ప్రస్తుతం దేశం మొత్తం మీద పనిగంటలపై చర్చ జరుగుతోంది. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలని చెబితే.. వారానికి 90 గంటలు పనిచేయాలని ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రమణ్యన్ అన్నారు. ఈ వ్యాఖ్యపై పలువురు పారిశ్రామిక వేత్తలు స్పందించారు. ఇప్పుడు ఈ జాబితాలోకి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ 'అదార్ పూనావల్లా' (Adar Poonawalla) కూడా చేరారు.
ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదు, ఎంత క్వాలిటీ వర్క్ చేశామన్నది ముఖ్యం. 10 గంటలు పని చేస్తే ప్రపంచాన్నే మార్చేయొచ్చన్న ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) మాటలతో.. అదార్ పూనావల్లా ఏకీభవించారు. నా భార్య కూడా నేను అద్భుతంగా ఉన్నాను అని అనుకుంటుంది. ఆమె ఆదివారాలు నన్ను చూస్తూ ఉండటానికి ఇష్టపడుతుందని ఆయన ట్వీట్ చేశారు.
ఢిల్లీలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025 సదస్సులో, పని గంటల పొడిగింపుపై ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ తన అసమ్మతిని వ్యక్తం చేశారు. నారాయణ మూర్తి.. ఇతర కార్పొరేట్ నాయకుల పట్ల నాకు చాలా గౌరవం ఉంది. అయితే నా ఉద్దేశ్యం ఏమిటంటే, మనం పని గంటలపై కాకుండా.. పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. కాబట్టి 70 గంటలు & 90 గంటలు కాదు. నాణ్యమైన పని 10 గంటలు చేస్తే చాలు. ప్రపంచాన్నే మార్చేయొచ్చని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: 'సరిగ్గా 10 గంటలు.. ప్రపంచాన్ని మార్చేయొచ్చు': ఆనంద్ మహీంద్రా
ఇంట్లో కూర్చుని.. భార్యను ఎంత సేపు చూస్తారు. ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండని చెప్పిన ఎస్‌ఎన్ సుబ్రమణ్యన్ (Subrahmanyan) వ్యాఖ్యలపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. ‘నా భార్య ఎంతో మంచిది, ఆమెను తదేకంగా చూడటం నాకు చాలా ఇష్టం’ అని అన్నారు. ఎల్ అండ్ టీ చైర్మన్ వ్యాఖ్యలపై కేవలం పారిశ్రామిక దిగ్గజాలు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.
Yes @anandmahindra, even my wife @NPoonawalla thinks i am wonderful, she loves staring at me on Sundays. Quality of work over quantity always. #worklifebalance pic.twitter.com/5Lr1IjOB6r
— Adar Poonawalla (@adarpoonawalla) January 12, 2025
Comments
Please login to add a commentAdd a comment