
సాక్షి, అమరావతి : దేశంలో కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర విధించిన నాలుగో విడత లాక్‌డౌన్ ఆదివారంతో ముగియనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. కరోనా నివారణ చర్యలు, లాక్‌డౌన్ పొడిగింపు వంటి అంశాలపై శుక్రవారం ఫోన్‌లో వీరిద్దరు చర్చించారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను అమిత్ షాకు సీఎం జగన్ వివరించారు. వైరస్‌ను గుర్తించేందుకు పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇక మే 31తో లాక్‌డౌన్ ముగియనున్న విషయం తెలిసిందే. మరో రెండువారాల పాటు ఆంక్షలను కొనసాగించాలని పలువురు ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కోరుతుండగా.. సీఎం జగన్ అభిప్రాయాన్ని సైతం అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. ఇక దేశంలో లాక్‌డౌన్ పొడిగింపుపై నేడు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అమిత్ షా భేటీ కానున్నారు. ముఖ్యమంత్రులు వెల్లడించిన సమాచారంపై వీరు చర్చించనున్నారు. (మోదీతో భేటీ కానున్న అమిత్ షా)
Comments
Please login to add a commentAdd a comment