శ్రీశ్రీ తన మహప్రస్థానంలో ఒకచోట కుక్కపిల్లా.. సబ్బుబిళ్ళా.. అగ్గిపుల్లా.. కాదేదీ కవితకనర్హం' అంటాడు. అలానే చక్కటి క్రియేటివిటీ ఉంటే దేనితో అయినే ఫ్యాషన్‌ని సృష్టించవచ్చని ఈ టెక్ డిజైనర్‌వేర్‌ని చూస్తే అనిపిస్తుంది. ఇంతవరకు రకరకాల ఫ్యాబ్రిక్‌లతో రూపొందించిన డిజైనర్‌వేర్‌లను చూసుంటారు. ఆఖరికి లోహాలతో చేసినవి కూడా చూసుండొచ్చు. కానీ ఈ డిజైనర్‌వేర్‌ని చూస్తే ఇలా కూడా ఫ్యాషన్‌ని క్రియేట్ చెయ్యొచ్చా అనిపిస్తుంది. అత్యంత వినూత్నంగా రూపొందించిన ఈ డిజైనర్‌వేర్ యావత్తు ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఎక్కడ జరిగిందంటే..
హర్పర్ బజార్ ఉమెన్ ఆప్ ది ఇయర్ అవార్డ్స్‌లో నటాషా పూనావల మిరుమిట్లు గొలిపే దుస్తులతో ఆశ్చర్యపరిచింది. మొత్తం సాంకేతిక స్ఫూర్తితో కూడిన ఈ డ్రెస్ అందర్నీ అమితంగా ఆకట్టుకుంది. ఆ డ్రెస్‌ని పాత సీడీలు, కాలిక్యులేటర్లు, ఫోన్‌లతో అత్యద్భుతంగా రూపొందించారు. అసాధారణ ఫ్యాషన్‌కి కేరాఫ్ అడ్రస్ అయిన ఎల్సా స్కియాపరెల్లి బ్రాండ్ దీన్నిడిజైన్ చేసింది.
దీనికి 'మదర్‌బోర్డ్' అని పేరుపెట్టడం విశేషం. క్రియేటివ్ డైరెక్టర్ రోజ్‌బెర్రీ సాంకేతికత హిస్టరీని తవ్వి మరీ ఐఫోన్ యుగానికి పూర్వం ఉన్న మెటీరియల్స్‌ని ఉపయోగించి ఈ డిజైనర్ వేర్‌ని రూపొందించారు. చెప్పాలంటే పాత గాడ్జెట్‌లతో రూపొందించిన డ్రెస్ ఇది. మధ్యమధ్యలో స్వరోవ్‌స్కీ స్ఫటికాలు, ఆకుపచ్చ చిప్‌లతో అలంకరించి ఉంటుంది. అలాగే అక్కడక్కడ కంప్యూటర్ వైర్లు కూడా ఉంటాయి.
ఇక్కడ నటాషా టెక్-ప్రేరేపిత దుస్తులతో సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపించింది. అంతేగాదు ఫ్యాషన్ అంటే ఎవరినో అనుకరించడం కాదు అత్యంత వినూత్నంగా ఆలోచించడం అని ఈ డ్రెస్‌ని చూస్తేనే అనిపిస్తుంది. కాగా, భారతదేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో ఒకరైన అదార్ పూనావాలా భార్యే నటాషా పూనావాలా. ఆమె అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారుగా ప్రసిద్ధి చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.
(చదవండి: బెట్టీ ద ఫ్యాషన్ క్వీన్)
Comments
Please login to add a commentAdd a comment