బిగ్‌బాస్ రియాలిటీ షోకు క్రేజ్ మామూలుగా ఉండదు. ఏ భాషలోనైనా ఈ షో పాపులారిటీ దక్కించుకుంది. ఇటీవల టాలీవుడ్‌లోనూ ఈ షో అత్యంత ప్రేక్షాదరణ దక్కించుకుంది. గతేడాది డిసెంబర్‌లో తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 గ్రాండ్‌గా ముగిసింది. ఈ సీజన్‌కు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు.
అయితే హిందీలోనూ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్-18 నడుస్తోంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ రియాలిటీ షో దాదాపు చివరిదశకు చేరుకుంది. వచ్చే వారంలోనే బిగ్ బాస్ 18 గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ షోలో అరుణాచల్‌కు చెందిన చుమ్ దరాంగ్ అనే కంటెస్టెంట్ టాప్-9లో చోటు దక్కించుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆ రాష్ట్ర సీఎం పెమా ఖండూ ఆమెకు మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి చేసిన పోస్ట్‌ను కంటెస్టెంట్ తన ఇన్‌స్టా ద్వారా షేర్ చేసింది.
ఈ రియాలిటీ షో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన చుమ్ దరాంగ్ టాప్-9లో నిలవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఆమెకు ఓటు వేయాలని పౌరులకు సూచించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేశారుయ. కాగా.. బిగ్‌బాస్ సీజన్- 18 గ్రాండ్ ఫినాలే జనవరి 19న ప్రసారం కానుంది.
ముఖ్యమంత్రి తన పోస్ట్‌లో రాస్తూ..'పాసిఘాట్‌కు చెందిన అరుణాచల్ ప్రదేశ్ కుమార్తె చుమ్ దరాంగ్ బిగ్‌బాస్ సీజన్-18 రియాల్టీ షోలో టాప్ 9లో చేరినందుకు సంతోషంగా ఉన్నా. ఆమెతో మీ అందరి మద్దతు కావాలి. ప్రతి ఒక్కరూ చుమ్‌కి ఓటు వేయడం మర్చిపోవద్దు. ఈ షోలో ఆమె విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని ఆశాభావంతో ఉన్నాను. ఈ సందర్భంగా చుమ్ దరాంగ్‌కి నా శుభాకాంక్షలు.' అని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి ట్విట్‌ను షేర్ చేసిన చుమ్ దరాంగ్ టీమ్ స్పందించింది. సీఎం పెమా ఖండుకు కృతజ్ఞతలు తెలిపింది.
చుమ్ దరాంగ్ టీమ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..“గౌరవనీయులైన అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సర్.. తనకు మద్దతు ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బిగ్ బాస్ హౌస్‌లో ఆమె అసాధారణమైన ప్రయాణం ప్రతి అరుణాచల్ వ్యక్తిని.. అలాగే ఈశాన్య భారతదేశాన్ని ఎంతో గర్వించేలా చేసింది. ఆమె సాధించిన విజయాలు.. ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికపై రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం మన రాష్ట్ర ప్రతిభను హైలైట్ చేయడమే కాకుండా ప్రపంచ దృష్టికి తీసుకెళ్తాయి. చుమ్ దరాంగ్ లాంటి వాళ్లను ప్రోత్సహిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆమె విజయం ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. మీ నాయకత్వం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించడం కొనసాగుతూనే ఉంటుంది.' అంటూ రిప్లై ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment