ఇటానగర్ : దేశవ్యాప్త లాక్‌డౌక్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను దశల వారిగా తిరిగి రాష్ట్రానికి తీసుకురావాలని నిర్ణయించినట్లు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ తెలిపారు. మొదటి దశలో ఈశాన్య రాష్ట్రాలలో ఉన్నవారిని తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించినట్లు పేర్కొన్నారు. శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన దాదాపు 18 వేల మంది విద్యార్థులు, కార్మికులు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్నారని, వారిని ప్రాధాన్యత క్రమంలో తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇతర రాష్ట్రాలలో చిక్కుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. (ట్రెండింగ్ టిక్‌టాక్‌లో శృతిహాసన్, అక్షర హాసన్ )
కాగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ మరో రెండు వారాలపాటు (మే 17 వరకు) పెంచడంతో ఇతర ప్రాంతాల్లో ఉన్న అరుణాచల్ ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీనియర్ అధికారులు వారితో సంప్రదింపులు జరుపుతున్నారని కావున వాళ్లకు ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. అరుణాచల్‌లో ఆరు జిల్లాలు మాత్రమే ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయని, మిగతా అన్ని జిల్లాలు గ్రీన్ జోన్‌లోనే ఉన్నాయని ఆయన అన్నారు. (చైనాలో కొత్తగా ఒకే ఒక్క కరోనా పాజిటివ్ కేసు! )
ఢిల్లీలో చిక్కుకుపోయిన విద్యార్థులు, కార్మికుల పరిస్థితి ఏంటని ప్రశ్నించగా.. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ, కేంద్ర మంత్రి కిరన్ రిజిజు వారితో చర్చలు జరుపుతున్నారని తెలిపారు. ఢిల్లీలోని అరుణాచల్ భవన్ అధికారులు వారితో సమావేశ మయ్యారని చెప్పారు. రెడో దశలో ఏయే రాష్ట్రాల నుంచి ప్రజలను తిరిగి తీసుకురావాలో ఇంకా నిర్ణయించలేదని, దీనిపై త్వరలోనే క్యాబినెట్ సమావేశంతోపాటు అఖిలపక్ష సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. (సాధువుల హత్యకేసు: నిందితుడికి కరోనా )
Comments
Please login to add a commentAdd a comment