గుర్తు పట్టలేని విధంగా మారిపోయిన బిగ్‌బాస్‌ బ్యూటీ.. అసలేం జరిగింది? | Urfi Javed shares shocking pictures of her face in instagram | Sakshi
Sakshi News home page

Urfi Javed: 'దయచేసి సలహాలు ఇవ్వకండి.. షాకింగ్‌ లుక్‌లో ఉర్ఫీ..అసలేమైందంటే? '!

Published Mon, Jun 3 2024 4:10 PM | Last Updated on Mon, Jun 3 2024 5:53 PM

Urfi Javed shares shocking pictures of her face in instagram

సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తూ ఫేమస్ అయిన బ్యూటీ ఉర్ఫీ జావెద్. ఈ బాలీవుడ్‌ భామకు బిగ్‌బాస్‌తోనే గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత బోల్డ్‌ ఫ్యాషన్ దుస్తులతో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. విచిత్రమైన ఫ్యాషన్ డ్రెస్సులు ధరించి ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇదిలా ఉండగా.. తాజాగా తన ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసింది ముద్దుగుమ్మ. గుర్తు పట్టలేని విధంగా ఉన్న ఫోటోలు పంచుకున్న భామ.. తనకెదురైన సమస్యను ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.

తాను అధికంగా ఫిల్లర్స్ వాడినందు వల్లే మొహం ఇలా మారిపోయిందంటూ ఉర్ఫీ రాసుకొచ్చింది. వాటి వల్లే అలర్జీ బారిన పడినట్లు తెలిపింది. ప్రతి రోజు ఇదే సమస్యతో నిద్ర లేస్తానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వీటితో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు పేర్కొంది. 

ఉర్ఫీ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'అధికస్థాయిలో ఫిల్లర్స్‌ వల్ల నా ముఖంలో ఇలా మారిపోయింది. నాకు అలెర్జీలు ఉన్నాయి. అంతే కాదు నా ముఖం చాలాచోట్ల ఉబ్బినట్లు కనిపిస్తుంది. నేను ప్రతి రోజు ఇలానే నిద్రలేస్తాను. నా ముఖం ఎప్పుడూ వాచి ఉంటుంది. ఎప్పుడూ తీవ్రమైన అసౌకర్యంగా ఉంటా. ఇవేమీ ఫిల్లర్స్ కాదు అబ్బాయిలు.. అలెర్జీ వల్లే ఏర్పడిందే. ఇమ్యునోథెరపీ తర్వాత ఇలా వాచిపోయిన ముఖంతో చూస్తే.. నేను అలర్జీతో బాధపడుతున్నా. నాకు 18 ఏళ్ల వయస్సు నుంచి ఉపయోగిస్తున్న  సాధారణ ఫిల్లర్లు, బొటాక్స్ వల్ల ఏం కాలేదు. కానీ మీకు నా ముఖం ఉబ్బినట్లు కనిపిస్తే, ఎక్కువ ఫిల్లర్స్‌ తీసుకోమని మాత్రం సలహా ఇవ్వకండి. కాస్తా దయ చూపండి చాలు'  అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్‌ గెట్‌ వెల్ సూన్‌ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement