బిగ్‌బాస్‌ నటి బ్రేకప్‌.. నువ్వు ఇంకా ఎదగాలన్న మరో నటి! | Rinku Dhawan Hits Back At Isha Malviya For Commenting On Her Divorce | Sakshi
Sakshi News home page

Isha Malviya: నటి విడాకులపై కామెంట్స్‌.. మీ మాటలు చూస్తేనే తెలుస్తోంది!

Published Fri, May 31 2024 8:08 PM | Last Updated on Fri, May 31 2024 8:47 PM

Rinku Dhawan Hits Back At Isha Malviya For Commenting On Her Divorce

బిగ్‌బాస్‌ బ్యూటీ ఇషా మాల్వియా ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. బాయ్‌ఫ్రెండ్‌ సమర్థ్ ‍జురెల్‌తో బ్రేకప్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. హౌస్‌లో ఉండగానే వీరిమధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరు విడిపోవడం మరో నటి, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ రింకూ ధావన్‌ విమర్శలు చేసింది. ఇషా మాల్వియా మరో ఆరు నెలల్లో కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో కనిపిస్తుందని కామెంట్స్‌ చేసింది.

అయితే రింకూ ధావన్‌ చేసిన కామెంట్స్‌పై ఇషా మాల్వియా గట్టిగానే రియాక్ట్‌ అయింది. ముందు నీ జీవితం ఎలా ఉందో చూస్కో అంటూ ఇచ్చిపడేసింది. ఈ టాపిక్ కాస్తా ఇద్దరి మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఇషా కామెంట్స్‌పై రింకూ ధావన్‌ స్పందించింది. మీరు నా వైవాహిక జీవితం, విడాకుల తీరు గురించి మాట్లాడిన తీరు మీ సున్నితత్వాన్ని తెలియజేస్తోందని అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బిగ్ బాస్ తర్వాత ఇషాతో టచ్‌లో కూడా లేనని చెప్పింది.

రింకూ తన ఇన్‌స్టాలో రాస్తూ..' నువ్వు తెలివిగలదానివి అని చెప్పా. అందులో తప్పేం లేదు. నీ జీవితం నీ ఇష్టం. నేను అందులో జోక్యం చేసుకోవడం లేదు. ఎందుకంటే మీరు ప్రతి విషయాన్ని సొంతంగా హ్యాండిల్‌ చేయగలరు. నా విడాకుల గురించి మీరు మాట్లాడిన విధానం చూస్తే మీ సున్నితత్వాన్ని తెలియజేసింది. జీవితంలో మీరు నిజంగా ఎదగాలని కోరుకుంటున్నా. అదే జరగకపోతే రాబోయే 8 నెలల్లో ఇలాంటి ప్రకటనలే వస్తాయి. విష్ యూ గుడ్‌ లక్‌' అంటూ పోస్ట్‌ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement