శ్వేతా శర్మది సాధారణ మధ్యతరగతి కుటుంబ నేపథ్యం. విజయగాథలు వింటూ పెరిగింది. అవన్నీ ఆమెలో ఏదో సాధించాలనే తపనను రగిలించాయి. వివిధ రంగాల పట్ల ఆసక్తిని కలిగించాయి. వాటిల్లో ఒకటే ఫ్యాషన్ డిజైనింగ్. ముంబైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి ఫ్యాషన్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసింది. ‘బెట్టీ ఆఫ్ ఎల్’ పోటీలో గెలిచి, ‘ఎల్ ఇండియా’లో ఇంటర్న్‌గా చేరింది. అప్పుడే తన పేరును శ్వేతా బెట్టీగా మార్చుకుంది. ఆ సమయంలోనే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ల దగ్గర పనిచేసే చాన్స్‌ను అందుకుంది.
స్టయిలింగ్‌పై పట్టు సాధించింది. తర్వాత టీఎల్‌సీ చానల్లో ఫ్యాషన్ ఎడిటర్‌గా చేరింది. కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ చేసింది. ఆ వర్కే ఆమెకు బాలీవుడ్‌లో ఎంట్రన్స్ కల్పించింది. అమితాబ్ బచ్చన్, ఫర్హాన్ అఖ్తర్‌లాంటి ఉద్దండులు నటించిన ‘వజీర్’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా అవకాశం ఇస్తూ! ఆ తర్వాత ఆమె వెనక్కి మళ్లే అవసరమే రాలేదు. ఆమె ఈస్తటిక్ సెన్స్‌కి ముచ్చటపడిన రాధికా ఆప్టే.. తనకు స్టయిలింగ్ చేయమని కోరింది. యెస్ చెప్పింది శ్వేతా.
మూవీ ఈవెంట్స్‌లో రాధికా స్టయిల్, గ్రేస్ చూసిన బాలీవుడ్ దివాస్ అంతా శ్వేతా స్టయిలింగ్‌కి క్యూ కట్టారు. సోనమ్ కపూర్, రియా కపూర్, అదితీ రావ్ హైదరీ, ట్వింకిల్ ఖన్నా, లీసా రే, కృతి సనన్, కియారా ఆడ్వాణీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, కరిశ్మా కపూర్, యామీ గౌతమ్, సోనాక్షీ సిన్హా.. ఆ వరుసలోని వాళ్లే! నటీమణులే కాదు ఇంటర్నేషనల్ మోడల్స్ కూడా ఆమె స్టయిలింగ్‌కి ఫ్యాన్స్ అయిపోయారు.
తమ స్టయిలిస్ట్‌గా ఆమెను అపాయింట్ చేసుకున్నారు. అలా తన ఫ్యాషన్ సెన్స్‌తో సెలబ్రిటీలకు మెరుగులు దిద్దుతూనే సెంట్రల్ సెయింట్ మార్టిన్స్ (యూనివర్సిటీ ఆఫ్ ది ఆర్ట్స్ లండన్) కాలేజ్‌లో కాంటెంపరరీ ఫైన్ ఆర్ట్స్‌లో కోర్స్ చేసింది. ఫొటోగ్రఫీ నేర్చుకుని, మహిళా క్రికెటర్స్‌తో ఫొటో సిరీస్ కూడా చేసింది. ఫ్యాషన్ కంటెంట్‌తో శ్వేతా.. బ్లాగ్‌నూ నిర్వహిస్తోంది. ఆమె ఇన్‌స్టా హ్యాండిల్‌కూ క్రేజీ ఫాలోయింగ్ ఉంది. అలాగే స్టయిలింగ్ అనేది నా దృష్టిలో మన పర్సనాలిటీని వ్యక్తపరచే ఒక మీడియం లాంటిది. వార్డ్‌రోబ్ మన స్వభావాన్ని రిఫ్లెక్ట్ చేసే అద్దం లాంటిదని అంటోంది శ్వేతా.
– శ్వేతా బెట్టీ.
(చదవండి: లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్: ‘తగ్గేదెలే’ అంటున్న స్పెషల్ బ్యూటీ)
Comments
Please login to add a commentAdd a comment