బెజోస్‌ ప్రియురాలితో నటాషా పూనావాలా స్టెప్పులు; ఫోటోలు, వీడియో వైరల్‌ | Natasha Poonawalla Partied With Jeff Bezos Fiancee Lauren Sanchez, Pics And Video Trending - Sakshi
Sakshi News home page

బెజోస్‌ ప్రియురాలితో నటాషా పూనావాలా స్టెప్పులు; ఫోటోలు, వీడియో వైరల్‌

Published Thu, Sep 14 2023 1:29 PM | Last Updated on Wed, Feb 21 2024 2:07 PM

Natasha Poonawalla Partied With Jeff Bezos Fiancee Lauren Sanchez - Sakshi

ప్రముఖ వ్యాక్సిన్‌ మేకర్‌ సీరంసీఈవో అదార్‌ పూనావాలా భార్య, సీరంఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నటాషాపూనావాలా మరోసారి ఒక అంతర్జాతీయ వేదికపై తళుక్కున మెరిసారు.  ప్రముఖ గాయని సల్మా హాయక్ సహ-అధ్యక్షురాలిగా ఉన్న కెరింగ్ ఫౌండేషన్ 15వ వార్షికోత్సవానికి హాజరైనఅతిథులలో ఫ్యాషన్ మొగల్ నటాషా స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు.  దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో  వైరల్‌ అవుతున్నాయి.

ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ షియాపరెల్లి గౌనులో  నటాషా తనదైన ఫ్యాషన్‌ స్టయిల్‌లో అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే అమెజాన్‌ ఫౌండర్‌ జెఫ్‌ బెజోస్‌ గర్ల్‌ఫ్రెండ్‌ లారెన్ శాంచెజ్‌, సల్మాతో కలిసి స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించి వీడియోను, ఫోటోలను నటాషా పూనావాలా  ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. వీరితోపాటు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకు ఫోటోలు, వీడియోలను, సల్మా హాయక్ , లారెన్ శాంచెజ్ షేర్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. 

సెప్టెంబర్ 12న అమెరికాలో మాన్‌హాటన్‌లో సల్మా హాయక్ ఇచ్చిన కేరింగ్ ఫర్ ఉమెన్ డిన్నర్ ఈవెంట్‌లో పలువురుమహిళా ప్రముఖులు స్పెషల్‌ గెస్ట్‌లు విచ్చేశారు. ముఖ్యంగా నటి ఓప్రా విన్‌ఫ్రే తన ప్రసంగంతో ఆకట్టుకుంది. ఇంకా మలాలా, నికోల్ కిడ్‌మాన్, కిమ్ కర్దాషియాన్, ఒలివియా వైల్డ్  లారెన్ శాంటో డొమింగో, ఎల్సా కాలిన్స్, జూలియా గార్నర్, లియోనార్డో డికాప్రియో, కింబాల్ మస్క్, క్రిస్టియానా మస్క్, డెరెక్ బ్లాస్‌బర్గ్ లాంటి వారున్నారు. 'కేరింగ్ ఫర్ ఉమెన్' విందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా  లింగ-ఆధారిత హింసను ఎదుర్కోవడానికి ,మహిళలు ,పిల్లలపై హింకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో  కలిసి పనిచేయడం  చాలా గౌరవంగా ఉందని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement