ సీ ఎర్క్ వెల్లడించిన సంగతి తెలిసిందే. చదవండి: ట్విటర్‌కు మరోషాక్, కేసు నమోదు -
స్పుత్నిక్ వీ: సీరంకు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌వేవ్‌తో అల్లాడిపోతున్న ప్రజలకు కేంద్రం మరో ఊరటనిచ్చింది. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తయారీకి అతిపెద్ద టీకా తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)కు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతినిచ్చింది. మహారాష్ట్ర పుణేలోని హడాస్పార్ తయారీ కేంద్రంలో ఈ టీకాను పరీక్షించి, విశ్లేషించి, తయారు చేస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇందుకు సీరంకు ప్రాథమిక అనుమతినిచ్చామనీ, తయారీకి కొన్ని నెలలు పడుతుందని వెల్లడించింది. అయితే ఈ టీకాలను విక్రయించుకునేందుకు సీరం అనుమతి లేదని వెల్లడించాయి. దేశీయంగా అదర్ పూనావాలా నేతృత్వంలోని సీరం ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా టీకా కోవీషీల్డ్‌ను తయారు చేస్తోంది. వ్యాక్సిన్ తయారీకి రష్యాలోని మాస్కోలో ఉన్న గమాలియా పరిశోధనా సంస్థ, సీరంతో జత కట్టింది. దీనికి సంబంధించిన పత్రాలను ఆ కంపెనీ ఇటీవల డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. వ్యాక్సిన్ తయారీకి డీసీజీఐ అనుమతి ఇవ్వడంతో జెనెటిక్ మానిపులేషన్ రివ్యూ కమిటీ (ఆర్సీజీఎం) సీరమ్‌కు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. సెల్ బ్యాంక్‌ను దిగుమతి చేసుకోవడం, వైరస్ స్టాక్ వివరాలను ఎలా సేకరించి భద్రపరుస్తారన్న విషయం ఆర్సీజీఎంకు తెలపాలి. అయితే ఈ అనుమతుల కోసం సీరమ్ గత నెల 18నే ఆర్సీజీఎమ్కు దరఖాస్తు పెట్టుకుంది. కాగా భారతదేశంలో అందుబాటులో ఉన్న కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లతో పోలిస్తే స్పుత్నిక్ వీ టీకా 91.6 శాతం సామర్థ్యం ఉందని గమాలియా ఇదివరకే ప్రకటించింది. చదవండి: vaccine: మినహాయింపులపై సీరం కీలక వ్యాఖ్యలు -
vaccine: మినహాయింపులపై సీరం కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: డిసెంబర్ చివరి నాటికి అందరికీ కరోనా వ్యాక్సిన్లు వేయాలన్న లక్ష్యంలో భాగంగా విదేశీ వ్యాక్సిన్లపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కోవిషీల్డ్ టీకా తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)స్పందించింది. వ్యాక్సిన్ తయారీదారులందరికీ ఒకే సూత్రాలు వర్తింప చేయాలని అదర్ పూనావాలా కేంద్రాన్ని కోరారు. నష్టపరిహారం విషయంలో విదేశీ సంస్థలు రక్షణ పొందితే సీరం మాత్రమే కాదు, అన్ని దేశీయ టీకా కంపెనీలకు దీనిని వర్తింపజేయాలఅని సీరం వర్గాలు పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇండెమ్నిటీ బాండ్ ఇండెమ్నిటీ బాండ్ అనేది సెక్యూరిటీ బాండ్ లాంటిదే. వ్యాక్సిన్ ట్రయల్స్ సందర్భంగా ఏదైనా జరిగితే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని, న్యాయపరమైన సమస్యలు రాకుండా చూసుకోవాలని తేల్చి చెప్పింది. ఈ హామీతో ఇండెమ్నిటీ బాండ్ ఇవ్వాలని మోడెర్నా, ఫైజర్ వంటి విదేశీ టీకా సంస్థలు కోరుతున్నాయి. కాగా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే విదేశాల్లో ఇప్పటికే అనుమతి పొందిన వ్యాక్సిన్లను మన దేశంలో వాడేందుకు బ్రిడ్జి ట్రయల్స్ అక్కర లేదంటూ విదేశీ టీకాలకు లైన్ క్లియర్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇండెమ్నిటీ బాండ్, పరిహారాన్ని కూడా తామే చెల్లించే అవకాశాలను కూడా ప్రకటించింది. చదవండి: Vaccination: ఊరట, త్వరలో మరో స్వదేశీ వ్యాక్సిన్ Vaccination : గుడ్‌న్యూస్ చెప్పిన డీసీజీఐ -
దేశ ప్రజలే మాకు ముఖ్యం: సీరం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి విదేశాలకు టీకాలు ఎగుమతి చేయలేదని కోవిషీల్డ్ తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదర్ పూనావాలా తెలిపారు. కరోనా కట్టడి కోసం దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించినప్పటికి టీకాల కొరత వల్ల అది అనుకున్న మేర ముందుకు సాగడం లేదు. 45 ఏళ్ల పైబడిన వారికి రెండో డోస్ టీకా ఇవ్వడం పూర్తవ్వలేదు. ఇక పలు రాష్ట్రాల్లో మూడో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న కంపెనీలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో వ్యాక్సినేషన్‌పై సీరం సంస్థ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. దేశ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి తాము విదేశాలకు టీకాలు ఎగుమతి చేయలేదని తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్‌కు సహకరించేందుకు కట్టుబడి ఉన్నట్లు లేఖలో తెలిపింది. ఇప్పటివరకు 20 కోట్ల టీకా డోసులు సరఫరా చేసినట్లు వెల్లడించింది. భారత్ వంటి దేశంలో 2,3 నెలల్లో వ్యాక్సినేషన్ చేయలేమన్నది. భారత్‌లో వ్యాక్సినేషన్లో అనేక సవాళ్లు ఉన్నట్లు తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశాల్లో భారత్ ఒకటి అని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌కు 2 నుంచి 3 ఏళ్లు పడుతుందని సీఎం తెలిపింది. అమెరికా కంపెనీల కంటే తమకు 2 నెలలు ఆలస్యంగా అనుమతులు వచ్చాయన్నది. ఉత్పత్తిపరంగా ప్రపంచంలోనే తమది మూడో స్థానమని.. ఈ ఏడాది చివరకు మాత్రమే విదేశాలకు టీకాలు సరఫరా చేస్తామని సీరం తెలిపింది. కరోనాపై యుద్ధానికి అంతా కలిసికట్టుగా పోరాడాలని సీరం పిలుపునిచ్చింది. చదవండి: యూకేకు 50 లక్షల డోసుల ఎగుమతికి ‘నో’ -
కోవీషీల్డ్ డోసుల గ్యాప్: పూనావాలా స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: కోవీషీల్డ్ వ్యాక్సిన్ మోతాదుల మధ్య అంతరాన్ని పెంచడంపై సీరం సీఈఓ అదార్ పూనావాలా సానుకూలంగా స్పందించారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్లను పుణేకు చెందిన అతిపెద్ద వ్యాక్సిన్ సంస్థ సీరం ఉత్పత్తి చేస్తోంది. తాజాగా వ్యాక్సిన్ డోసుల మధ్య విరామ కాలాన్ని ప్రస్తుతమున్న ఆరు నుంచి 8 వారాల నుంచి 12-16 వారాలకు పెంచడం మంచి నిర్ణయమని ఆదార్ పూనావాలా అన్నారు. టీకా సమర్థత, ఇమ్యునోజెనిసిటీ దృక్కోణంలో చూస్తే ప్రయోజనకరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.(మొదటి డోస్ తర్వాత కరోనా వస్తే.. వ్యాక్సిన్ ఎపుడు తీసుకోవాలి!) టీకా సామర్థ్యాన్ని, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందని, ఈ నిర్ణయం శాస్త్రీయంగా సరైందని పూనావల్లా చెప్పారు. పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ నిర్ణయం కోవిషీల్డ్ ఉత్పత్తిపై పడే ఒత్తిడిని తగ్గిస్తుందని అన్నారు. మరింత ఎక్కువమంది ప్రజలు మొదటి డోసును తీసుకోవడానికి కూడా ఇది ఉపకరిస్తుందని అంచనా. మొదట్లో రెండు డోసుల మధ్య విరామం నాలుగు నుంచి ఆరు వారాలు ఉండాలని నిర్దేశించారు. ఆ తరువాత అది 6 నుంచి 8 వారాలకు పెరిగింది. అయితే ఇటీవలి అధ్యయనం ప్రకారం రెండు డోసుల మధ్య అంతరం 12 నుంచి అంతకంటే ఎక్కువ విరామంలో ఇచ్చిన రెండు ప్రామాణిక మోతాదుల తరువాత టీకా సామర్థ్యం 81.3 శాతంగా ఉంది. 6 వారాల కన్నా తక్కువ ఉంటే ఇది 55.1 శాతం ఉంటుందని వెల్లడైంది. అదే బ్రిటన్ నుంచి అందిన ఆధారాల ప్రకారం ఈ విరామ కాలాన్ని పెంచేందుకు కోవిడ్ వర్కింగ్ గ్రూప్ అంగీకరించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇండియాలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మధ్య గ్యాప్ పెంచడం ద్వారా టీకా సామర్థ్యం పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ సౌమ్య స్వామినాథన్ గత ఫిబ్రవరిలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. చదవండి : గుడ్ న్యూస్: స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ త్వరలోనే మార్కెట్లోకి కరోనా: సీనియర్ వైద్యుల మూకుమ్మడి రాజీనామా -
యూకేలో 2200 కోట్ల పెట్టుబడి: సీరం అధినేత నిర్ణయం
లండన్: ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్ట్సిట్యూట్ ఆఫ్ ఇండియా అధిపతి అదార్ పూనావాలా భారత్‌లో తనను బెదిరిస్తున్నారని చెప్పి తన ఫ్యామిలీతో కలిసి యూకే వెళ్లిన విషయం తెలిసిందే. యూకేలో కొత్త వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అదార్ పూనావాలా సన్నాహాలను మొదలు పెట్టారు. దానిలో భాగంగా సుమారు 300 మిలియన్ డాలర్లును బ్రిటన్‌లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యాడు. భవిషత్తులో టీకా ఉత్పతి కేంద్రాలకు అవసరమైన సౌలభ్యాలను నిర్మించనున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సోమవారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు. కాగా 334 మిలియన్ డాలర్ల ప్రాజెక్టుతో బ్రిటన్‌లో క్లినికల్ ట్రయల్స్, పరిశోధనలు, వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జాన్సన్ అధికార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సీరం తక్కువ ఖర్చుతో కూడిన ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ షాట్‌ను ఉత్పత్తి చేయడంలో ముందంజలో ఉంది. కరోనాను కట్టడి చేయడానికి నాజిల్ వ్యాక్సిన్‌ను తయారు చేయడంలో సీరం కీలకపాత్ర పోషిస్తోంది. ఈ వ్యాక్సిన్ నేరుగా ముక్కులో ఒక డోసు స్ప్రే చేస్తారు. ప్రస్తుతం సీరం యూకేలో మొదటి ఫేజ్ క్లినికల్ ట్రయల్స్‌ను మొదలుపెట్టింది. సీరం పెట్టుబడి భారత్, యూకే వాణిజ్య, పెట్టుబడి ఒప్పందాల విస్తృత ప్యాకేజీలో భాగమని డౌనింగ్ స్ట్రీట్ తెలిపింది. దీంతో సుమారు 6500 మందికి ఉద్యోగకల్పన జరుగుతుందని తెలిపారు. ఈ ఒప్పందం యూకే ప్రధాని బోరిస్, భారత ప్రధాని నరేంద్రమోదీకి మంగళవారం జరిగిన వర్చువల్ మీటింగ్ కంటే ముందుగానే జరగడం విశేషం. చదవండి: కరోనా వ్యాక్సిన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన సీరం -
వ్యాక్సిన్ కోసం నాపై తీవ్ర ఒత్తిళ్లు ఉన్నాయి: పూనావాలా
లండన్: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విశ్వరూపం చూపుతున్న సమయంలో వ్యాక్సిన్ కోసం నెలకొన్న విపరీతమైన డిమాండ్‌పై కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) సీఈవో అదర్ పూనావాలా స్పందించారు. తీవ్రంగా ఒత్తిళ్లు వస్తున్నాయని, దేశంలోని కొందరు అత్యంత బలవంతులైన ప్రముఖులు కోవిషీల్డ్ సరఫరా కోసం డిమాండ్ చేస్తూ దురుసుగా మాట్లాడుతున్నారని పూనావాలా ‘ది టైమ్స్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో వెల్లడించారు. అందుకే భార్యా పిల్లలతో కలిసి ఉండటానికి లండన్‌కు వచ్చేశానని, దీనికి ఒత్తిళ్లే ముఖ్యకారణమని ఆయన చెప్పారు. ‘అనుకున్న దానికంటే ఎక్కువ సమయం లండన్‌లో ఉండటానికి కారణం అదే. మళ్లీ అటువంటి పరిస్థితుల్లోకి వెళ్లాలని అనుకోవడం లేదు. భారమంతా నా ఒక్కడి భుజస్కందాలపైనే పడుతోంది. కానీ నేనొక్కడినే చేయలేను. మీ బాధ్యత మీరు నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నపుడు కూడా... ఎవరో ఎక్స్, వై, జడ్ అడిగినంత సరఫరా చేయలేకపోయినందుకు వారేం చేస్తారోననే ఆలోచనలతో గడపలేం కదా. అలాంటి పరిస్థితులను ఎదుర్కొవడానికి నేను సిద్ధంగా లేను. ఇంతటి దూకుడు వ్యవహారశైలి (దురుసుతనం)ని, మానుంచి ఇంతగా ఆశించడాన్ని నేనెప్పుడూ చూడలేదు. మాకు వ్యాక్సిన్ అందాల్సిందేనని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. తమకంటే ముందు ఇతరులకు వ్యాక్సిన్లు అందడాన్ని వారు అర్థం చేసుకోలేరు’ అని పూనావాలా అన్నారు. సీరమ్ సంస్థ విజ్ఞప్తి మేరకు కేంద్ర హోంశాఖ ఇటీవలే పూనావాలాకు ‘వై’ కేటగిరీ భద్రతను కల్పించిన విషయం తెలిసిందే. చదవండి: (భారత్‌లో కరోనా పరిస్థితి విషాదకరం) భారత్‌కు బయట కూడా కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేసే ప్రణాళికలు ఉన్నాయని, లండన్‌లో మకాం పెట్టడానికి ఇది కూడా ఒక కారణమని పూనావాలా సంకేతాలిచ్చారు. బ్రిటన్‌తో సహా ఇతరదేశాల్లో కోవిషీల్డ్ ఉత్పత్తికి సంబంధించిన రాబోయే కొద్దిరోజుల్లో ఒక ప్రకటన వెలువడుతుందని చెప్పారు. భారత్‌లో పరిస్థితి ఇంతగా విషమిస్తుందని ఎవరూ ఊహించలేకపోయారన్నారు. కోవిషీల్డ్ డోసు ధరను రాష్ట్రాలకు రూ.300, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600లుగా నిర్ణయించడం ద్వారా విపత్కర పరిస్థితుల్లోనూ లాభాలు మూటగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని వచ్చిన విమర్శలపై పూనావాలా స్పందిస్తూ... ప్రపంచంలోనే అత్యంత సరసమైన ధరకు లభిస్తున్న వ్యాక్సిన్ తమదేనని అన్నారు. తామేమీ తప్పు చేయడం లేదని, దీనిపై కాలం చెప్పే తీర్పు కోసం వేచిచూస్తానని అన్నారు. -
కోవిషీల్డ్ టీకా: సీరమ్‌కు లీగల్ నోటీస్
సాక్షి,న్యూఢిల్లీ: ఆస్ట్రాజెనెకా సంస్థ తమకు లీగల్ నోటీసు జారీ చేసిందని కరోనా వైరస్ టీకా ‘కోవిషీల్డ్’ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) వెల్లడించింది. ఒప్పందం మేరకు కోవిషీల్డ్‌ను సరఫరా చేయడంలో జరుగుతున్న జాప్యంపై నోటీసులో ప్రశ్నించిందని ఎస్ఐఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదర్ పూనావాలా బుధవారం తెలిపారు. ఈ విషయం కేంద్రానికి కూడా తెలుసన్నారు. దీనిపై ఇప్పుడే వ్యాఖ్యానించలేనని, వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. (కరోనా ప్రమాద ఘంటికలు: సోనూసూద్ స్పెషల్ డ్రైవ్) భారత్‌లో సరఫరా చేయాల్సిన డోసులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆస్ట్రాజెనెకాకు సరఫరా చేయాల్సిన టీకా డోసుల్లో జాప్యం నెలకొన్నదని ‘బిజినెస్ స్టాండర్డ్’ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పూనావాలా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తమ టీకాకు డిమాండ్ ఉందని, భారత దేశ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ.. టీకా అవసరమైన భారతీయులందరికీ దీన్ని అందజేయలేమని ఆయన స్పష్టం చేశారు. విదేశాల్లో టీకా డోసు ధర కూడా ఎక్కువగా ఉందన్నారు. ఎస్ఐఐ నెలకు ఆరు కోట్ల నుంచి ఆరున్నర కోట్ల టీకాలను ఉత్పత్తి చేస్తోందని తెలిపారు. ఇప్పటివరకు 10 కోట్ల డోసులను కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేశామని, మరో 6 కోట్ల డోసులను విదేశాలకు ఎగుమతి చేశామని వివరించారు. ‘భారత ప్రభుత్వ అభ్యర్థనపై భారత్‌కు సబ్సీడీ ధరకు సుమారు రూ. 150 రూ. 160 కే టీకా డోసు అందిస్తున్నాం. లాభాలు రావడం లేదని చెప్పలేం. కానీ గొప్పగా లాభాలేమీ రావడం లేదు’ అని వ్యాఖ్యానించారు. -
భారత్‌లో కొవొవాక్స్ ప్రయోగాలు షురూ
న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్ వ్యాక్సిన్ కొవొవాక్స్ ప్రయోగాలు ప్రారంభమైనట్టుగా సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా వెల్లడించారు. అమెరికా వ్యాక్సిన్ కంపెనీ నొవవాక్స్ భాగస్వామ్యంతో కొత్త వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. సెప్టెంబర్ నాటికి ఈ వ్యాక్సిన్ ప్రజంలందరికీ అందుబాటులోకి వస్తుందని ట్వీట్ చేశారు. ఈ వ్యాక్సిన్‌ను యూకేలో పరీక్షించగా 89.3శాతం సామర్థ్యంతో పని చేస్తున్నట్టుగా వెల్లడైంది. దక్షిణాఫ్రికా, యూకే వేరియెంట్లను టీకా సమర్థంగా ఎదుర్కోగలదు. గత ఏడాది ఆగస్టులోనే నొవావాక్స్, ఎస్ఐఐ వ్యాక్సిన్ తయారీ, అమ్మకాలకు సంబంధించి ఒక అంగీకారానికి వచ్చాయి. ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఇప్పటికే తయారు చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇప్పుడు కొవొవాక్స్ ఉత్పత్తిని కూడా చేపట్టనుంది. కరోనాపై పోరాటంలో భారత్ ఇతర దేశాలకు కూడా అండగా ఉంటూ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ప్రపంచ దేశాలకు పంపిణీ చేస్తోంది. విదేశాలకే ఎక్కువ వ్యాక్సిన్లు భారత్‌లో ప్రజలకి వేసిన కరోనా వ్యాక్సిన్ల కంటే ఎక్కువ మొత్తంలో టీకా డోసులు విదేశాలకు పంపిణీ చేసినట్టుగా ఐక్యరాజ్యసమితిలో డిప్యూటీ శాశ్వత ప్రతినిధి నాగరాజ్ చెప్పారు. ప్రపంచ దేశాల్లో వ్యాక్సిన్ అసమానతలు యూఎన్ స్ఫూర్తిని దెబ్బతీస్తాయని ఐరాససర్వ ప్రతినిధి సభలో ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ నిరుపేద దేశా>లకు కూడా అందాలన్న యూఎన్ రాజకీయ డిక్లరేషన్‌కు భారత్ కూడా మద్దతు పలికింది. ఎక్కువ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్న కొద్దీ సవాళ్లను అధిగమించగలమని వ్యాక్సిన్ లభ్యత, అందుబాటులో ధర, పంపిణీ, నిరుపేద దేశాలకు కూడా పంపేలా సహకారం భారత్ బాగా ఇస్తోందని వివరించారు. భారత్ 70కిపైగా దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్లను పంపిణీ చేస్తోంది. -
సీరం ఘటన: ప్రమాదమా.. విధ్వంసమా..?
ముంబై: ‘సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)లో అగ్నిప్రమాదానికి గల కారణాన్ని నిర్ధారించేందుకు దర్యాప్తు ప్రారంభించాం. అది పూర్తయిన తర్వాత, ఇది ప్రమాదమా? లేదా విధ్వంసమా? అ ని మాకు తెలుస్తుంది. దర్యాప్తు పూర్తి చేయని వ్వండి. ఈ ఘటనపై ఇప్పుడు ఏమీ చెప్పలేం’ అని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. గురువారం ఎస్ఐఐలో జరిగిన ప్రమాద ఘటనను తెలుసుకునేందుకు సీఎం ఉద్ధవ్ శుక్రవారం ఎస్ఐఐని సందర్శించారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం ఉద్ధవ్ ఠాక్రే సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలాతో కలసి విలేకరులతో మాట్లాడారు. ‘గత వారం టీకా డ్రైవ్ ప్రారంభమైనప్పుడు కరోనాపై విజయం సాధించగలమనే ఆశలు రేకెత్తాయి. అయితే టీకా తయారు చేస్తున్న కేంద్రంలో అగ్ని ప్రమాదం గురించి వార్తలు ఆందోళనకు గురిచేశాయి. దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. వీరి కుటుం బ సభ్యుల బాధ్యత సీరం ఇన్స్టిట్యూటే తీసుకుం టుంది. ప్రభుత్వం తరఫున కూడా వీరికి సాయం అందజేస్తాం’ అని సీఎం పేర్కొన్నారు. ‘కోవిడ్–19 వ్యాక్సిన్ తయారు చేస్తున్న కేంద్రానికి ఎలాంటి హానీ జరగలేదు. ప్రమాదం జరిగిన రెండు అంతస్తుల్లో కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ రెండు అంతస్తుల్లో వేరే టీకాలు తయా రు చేస్తున్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ యూనిట్.. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి కిలోమీటర్ దూరంలో ఉంది. దీంతో వ్యాక్సిన్ల ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం కలగదు’ అని ఉద్ధవ్ వెల్లడించారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే తాను పోస్ట్ చేసిన ట్వీట్ గురించి పూనావాలాను అడిగినప్పడు.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని తెలిసింది. దీంతో ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేనందుకు సంతోషంగా ఉంది అని ట్వీట్ చేశాను. కొంత సమయం తర్వాత ఐదు మృతదేహాలను కనుగొన్నారు. మరణించిన కార్మికులందరూ కాంట్రాక్టర్ ఉద్యోగులని, దీంతో వారి వివరాలు ఎస్ఐఐ వద్ద లేకపోవడంతో తప్పిందం జరిగింది’ అని పేర్కొన్నారు. (చదవండి: టీకాపై అపోహలు తొలగిద్దాం) రూ.1,000 కోట్ల నష్టం జరిగింది... సీరం ఇన్స్టిట్యూట్ గురువారం జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో దాదాపు రూ.1,000 కోట్ల నష్టం జరిగిందని ఆ కంపెనీ సీఈవో అదార్ పూనావాలా తెలిపారు. ప్రమాదం జరిగిన అంతస్తుల్లో భవిష్యత్తు అవసరాల కోసం ఫిల్లింగ్ లైన్, బల్క్ ప్రొడక్షన్ లైన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉందని, ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో నష్టం భారీగానే జరిగిందని పేర్కొన్నారు. కోవిడ్–19 వ్యాక్సిన్ నిల్వ చేయని భవనంలో ఈ సంఘటన జరిగింనందున తాము చాలా అదృష్టవంతులమన్నారు. రోటా వైరస్, బీసీజీ వ్యాక్సిన్ల తయారీ కోసం ఉద్దేశించిన భవనంలో ఈ ప్రమాదం జరిగిందని, దీంతో భవిష్యత్తులో ఈ వ్యాక్సిన్ల ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంతో ఆర్థికంగా నష్టపోయాం కానీ వ్యాక్సిన్ సరఫరా విషయంలో ఆటంకం కలగదని పూనావాలా స్పష్టం చేశారు. మూడు ఏజెన్సీలతో విచారణ.. వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్లో గురువారం జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మూడు ఏజెన్సీలు సిద్ధమయ్యాయి. పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ), పుణే మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎంఆర్డీఏ), మహారాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ (ఎంఐడీసీ)లు సీరం ప్రమాద ఘటనపై కలిసి దర్యాప్తు చేయనున్నాయి. సెజ్–3 ప్రాంతంలోని సీరం ఇన్స్టిట్యూట్కు చెందిన ఐదంతస్తుల భవనంలో గురువారం మంటలు చెలరేగగా.. ఆ భవనంలోని రెండు అంతస్తులు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. ఈ భవనంలో మంటలు చెలరేగడానికి కారణమేంటో విచారించేందుకు పీఎంసీ, ఎంఐడీసీలతో కలిసి పీఎంఆర్డీఏ ఉమ్మడి దర్యాప్తు చేపట్టనున్నట్లు పీఎంఆర్డీఏ చీఫ్ ఫైర్ ఆఫీసర్ దేవేంద్ర పాట్ఫడే తెలిపారు. (చదవండి: ఒక్కసారి తిరస్కరిస్తే.. మళ్లీ నో కరోనా వ్యాక్సిన్!) ప్రమాదంలో భవనంలోని 4, 5వ అంతస్తులు పూర్తిగా పాడయ్యాయని పేర్కొన్నారు. పలు రకాల పరికరాలు కూడా ధ్వంసం అయ్యాయన్నారు. దర్యాప్తు తర్వాత అసలు అగ్నిప్రమాదం ఎలా సంభవించిందనేది తెలుస్తుందన్నారు. అయితే కారణాలేమై ఉంటాయన్న దానిపై మాత్రం స్పందించడానికి ఆయన నిరాకరించారు. ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందన్న దానిపై ఇప్పుడే స్పందించలేమని ఎంఐడీసీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ సంతోష్ వార్రిక్ పేర్కొన్నారు. సీరం అగ్ని ప్రమాద ఘటనపై విచారణ ప్రారంభించామని, అసలు ప్రమాదం ఎలా సంభవించిందో తెలుసుకోవడమే తమ దర్యాప్తు ముఖ్యోద్దేశం అని పీఎంసీ ఫైర్ శాఖ అధిపతి ప్రశాంత్ రానిప్సే తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆధారాలు సేకరిస్తున్నారని మరో అధికారి వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించి హడాప్సర్ పోలీస్ స్టేషన్లో ‘మంటలు చెలరేగడం, ప్రమాదవశాత్తు మృతి’ కేసు నమోదు చేశామని స్థానిక జోన్–5 డీసీపీ నమ్రతా పాటిల్ వెల్లడించారు. ఐదుగురు చనిపోవడం బాధాకరం..: ఐరాస ఐక్యరాజ్యసమితి: పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతుందని భావిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పేర్కొన్నారని ఆయన అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నామని సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ గురువారం విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. సీరం ఇన్స్టిట్యూట్ అగ్ని ప్రమాద ఘటనపై యూఎన్ చీఫ్ స్పందించారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. (చదవండి: అక్కడ వేసవి వరకూ లాక్డౌన్..) ప్రమాదవశాత్తు జరిగింది..: పవార్ ముంబై: పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప, ఇందులో పనిచేసే శాస్త్రవేత్తల సమగ్రత గురించి ఎలాంటి సందేహం లేదని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు. గురువారం సీరం ఇన్స్టిట్యూట్లో జరిగిన అగ్నిప్రమాదం వెనుక విధ్వంసం ఆరోపణలు ఉన్నాయన్న విలేకరుల ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. శుక్రవారం కొల్హాపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సీరం ఇన్స్టిట్యూట్లో జరిగింది ఒక ప్రమాదం. ఈ ఘటనలో ఎలాంటి విధ్వంసం లేదు. దీని గురించి ఈ రోజు మాట్లాడటం మాకు సరైంది కాదు. అయితే సీరంలో పనిచేసే నిపుణులు, శాస్త్రవేత్తల సమగ్రత గురించి మాకు ఎలాంటి సందేహం లేదు’అని అన్నారు. కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకోవడంలో ప్రజలు సంకోచిస్తున్నారన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఎస్ఐఐ ప్రపంచ ప్రఖ్యాత సంస్థ అని, నిపుణులు ఆ సంస్థ ఉత్పత్తుల వాడకాన్ని సమర్థించారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ కూడా ఇక్కడ తయారు చేసిన వ్యాక్సిన్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నారు, అలాంటిది తాను దీనిపై ఏమి మాట్లాడాలని అని పవార్ అన్నారు. -
కోవీషీల్డ్ వ్యాక్సిన్ ధర : సీరం కీలక ప్రకటన
సాక్షి,ముంబై: మరికొన్ని రోజుల్లో దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. తొలిదశలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు, ఆ తరువాత క్రమంగా దేశ ప్రజలకు ఈ టీకాను అందించనున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలంతో ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. దీంతో ఈక్రమంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరపై సీరం కీలక ప్రకటన చేసింది. దేశంలో తొలి కోవిడ్-19 వ్యాక్సిన్ అందించడం ఒక చారిత్రక క్షణం గురించి సీరం సీఈవో అదర్ పూనావాలా సంతోషం వ్యక్తం చేశారు. అలాగే భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు కోవిడ్-19 వ్యాక్సిన్‌ను కేంద్రం "ప్రత్యేక ధర" కు కొనుగోలు చేసినట్లు పూనావాలా మంగళవారం ధృవీకరించారు. (సీరం, కేంద్రం డీల్ : రూ. 200కే వ్యాక్సిన్) ప్రభుత్వ మెగా టీకా డ్రైవ్‌లో అందించే కోవిషైల్డ్ వ్యాక్సిన్ ధరపై స్పందించిన అదర్ పూనావాలా మొదటి 100 మిలియన్ మోతాదులకు మాత్రమే 200 రూపాయల ప్రత్యేక ధరకు అందించాం. ప్రధానంగా సామాన్యులకు, బలహీనంగా, పేదలకు, ఆరోగ్య కార్యకర్తలతోపాటు, ఇతర అణగారిన వర్గాలకు మద్దతు ఇవ్వడమే తమ లక్క్ష్యం.ఇందులో భాగంగా లభాపేక్ష లేకుండా తక్కువ ధరను నిర్ణయించామన్నారు. 100 మిలియన్ యూనిట్ల సరఫరా తర్వాత కూడా ప్రభుత్వానికి చాలా సహేతుకమైన ధరకే అందిస్తామని, అయితే ఇది రూ.200 కన్నా కొంచెం ఎక్కువే అవుతుందన్నారు. ఇక ప్రైవేట్ మార్కెట్లలో రూ. 1000 విక్రయిస్తామని చెప్పారు. అలాగే ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ను అందించడమే తమ ప్రధాన సవాల్ అని పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి గురించి ఆయన మాట్లాడుతూ తాము ప్రతి నెలా 70-80 మిలియన్ మోతాదులను తయారుచేస్తామన్నారు. అలాగే విదేశీ దేశాలకు తమటీకాను అందించనున్నామని, ఇందుకు సంబంధించిన ప్రణాళికలు జరుగుతున్నాయన్నారు. పూణే విమానాశ్రయానికి ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కోవిడ్ వ్యాక్సిన్ తొలి లోడ్‌ను తీసుకెళ్తున్న మూడు ట్రక్కులు ఈ రోజు దేశవ్యాప్తంగా 13 ప్రదేశాలకు చేరుకోనున్నాయి. ఢిల్లీ, కర్నాల్, అహ్మదాబాద్, చండీగఢ్, లక్నో, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, భువనేశ్వర్, కోల్‌కతా, గౌహతి తదితరాలున్నాయి. జనవరి 16న దేశవ్యాప్త టీకా డ్రైవ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. We've given a special price of Rs 200 for the first 100 mn doses only to GoI on their request, that we want to support common man, vulnerable, poor, healthcare workers. After that we'll be selling it at Rs 1000 in pvt markets: Adar Poonawalla, CEO-Owner, Serum Institute of India pic.twitter.com/EmKwGhevc2 — ANI (@ANI) January 12, 2021 -
మరి కొద్ది రోజుల్లోనే వ్యాక్సిన్ : సీరం
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్‌లో ప్రకంపనలు రేపుతున్న మరో ప్రమాదకరమైన కరోనా వైరస్ ఉనికి తెలంగాణాలో కూడా ఉందన్న తాజా అంచనాల మధ్య దేశీయ అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం కీలక విషయాన్ని ప్రకటించింది. భారతదేశంలో సీరం ఉత్సత్తి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్‌కు మరికొన్నిరోజుల్లో అత్యవసర ఉపయోగానికి ఆమోదం లభించనుంది. ఈ మేరకు సీరం సీఈఓ అదార్ పూనావల్లా వ్యాఖ్యలను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. సీరం ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో అక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ ప్రయోగాలకు సంబంధించిన సీరం సమర్పించిన లేటెస్ట్ డేలా సంతృప్తికరంగా ఉన్నందున త్వరలోనే వ్యాక్సిన్ అత్యసర వినియోగానికి ప్రభుత్వ అనుమతి లభించనుందని ఆశిస్తున్నట్టు పూనావల్లా తెలిపారు. ఇప్పటికే 40 మిలియన్ల నుండి 50 మిలియన్ల మోతాదుల వ్యాక్సిన్ సిద్దంగా ఉందన్నారు. అంతేకాదు డేటా విశ్లేషణ పూర్తయిన తర్వాత, టీకాకు అనుమతినిచ్చేందుకు యూకే మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్‌ఎ) ఆమోదం కోసం భారత ప్రభుత్వం వేచి ఉండక పోవచ్చని ఆయన పేర్కొన్నారని రాయిటర్స్ తెలిపింది. -
వచ్చే జనవరిలోనే వ్యాక్సిన్: అక్టోబరు నాటికి..
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చేస్తున్న తరుణంలో మరోసారి సీరం కరోనా మహమ్మారి నివారణకు సంబంధించి కీలక అంశాన్ని వెల్లడించింది. ఈ నెలాఖరులోనే ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ టీకాకు అత్యవసర లైసెన్స్ పొందవచ్చనే ఆశాభావాన్ని సీరం సీఈఓ అదార్ పూనావాలా వ్యక్తం చేశారు. ఆమోదం తర్వాత, వచ్చే నెలలోగా భారతదేశంలో టీకా పంపిణీ ప్రారంభించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. (వ్యాక్సిన్ : సీరం పూనావాలా అరుదైన ఘనత) అత్యవసర వినియోగానికి రెగ్యులేటర్ల అనుమతి, ఆ తరువాత దేశంలో టీకా డ్రైవ్ 2021, జనవరి నాటికి ప్రారంభమవుతుందన్నారు. అలాగే 2021, అక్టోబర్ నాటికి చాలామందికి టీకాలు వేయడం పూర్తవు తుందని, దీంతో మామూలు పరిస్థితులు నెలకొంటాయని తెలిపారు. ఆ తర్వాత ప్రజలంతా సాధారణ జీవితం గడపవచ్చని ఆయన పేర్కొన్నారు. ది ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో పూనవాలా ఈ వ్యాఖ్యలు చేశారు. తొలి దశలో దేశ జనాభాలో 20-30 శాతం మందికి టీకాలు వేయాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ యోచిస్తోందన్నారు. 20 శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత ప్రజల్లో విశ్వాసం పుంజు కుంటుందన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నాటికి ప్రతి ఒక్కరికీ టీకాలు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నాననీ, దీంతో సాధారణ జీవితం తిరిగి వస్తుందని పూనావాలా అభిప్రాయపడ్డారు. (వ్యాక్సిన్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం : ట్రంప్ సంచలనం) జూలై 2021నాటికి 300-400 మిలియన్ మోతాదులను సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. అలాగే ప్రభుత్వంతో పాటు ప్రైవేటు మార్కెట్లకు కూడా టీకాల తయారీకి తాము సన్నద్ధమవుతున్నా మని తెలిపారు. మరోవైపు అక్టోబర్ నాటికి సాధారణ జీవితం తిరిగి వస్తుందని పూనావాలా నమ్ముతుండగా, రోజుకు 100 కరోనా వైరస్ షాట్లను మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఆయా రాష్ట్రాలు మౌలిక సదుపాయాలను కల్పించనున్నాయి. అలాగే షాట్ పొందిన ప్రతి వ్యక్తిని 30 నిమిషాల పాటు పర్యవేక్షిస్తారు. కాగా కరోనావైరస్ వ్యాక్సిన్ల తయారీకి సీరం నోవావాక్స్తో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. నోవావాక్స్ కోసం ఫేజ్ 3 క్లినికల్ పరీక్షలను 2021 మొదటి త్రైమాసికం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
కరోనా: సీరమ్ సీఈవోకు అరుదైన గౌరవం
న్యూఢిల్లీ: సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనవల్లాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఆరికట్టేందుకు సీరం చేస్తున్న కృషికి గాను ఆయనకు ‘ఆసియన్ ఆఫ్ ది ఇయర్’ అనే బిరుదు ప్రకటించినట్లు సింగాపూర్‌కు ది స్ట్రయిట్ టైమ్స్ మీడియా శనివారం ప్రకటన విడుదల చేసింది. అంతేగాక చైనా, ఉత్తర కొరియా, జపాన్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన మరో అయిదుగురికి ఈ బిరుదును ప్రకటించినట్లు కూడా తెలిపింది. మహమ్మారిని ఆరికట్టేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్.. ఆక్సఫర్డ్ యూరివర్శిటీ, బ్రిటిష్ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకాలు కలిసి కోవిడ్-19 నివారణకు ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్ అభివృద్ద చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌ను భారతదేశంలో ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రయోగాలు చేసేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)కు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే ముంబై, పుణెలో క్లినికల్ ట్రయల్స్ త్వరలోనే నిర్వహించనున్నారు. (చదవండి: కరోనా టీకాపై ఓ గుడ్‌న్యూస్) అయితే ఈ జాబితాలో పూనవల్లాతో పాటు చైనా, జపాన్, ఉత్తర కొరియాకు చెందిన మరో అయిదుగురికి ఈ బిరుదును ఆసియా ప్రకటించింది. వీరిలో.. మొట్టమొదటి సారిగా కరోనా వైరస్ ‘సార్స్-కోవ్-2’ జన్యూ రూపాన్ని మ్యాప్ చేసి కంటికి కనిపించని కరోనా వైరస్ ఇదేనని ప్రపంచానికి పరిచయం చేసిన ఆన్లైన్ బృందానికి నాయకత్వం వహించిన చైనా పరిశోధకుడు జాంగ్ యోంగ్-జేన్, చైనా మేజర్ జనరల్ చెన్-వెయ్, జపాన్‌లో వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడటంలో ముందంజలో ఉన్న మొరిసితా, సింగపూర్ ప్రొఫెసర్ వూయ్-ఇంగ్-యోంగ్‌లతో పాటు దక్షిణ కోరియాకు చెందిన వ్యాపారవేత్త సియో జంగ్-జీన్లు ఉన్నారు. జంగ్-జీన్ తన సంస్థ ద్వారా కోవిడ్-19 చికిత్సలకు ఇతర వ్యాక్సిన్లను తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఈ టికాలను పంపిణీ చేస్తూ తనవంతు కృషి చేశారు. అయితే ఈ ఆవార్డుకు ఎన్నికైనా ఈ ఆరుగురిని కరోనా వీరులుగా ‘వైరస్ బస్టర్స్’గా పిలుస్తూ ఈ బిరుదును ప్రకటించింది. (చదవండి: కరోనా వ్యాక్సిన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన బహ్రెయిన్) అంతేగాక కరోనా నివారణకు మహమ్మరిపై పోరాటంలో ముందంజలో నిలిచిన వీరూ ప్రపంచానికి ఆదర్శంగా నిలచారంటూ సదరు ఆసియా ప్రశంస పత్రాన్ని విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో మరణాలు, ఆర్థిక కష్టాలను తెచ్చిన పెట్టిన సార్స్-కోవి-2 వైరస్‌పై వీరి పోరాటం ప్రశంసనీయమని, అందుకే వీరిని ‘వైరస్ బస్టర్స్’గా పిలుస్తున్నట్లు ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు. ఇక వీరి ధైర్యం, సంరక్షణ, నిబద్ధత, సృజనాత్మకతకు వందనాలు అంటూ ఆసియా ప్రశంస పత్రంలో పేర్కొంది. ఇక కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచానికి ఈ ఆరుగురు ఆసియా ఆశ చిహ్నంగా పిలిచింది. అయితే అదార్ పూనవల్లా తండ్రి సైరస్ పూనవల్లా 1966లో సీరం ఇన్స్టిట్యూట్ను స్థాపించారు. 2011లో ఆయన మరణం తర్వాత అదార్ సంస్థ మొక్క పూర్తి బాధ్యతల చేపట్టి సీరం ఇన్స్టిట్యూట్కు సీఈవో అయ్యారు. -
వ్యాక్సిన్ : సీరం పూనావాలా అరుదైన ఘనత
సాక్షి, ముంబై: ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా (39) అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. కోవిడ్-19 మహమ్మారిపై చేసిన పోరాటానికి గాను సింగపూర్ ప్రముఖ దినపత్రిక ది స్ట్రెయిట్స్ టైమ్స్ అందించే “ఆసియన్స్ ఆఫ్ ది ఇయర్” అవార్డుకి ఎంపికయ్యారు. ఆసియా ఖండంలో ఈ ఘనతను సాధించిన ఆరుగురిలో ఒకరిగా పూనావాలా నిలిచారు.(ప్రధాని మోదీ పర్యటన : సీరం కీలక ప్రకటన) కరోనాపై పోరులో వారి ధైర్యం, నిబద్ధత, క్రియేటివిటీకి సాల్యూట్ చెబుతున్నామంటూ సింగపూర్ డెయిలీ కితాబిచ్చింది. ఈ సంక్షోభ సమయంలో విశేష కృషితో ఆసియాతోపాటు ప్రపంచానికి ఆశాకిరణాలుగా నిలిచారని వ్యాఖ్యానించింది. మొత్తం ఆరుగురిని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. కరోనావైరస్ మహమ్మారి అంతంకోసం సమిష్టిగా అంకితభావంతో పనిచేసిన వీరులుగా వీరిని "వైరస్ బస్టర్స్"గా అవార్డు ప్రశంసాపత్రంలో కీర్తించింది. ఈ జాబితాలో పేర్కొన్న మరో ఐదుగురిలో చైనా పరిశోధకుడు కరోనా మహమ్మారి వైరస్ సార్స్-కోవి-2 తొలి పూర్తి జన్యువును గుర్తించినందుకు చాంగ్ యోంగ్జెన్, మహమ్మారి అంతానికి వ్యాక్సిన్ రూపకల్పనలో కృషి చేసినందుకుగాను చైనా మేజర్-జనరల్ చెన్ వీ, జపాన్‌కు చెందిన డాక్టర్ ర్యూచికు సింగపూర్ ప్రొఫెసర్ ఓయి ఇంగ్ ఎంగ్, దక్షిణ కొరియాకు చెందిన వ్యాపారవేత్త సియో జంగ్-జిన్ తదితరులు ఈ అవార్డుకు ఎంపికైన వారిలో ఉన్నారు. నిబద్ధతతో తమకు తాము అంకితమైన కృషితో ఆసియాతోపాటు, ప్రపంచ ప్రజలకు ఆశలను చిగురింప చేశారని సింగపూర్ ప్రెస్ హోల్డింగ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ వారెన్ ఫెర్నాండెజ్ ప్రశంసించారు. ఇంతకుముందెన్నడూ లేని కృషితో వార్తల్లో నిలవడంతోపాటు, తద్వారా ఆసియా అభివృద్ధికి సహాయపడిన వ్యక్తులకు, బృందాలకు లేదా సంస్థలకు ప్రతీ ఏడాదీ ఈ అవార్డులను అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కరోనా మహమ్మారి నివారణకు పరిష్కారానికి సమాధానం కనుగొనడంలో సాయం చేసిన వ్యక్తులకు, టీంలకు ఇవ్వాలని నిర్ణయించింది. కాగా ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా కలిసి రూపొందించిన కోవిడ్-19వ్యాక్సిన్ ‘‘కోవిడ్‌షీల్డ్’’ తయారీకి తయారీకి పూణేకు చెందిన సీరం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కరోనా లాక్‌డౌన్‌తో ఇబ్బందులు ప్రజలకు విముక్తి రావాలనే ఉద్దేశంతో తన సంస్థ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడానికి తన కుటుంబ సంపదలో 250 మిలియన్ డాలర్లను అందించినట్టు ఇటీవల వెల్లడించారు. ప్రధానంగా స్వల్ప, మధ్య-ఆదాయ దేశాలకు సరసమైన ధరలో కోవిడ్-19వాక్సిన్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు చెప్పారు. 1966లో పూనవాలా తండ్రి సైరస్ పూనావాలా సీరంను స్థాపించారు. ఆ తరువాత 2001లో సీరంలో చేరిన అదర్ పూనావాలా దినదినాభివృద్ధి చెందుతూ 2011లో సీఈవోగా అవతరించి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. -
ప్రధాని మోదీ పర్యటన : సీరం కీలక ప్రకటన
సాక్షి, పుణే: ఆక్సఫర్డ్ ఆస్ట్రాజెనెకా కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్న దిగ్గజ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ శనివారం కీలక ప్రకటన చేసింది. కోవిడ్-19 వ్యాప్తికి కళ్లెం వేసే వ్యాక్సీన్ల అభివృద్ధి ప్రక్రియలను వ్యక్తిగతంగా పరిశీలించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ టాప్-3 వ్యాక్సిన్ హబ్‌లను సందర్శించారు. ఇందులో భాగంగా పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ను సందర్శించారు. అనంతరం సీరం సీఈఓ అదార పూనవల్లా మాట్లాడుతూ తమ కోవిడ్-19 వ్యాక్సిన్ అత్యసవర వినియోగం కోసం మరో రెండు వారాల్లో దరఖాస్తు చేయనున్నామని చెప్పారు. అలాగే జూలై నాటికి 30 నుంచి 40 కోట్ల మోతాదుల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తయారు చేయాలని కేంద్ర రప్రభుత్వం సూచిందని చెప్పారు. ఎన్ని మోతాదుల వ్యాక్సిన్ కొనుగోలు చేస్తుందనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేనప్పటికీ జూలై 2021 నాటికి ఇది 300-400 మిలియన్ మోతాదులను కొనుగోలు చేయనుందనే సూచన లభించిందని పూనవల్లా వెల్లడించారు. తమ వ్యాక్సిన్ 70 సమర్థతతో అత్యంత ప్రభావవంతమైందిగా తేలిందన్నారు. భారతదేశంలో కోవిషీల్డ్‌గా పిలుస్తున్నఈ టీకా ప్రస్తుతం మూడవ దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. (కరోనా మూలాలు ఇండియాలో : చైనా శాస్త్రవేత్తలు) ఈ సందర్భంగా సీరం సీఈవో ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. వ్యాక్సిన్లు, వ్యాక్సిన్ ఉత్పత్తిపై ప్రధాని పరిజ్ఞానాన్ని చూసి తామే ఆశ్చర్యపోయామని పూనవల్లా వ్యాఖ్యానించారు. వివిధ రకాల వ్యాక్సిన్లు, ఎదుర్కొనే సవాళ్లు తప్ప, తాము ఆయనకి వివరించిందేమీ లేదని తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ అమలు ప్రణాళికపై ప్రధానితో చర్చించామన్నారు.మరోవైపు సీరం కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సీరం బృందంతో మంచి చర్చలు జరిగాయనీ, ఇప్పటివరకు జరిగిన కృషి, భవిష్యత్ పురోగతిపై వివరాలను వారు షేర్ చేశారని మోదీ పేర్కొన్నారు. కాగా ప్రధాని మోదీ వ్యాక్సిన్ టూర్లో భాగంగా హైదరాబాద్‌లోని భారత్ బయోటిక్, అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటిక్ పార్క్, పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్‌ను సందర్శించారు. మొదట గుజరాత్‌లోని ఫార్మా మేజర్ జైడస్ కాడిలా ప్లాంట్‌కు, ఆతరువాత కోవాక్సిన్‌ను ఉత్పత్తిచేస్తున్న హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ కేంద్రానికి, చివరగా పూణేకు వెళ్లిన సంగతి తెలిసిందే. Had a good interaction with the team at Serum Institute of India. They shared details about their progress so far on how they plan to further ramp up vaccine manufacturing. Also took a look at their manufacturing facility. pic.twitter.com/PvL22uq0nl — Narendra Modi (@narendramodi) November 28, 2020 -
కోవిషీల్డ్ వ్యాక్సిన్ : జనవరి నాటికి పదికోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సాయంతో తీసుకొస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్‌పై సీరం సీఈవో మరోసారి కీలక విషయాన్ని ప్రకటించారు. జనవరి నాటికి కనీసం 100 మిలియన్ల మోతాదుల వ్యాక్సిన్‌ను అందుబాటులోఉంచుతామని తెలిపారు. అలాగే ఫిబ్రవరి చివరి నాటికి వందల మిలియన్లు సిద్ధంగా ఉంటాయని అంచనావేశారు. బ్రిటన్, బ్రెజిల్ ట్రయిల్స్‌లో అస్ట్రాజెనెకా టీకా 90 శాతం ప్రభావవంతంగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా పరీక్షిస్తున్నవాటిలో ప్రోత్సాహకరంగా ఉన్న వాటిల్లో తమది కూడా ఉందని అదర పూనవాలలా చెప్పారు. (ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ : అద్భుతమైన వార్త!) కోవిడ్-19 వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్ ’ భారీ తయారీకి ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న పుణే సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా సోమవారం సాయంత్రం చెప్పారు. ఇప్పటికే 40 మిలియన్ల మోతాదులను సిద్ధం చేశామన్నారు. రెండు డోసుల ఈ వ్యాక్సిన్ ఒక్కొక్క మోతాదు ధర 500-600 రూపాయల మధ్య ఉంటుందని తెలిపారు. -
కరోనా టీకా ధర ప్రకటించిన సీరం
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్ లభ్యత, ధరపై దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తరుణంలో సీరం ఇన్స్టిట్యూట్ కీలక విషయాన్ని ప్రకటించింది. 2021 ఏప్రిల్ నుంచి సాధారణ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామని సీరం సీఈఓ అదర్ పూనావాలా గురువారం ప్రకటించారు. తాము ఉత్పత్తి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ ధర రూ.1000 వరకు ఉంటుందని తెలిపారు. రెండు డోసుల తమ వ్యాక్సిన్‌ను 5-6 డాలర్ల చొప్పున ( సుమారు వెయ్యి రూపాయలకు) అందిస్తామన్నారు. (గుడ్‌న్యూస్: క్రిస్మస్కు ముందే కరోనా వ్యాక్సిన్) ఫలితాలు, నియంత్రణ ఆమోదాలను బట్టి 2021 ఫిబ్రవరి లోపు హెల్త్ కేర్ సిబ్బందికి, వృద్దులకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందన్నారు. అలాగే ఏప్రిల్ నాటికి సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండనుందని పూనావాలా తెలిపారు. ఫిబ్రవరి నుంచి నెలకు సుమారు 10 కోట్ల మోతాదులను తయారు చేయాలని ఎస్ఐఐ యోచిస్తోందని ఆయన చెప్పారు. 2024 నాటికి దేశంలోని అందరికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందన్నారు. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం ఇండియాలోని సీరం ఇన్స్టిట్యూట్తో కలిసి కరోనా వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు దేశీయంగా భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవాగ్సిన్ మూడవ దశ ప్రయోగాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. (కరోనా వ్యాక్సిన్ : ఇన్ఫీ మూర్తి కీలక డిమాండ్) -
జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల కరోనా వైరస్ సెకండ్ వేవ్‌పై ఆందోళన పెరుగుతున్న సమయంలో వ్యాక్సిన్‌పై ఆశలు మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్-19 వ్యాక్సిన్‌పై సీరం ఇన్స్టిట్యూట్ కీలక విషయాన్ని ప్రకటించింది. 2021 జనవరి నాటికి తమవాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, బ్రిటీష్ సంస్థ ఆశ్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ 2021, జనవరి నాటికి భారత్‌లో లభిస్తుందని పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా తాజాగా వెల్లడిచారు. ట్రయల్స్ విజయవంతమైన అనంతరం నియంత్రణ సంస్థల ఆమోదాలు సకాలంలో లభిస్తే వచ్చే ఏడాది జనవరి నాటికి టీకా భారత్‌లో లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. భారత్, యూకేలలో జరుగుతున్న పరీక్షల ఆధారంగా ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా ఉంటుందనే నమ్మకముందని పేర్కొన్నారు. భారత మార్కెట్ కోసం కొవీషీల్డ్ పేరుతో వస్తున్న ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం దేశంలో రెండు, మూడు దశల పరీక్షలు కొనసాగుతున్నాయి. ఫలితాలు వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న క్లినికల్ ట్రయల్స్ గురించి ప్రస్తావించిన అదర్ పూనావాలా కొవీషీల్డ్‌కు సంబంధించి తక్షణం ఆందోళన కలిగించే అంశాలేమీ లేవని, భారత్‌తో పాటు విదేశాల్లో వేలాది మంది ఈ వ్యాక్సిన్ షాట్ లభించిందని ఆయన తెలిపారు. ఇప్పటివరకైతే తమ సంస్థ 60 నుంచి 70 లక్షల మోతాదుల తయారీ లక్ష్యంగా ఉన్నట్టు, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక నెలకు కోటి మోతాదుల వ్యాక్సిన్లను తయారు చేయాలని భావిస్తున్నట్టు ఆయన వివరించారు. అంతేకాదు టీకా సరసమైన ధరకు టీకాను అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వంతో సీరం చర్చలు జరుపుతోందన్నారు. అందరికీ అందుబాటులో ధరలో టీకాను అందించాలని నిశ్చయించుకున్నామని పూనావాలా ప్రకటించారు. -
5 వ్యాక్సిన్లు : 100 కోట్ల డోసులు
సాక్షి, ముంబై: కరోనా వ్యాక్సిన్ తయారీలో దేశీయ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) భారీ సన్నాహాలు ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఐదు కరోనా వైరస్ ఒక వాక్సిన్లకు సంబంధించి ఒక్కోదానికి ఒక బిలియన్ మోతాదులను తయారు చేస్తున్నట్టు సీరం సీఈఓ అదార్ పూనావల్లా తెలిపారు. అలాగే 2021 నాటికి ప్రతి త్రైమాసికంలో కనీసం ఒక వ్యాక్సిన్ లాంచ్ చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. (కరోనా వాక్సిన్ : సీరం సీఈఓ కీలక వ్యాఖ్యలు) 2021-22 ముగిసేలోపు ప్రపంచవ్యాప్తంగా కోవిషీల్డ్, కోవోవాక్స్, కోవివాక్స్, కోవి-వాక్, ఎస్ఐఐ కోవాక్స్ అనే ఐదు వేర్వేరు కరోనావైరస్ వ్యాక్సిన్లకు సంబంధించి వందకోట్ల మోతాదులను సిద్ధం చేయనున్నామని పూనావల్లా చెప్పారు. 'కోవిషీల్డ్' కరోనావైరస్ వ్యాక్సిన్‌తో ప్రారంభించి, సీరం 2021 నాటికి ప్రతి త్రైమాసికంలో కనీసం ఒక వ్యాక్సిన్‌ను విడుదల చేయాలని భావిస్తోంది. 20-30 మిలియన్ మోతాదులను ఇప్పటికే తయారు చేస్తున్నామనీ దీన్ని నెలకు 70-80 మిలియన్లకు పెంచనున్నామని పూనావల్లా తెలిపారు. టీకా షెల్ఫ్ జీవితాన్ని పరిగణనలోకి తీసుకుని తక్కువ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. పూణేలోని ఎస్ఐఐ ప్రక్కనే కొత్త ఉత్పాదక కేంద్రం సిల్స్ రాబోతోందని, ఇది పూర్తి కావడానికి రెండేళ్లు పడుతుందని అదార్ పూనావాలా తెలిపారు. అప్పటి వరకు సిల్స్ అవుట్ సోర్స్ చేస్తుందన్నారు. ఈ రెండూ పూర్తయిన తరువాత డిమాండ్, అవసరాన్ని బట్టి 2 నుంచి 3 బిలియన్ మోతాదుల వరుకు తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటామని కూడా పూనావల్లా వెల్లడించారు. బ్రిటిష్-స్వీడిష్ ఫార్మా కంపెనీ అస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ సంయక్తంగారూపొందించిన వ్యాక్సిన్ కోవిషీల్డ్. ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 1,600 మందిలో క్లినికల్ ట్రయల్ 3వ దశలో ఉంది. దీని తయారీకి సంబంధించి ఇప్పటికే సీరం ఒప్పంద భాగస్వామ్యం చేసుకుంది. రెండవ వ్యాక్సిన్ బయోటెక్ సంస్థ నోవోవాక్స్ కు చెందిన 'కోవోవాక్స్'. దీని ఫేజ్-1 క్లినికల్ ట్రయల్ మే 2020 లో ఆస్ట్రేలియాలో ప్రారంభం కాగా ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ 2020 చివరి నాటికి ప్రారంభం కానున్నాయి. నోవోవాక్స్ 2021 లో ఒక బిలియన్ మోతాదులను ఉత్పత్తికి సీరం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. -
కరోనా వాక్సిన్ : సీరం సీఈఓ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న వేళ ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి సుదీర్ఘ కాలంపాటు కోవిడ్-19 వాక్సీన్ల అవసరం ఉంటుదని పేర్కొన్నారు. జనాభాలో 100 శాతానికి కరోనా టీకా ప్రక్రియ పూర్తిచేసినప్పటికీ, భవిష్యత్తులోమరో 20 ఏళ్లపాటు ఈ టీకాల అవసరం తప్పక ఉంటుందన్నారు. టీకా ఒక్కటే పరిష్కారం కాదని అదార్ వివరించారు. ఎందుకంటే ప్రపంచంలో పలురకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిల్లో ఏ ఒక్క టీకాను నిలిపివేసిన చరిత్ర ఎక్కడా లేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు వ్యాక్సిన్ ఖచ్చితమైన శాస్త్రం కాదు. అది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది, కానీ వ్యాధి రాకుండా పూర్తిగా నిరోధించదని పూనావాలా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నటీకాలు ఎంతకాలం రక్షణ కల్పిస్తాయో ఎవరికీ తెలియదు. ఒకటి, రెండు లేదా మూడు సంవత్సరాలు. అయితే ఫ్లూ విషయానికి వస్తే ప్రతీ ఏడాది, ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కరోనావైరస్ విషయంలో కనీసం రెండు, మూడు సంవత్సరాలకు ఒకసారి వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు. కోవిడ్-9 వ్యాక్సిన్ కరోనాను ప్రపంచ వ్యాప్తంగా నిర్మూలిస్తుంది, వైరల్ సంక్రమణను పూర్తిగా అరికడుతుంది లాంటి ఆశలు ఏమైనా ఉంటే ఈ కఠోర సత్యాన్ని మనం జీర్ణించుకోక తప్పదన్నారు. మీజిల్స్ వ్యాక్సిన్, అత్యంత శక్తివంతమైన టీకా, 95 శాతం వ్యాధి నివారణ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కానీ ప్రతీ ఏడాది కొత్తగా పుట్టిన శిశువులకు మీజిల్స్ వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే కదా అని ఆయన ఉదాహరించారు. మొత్తం ప్రపంచంలో 100 శాతానికి టీకాలు అందించిన తరువాత కూడా భవిష్యత్తు కోసం కరోనా టీకా అవసరం ఉంటూనే ఉంటుదని పూనావల్లా వాదించారు. ఫ్లూ, న్యుమోనియా, మీజిల్స్, అంత ఎందుకు పోలియో వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ఒక్కటి కూడా ఇంతవరకూ నిలిపివేయలేదని తెలిపారు.