నీకేంటి ప్రాబ్లం.. బాడీగార్డ్‌పై బిగ్‌ బాస్‌ బ్యూటీ ఫైర్..! | Shehnaaz Gill Shouts at Her Bodyguard for Pushing Fans In Dubai | Sakshi
Sakshi News home page

Shehnaaz Gill: బాడీగార్డ్‌పై బిగ్‌ బాస్‌ బ్యూటీ ఫైర్.. నెటిజన్ల ప్రశంసలు

Published Sat, Nov 19 2022 5:52 PM | Last Updated on Sat, Nov 19 2022 6:06 PM

Shehnaaz Gill Shouts at Her Bodyguard for Pushing Fans In Dubai - Sakshi

బిగ్ బాస్ బ్యూటీ షెహనాజ్‌కౌర్ గిల్‌ తన బాడీగార్డుపై సీరియస్ అయింది. ఆమెతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. అదే సమయంలో పక్కనే ఉన్న ఆమె బాడీగార్డ్ ఫ్యాన్స్‌పై దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన బిగ్ బాస్ ఫేమ్‌ అతనిపై విరుచుకుపడింది. నీ సమస్య ఏంటని నిలదీసింది. దీంతో షెహనాజ్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

ఎక్కడ జరిగిందంటే..: షెహనాజ్‌ కౌర్ గిల్ దుబాయ్‌లో ఒక ఈవెంట్‌కు హాజరయ్యేందుకు వెళ్లింది. అదే సమయంలో ఆమెతో ఫోటోలు దిగడానికి అభిమానులు పెద్దఎత్తున చుట్టుముట్టారు. అక్కడే ఉన్న ఆమె బాడీగార్డ్‌ అభిమానులను దూరంగా నెట్టివేశారు. ఈ సంఘటన బిగ్‌ బాస్‌ నటికి కోపం తెప్పించింది. వెంటనే బాడీగార్డ్‌పై పెద్దగా అరిచింది. నీ సమస్య ఏంటని బాడీగార్డ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అభిమానులు ఫోటోలు దిగడానికి వస్తే అనవసరంగా భయాందోళనకు గురి చేయొద్దని మండిపడింది. షెహనాజ్‌ కౌర్ గిల్‌ సింప్లిసిటీకి ఫ్యాన్స్‌ అందరూ చప్పట్లు కొట్టారు. షెహనాజ్‌ గిల్‌కు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఆమెను విపరీతంగా ప్రేమించే వారు చాలా మంది ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement