![Bollywood Actress Gauhar Khan Buys Three Luxury Apartments In Mumbai](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/khan.jpg.webp?itok=YKyL08Vf)
గౌహర్ ఖాన్.. బాలీవుడ్‌లో ఆమె పేరు చాలా పాపులర్. బిగ్‌బాస్ సీజన్-7 విన్నర్, టీవీ స్టార్,మోడల్,హీరోయిన్ ఇలా పలు రంగాల్లో రాణించింది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్‌తో తెలుగు వారికి గౌహర్ ఖాన్ సుపరిచయమే. ఇందులో 'నాపేరే కాంచనమాల' అనే స్పెషల్ సాంగ్‌తో అభిమానులను ఓ రేంజ్‌లో అలరించింది. ఈ పాటతో తెలుగు కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టింది బాలీవుడ్ భామ.
అయితే ఈ బాలీవుడ్ బ్యూటీ ముంబయిలో ఖరీదైన అపార్ట్‌మెంట్స్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వర్సోవా ప్రాంతంలో దాదాపు రూ.10 కోట్లకు పైగా విలువ చేసే మూడు లగ్జరీ అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేసింది. వీటిలో అత్యంత ఆధునాతన సౌకర్యాలు కలిగి ఉన్నాయి. ఈ నెలలోనే రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకుంది. కాగా.. 2013లో బిగ్ బాస్ సీజన్- 7 టైటిల్ గెలిచిన గౌహర్ ఖాన్, మోడలింగ్‌తో పాటు హిందీ చిత్రాల్లో నటించింది.
18 ఏళ్ల వయసులో మోడల్‌గా కెరీర్ ఆరంభించిన గౌహర్‌ఖాన్ పలు అందాల పోటీల్లోనూ పాల్గొన్నారు. యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఆమె పలు సీరియల్స్‌లోనూ నటించారు. గేమ్, రాకెట్ సింగ్, ఫీవర్, బేగం జాన్ వంటి చిత్రాలతో పాటు తాండవ్ వెబ్ సిరీస్ ఆమెకు మంచి పేరును తెచ్చాయి. 2020లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జైద్ దర్బార్(25)ను పెళ్లాడింది. ఆమె కంటే చిన్నవాడిని పెళ్లి చేసుకోవడంతో అప్పట్లో విమర్శలొచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment