Shehnaaz Kaur Gill
-
Shehnaaz Kaur Gill: అందాలు హోరెత్తిస్తున్న షెహ్నాజ్ గిల్ (ఫోటోలు)
-
Shehnaaz Gill: అమ్మో అమ్మాయేనా.. ఎల్లోరా శిల్పమా..! (ఫోటోలు)
-
షాండ్‌విచ్ దెబ్బకు ఆస్పత్రిపాలైన టాప్ హీరోయిన్
మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి నటిగా మారిన 'షెహనాజ్ కౌర్ గిల్' బాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు. 2019లో రియాలిటీ షో బిగ్ బాస్ 13లో పాల్గొన్న ఆమె మూడవ స్థానంలో నిలిచింది. తాజాగా 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' చిత్రంలో కూడా ఆమె మెరిశారు. భూమి పెడ్నేకర్, షిబానీ బేడీ, కుషా కపిలతో ఇటీవల 'థ్యాంక్యూ ఫర్ కమింగ్'లో కనిపించిన షెహనాజ్ గిల్ ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆసుపత్రి పాలైంది. ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించిన రియా కపూర్ అనారోగ్యంతో బాధపడుతున్న షెహనాజ్ గిల్‌ను కలవడానికి ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిని తాజాగా సందర్శించింది. రియా కపూర్ తన కారులో బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఆమె ఫోటో వైరల్ అయింది. (ఇదీ చదవండి; నాగ చైతన్య షేర్ చేసిన ఫోటో.. మళ్లీ ఒకటిగా సమంత- చైతూ) షెహ్నాజ్ గిల్ తన అభిమానులకు, అనుచరులకు ఆమె పరిస్థితి గురించి తెలియజేయడానికి హాస్పిటల్ బెడ్ నుంచి ఇన్స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చింది. 'అబ్బాయిలు, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల కొంతమేరకు ఇబ్బంది పడ్డాను. ఇలాంటి సమయం అందరికి ఎదురౌతుంది. తర్వాత దానంతట అదే పోతుంది. నా విషయంలో కూడా అదే జరిగింది. నేను శాండ్విచ్ తినడం వల్ల ఫుడ్ ఇన్ఫెక్షన్ అయినట్లు వైద్యులు గుర్తించారు. నా గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. మరో రెండు రోజుల్లో నేను ఇంటికి కూడా చేరుకుంటాను.' అని ఆమె తెలిపింది. తన అభిమానులతో ఆమె ఎంతో క్యూట్‌గా మాట్లాడింది. అక్టోబర్ 6న విడుదలైన థ్యాంక్యూ ఫర్ కమింగ్ చిత్రం విడుదలై ప్రేక్షకుల ముందు మంచి టాక్ తెచ్చుకుంది. షెహనాజ్ ఈ సినిమా విడుదలకు ముందు విస్తృతంగా ప్రచారం చేసింది. సినిమా స్పెషల్ స్క్రీనింగ్ నుంచి పలు ప్రమోషన్స్ కార్యక్రమాల వరకు అన్నీ తానై చూసుకుంది. ఆమె గురు రంధవా, వరుణ్ శర్మ, మరికొందరు స్నేహితులతో కలిసి సినిమా చూసింది. షెహ్నాజ్ గిల్ బాలీవుడ్లో సింగర్‌గా కూడా రానించిన విషయం తెలిసిందే. Get well soon ShehnaazGill is in Hospital 🥺💔#ShehnaazGiIl #shehnaazkaurgill #Shehnaazians #ShehnaazKaurGiII #ShehnaazGallery pic.twitter.com/CKANiBIWex — Asmakhan (@zoyakhan9948a) October 9, 2023 View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) -
రూ.80 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన 'బిగ్‌బాస్' బ్యూటీ!
సాధారణంగా సెలబ్రిటీలకు ఏదో ఓ వ్యసనం ఉంటుంది. కొందరు బట్టలంటే ఇష్టం. మరికొందరికి ట్రావెలింగ్ అంటే పిచ్చి. మరికొందరైతే కొత్త మోడల్ మార్కెట్లోకి రావడం లేటు వెంటనే ఆయా కార్, బైక్ లాంటివి కొనేస్తుంటారు. ప్రముఖ నట కూడా ఇప్పుడు అలానే రూ.80 లక్షల విలువైన బెంజ్ కార్ సొంతం చేసుకుంది. కాకపోతే దాన్ని మరో వ్యక్తికి బహుమతిగా ఇచ్చింది. (ఇదీ చదవండి: అతడితో డేటింగ్ వల్ల బరువు తగ్గాను: రాశీఖన్నా) పంజాబీ నటి అయిన షెహనాజ్ గిల్.. సొంత భాషలోనే పలు సినిమాల్లో హీరోయిన్గా చేసింది. బిగ్‌బాస్ హిందీ 13లో పాల్గొంది. అదే సీజన్లో ఆడిన బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లాతో ప్రేమలో పడి రిలేషన్షిప్ మెంటైన్ చేసింది. బిగ్‌బాస్ జోడీగా అప్పట్లో వీళ్లు చాలా పాపులర్ అయ్యారు. అయితే సిద్ధార్థ్ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చనిపోయాడు. అప్పటినుంచి షెహనాజ్ సింగిల్‌గానే ఉంటోంది. ఈ మధ్య సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్'తో ప్రేక్షకుల్ని పలకరించిన షెహనాజ్.. ఇప్పుడు రూ.80 లక్షలు విలువైన బెంజ్ కారుని తమ్ముడు షెహబాజ్ బాద్ షాకి గిఫ్ట్‌గా ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. షెహనాజ్ దగ్గర ఇప్పటికే రేంజ్ రోవర్, జాగ్వార్, బెంజ్ ఎస్ క్లాస్ కార్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by SHEHBAZ BADESHA (@badeshashehbaz) (ఇదీ చదవండి: దేవుడి సినిమాకు 'A' సర్టిఫికెట్.. మరో కాంట్రవర్సీ?) -
నటితో డేటింగ్.. నాకంత టైం కూడా లేదు!
బిగ్ బాస్ ఫేమ్, బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే సల్మాన్ ఖాన్ చిత్రం కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ చిత్రంలో నటించింది. బాలీవుడ్లో సీరియల్స్‌తో పాటు పలు చిత్రాల్లో నటించింది. అయితే షెహనాజ్ గిల్ బిగ్ బాస్- 13లో తన సహ-కంటెస్టెంట్, బాలికా వధు నటుడు సిద్ధార్థ్ శుక్లాతో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించింది. అయితే ఊహించని విధంగా సిద్ధార్థ్ శుక్లా కథ విషాదాంతంగా మారింది. అనుకోని విధంగా సిద్ధార్థ మరణించాడు. ఆ తర్వాత షెహనాజ్ గిల్ మరొకరితో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స వినిపించాయి. మరో నటుడు రాఘవ్ జుయల్‌తో డేటింగ్లో ఉందని బీటౌన్‌లో గుసగుసలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నటుడు రాఘవ్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా షెహనాజ్‌తో రిలేషన్‌పై నోరు విప్పారు. రాఘవ్ మాట్లాడుతూ..'రాబోయే కొద్ది నెలల్లో మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆ పనులతోనే నేను బిజీగా ఉన్నా. ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నా. ఎవరితోను రిలేషన్లో లేను. నాకు ఒకరిని ప్రేమించేందుకు, రిలేషన్లో కొనసాగించేంత టైం కూడా లేదు.' అని అన్నారు. కాగా.. సిద్ధార్థ్ మరణం తర్వాత షెహనాజ్ రెండు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ సల్మాన్ 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'తో రీ ఎంట్రీ ఇచ్చింది. కాగా.. షెహనాజ్, రాఘవ్ జుయల్ ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం తర్వాత వీరిద్దరూ పలుసార్లు జంటగా కనిపించారు. దీంతో వీరిపై డేటింగ్ రూమర్స్ పెద్దఎత్తున ఊపందుకున్నాయి. View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) -
ప్రేమలో ప్రతిసారీ నేనే మోసపోయాను: యంగ్ హీరోయిన్
దాదాపు హీరోయిన్లు ఎవరైనా సరే తమ జీవితంలోని ప్రేమ, రిలేషన్షిప్ గురించి మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడరు. కొన్నిసార్లు మాత్రం సందర్భాన్ని బట్టి బయటపడుతుంటారు. అలా ఇప్పుడు బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్.. తన ప్రేమ, బ్రేకప్స్ గురించి రివీల్ చేసింది. తను ఎవరినీ మోసం చేయలేదని, ప్రతిసారీ తనే మోసపోయాననే విషయాన్ని బయటపెట్టింది. పంజాబీ నటి అయిన షెహనాజ్ గిల్.. సొంత భాషలో పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లాతో రిలేషన్లో ఉంది. బిగ్‌బాస్‌లో ఈ జోడీ అప్పట్లో చాలా పాపులర్. కానీ సిద్ధార్థ్ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చనిపోయాడు. దీంతో షెహనాజ్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. కొన్నాళ్లకు కుదుటపడి సినిమాలు, ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ కాస్త బిజీగా ఉంది. తాజాగా షెహనాజ్ నటించిన ఓ ఆల్బమ్ సాంగ్ విడుదలైంది. ఈ సందర్భంగానే తన బ్రేకప్స్ గురించి మాట్లాడింది. 'నేను ఎవరినీ ప్రేమ విషయమై మోసం చేయలేదు. కానీ నన్నే చాలాసార్లు మోసం చేశారు. ఈ రోజుల్లో నేను నమ్మేది ఒక్కటే. బ్రేకప్ చెప్పి, దూరంగా వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోండి' అని నటి షెహనాజ్ గిల్ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తాను పూర్తిగా రిలేషన్‌షిప్‌కు దూరం కాలేదని, నిజమైన ప్రేమ దొరికితే మాత్రం అస్సలు విడిచిపెట్టనని క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: మహేశ్నే మించిపోయిన సితార.. ఆ ఒక్క విషయంలో) -
ఖరీదైన ఇంటిని కొనుగోలు బిగ్ బాస్ బ్యూటీ!
ఇటీవల సల్మాన్ ఖాన్ చిత్రం కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం ద్వారా బిగ్ బాస్ బ్యూటీ షెహనాజ్ గిల్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అయితే తాజాగా ఆమె ముంబయిలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆమె ప్రశంసలతో ముంచెత్తారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది బిగ్ బాగ్ బ్యూటీ. విదేశాల్లోని స్నేహితులు సైతం ఆమెను అభినందించారు. అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు తెలిపింది ముద్దుగుమ్మ. గతంలో షెహనాజ్ ఎదుర్కొన్న కష్టాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. పంజాబీ చిత్ర పరిశ్రమలో తొలినాళ్లలో పడిన ఇబ్బందులను పంచుకుంది. షెహనాజ్ మాట్లాడుతూ.. 'నేను వెనక్కి తిరిగి చూసుకుంటే పెద్దగా సాధించింది ఏం లేదు. నా విధిరాత ఎప్పటికైనా మారుతుందని భావించా. మొదట్లో నేను సినిమాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు సెట్‌కు పిలిచి మరీ అవమానించారు. అదేదో ముందే చెప్పాల్సింది. రమ్మని పిలిచి తీరా అలా చేయడం కరెక్ట్ కాదు. తను ఓ చిన్నపిల్ల.. మనం ఆమెను ఎలా తీసుకుంటాం అన్నారు. ఇది నాకు చాలా బాధ కలిగించింది. ఈ రోజు రిజెక్ట్ కావడం నా మంచి కోసమే జరిగిందని భావిస్తున్నా.' అని అన్నారు. కాగా.. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రంలో భూమికా చావ్లా, రాఘవ్ జుయాల్, పాలక్ తివారీ నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 21న సినిమా థియేటర్లలో విడుదలైంది. -
నీకేంటి ప్రాబ్లం.. బాడీగార్డ్‌పై బిగ్ బాస్ బ్యూటీ ఫైర్..!
బిగ్ బాస్ బ్యూటీ షెహనాజ్కౌర్ గిల్ తన బాడీగార్డుపై సీరియస్ అయింది. ఆమెతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. అదే సమయంలో పక్కనే ఉన్న ఆమె బాడీగార్డ్ ఫ్యాన్స్‌పై దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన బిగ్ బాస్ ఫేమ్ అతనిపై విరుచుకుపడింది. నీ సమస్య ఏంటని నిలదీసింది. దీంతో షెహనాజ్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎక్కడ జరిగిందంటే..: షెహనాజ్ కౌర్ గిల్ దుబాయ్‌లో ఒక ఈవెంట్‌కు హాజరయ్యేందుకు వెళ్లింది. అదే సమయంలో ఆమెతో ఫోటోలు దిగడానికి అభిమానులు పెద్దఎత్తున చుట్టుముట్టారు. అక్కడే ఉన్న ఆమె బాడీగార్డ్ అభిమానులను దూరంగా నెట్టివేశారు. ఈ సంఘటన బిగ్ బాస్ నటికి కోపం తెప్పించింది. వెంటనే బాడీగార్డ్‌పై పెద్దగా అరిచింది. నీ సమస్య ఏంటని బాడీగార్డ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అభిమానులు ఫోటోలు దిగడానికి వస్తే అనవసరంగా భయాందోళనకు గురి చేయొద్దని మండిపడింది. షెహనాజ్ కౌర్ గిల్ సింప్లిసిటీకి ఫ్యాన్స్ అందరూ చప్పట్లు కొట్టారు. షెహనాజ్ గిల్‌కు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెను విపరీతంగా ప్రేమించే వారు చాలా మంది ఉన్నారు. #ShehnaazGill: She scolded the bodyguard and told him not to say anything to fans. She took a picture with her every fan.🤍🥹✨ pic.twitter.com/JcWucSVEIP — 𝘙𝘐𝘑𝘈♡ (@jaadafahoo) November 18, 2022 -
ప్రియుడు చనిపోయిన ఏడాదికే మరొకరితో నటి డేటింగ్?
షెహనాజ్ గిల్.. ఈ పేరు వినగానే చాలామందికి సిద్దార్థ్ శుక్లా గుర్తుకు వస్తాడు. అంతలా వీరి జంట పాపులర్ అయింది బిగ్‌బాస్ షోతో. కానీ షెహనాజ్‌ను ఒంటరి చేస్తూ నటుడు సిద్దార్థ్ శుక్లా చిన్నవయసులోనే తనువు చాలించాడు. ప్రియుడి మరణంతో ఎంతగానో కుమిలిపోయిన షెహనాజ్ ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి తేరుకుని తిరిగి తన పనిలో నిమగ్నమైంది. అయితే ఆమె టీవీ యాంకర్, కొరియోగ్రాఫర్ రాఘవ్ జుయల్‌తో కొంచెం క్లోజ్‌గా కనిపించడంతో అతడితో డేటింగ్ చేస్తుందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. తాజాగా ముంబైలో ఓ ఈవెంట్‌కు హాజరైన షెహనాజ్‌కు మీడియా నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. దీంతో చిర్రెత్తిపోయిన నటి.. 'ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడూ ఏది పడితే అది ఎందుకు రాస్తున్నారు? ఒకరి పక్కన నిల్చున్నామంటే వారితో రిలేషన్లో ఉన్నామనే అర్థమా? మేమిద్దరం కలిసి కనిపిస్తే ప్రేమలో ఉన్నట్లేనా? కాదు కదా! ఇలా వాగితే నాకు పిచ్చి కోపం వస్తుంది' అని ఆగ్రహించింది. తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే పలు పంజాబీ మ్యూజిక్ వీడియోలో కనిపించిన షెహనాజ్ చివరగా హోంస్లా రఖ్ అనే పంజాబీ చిత్రంలో నటించింది. View this post on Instagram A post shared by KATTAR SHEHNAAZIAN (@shehnaazian_army) చదవండి: ఆత్మహత్యకు ముందు నా కూతురిని ఆ నటుడు వేధించాడు: నటి తల్లి కార్తికేయ 2 ఈ ఓటీటీలోకే రాబోతోంది! -
నన్ను పెళ్లి చేసుకుంటే మీ పని అంతే.. : బిగ్‌బాస్ బ్యూటీ
షెహనాజ్ గిల్.. హిందీ ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన పేరు. అప్పటిదాకా మ్యూజిక్ ఆల్బమ్స్‌తో గుర్తింపు పొందిన షెహనాజ్ హిందీ బిగ్‌బాస్ 13వ సీజన్‌తో మరింతమందికి చేరువయ్యింది. తర్వాత ఫిట్నెస్ మీద దృష్టి పెట్టిన ఈ బొద్దుగుమ్మ సన్నబడి ముద్దుగుమ్మలా తయారైంది. తాజాగా ఆమె 'మసాబా మసాబా సీజన్ 2' వెబ్ సిరీస్ ప్రమోషన్లో పాల్గొంది. ఇందులో ఓ అభిమాని నన్ను పెళ్లి చేసుకుంటావా? అని షెహనాజ్‌కు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. దీనికామె తనను భరించడం చాలా కష్టమని బదులిచ్చింది. 'మీరు ప్రపోజల్ పెడుతున్నారు సరే, మీ బయోడేటా కూడా పంపండి. కానీ నాతో అంత ఈజీయేం కాదు. ఎందుకంటే నాకు ఎదుటివారు చెప్పేది వినేంత ఓపిక ఉండదు. 24 గంటలు మీరు నన్ను పొగుడుతూనే ఉండాలి. ఇప్పుడు పెళ్లి చేసుకుంటానంటున్నారు కానీ, తర్వాత సులువుగా బోర్ కొట్టేస్తాను. రోజంతా నేను వాగుతూనే ఉంటాను. మీరు దాన్ని వింటూనే ఉండాలి. మీరు కూడా నాగురించే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి. ఒకవేళ మీరు నాగురించి మాట్లాడటం ఆపేస్తే నేను మధ్యలోనే వెళ్లిపోతాను. కాబట్టి నాతో వివాహం అంటూ కలలు కనకండి' అని సమాధానమిచ్చింది షెహనాజ్ గిల్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. చదవండి: గ్యారేజీలో అనిల్ కాపురం.. హీరోయిన్‌తో సునీల్ దత్ లవ్‌స్టోరీ.. అందుకే నాకు బాయ్‌ఫ్రెండ్ ఉండరట!: మృణాల్ ఠాకూర్