మగవాళ్లకు స్టయిలింగ్‌ చేయడమే కష్టం! ఈశా భన్సాలీ | Celebrity Stylist Isha Bhansali Talks | Sakshi
Sakshi News home page

మగవాళ్లకు స్టయిలింగ్‌ చేయడమే కష్టం! ఈశా భన్సాలీ

Published Sun, May 19 2024 4:53 PM | Last Updated on Sun, May 19 2024 5:33 PM

Celebrity Stylist Isha Bhansali Talks

బాలీవుడ్‌లో రాజ్‌కుమార్‌ రావు, ఆయుష్మాన్‌ ఖురానా ఎట్‌సెట్రా.. హీరోలు కారు. నటులు! వీళ్ల గ్లామర్, గ్రామర్‌ అంతా కూడా వాళ్ల యాక్టింగ్‌ టాలెంటే! కానీ ఫ్యాషన్‌ అండ్‌ స్టయిల్‌లో వీళ్లిప్పుడు  రణ్‌వీర్‌ సింగ్‌తో పోటీపడుతున్నారు! క్రెడిట్‌.. స్టయిలిస్ట్‌ ఈశా భన్సాలీదే!

ఈశా భన్సాలీ పుట్టిపెరిగింది ముంబైలో! డిజైన్‌ అండ్‌ ఇన్నొవేషన్‌లో మాస్టర్స్‌ చేసింది. చదువైపోయాక చాలామంది ఫ్యాషన్‌ డిజైనర్స్‌లాగే ఈశా కూడా ఒక ఫ్యాషన్‌ మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా వ్యవహరించింది. ఆ బాధ్యతల్లో తలమునకలుగా ఉంటూనే ఫ్యాషన్‌ షోల్లో పాల్గొనేది. ఆమె అభిరుచి, సూక్ష్మ పరిశీలనే ఈశాకు బాలీవుడ్‌లో ఎంట్రీ కల్పించాయి. సమకాలీన పోకడలకు సంప్రదాయ సోకును అద్దే ఈశా శైలి బాలీవుడ్‌లో ఆమెకు ప్రత్యేకతనిచ్చింది.

ఆ స్పెషాలిటీయే రాజ్‌కుమార్‌ రావు ఆమెను సంప్రదించేలా చేసింది.. తనకు స్టయిలిస్ట్‌గా ఉండమని! ఫ్యాషన్‌ ఇన్‌ఫ్లుయెన్స్‌ ఇసుమంత కూడా లేని ఆ నటుడికి స్టయిలిస్ట్‌గా పనిచేయడమంటే సవాలే! ఒకింత రిస్క్‌ కూడా! తన ఎక్స్‌పరిమెంట్స్‌ ఏ కొంచెం అటూ ఇటూ అయినా తన పేరుతో పాటు రాజ్‌కుమార్‌ రావు ఖ్యాతీ అభాసుపాలవుతుంది. కానీ ఫ్యాషన్‌ అండ్‌ స్టయిల్‌ అంటే పర్సనాలిటీని మెరుగుపరచడమే కదా అనే తన ఫ్యాషన్‌ స్టెప్‌ని గుర్తు తెచ్చుకుంది. 

ఫాలో అయిపోయింది. ఆమె చేసిన స్టయిలింగ్‌తో రాజ్‌కుమార్‌ రావు సెల్యులాయిడ్‌ మీద అపియర్‌ అయ్యాడు. ఆడియెన్స్‌ మురిసిపోయారు ఆయన నటనతోపాటు ఆ స్టయిల్‌కీ! రాజ్‌కుమార్‌ రావు న్యూ లుక్స్‌ అజయ్‌ దేవ్‌గణ్‌నీ అబ్బురపరచాయి. ఆరా తీస్తే ఈశా భన్సాలీ పేరు వినిపించింది. అంతే కబురు పంపాడు. తనకు పర్సనల్‌  స్టయిలిస్ట్‌ అవసరం లేదు కానీ సినిమాల్లో తనకు కాస్ట్యూమ్‌ డిజైన్‌ చేసేపెట్టే బాధ్యతను తీసుకోమన్నాడు. 

రాజ్‌కుమార్‌ రావును మించిన చాలెంజ్‌ అది. అజయ్‌ దేవ్‌గణ్‌కున్న హీరో ఇమేజే పెద్ద హర్డల్‌. అయినా అధిగమించింది ఏకంగా ఒక ప్రయోగంతో. ఆ కటౌట్‌ పర్సనాలిటీకి వైట్‌ జీన్స్, చెక్స్‌ బ్లేజర్‌ కాంబినేషన్‌ కాస్ట్యూమ్‌ని డిజైన్‌ చేసి! ఆ ప్రతిభతో బాలీవుడ్‌ అటెన్షన్‌ అంతా ఈశా మీదకు మళ్లింది. చాలామంది డైరెక్టర్స్‌ తమ సినిమాలకు ఆమెను కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పెట్టుకున్నారు. వాటిల్లో  పీకూ, హిందీ మీడియం చిత్రాలూ ఉన్నాయి.

ఈశా డిజైన్‌ చేసిన కాస్ట్యూమ్స్‌ని ధరించిన స్టార్స్‌లో ఇర్ఫాన్‌ ఖాన్‌ కూడా ఉన్నాడు. పని పట్ల ఆమెకున్న కమిట్‌మెంట్, ఎక్స్‌పరిమెంట్స్‌కి స్టార్స్‌ని ఆమె కన్విన్స్‌ చేసే విధానం నచ్చిన ఆయుష్మాన్‌ ఖురానా.. ఈశాను తనకు పర్సనల్‌ స్టయిలిస్ట్‌గా ఉండమని రిక్వెస్ట్‌ చేశాడు. ఆయుష్మాన్‌ ఖురానాకు ఫ్యాషన్‌ స్పృహ మెండు. ఇది కూడా ఆమెకు చాలెంజే అయింది. అన్నిట్లో ప్రవేశం .. కొన్నిట్లో ప్రావీణ్యం ఉన్న ఆయుష్మాన్‌లాంటి వాళ్లను మెప్పించడం మహా కష్టం. అయితే ఆ నటుడు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంది ఈశా.. ఆయన వ్యక్తిత్వానికి తగిన స్టయిల్‌ని జోడించి.. ఆ పర్సన్‌ని మరింత ఎలిగెంట్‌గా ప్రెజెంట్‌ చేసి! ఆ కాంబినేషన్‌ ఆఫ్‌ జర్నీ ఇంకా కొనసాగుతోంది!

‘ఆడవాళ్లకు స్టయిలింగ్‌ చేయడం కష్టం అనుకుంటారు కానీ.. ఈజీ! మగవాళ్లకే కష్టం. ఫర్‌ ఎగ్జాంపుల్‌.. రెడ్‌కార్పెట్‌ కోసం ఫీమేల్‌ స్టార్స్‌కి స్టయిలింగ్‌ చేయాలనుకోండి..  గౌను.. దానికి తగ్గ జ్యూలరీ అండ్‌ షూస్‌ మీద దృష్టి పెడితే చాలు. అదే మగవాళ్లకైతే.. జాకెట్, టై ఉండాలా.. వద్దా.. ఉంటే మ్యాచింగ్‌ టై, లేపల్‌ పిన్, షూస్, సాక్స్, కఫిన్స్‌.. ఓ మై గాడ్‌.. ఎన్ననీ! ఆయుష్మాన్‌ ఖురానాతో ప్రమోషన్స్‌ అంటే చాలా ఎక్సయిట్‌మెంట్‌గా ఉంటుంది. క్రియేటివిటీ హై లెవెల్లో ఉంటుంది! నా పర్సనల్‌ స్టయిల్‌ని డిస్‌క్రైబ్‌ చేయాలంటే నేను మినిమలిజమ్‌ని ఇష్టపడతాను. నా స్టేట్‌మెంట్‌ పీస్‌ ఒక్కదానితో నా ఎంటైర్‌ లుక్‌ని ప్రెజెంట్‌ చేస్తాను. ఒక్కమాటలో చెప్పాలంటే సింప్లిఫైడ్‌ వెర్షన్‌ ఆఫ్‌ ఎలెక్టిక్‌ అన్నమాట!’
 --ఈశా భన్సాలీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement