Arunachal Pradesh chief minister
-
అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండుకు కరోనా
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు కరోనా వైరస్ బారిన పడ్డారు. తనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు ఆయన మంగళవారం ట్వీటర్లో ప్రకటించారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న ఆయన తన ట్వీట్లో తనకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవని.. పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు తెలిపారు. అయినప్పటికీ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. దీంతో మహమ్మారి పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం ప్రజలకు సూచించారు. ప్రస్తుతం తాను ఎస్ఓపీ నిబంధనల మేరకు క్వారంటైన్లో ఉన్నానట్లు చెప్పారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్‌లో కరోనా యాక్టివ్ కేసులు సంఖ్య 1756 ఉండగా.. 4531 మంది పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జీ అయ్యారు. కరోనా కారణంగా 11 మంది మృత్యువాత పడ్డారు. (చదవండి: ఢిల్లీలో కొత్తగా 4,263 పాజిటివ్ కేసులు) I had undergone Covid test RT-PCR and have tested positive for Covid19. I am asymptomatic and feeling healthy. However as per SOP and safety of others, I am self isolating myself and request everyone who came in contact with me to adhere to the SOP. — Pema Khandu པདྨ་མཁའ་འགྲོ་། (@PemaKhanduBJP) September 15, 2020 -
ఆ ఐదుగురు చైనాలోనే ఉన్నారు
న్యూఢిల్లీ: గత వారం అరుణాచల్ ప్రదేశ్ నుంచి తప్పిపోయిన ఐదుగురు భారత పౌరులు తమ వైపు ఉన్నట్లు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ధృవీకరించిందని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. వారిని భారత్‌కు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. ‘భారత సైన్యం పంపిన హాట్‌లైన్ సందేశానికి చైనా పీఎల్ఏ స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి తప్పిపోయిన యువకులు వారి పక్షాన ఉన్నట్లు చైనా ధ్రువీకరించింది. వారిని భారత్‌కు అప్పగించే ప్రక్రియకు సంబంధించిన చర్యలు కొనసాగుతున్నాయి’ అని ట్వీట్ చేశారు. (చదవండి: ఇప్పుడే చెప్పలేం) China's PLA has responded to the hotline message sent by Indian Army. They have confirmed that the missing youths from Arunachal Pradesh have been found by their side. Further modalities to handover the persons to our authority is being worked out. — Kiren Rijiju (@KirenRijiju) September 8, 2020 అరుణాచల్ ప్రదేశ్ ఎగువ సుబన్సిరి జిల్లా నుంచి శుక్రవారం తప్పిపోయిన ఐదుగురు పౌరులు భారత సైన్యానికి పోర్టర్లు, గైడ్లుగా పనిచేస్తున్నారు. మొత్తం ఏడుగురు అదృశ్యం కాగా వారిలో ఇద్దరు తప్పించుకుని వచ్చి సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు దీని గురించి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. -
18 వేల మందిని రాష్ట్రానికి తీసుకొస్తాం : సీఎం
ఇటానగర్ : దేశవ్యాప్త లాక్‌డౌక్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను దశల వారిగా తిరిగి రాష్ట్రానికి తీసుకురావాలని నిర్ణయించినట్లు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ తెలిపారు. మొదటి దశలో ఈశాన్య రాష్ట్రాలలో ఉన్నవారిని తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించినట్లు పేర్కొన్నారు. శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన దాదాపు 18 వేల మంది విద్యార్థులు, కార్మికులు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్నారని, వారిని ప్రాధాన్యత క్రమంలో తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇతర రాష్ట్రాలలో చిక్కుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. (ట్రెండింగ్ టిక్‌టాక్‌లో శృతిహాసన్, అక్షర హాసన్ ) కాగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ మరో రెండు వారాలపాటు (మే 17 వరకు) పెంచడంతో ఇతర ప్రాంతాల్లో ఉన్న అరుణాచల్ ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీనియర్ అధికారులు వారితో సంప్రదింపులు జరుపుతున్నారని కావున వాళ్లకు ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. అరుణాచల్‌లో ఆరు జిల్లాలు మాత్రమే ఆరెంజ్ జోన్లో ఉన్నాయని, మిగతా అన్ని జిల్లాలు గ్రీన్ జోన్లోనే ఉన్నాయని ఆయన అన్నారు. (చైనాలో కొత్తగా ఒకే ఒక్క కరోనా పాజిటివ్ కేసు! ) ఢిల్లీలో చిక్కుకుపోయిన విద్యార్థులు, కార్మికుల పరిస్థితి ఏంటని ప్రశ్నించగా.. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ, కేంద్ర మంత్రి కిరన్ రిజిజు వారితో చర్చలు జరుపుతున్నారని తెలిపారు. ఢిల్లీలోని అరుణాచల్ భవన్ అధికారులు వారితో సమావేశ మయ్యారని చెప్పారు. రెడో దశలో ఏయే రాష్ట్రాల నుంచి ప్రజలను తిరిగి తీసుకురావాలో ఇంకా నిర్ణయించలేదని, దీనిపై త్వరలోనే క్యాబినెట్ సమావేశంతోపాటు అఖిలపక్ష సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. (సాధువుల హత్యకేసు: నిందితుడికి కరోనా ) -
దేశంలోనే యంగెస్ట్ సీఎం ఆయనే!
ఒకప్పుడు తండ్రికి రాజకీయాల్లో అండగా నిలిచాడు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు చేదోడు-వాదోడుగా ఉండి సహకరించాడు. అలా నెమ్మదిగా అడుగులు వేస్తూ.. సామాజిక మార్పే సంకల్పంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు పెమా ఖండూ.. దేశంలోనే అతి పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. అరుణాచల్ ప్రదేశ్ 9వ సీఎంగా పెమా ఖండూ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. పెమాకు మద్దతుగా 45 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ తథాగత్ రాయ్ ముందు పరేడ్ నిర్వహించడంతో ఇక అసెంబ్లీలో బలనిరూపణ అవసరం లేదని గవర్నర్ స్పష్టం చేశారు. అనూహ్య రాజకీయ పరిణామాల నడుమ పెమా ఖండూకు రాష్ట్రంలో అత్యున్నతమైన సీఎం పదవి లభించింది. సొంత పార్టీ కాంగ్రెస్ లో రెబల్స్ కారణంగా నబం తుకీ సీఎల్పీ పదవికి రాజీనామా చేశారు. దాంతో సీఎం పదవి నుంచి కూడా వైదొలిగారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో చీలికకు కారణమైన రెబల్ నేత, మాజీ సీఎం కలిఖో పాల్ కూడా పెమాకు మద్దతు పలుకడంతో ఆయన సీఎం పదవి చేపట్టేందుకు మార్గం సుగమమైంది.37 ఏళ్ల పెమా ఖండూతో సీఎంగా, చౌనా మెయిన్ తో డిప్యూటీ సీఎంగా గవర్నర్ ప్రమాణం చేయించారు. యువ సంచలనం! 37 ఏళ్లకే సీఎం పదవి చేపట్టి, దేశంలో అతి పిన్న ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన పెమా ఖండూ యువ సంచలనం అని చెప్పవచ్చు. పెమా ఖండూ తండ్రి డోర్జీ ఖండూ ఒకప్పుడు అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా పనిచేశారు. సీఎం పదవిలో ఉండగానే 2011లో జరిగిన విమాన ప్రమాదంలో డోర్జీ ఖండూ ప్రాణాలు విడిచారు. తండ్రి మరణం నేపథ్యంలో ఆయన పెద్ద కొడుకు అయిన పెమా ఖండూ డోర్జీ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించారు. ప్రతిష్టాత్మక ఢిల్లీ హిందూ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఆయన తండ్రి మరణానంతరం అరుణాచల్ ప్రదేశ్ కేబినెట్ లో జలవనరుల శాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా నబం తుకీకి వ్యతిరేకంగా అరుణాల్ ప్రదేశ్ కాంగ్రెస్ లో తిరుగుబాటు తలెత్తడం.. దీంతో తుకీ ప్రభుత్వాన్ని గవర్నర్ బర్తరఫ్ చేయడం.. రెబల్ ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడం.. సుప్రీంకోర్టు ఆదేశాలతో మళ్లీ అరుణాల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో ఈ యువనేతకు దేశంలో అతిపిన్న సీఎంగా గొప్ప గౌరవం లభించింది.