celebratys
-
బెట్టీ ద ఫ్యాషన్ క్వీన్
శ్వేతా శర్మది సాధారణ మధ్యతరగతి కుటుంబ నేపథ్యం. విజయగాథలు వింటూ పెరిగింది. అవన్నీ ఆమెలో ఏదో సాధించాలనే తపనను రగిలించాయి. వివిధ రంగాల పట్ల ఆసక్తిని కలిగించాయి. వాటిల్లో ఒకటే ఫ్యాషన్ డిజైనింగ్. ముంబైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి ఫ్యాషన్ కమ్యూనికేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసింది. ‘బెట్టీ ఆఫ్ ఎల్’ పోటీలో గెలిచి, ‘ఎల్ ఇండియా’లో ఇంటర్న్‌గా చేరింది. అప్పుడే తన పేరును శ్వేతా బెట్టీగా మార్చుకుంది. ఆ సమయంలోనే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ల దగ్గర పనిచేసే చాన్స్‌ను అందుకుంది. స్టయిలింగ్‌పై పట్టు సాధించింది. తర్వాత టీఎల్సీ చానల్లో ఫ్యాషన్ ఎడిటర్‌గా చేరింది. కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ చేసింది. ఆ వర్కే ఆమెకు బాలీవుడ్లో ఎంట్రన్స్ కల్పించింది. అమితాబ్ బచ్చన్, ఫర్హాన్ అఖ్తర్లాంటి ఉద్దండులు నటించిన ‘వజీర్’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా అవకాశం ఇస్తూ! ఆ తర్వాత ఆమె వెనక్కి మళ్లే అవసరమే రాలేదు. ఆమె ఈస్తటిక్ సెన్స్‌కి ముచ్చటపడిన రాధికా ఆప్టే.. తనకు స్టయిలింగ్ చేయమని కోరింది. యెస్ చెప్పింది శ్వేతా. మూవీ ఈవెంట్స్‌లో రాధికా స్టయిల్, గ్రేస్ చూసిన బాలీవుడ్ దివాస్ అంతా శ్వేతా స్టయిలింగ్కి క్యూ కట్టారు. సోనమ్ కపూర్, రియా కపూర్, అదితీ రావ్ హైదరీ, ట్వింకిల్ ఖన్నా, లీసా రే, కృతి సనన్, కియారా ఆడ్వాణీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, కరిశ్మా కపూర్, యామీ గౌతమ్, సోనాక్షీ సిన్హా.. ఆ వరుసలోని వాళ్లే! నటీమణులే కాదు ఇంటర్నేషనల్ మోడల్స్ కూడా ఆమె స్టయిలింగ్కి ఫ్యాన్స్ అయిపోయారు. తమ స్టయిలిస్ట్‌గా ఆమెను అపాయింట్ చేసుకున్నారు. అలా తన ఫ్యాషన్ సెన్స్‌తో సెలబ్రిటీలకు మెరుగులు దిద్దుతూనే సెంట్రల్ సెయింట్ మార్టిన్స్ (యూనివర్సిటీ ఆఫ్ ది ఆర్ట్స్ లండన్) కాలేజ్‌లో కాంటెంపరరీ ఫైన్ ఆర్ట్స్‌లో కోర్స్ చేసింది. ఫొటోగ్రఫీ నేర్చుకుని, మహిళా క్రికెటర్స్‌తో ఫొటో సిరీస్ కూడా చేసింది. ఫ్యాషన్ కంటెంట్‌తో శ్వేతా.. బ్లాగ్నూ నిర్వహిస్తోంది. ఆమె ఇన్‌స్టా హ్యాండిల్కూ క్రేజీ ఫాలోయింగ్ ఉంది. అలాగే స్టయిలింగ్ అనేది నా దృష్టిలో మన పర్సనాలిటీని వ్యక్తపరచే ఒక మీడియం లాంటిది. వార్డ్రోబ్ మన స్వభావాన్ని రిఫ్లెక్ట్ చేసే అద్దం లాంటిదని అంటోంది శ్వేతా.– శ్వేతా బెట్టీ. (చదవండి: లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్: ‘తగ్గేదెలే’ అంటున్న స్పెషల్ బ్యూటీ) -
మగవాళ్లకు స్టయిలింగ్ చేయడమే కష్టం! ఈశా భన్సాలీ
బాలీవుడ్లో రాజ్‌కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానా ఎట్సెట్రా.. హీరోలు కారు. నటులు! వీళ్ల గ్లామర్, గ్రామర్ అంతా కూడా వాళ్ల యాక్టింగ్ టాలెంటే! కానీ ఫ్యాషన్ అండ్ స్టయిల్లో వీళ్లిప్పుడు రణ్వీర్ సింగ్‌తో పోటీపడుతున్నారు! క్రెడిట్.. స్టయిలిస్ట్ ఈశా భన్సాలీదే!ఈశా భన్సాలీ పుట్టిపెరిగింది ముంబైలో! డిజైన్ అండ్ ఇన్నొవేషన్‌లో మాస్టర్స్ చేసింది. చదువైపోయాక చాలామంది ఫ్యాషన్ డిజైనర్స్లాగే ఈశా కూడా ఒక ఫ్యాషన్ మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా వ్యవహరించింది. ఆ బాధ్యతల్లో తలమునకలుగా ఉంటూనే ఫ్యాషన్ షోల్లో పాల్గొనేది. ఆమె అభిరుచి, సూక్ష్మ పరిశీలనే ఈశాకు బాలీవుడ్లో ఎంట్రీ కల్పించాయి. సమకాలీన పోకడలకు సంప్రదాయ సోకును అద్దే ఈశా శైలి బాలీవుడ్లో ఆమెకు ప్రత్యేకతనిచ్చింది.ఆ స్పెషాలిటీయే రాజ్‌కుమార్ రావు ఆమెను సంప్రదించేలా చేసింది.. తనకు స్టయిలిస్ట్‌గా ఉండమని! ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్స్ ఇసుమంత కూడా లేని ఆ నటుడికి స్టయిలిస్ట్‌గా పనిచేయడమంటే సవాలే! ఒకింత రిస్క్ కూడా! తన ఎక్స్పరిమెంట్స్ ఏ కొంచెం అటూ ఇటూ అయినా తన పేరుతో పాటు రాజ్‌కుమార్ రావు ఖ్యాతీ అభాసుపాలవుతుంది. కానీ ఫ్యాషన్ అండ్ స్టయిల్ అంటే పర్సనాలిటీని మెరుగుపరచడమే కదా అనే తన ఫ్యాషన్ స్టెప్ని గుర్తు తెచ్చుకుంది. ఫాలో అయిపోయింది. ఆమె చేసిన స్టయిలింగ్‌తో రాజ్‌కుమార్ రావు సెల్యులాయిడ్ మీద అపియర్ అయ్యాడు. ఆడియెన్స్ మురిసిపోయారు ఆయన నటనతోపాటు ఆ స్టయిల్‌కీ! రాజ్‌కుమార్ రావు న్యూ లుక్స్ అజయ్ దేవ్గణ్నీ అబ్బురపరచాయి. ఆరా తీస్తే ఈశా భన్సాలీ పేరు వినిపించింది. అంతే కబురు పంపాడు. తనకు పర్సనల్ స్టయిలిస్ట్ అవసరం లేదు కానీ సినిమాల్లో తనకు కాస్ట్యూమ్ డిజైన్ చేసేపెట్టే బాధ్యతను తీసుకోమన్నాడు. రాజ్‌కుమార్ రావును మించిన చాలెంజ్ అది. అజయ్ దేవ్గణ్కున్న హీరో ఇమేజే పెద్ద హర్డల్. అయినా అధిగమించింది ఏకంగా ఒక ప్రయోగంతో. ఆ కటౌట్ పర్సనాలిటీకి వైట్ జీన్స్, చెక్స్ బ్లేజర్ కాంబినేషన్ కాస్ట్యూమ్ని డిజైన్ చేసి! ఆ ప్రతిభతో బాలీవుడ్ అటెన్షన్ అంతా ఈశా మీదకు మళ్లింది. చాలామంది డైరెక్టర్స్ తమ సినిమాలకు ఆమెను కాస్ట్యూమ్ డిజైనర్‌గా పెట్టుకున్నారు. వాటిల్లో పీకూ, హిందీ మీడియం చిత్రాలూ ఉన్నాయి.ఈశా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్‌ని ధరించిన స్టార్స్‌లో ఇర్ఫాన్ ఖాన్ కూడా ఉన్నాడు. పని పట్ల ఆమెకున్న కమిట్మెంట్, ఎక్స్‌పరిమెంట్స్‌కి స్టార్స్‌ని ఆమె కన్విన్స్ చేసే విధానం నచ్చిన ఆయుష్మాన్ ఖురానా.. ఈశాను తనకు పర్సనల్ స్టయిలిస్ట్‌గా ఉండమని రిక్వెస్ట్ చేశాడు. ఆయుష్మాన్ ఖురానాకు ఫ్యాషన్ స్పృహ మెండు. ఇది కూడా ఆమెకు చాలెంజే అయింది. అన్నిట్లో ప్రవేశం .. కొన్నిట్లో ప్రావీణ్యం ఉన్న ఆయుష్మాన్లాంటి వాళ్లను మెప్పించడం మహా కష్టం. అయితే ఆ నటుడు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంది ఈశా.. ఆయన వ్యక్తిత్వానికి తగిన స్టయిల్ని జోడించి.. ఆ పర్సన్‌ని మరింత ఎలిగెంట్‌గా ప్రెజెంట్ చేసి! ఆ కాంబినేషన్ ఆఫ్ జర్నీ ఇంకా కొనసాగుతోంది!‘ఆడవాళ్లకు స్టయిలింగ్ చేయడం కష్టం అనుకుంటారు కానీ.. ఈజీ! మగవాళ్లకే కష్టం. ఫర్ ఎగ్జాంపుల్.. రెడ్‌కార్పెట్ కోసం ఫీమేల్ స్టార్స్‌కి స్టయిలింగ్ చేయాలనుకోండి.. గౌను.. దానికి తగ్గ జ్యూలరీ అండ్ షూస్ మీద దృష్టి పెడితే చాలు. అదే మగవాళ్లకైతే.. జాకెట్, టై ఉండాలా.. వద్దా.. ఉంటే మ్యాచింగ్ టై, లేపల్ పిన్, షూస్, సాక్స్, కఫిన్స్.. ఓ మై గాడ్.. ఎన్ననీ! ఆయుష్మాన్ ఖురానాతో ప్రమోషన్స్ అంటే చాలా ఎక్సయిట్మెంట్గా ఉంటుంది. క్రియేటివిటీ హై లెవెల్లో ఉంటుంది! నా పర్సనల్ స్టయిల్ని డిస్క్రైబ్ చేయాలంటే నేను మినిమలిజమ్ని ఇష్టపడతాను. నా స్టేట్మెంట్ పీస్ ఒక్కదానితో నా ఎంటైర్ లుక్‌ని ప్రెజెంట్ చేస్తాను. ఒక్కమాటలో చెప్పాలంటే సింప్లిఫైడ్ వెర్షన్ ఆఫ్ ఎలెక్టిక్ అన్నమాట!’ --ఈశా భన్సాలీ -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: ఏడుకొండల వాడి దివ్య దర్శనానికి సోమవారం పలువురు ప్రముఖులు తరలివచ్చారు. వైఎస్సీర్సీపీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కె. శ్రీనివాసులు, టీడీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామాహేశ్వర్ రావు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి వారు స్వామిని దర్శించుకున్నారు. ఒకరికి ఒకరు సినిమా ఫేం హీరో శ్రీరామ్ దంపతులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.