Natasha Poonawalla
-
ఫ్యాషన్‌కే పాఠాలు చెప్పే ఫ్యాషన్ క్వీన్, బిజినెస్ మాగ్నేట్ భార్య (ఫోటోలు)
-
వాట్ ఏ ఫ్యాషన్? సాంకేతిక స్టైలిష్ డిజైనర్‌వేర్..!
శ్రీశ్రీ తన మహప్రస్థానంలో ఒకచోట కుక్కపిల్లా.. సబ్బుబిళ్ళా.. అగ్గిపుల్లా.. కాదేదీ కవితకనర్హం' అంటాడు. అలానే చక్కటి క్రియేటివిటీ ఉంటే దేనితో అయినే ఫ్యాషన్‌ని సృష్టించవచ్చని ఈ టెక్ డిజైనర్‌వేర్‌ని చూస్తే అనిపిస్తుంది. ఇంతవరకు రకరకాల ఫ్యాబ్రిక్‌లతో రూపొందించిన డిజైనర్‌వేర్‌లను చూసుంటారు. ఆఖరికి లోహాలతో చేసినవి కూడా చూసుండొచ్చు. కానీ ఈ డిజైనర్‌వేర్‌ని చూస్తే ఇలా కూడా ఫ్యాషన్‌ని క్రియేట్ చెయ్యొచ్చా అనిపిస్తుంది. అత్యంత వినూత్నంగా రూపొందించిన ఈ డిజైనర్‌వేర్ యావత్తు ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఎక్కడ జరిగిందంటే..హర్పర్ బజార్ ఉమెన్ ఆప్ ది ఇయర్ అవార్డ్స్‌లో నటాషా పూనావల మిరుమిట్లు గొలిపే దుస్తులతో ఆశ్చర్యపరిచింది. మొత్తం సాంకేతిక స్ఫూర్తితో కూడిన ఈ డ్రెస్ అందర్నీ అమితంగా ఆకట్టుకుంది. ఆ డ్రెస్‌ని పాత సీడీలు, కాలిక్యులేటర్లు, ఫోన్లతో అత్యద్భుతంగా రూపొందించారు. అసాధారణ ఫ్యాషన్‌కి కేరాఫ్ అడ్రస్ అయిన ఎల్సా స్కియాపరెల్లి బ్రాండ్ దీన్నిడిజైన్ చేసింది. View this post on Instagram A post shared by DietSabya® (@dietsabya) దీనికి 'మదర్బోర్డ్' అని పేరుపెట్టడం విశేషం. క్రియేటివ్ డైరెక్టర్ రోజ్బెర్రీ సాంకేతికత హిస్టరీని తవ్వి మరీ ఐఫోన్ యుగానికి పూర్వం ఉన్న మెటీరియల్స్ని ఉపయోగించి ఈ డిజైనర్ వేర్ని రూపొందించారు. చెప్పాలంటే పాత గాడ్జెట్లతో రూపొందించిన డ్రెస్ ఇది. మధ్యమధ్యలో స్వరోవ్స్కీ స్ఫటికాలు, ఆకుపచ్చ చిప్‌లతో అలంకరించి ఉంటుంది. అలాగే అక్కడక్కడ కంప్యూటర్ వైర్లు కూడా ఉంటాయి. ఇక్కడ నటాషా టెక్-ప్రేరేపిత దుస్తులతో సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపించింది. అంతేగాదు ఫ్యాషన్ అంటే ఎవరినో అనుకరించడం కాదు అత్యంత వినూత్నంగా ఆలోచించడం అని ఈ డ్రెస్‌ని చూస్తేనే అనిపిస్తుంది. కాగా, భారతదేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో ఒకరైన అదార్ పూనావాలా భార్యే నటాషా పూనావాలా. ఆమె అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారుగా ప్రసిద్ధి చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. View this post on Instagram A post shared by Snehkumar Zala (@snehzala) (చదవండి: బెట్టీ ద ఫ్యాషన్ క్వీన్) -
మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
-
బెజోస్ ప్రియురాలితో నటాషా పూనావాలా స్టెప్పులు; ఫోటోలు, వీడియో వైరల్
ప్రముఖ వ్యాక్సిన్ మేకర్ సీరంసీఈవో అదార్ పూనావాలా భార్య, సీరంఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నటాషాపూనావాలా మరోసారి ఒక అంతర్జాతీయ వేదికపై తళుక్కున మెరిసారు. ప్రముఖ గాయని సల్మా హాయక్ సహ-అధ్యక్షురాలిగా ఉన్న కెరింగ్ ఫౌండేషన్ 15వ వార్షికోత్సవానికి హాజరైనఅతిథులలో ఫ్యాషన్ మొగల్ నటాషా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ షియాపరెల్లి గౌనులో నటాషా తనదైన ఫ్యాషన్ స్టయిల్లో అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ గర్ల్‌ఫ్రెండ్ లారెన్ శాంచెజ్, సల్మాతో కలిసి స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించి వీడియోను, ఫోటోలను నటాషా పూనావాలా ఇన్‌స్టాలో షేర్ చేశారు. వీరితోపాటు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకు ఫోటోలు, వీడియోలను, సల్మా హాయక్ , లారెన్ శాంచెజ్ షేర్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. సెప్టెంబర్ 12న అమెరికాలో మాన్హాటన్లో సల్మా హాయక్ ఇచ్చిన కేరింగ్ ఫర్ ఉమెన్ డిన్నర్ ఈవెంట్లో పలువురుమహిళా ప్రముఖులు స్పెషల్ గెస్ట్‌లు విచ్చేశారు. ముఖ్యంగా నటి ఓప్రా విన్ఫ్రే తన ప్రసంగంతో ఆకట్టుకుంది. ఇంకా మలాలా, నికోల్ కిడ్మాన్, కిమ్ కర్దాషియాన్, ఒలివియా వైల్డ్ లారెన్ శాంటో డొమింగో, ఎల్సా కాలిన్స్, జూలియా గార్నర్, లియోనార్డో డికాప్రియో, కింబాల్ మస్క్, క్రిస్టియానా మస్క్, డెరెక్ బ్లాస్బర్గ్ లాంటి వారున్నారు. 'కేరింగ్ ఫర్ ఉమెన్' విందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా లింగ-ఆధారిత హింసను ఎదుర్కోవడానికి ,మహిళలు ,పిల్లలపై హింకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో కలిసి పనిచేయడం చాలా గౌరవంగా ఉందని పేర్కొంది. View this post on Instagram A post shared by Lauren Sanchez (@laurenwsanchez) View this post on Instagram A post shared by Salma Hayek Pinault (@salmahayek) View this post on Instagram A post shared by Natasha Poonawalla (@natasha.poonawalla)