
బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ గురించి పరిచయం అక్కర్లేదు. వెరైటీ డ్రెస్సులతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఈ భామ తన డ్రెస్సింగ్ స్టైల్‌తో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. చిరిగిన బట్టలు, పగిలిన గ్లాస్ ముక్కలు, గోనెసంచి.. ఇలా ఒకటేమిటి ఫ్యాషన్‌కు కాదేదీ అనర్హం అన్నట్లు రకరకాల కాస్ట్యూమ్స్‌తో దర్శనం ఇస్తుంది. తన బోల్డ్ ఫ్యాషన్‌తో సోషల్ మీడియాను షేక్ చేసే ఉర్ఫీ తాజాగా చిన్నతనంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తుచేసుకుంది.
ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి నాకు ఫ్యాషన్‌పై మక్కువ ఉండేది, టీవీ షోస్ చూస్తున్నప్పుడు అలాంటి మోడ్రన్ డ్రస్సులు వేసుకోవాలని, ఇంకా అందంగా తయారవ్వాలని అనిపించేది. కానీ మా నాన్న అందుకు అంగీకరించేవాడు కాదు. పైపెచ్చు మమ్మల్ని హింసించేవాడు.
అమ్మను ఎప్పుడూ తిడుతూ, కొడుతూ చిత్రహింసలు పెట్టేవాడు. తండ్రి చేస్తున్న అరాచాకలను భరించలేక రెండుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశాను. కానీ ఇప్పుడు నాకు నచ్చిన బట్టలు వేసుకుంటూ నాకు తెలిసిన ఫ్యాషన్‌ను ఫాలో అవుతున్నా అంటూ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment