షాండ్‌విచ్‌ దెబ్బకు ఆస్పత్రిపాలైన టాప్‌ హీరోయిన్‌ | Shehnaaz Gill Hospitalised With Food Poisoning At Mumbai Kokilaben Hospital, Video Viral - Sakshi
Sakshi News home page

Shehnaaz Gill Hospitalised: షాండ్‌విచ్‌ దెబ్బకు ఆస్పత్రిపాలైన టాప్‌ హీరోయిన్‌

Published Tue, Oct 10 2023 11:59 AM | Last Updated on Tue, Oct 10 2023 12:10 PM

Shehnaaz Gill In Hospitalised With Food Poisoning - Sakshi

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి నటిగా మారిన 'షెహనాజ్ కౌర్‌ గిల్' బాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందారు. 2019లో రియాలిటీ షో బిగ్ బాస్ 13లో పాల్గొన్న ఆమె మూడవ స్థానంలో నిలిచింది. తాజాగా 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' చిత్రంలో కూడా ఆమె మెరిశారు. భూమి పెడ్నేకర్, షిబానీ బేడీ, కుషా కపిలతో ఇటీవల 'థ్యాంక్యూ ఫర్ కమింగ్‌'లో కనిపించిన షెహనాజ్ గిల్ ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆసుపత్రి పాలైంది. ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించిన రియా కపూర్ అనారోగ్యంతో బాధపడుతున్న షెహనాజ్ గిల్‌ను కలవడానికి ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిని తాజాగా సందర్శించింది. రియా కపూర్ తన కారులో బ్లాక్‌ డ్రెస్‌లో ఉన్న ఆమె ఫోటో వైరల్‌ అయింది. 

(ఇదీ చదవండి; నాగ చైతన్య షేర్‌ చేసిన ఫోటో.. మళ్లీ ఒకటిగా సమంత- చైతూ)

షెహ్నాజ్ గిల్ తన అభిమానులకు, అనుచరులకు ఆమె పరిస్థితి గురించి తెలియజేయడానికి హాస్పిటల్ బెడ్ నుంచి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చింది. 'అబ్బాయిలు, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను.  ఫుడ్ ఇన్‌ఫెక్షన్ వల్ల కొంతమేరకు ఇబ్బంది పడ్డాను. ఇలాంటి సమయం అందరికి ఎదురౌతుంది. తర్వాత దానంతట అదే పోతుంది. నా విషయంలో కూడా అదే జరిగింది. నేను శాండ్‌విచ్ తినడం వల్ల ఫుడ్‌ ఇన్‌ఫెక్షన్‌ అయినట్లు వైద్యులు గుర్తించారు. నా గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. మరో రెండు రోజుల్లో నేను ఇంటికి కూడా చేరుకుంటాను.' అని ఆమె తెలిపింది. తన అభిమానులతో ఆమె ఎంతో క్యూట్‌గా మాట్లాడింది.

అక్టోబర్‌ 6న విడుదలైన థ్యాంక్యూ ఫర్‌ కమింగ్‌ చిత్రం విడుదలై ప్రేక్షకుల ముందు మంచి టాక్‌ తెచ్చుకుంది. షెహనాజ్ ఈ సినిమా విడుదలకు ముందు విస్తృతంగా ప్రచారం చేసింది. సినిమా స్పెషల్ స్క్రీనింగ్ నుంచి పలు ప్రమోషన్స్‌ కార్యక్రమాల వరకు అన్నీ తానై చూసుకుంది. ఆమె గురు రంధవా, వరుణ్ శర్మ, మరికొందరు స్నేహితులతో కలిసి సినిమా చూసింది. షెహ్నాజ్ గిల్ బాలీవుడ్‌లో సింగర్‌గా కూడా రానించిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement