Watch: Shehnaaz Gill Gifts A New Luxury Car To Brother Shehbaz Badesha Brand New Mercedes-Benz-E-Class; Know Price Here - Sakshi
Sakshi News home page

Shehnaaz Gill: కాస్ట్‌లీ బహుమతి.. ఎవరా ఆ వ్యక్తి?

Published Tue, Aug 1 2023 6:45 PM | Last Updated on Wed, Sep 6 2023 10:15 AM

Actress Shehnaaz Gill Gift Benz Car Her Brother - Sakshi

సాధారణంగా సెలబ్రిటీలకు ఏదో ఓ వ్యసనం ఉంటుంది. కొందరు బట్టలంటే ఇష్టం. మరికొందరికి ట్రావెలింగ్ అంటే పిచ్చి. మరికొందరైతే కొత్త మోడల్ మార్కెట్‌లోకి రావడం లేటు వెంటనే ఆయా కార్, బైక్ లాంటివి కొనేస్తుంటారు. ప్రముఖ నట కూడా ఇప్పుడు అలానే రూ.80 లక్షల విలువైన బెంజ్ కార్ సొంతం చేసుకుంది. కాకపోతే దాన్ని మరో వ్యక్తికి బహుమతిగా ఇచ్చింది. 

(ఇదీ చదవండి: అతడితో డేటింగ్ వల్ల బరువు తగ్గాను: రాశీఖన్నా)

పంజాబీ నటి అయిన షెహనాజ్ గిల్.. సొంత భాషలోనే పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. బిగ్‌బాస్ హిందీ 13లో పాల్గొంది. అదే సీజన్‌లో ఆడిన బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లాతో ప్రేమలో పడి రిలేషన్‌షిప్ మెంటైన్ చేసింది. బిగ్‌బాస్‌ జోడీగా అప్పట్లో వీళ్లు చాలా పాపులర్ అయ్యారు. అయితే సిద్ధార్థ్ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చనిపోయాడు. అప్పటినుంచి షెహనాజ్ సింగిల్‌గానే ఉంటోంది.

ఈ మధ్య సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్'తో ప్రేక్షకుల్ని పలకరించిన షెహనాజ్.. ఇప్పుడు రూ.80 లక్షలు విలువైన బెంజ్ కారుని తమ్ముడు షెహబాజ్ బాద్ షాకి గిఫ్ట్‌గా ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. షెహనాజ్ దగ్గర ఇప్పటికే రేంజ్ రోవర్, జాగ్వార్, బెంజ్ ఎస్ క్లాస్ కార్లు ఉన్నాయి.

(ఇదీ చదవండి: దేవుడి సినిమాకు 'A' సర్టిఫికెట్.. మరో కాంట్రవర్సీ?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement