![Bollywood Actor Prince Narula wife Yuvika Chaudhary announce pregnancy](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/06/26/bollywood.jpg.webp?itok=bi7bA9XD)
బాలీవుడ్ జంట ప్రిన్స్ నరులా- యువికా చౌదరి త్వరలో పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందనున్నారు. బిగ్‌బాస్ -9 సీజన్‌లో పరిచయమైన ఈ జంట ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగానే ప్రిన్స్.. ఆమెకు ప్రపోజ్ చేశాడు. అతడి ప్రేమకు ముగ్దురాలైన యువిక వెంటనే ఓకే చెప్పింది. అనంతరం ఈ ప్రేమజంట 2018 జనవరిలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అదే ఏడాది అక్టోబర్‌లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.
తాజాగా యువికా చౌదరి గర్భం ధరించినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 'మా జీవితాల్లోకి త్వరలోనే బేబీ రాబోతోంది' అంటూ ఇన్‌స్టా వేదికగా రాసుకొచ్చారు. తన భార్య నుంచి అందుకునే ఉత్తమ బహుమతి ఇదే అంటూ ఆమెకు ప్రిన్స్ నరులా కృతజ్ఞతలు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.
కాగా.. 2019లో నాచ్ బలియే అనే డ్యాన్స్ షోలో జంటగా పాల్గొని గెలిచారు. ప్రిన్స్ నరౌలా రియాలిటీ షోలలో తన టాలెంట్ చూపించేవాడు. 2015లో వచ్చిన రోడీస్- 2 సీజన్‌లో విజేతగా నిలిచాడు. మరోవైపు అతను స్ప్లిట్స్ విల్లా 8వ సీజన్ ట్రోఫీ గెలుచుకున్నాడు. హిందీ బిగ్‌బాస్ 9వ సీజన్ టైటిల్ అందుకున్నాడు. నటి యువికా చౌదరి.. ఓం శాంతి ఓం, నాటీ @40, వీరే కీ వెడ్డింగ్, ఎస్‌పీ చౌహాన్, ద పవర్ వంటి చిత్రాల్లో నటించింది.
Comments
Please login to add a commentAdd a comment