సాక్షి, అమరావతి : అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమఖండు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం ట్విటర్ వేదికగా పెమఖండు స్పందించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో విశాఖపట్నంలో ఉంటున్న తమ రాష్ట్రవాసులు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసిన వెంటనే సీఎం జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లు స్పందించటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తమ రాష్ట్రవాసులకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న రోజుల్లో కూడా తమ రాష్ట్రానికి చెందిన వారికి అండగా ఉంటారని ఆశిస్తున్నానన్నారు.
కాగా, రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్‌డౌన్ పక్కాగా అమలు జరుగుతోంది. జనం రోడ్లపైకి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు అతిక్రమించి బయటకు వచ్చినవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
I would like to thank @AndhraPradeshCM and DGP Andhra Pradesh Shri Gautam Sawang in their prompt response in attending to a distress call made by Arunachalee citizens stranded in Vizag. I look forward to more such cooperation during these times of crisis to fight #COVID19
— Pema Khandu (@PemaKhanduBJP) March 27, 2020
Comments
Please login to add a commentAdd a comment