(ఫైల్ ఫోటో)
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (మంగళవారం) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. దీనిలో భాగంగా కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కానున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టిన నివారణ చర్యలను, పెద్ద ఎత్తున నిర్వహించిన కరోనా పరీక్షల గురించి అమిత్ షాకు వివరించనున్నారు. లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన నేపథ్యంలో ఆయా అంశాలను కూడా అమిత్ షా దృష్టికి తీసుకురానున్నారు. వలస కూలీల తరలింపుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలను వీరిద్దరు చర్చించనున్నారు. అలాగే కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్ర షెకావత్‌ను కూడా సీఎం కలిసే అవకాశం ఉంది. (ఏడాదిలోనే 90% వాగ్దానాలు అమలు)
Comments
Please login to add a commentAdd a comment