Grand Finale
-
బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు సీఎం మద్దతు.. !
బిగ్‌బాస్ రియాలిటీ షోకు క్రేజ్ మామూలుగా ఉండదు. ఏ భాషలోనైనా ఈ షో పాపులారిటీ దక్కించుకుంది. ఇటీవల టాలీవుడ్‌లోనూ ఈ షో అత్యంత ప్రేక్షాదరణ దక్కించుకుంది. గతేడాది డిసెంబర్లో తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 గ్రాండ్‌గా ముగిసింది. ఈ సీజన్‌కు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు.అయితే హిందీలోనూ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్-18 నడుస్తోంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ రియాలిటీ షో దాదాపు చివరిదశకు చేరుకుంది. వచ్చే వారంలోనే బిగ్ బాస్ 18 గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ షోలో అరుణాచల్‌కు చెందిన చుమ్ దరాంగ్ అనే కంటెస్టెంట్ టాప్-9లో చోటు దక్కించుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆ రాష్ట్ర సీఎం పెమా ఖండూ ఆమెకు మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి చేసిన పోస్ట్‌ను కంటెస్టెంట్ తన ఇన్‌స్టా ద్వారా షేర్ చేసింది.ఈ రియాలిటీ షో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన చుమ్ దరాంగ్ టాప్-9లో నిలవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఆమెకు ఓటు వేయాలని పౌరులకు సూచించారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారుయ. కాగా.. బిగ్‌బాస్ సీజన్- 18 గ్రాండ్ ఫినాలే జనవరి 19న ప్రసారం కానుంది.ముఖ్యమంత్రి తన పోస్ట్‌లో రాస్తూ..'పాసిఘాట్కు చెందిన అరుణాచల్ ప్రదేశ్ కుమార్తె చుమ్ దరాంగ్ బిగ్‌బాస్ సీజన్-18 రియాల్టీ షోలో టాప్ 9లో చేరినందుకు సంతోషంగా ఉన్నా. ఆమెతో మీ అందరి మద్దతు కావాలి. ప్రతి ఒక్కరూ చుమ్కి ఓటు వేయడం మర్చిపోవద్దు. ఈ షోలో ఆమె విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని ఆశాభావంతో ఉన్నాను. ఈ సందర్భంగా చుమ్ దరాంగ్కి నా శుభాకాంక్షలు.' అని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి ట్విట్‌ను షేర్ చేసిన చుమ్ దరాంగ్ టీమ్ స్పందించింది. సీఎం పెమా ఖండుకు కృతజ్ఞతలు తెలిపింది.చుమ్ దరాంగ్ టీమ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..“గౌరవనీయులైన అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సర్.. తనకు మద్దతు ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బిగ్ బాస్ హౌస్‌లో ఆమె అసాధారణమైన ప్రయాణం ప్రతి అరుణాచల్ వ్యక్తిని.. అలాగే ఈశాన్య భారతదేశాన్ని ఎంతో గర్వించేలా చేసింది. ఆమె సాధించిన విజయాలు.. ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికపై రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం మన రాష్ట్ర ప్రతిభను హైలైట్ చేయడమే కాకుండా ప్రపంచ దృష్టికి తీసుకెళ్తాయి. చుమ్ దరాంగ్ లాంటి వాళ్లను ప్రోత్సహిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆమె విజయం ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. మీ నాయకత్వం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించడం కొనసాగుతూనే ఉంటుంది.' అంటూ రిప్లై ఇచ్చారు. View this post on Instagram A post shared by Chum Darang (@chum_darang) -
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే ప్రోమో
-
డ్రీమ్‌హాక్ ఇండియా 2024: హైదరాబాద్‌లో గ్రాండ్ ఫినాలే..
డ్రీమ్‌హాక్ ఇండియాలో ఒమెన్ ఇంటెల్ క్యాంపస్ క్వెస్ట్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలేను హెచ్‌పీ ప్రకటించింది. గత మూడు నెలలుగా.. భారతదేశం అంతటా 1,600 జట్లకు చెందిన 8,000 మంది ప్లేయర్స్ వివిధ రౌండ్లలో పోరాడారు. కాగా ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగే గ్రాండ్ ఫినాలేలో టాప్ ఆరు జట్లు పోటీపడనున్నాయి. ఇందులో విజేతకు రూ.5 లక్షల బహుమతిని అందజేస్తారు.గ్రాండ్ ఫినాలే నవంబర్ 15 నుంచి 17వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైదరాబాద్‌లో జరగనుంది. ఈ టోర్నమెంట్లో సందర్శకులు హెచ్‌పీ ఇంటరాక్టివ్ ప్రోడక్ట్ బూత్‌లలో బ్రాండ్ గేమింగ్ సొల్యూషన్లకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ కూడా పొందవచ్చు. ఆసక్తి కలిగిన సందర్శకులు కూడా ఈ ఈవెంట్లో పాల్గొనవచ్చు. దీనికోసం టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సందర్శకులు తమ అభిమాన ప్రో ప్లేయర్లు, గేమింగ్ ఇన్ఫ్లుయెన్సర్లను కలవడానికి కూడా ఓ మంచి అవకాశాన్ని పొందుతారు.•తేదీ: 2024 నవంబర్ 15 నుంచి 17•వేదిక: హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైదరాబాద్•టిక్కెట్ ప్రారంభ ధర: రూ. 1,699 -
మిస్ యూనివర్స్ స్టేట్ గ్రాండ్ ఫినాలే.. బ్యూటీ క్వీన్స్ క్యాట్ వాక్ (ఫోటోలు)
-
Sreemukhi: రెక్కలు తొడిగిన ముద్దబంతిలా శ్రీముఖి స్టయిల్ (ఫోటోలు)
-
మిస్ అండ్ మిసెస్ గుజరాతీ తెలంగాణ 2024 గ్రాండ్ ఫినాలే ముగింపు వేడుక (ఫోటోలు)
-
హైదరాబాద్: నెక్సస్ మాల్లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ గ్రాండ్ ఫినాలే బంపర్ డ్రా (ఫోటోలు)
-
రవీంద్రభారతిలో ఘనంగా ఆటా గ్రాండ్ ఫినాలే వేడుకలు (ఫొటోలు)
-
అమర్‌దీప్‌కు క్రేజీ ఆఫర్..
-
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే.. అమర్‌కు ఊహించని ఆఫరిచ్చిన నాగ్.. మరో ఆలోచన లేకుండా!
Bigg Boss Season 7 Telugu Grand Finale: మరికొద్ది గంటల్లో బిగ్‌బాస్ సీజన్-7 గ్రాండ్ ఫినాలే షురూ కానుంది. వందకు పైగా రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులు కట్టి పడేసిన తెలుగువారి బిగ్ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. ఈ నేపథ్యంలో సీజన్-7 విన్నర్ ఎవరనే విషయంపై అందరిలో ఆసక్తిని పెంచుతోంది. శనివారం రోజు ఇంటి సభ్యులంతా చిల్ అయ్యారు. 3వ సీజన్ రన్నరప్, యాంకర్ శ్రీముఖి.. కాసేపు ఆరుగురు ఇంటి సభ్యులతో పాటలు పాడించింది. ఇక చివరి రోజు సాయంత్రం 7 గంటలకే ఎపిసోడ్ ప్రసారం కానుండగా.. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. (ఇది చదవండి: 'సలార్' రెండో ట్రైలర్‌తో ప్రభాస్ రెడీ) తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే ఈ ఏడాది సీజన్-7 గ్రాండ్ ఫినాలేను మరింత గ్రాండ్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరూ గ్రాండ్ ఫినాలేకు హాజరైనట్లు కనిపిస్తోంది. అయితే ఈ గ్రాండ్ ఫినాలేలో మాస్ మహారాజా రవితేజ, కల్యాణ్ రామ్, యాంకర్ సుమ, ఆమె కొడుకు రోషన్, బబుల్ గమ్ హీరోయిన్ మానస చౌదరి, అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ సందడి చేశారు. వీరంతా తమ సినిమాల ప్రమోషన్లలో భాగంగా గ్రాండ్ ఫినాలేకు హాజరయ్యారు. అయితే మరోవైపు ఈరోజు బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ ఎవరో తెలిసిపోనుంది. కానీ అంతకంటే ముందు టాప్-6లో ఉన్న కంటెస్టెంట్స్‌కు సూట్ కేస్ ఆఫర్ తీసుకొచ్చారు. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ సూట్‌కేసుతో హౌస్‌లో అడుగుపెట్టారు. 'రండి బాబు రండి.. ఆలోచిస్తే ఆశాభంగం' అంటూ అల్లరి నరేశ్ వారికి సూట్‌కేస్ కోసం రండి వేలంపాట మొదలెట్టాడు. ఆ తర్వాత ఇన్ని రోజుల కష్టపడి ఉట్టి చేతులతో బయటికెళ్లడమా? అంటూ రాజ్ తరుణ్ టెంప్టింగ్ అయ్యేలా సలహా ఇచ్చాడు. అయితే ప్రోమో చివర్లో మాస్ రవితేజ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. అయితే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున అమర్‌దీప్‌కు ఎవరు ఊహించని ఆఫర్ ఇచ్చాడు. బిగ్‌బాస్ గేట్స్ తెరిచి ఉన్నాయి.. నువ్వు బయటకి వస్తే నెక్ట్స్ సినిమాలో రవితేజతో పాటు నటిస్తావ్ అన్నారు. అంతేకాకుండా అమర్‌కు కేవలం 7 సెకన్లు మాత్రమే టైం ఇచ్చాడు. దీంతో అమర్దీప్ మరో ఆలోచన లేకుండా పరుగుత్తాడు. అయితే అమర్దీప్ నిజంగానే బయటికొచ్చేశాడా? చివరి నిమిషంలో ఏం జరిగింది? అనేది తెలియాలంటే ఇవాళ ప్రసారమయ్యే గ్రాండ్ ఫినాలేను మిస్ అవ్వకండి. (ఇది చదవండి: Bigg Boss 7: అన్ని లక్షలు ఆఫర్ చేసిన నాగ్.. టైటిల్ రేసు నుంచి ఆ ఒక్కడు డ్రాప్!) -
'ఆటా' గ్రాండ్ ఫినాలే.. రాజేంద్రప్రసాద్‌కు ప్రత్యేక ఆహ్వానం
'ఆటా' గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. ఈనెల 30న రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా ఆధ్వర్యంలో ఆటా ప్రతినిధులు రాజేంద్రప్రసాద్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయన ఇంట్లో సరదాగా కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కాశీ కొత్త, ఆటా ఇండియా కో ఆర్డినేటర్ అమృత్ ముళ్ళపూడి తదితరులు పాల్గొన్నారు. -
Pydi Rajani: మిసెస్ ఇండియా పోటీలకు విశాఖ మహిళ పైడి రజని
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): రాజస్థాన్ రాష్ట్రం సిటీ ఆఫ్ టైగ్రేసెస్ రంతంపోర్ ప్రాంతంలో ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి మిసెస్ ఇండియా గ్రాండ్ ఫినాలే పోటీలకు ఆంధ్రా యూనివర్సిటీ స్కాలర్, ఏవీఎన్ కళాశాల ఇంగ్లిష్ విభాగాధిపతి, శక్తి ఎంపవరింగ్ ఉమెన్ అసోసియేషన్(సేవ) అధ్యక్షురాలు పైడి రజని ఎంపికయ్యారు. గతేడాది మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ టైటిల్‌ను ఈమె గెలుచుకున్నారు. ఆలిండియా డైరెక్టర్ దీపాలి ఫడ్నిస్ ఆధ్వర్యంలో శాస్త్రీయ నృత్యం, ప్రాంతీయ నృత్యం, ప్రాంతీయ వంటకాలు, శాస్త్రీయ వేషధారణ, దేశంపై సామాజిక అవగాహన, సేవా కార్యక్రమాల నిర్వహణపై నాలుగు రోజుల పాటు జరగనున్న పోటీల్లో దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మహిళలు పాల్గొననున్నారు. చదవండి: ఖైదీల బంక్.. రోజుకు రూ.5 లక్షల అమ్మకాలు.. -
Miss Uttarandhra 2022: మిస్ ఉత్తరాంధ్ర నిధి చౌదరి
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): మిస్ అండ్ మిసెస్ ఉత్తరాంధ్ర–2022 గ్రాండ్ ఫైనల్స్ ఆదివారం ఘనంగా జరిగాయి. న్యూ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో నగరంలోని ఒక హోటల్లో నిర్వహించిన ఈ వేడుకల్లో యువతలు, మహిళలు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి, క్యాట్ వాక్ చేస్తూ అదరహో అనిపించారు. ఫైనల్స్‌లో 20 మంది పాల్గొనగా మిస్ ఉత్తరాంధ్రగా నిధి చౌదరి, మిసెస్ ఉత్తరాంధ్రగా భాగ్యలక్ష్మి నిలిచారు. విజేతలకు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ బహుమతులు అందజేశారు. -
అన్‌స్టాపబుల్ స్పెషల్ ప్రోమో: మహేశ్‌పై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' షో ఆహా ఓటీటీలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోన్న ఈ షో దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే 9ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు గ్రాండ్ ఫినాలేలోకి అడుగుపెట్టింది. ఫినాలేలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సందడి చేయనున్నారు. ఆయనతో పాటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి సైతం విచ్చేశారు. ఈ గ్రాండ్ ఎపిసోడ్ రేపు(ఫిబ్రవరి 4న) 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా.. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా సోషల్ మీడియా ఇది వీపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇక ఫైనల్ ఎపిసోడ్ రేపు(శుక్రవారం) ప్రసారం కానున్న నేపథ్యంలో తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేశారు నిర్వాహకులు. దీంతో ఈ ప్రోమో నెట్టింట మంచి రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన తక్కువ వ్యవధిలో మంచి వ్యూస్‌ను రాబట్టింది ఈ ప్రోమో. ఇందులో బాలయ్య మహేశ్ బాబును ఆటపట్టించిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది. చదవండి: వరుణ్ తేజ్‌తో పెళ్లిపై తొలిసారి స్పందించిన లావణ్య, ఏం చెప్పిందంటే.. మహేశ్ సంబంధించిన ఆసక్తికర సీక్రెట్స్‌ను రాబట్టడానికి బాలయ్య చేసిన సందడి బాగా ఆకట్టుకుంటోంది. ఇక నువ్వు చిన్నప్పుడు చాలా నాటీ బాయ్ అంట కదా అనగానే మహేశ్ సిగ్గు పడటం.. దీనికి చేసేవి చేస్తూనే చెప్పాడానికి సిగ్గు పడతావంటూ బాలయ్య వేసిన పంచ్ డైలాగ్ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఫుల్ ఎపిసోడ్ కోసం నెటజన్లంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి నటసింహం, సూపర్ స్టార్ల అల్లరి చూడాలంటే ఈ ప్రోమోపై మీరు కూడా ఓ లుక్కేయండి. -
నాకో టైమింగ్ ఉంటుంది.. సితార తాట తీసేస్తది : మహేశ్ బాబు
Unstoppable With Mahesh Babu Grand Finale Promo: నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' షో ఆహా ఓటీటీలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోన్న ఈ షో దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే 9ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు గ్రాండ్ ఫినాలేలోకి అడుగుపెట్టింది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు చివరి ఎపిసోడ్లో సందడి చేయనున్నారు. ఆయనతో పాటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి సైతం విచ్చేశారు. ఈ గ్రాండ్ ఎపిసోడ్ ఫిబ్రవరి 4న 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్లో బాలయ్య అన్‌స్టాపబుల్ షో ఫస్ట్ సీజన్‌కు ఎండ్ కాండ్ పడనుంది. గ్రాండ్ ఫినాలేలో బాలయ్య, మహేశ్‌ల మధ్య సాగిన సంభాషణ ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. 'ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో అతనే మహేశ్'.. అంటూ బాలయ్య తనదైన స్టయిల్లో మహేశ్‌ను ఆహ్వానించారు.ఇక తన కుమారుడు గౌతమ్ క్యాట్, సితార బ్రాట్ ..తాట తీసేస్తది అంటూ మహేశ్ నవ్వులు పూయించాడు.ఓ సారి కేబీఆర్ పార్కుకి వాకింగ్‌కి వెళ్తే పాము కనిపించిందని, అప్పటి నుంచి మళ్లీ అటువైపు వెళ్లలేదంటూ సీక్రెట్ రివీల్ చేశాడు.మొత్తంగా ఆహా అనిపించేలా ఈ గ్రాండ్ ఎపిసోడ్ ఉండనుంది స్పష్టమవుతుంది. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
ఆటా నాదం పాటల పోటీల విజేతలు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) నిర్వహించిన “ఆటా నాదం” పాటల పోటీల్లో ఫైనల్ రౌండ్లో 13 మంది గాయనీగాయకులు పాల్గొనగా.. విజేతలుగా ప్రథమ స్థానంలో కే ప్రణతి, ద్వితీయ స్థానంలో దాసరి మేఘన నాయుడు, తృతీయ స్థానంలో వెంకట సాయి లక్ష్మి, పాసాల హర్షిత, అవసరాల అభినవ్‌లు నిలిచారు. సంగీత దర్శకులు, ప్లేబాక్ సింగర్ నిహాల్ కొందూరి, ప్లేబాక్ సింగర్, సినీ మ్యుజిషియన్ యూనియన్ ప్రెసిడెంట్ విజయ లక్ష్మి, సంగీత దర్శకులు,ప్లేబ్యాక్ సింగర్ సాయి శ్రీకాంత్ వెళ్లల, ప్లేబాక్ సింగర్ నూతన మోహన్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహారించారు. ఆటా మహాసభల సన్నహాక కార్యక్రమములో భాగంగా ప్రతిభా వంతులైన యువ గాయనీగాయకులకు ప్రోత్సహాం అందించేందుకు ఆటా నాదం పాటల పోటీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు చెందిన 200ల మంది గాయనీ గాయకులు పాల్గొన్నారు. రవీంద్రభారతి హైదరాబాద్ డిసెంబర్ 26, 2021 లో సాయంత్రం 7 గంటలకు జరిగే ఆటా వేడుకలు గ్రాండ్ ఫినాలే” సాంస్కృతిక కార్యక్రములో విజేతలకు పాడే అవకాశం ఆటా కల్పిస్తోంది. -
వెర్స్టాపెన్ను వరించిన అదృష్టం... సీజన్లో ఎనిమిదో ‘పోల్’
ఫార్ములావన్ (ఎఫ్1) ఇటాలియన్ గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ వెర్స్టాపెన్ను అదృష్టం వరించింది. మోంజాలో శనివారం జరిగిన క్వాలిఫయింగ్ స్ప్రింట్ రేస్‌లో విజేతగా నిలిచిన బొటాస్ (మెర్సిడెస్)కు గ్రిడ్ పెనాల్టీ పడటంతో రెండో స్థానంలో నిలిచిన వెర్‌స్టాపెన్‌కు పోల్ పొజిషన్ లభించింది. దాంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును వెర్స్టాపెన్ తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. తాజా సీజన్లో వెర్‌స్టాపెన్‌కు ఇది ఎనిమిదో పోల్ కాగా... ఓవరాల్‌గా 11వది. 18 ల్యాప్‌ల పాటు జరిగిన క్వాలిఫయింగ్ స్ప్రింట్ రేస్‌ను బొటాస్ 27 నిమిషాల 54.078 సెకన్లలో పూర్తి చేశాడు. అయితే ఈ రేసు కోసం అతడు నిబంధనలకు విరుద్ధంగా నాలుగో ఇంజిన్‌ను తీసుకోవడంతో గ్రిడ్ పెనాల్టీ విధించారు. దాంతో బొటాస్ ఆదివారం జరిగే రేసును చివరి నుంచి ఆరంభిస్తాడు. -
బిగ్‌బాస్: గ్రాండ్ ఫినాలేకు ముహూర్తం ఖరారు!
వినోదమే కరువైన కాలంలో సరికొత్త ఎంటర్టైన్మెంట్ను పంచుతామంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది బిగ్‌బాస్ నాల్గో సీజన్. కరోనా వల్ల ఈసారి బిగ్‌బాస్ ఉంటుందా? లేదా అనుకునే సమయంలో షో అట్టహాసంగా ప్రారంభమై అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. ఇక ప్రీమియర్ ఎపిసోడ్‌తోనే రికార్డులు బద్ధలు కొట్టిన ఈ షో మొదట్లో నత్తనడకగా సాగినప్పటికీ, రానురానూ వినోదాల విందును పంచుతూ ప్రేక్షకుల ఫేవరెట్‌గా నిలుస్తోంది. స్నేహగీతాలకు సరిహద్దులు చెరిపేస్తూనే కలహ భోజనాలకు కొరత లేకుండా అన్ని ఎమోషన్స్‌ను ఒకే విస్తరిలో సరిసమానంగా వడ్డిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రజాదరణను చూరగొంటున్న ఈ బిగ్‌బాస్ నాల్గో సీజన్ ప్రయాణం ముగింపుకు వస్తోంది. క్రిస్మస్ పండగకు ముందే.. ఈ క్రమంలో గ్రాండ్ ఫినాలే కోసం నిర్వాహకులు అప్పుడే ప్రణాళికలు మొదలు పెట్టేశారట. ఆఖరి ఎపిసోడ్‌కు అతిథులుగా ఎవరెవర్ని పిలవాలి? ఫైనల్లో ఎలాంటి కఠినతరమైన గేమ్స్ ప్రవేశపెట్టాలి? ఎవరి చేతుల మీదుగా ట్రోఫీ అందిచాలి? వంటివాటిపై సమాలోచనలు జరుపుతున్నారట. అంతే కాకుండా పెరుగుతున్న టీఆర్పీ రేటింగ్‌ను దృష్టిలో పెట్టుకుని షోను మరో రెండు వారాలు పొడిగించే ఆలోచనలో బిగ్‌బాస్ టీమ్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే కనక నిజమైతే గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 20న జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజమనేది నాగార్జునే చెప్పాలి. (చదవండి: మీరు అనుమతిస్తే హారికను తీసుకెళ్లిపోతా: అభిజిత్) పంతొమ్మిది మందిలో 8 మందే మిగిలారు కాగా ఇప్పటివరకు జరిగిన సీజన్లను పరిశీలిస్తే మొదటి సీజన్లో విజేతకు జూనియర్ ఎన్టీఆర్ ట్రోఫి అందించగా, రెండో దాంట్లో వెంకటేష్, మూడో సీజన్లో చిరంజీవి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక నాల్గో సీజన్లో పంతొమ్మిది కంటెస్టెంట్లు పాల్గొనగా పదకొండో వారం ముగింపుకు వచ్చేసరికి కేవలం ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. వీరిలో అభిజిత్, సోహైల్, హారిక, అరియానా, మోనాల్, లాస్య నామినేషన్లో ఉండగా మోనాల్, లాస్య డేంజర్ జోన్లో ఉన్నారు. ఆన్లైన్ పోల్స్ అన్నీ కూడా మోనాల్ బ్యాగు సర్దుకోవాల్సిన సమయం ఆసన్నమైందని జోస్యం చెప్తున్నాయి. అయితే నో ఎలిమినేషన్, రీ ఎంట్రీ వంటి అద్భుతాలు జరిగితే మాత్రం వీరికి గండం గట్టెక్కినట్టే. (చదవండి: అభిజిత్‌కు క్లాస్ పీకిన మోనాల్ సోదరి) -
టీఆర్పీలో దుమ్మురేపిన బిగ్‌బాస్ 3 గ్రాండ్ ఫినాలే
హైదరాబాద్ : నాగార్జున-చిరంజీవి కాంబినేషన్లో అట్టహాసంగా జరిగిన బిగ్‌బాస్ 3 తెలుగు సీజన్ గ్రాండ్ ఫినాలే టీవీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. జూనియర్ ఎన్టీఆర్, నానిలు ప్రెజెంట్ చేసిన తొలి రెండు సీజన్ల ఫైనల్స్‌తో పోలిస్తే సీజన్ 3 టీఆర్పీ వాటిని అధిగమించింది. బిగ్‌బాస్ తెలుగు 3 గ్రాండ్‌ఫినాలేను నవంబర్ 3న స్టార్ మా ప్రసారం చేసింది. శ్రీముఖి, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, అలీ రెజాల నుంచి గట్టి పోటీని ఎదుర్కొని రాహుల్ సిప్లీగంజ్ బిగ్‌బాస్ టైటిల్‌ను ఎగరేసుకుపోయిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 గ్రాండ్ఫినాలే టీఆర్పీలు వెల్లడై ఫైనల్ ఎపిసోడ్ ఏ రేంజ్లో వీక్షకులను ఆకట్టుకుందో తేటతెల్లం చేశాయి. నాలుగున్నర గంటల పాటు సాగిన ఫైనల్ ఎపిసోడ్ 18.29 టీఆర్పీ రాబట్టిందని ఈ షో నిర్మాతలైన ఎండెమోల్ షైన్ ఇండియా ట్వీట్ చేసింది. దేశవ్యాప్తంగా అత్యధిక టీఆర్పీ నమోదు చేసిన బిగ్‌బాస్ షో ఇదేనని ట్వీట్ పేర్కొంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1 గ్రాండ్ ఫినాలేకు 14.13 టీఆర్పీ, నాని ప్రెజెంట్ చేసిన సీజన్ 2 ఫినాలే 15.05 టీఆర్పీ రాబట్టాయి. మరోవైపు బిగ్‌బాస్ సీజన్ 3 గ్రాండ్ఫినాలేలో విజేత రాహుల్‌కు చిరంజీవి టైటిల్‌ను ప్రదానం చేసే ఎపిసోడ్ చివరి గంటలో ఏకంగా 22.4 టీఆర్పీ నమోదైనట్టు స్టార్ మా నెట్వర్క్ ఉద్యోగి రాజీవ్ ఆలూరి ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు హీరో శ్రీకాంత్, హీరోయిన్ క్యాథరిన్ త్రెసా సహా పలువురు సెలెబ్రిటీలు బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లో తళుక్కున మెరవడం ఈ షోకు అదనపు ఆకర్షణగా మారడంతో భారీ రేటింగ్‌లు దక్కాయి. -
బిగ్‌బాస్ 3 విన్నర్
-
ఘనంగా సాక్షి ఎరినావన్ గ్రాండ్ ఫినాలె
-
సాక్షి స్పెల్‌బీ ఏపీ గ్రాండ్ ఫైనల్ కేటగిరి - 1
-
31న మిస్ రాజమండ్రి–2016 గ్రాండ్ఫినాలె
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం): ఫ్యూచర్ ఆల్ ఆధ్వర్యంలో సాయి క్రియేటివ్ ఎంటర్టై¯ŒSమెంట్స్ నిర్వహిస్తున్న మిస్ రాజమండ్రి–2016 గ్రాండ్ ఫినాలే ఈనెల 31వ తేదీన హోటల్ షెల్టా¯ŒSలో సాయంత్రం ఆరు గంటల నుంచి జరుగుతుందని సంస్థ ఎండీ గొట్టిపాటిసాయి తెలిపారు. స్థానిక హోటల్ షెల్టా¯ŒSలో మిస్ రాజమండ్రి ఆడిష¯ŒS ఆదివారం నిర్వహించారు. ఈ ఆడిష¯ŒSలో 60 మంది యువతులు పాల్గొనగా 18మందిని ఫైనలిస్టులుగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా గొట్టిపాటి సాయి విలేకరులతో మాట్లాడుతూ ఫైనల్‌కు సెలక్ట్ అయిన యువతులకు హోటల్ షెల్టా¯ŒSలో ఈనెల 31వతేదీ వరకు కొరియోగ్రాఫర్ మోడల్ నీలోఫర్, ఫ్యాష¯ŒS డిజైనర్లు శ్రావణి, దివ్యల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తామన్నారు. వీరు 31 తేదీ సాయంత్రం గ్రాండ్ఫినాలే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. మిస్ రాజమండ్రికి న్యాయనిర్ణేతలుగా వ్యాపారవేత్త స¯ŒSమోహ¯ŒSరెడ్డి, సినీ దర్శకుడు మల్లికార్జున్, హీరోయి¯ŒS అక్ష, మోడల్ మార్గాని భరత్ వ్యవహరిస్తారన్నారు. ఈకార్యక్రమానికి ఈవెంట్హెడ్గా భారతీబేరీ పనిచేస్తారని సాయి తెలిపారు. -
సాక్షి స్పెల్‌బీ గ్రాండ్ ఫినాలే TS కేటగిరీ–4
-
సాక్షి స్పెల్‌బీ గ్రాండ్ ఫినాలే AP కేటగిరీ–4
-
సాక్షి స్పెల్‌బీ గ్రాండ్ ఫినాలే TS కేటగిరీ–3
-
సాక్షి స్పెల్‌బి గ్రాండ్ ఫినాలే AP కాటగిరి -3
-
సాక్షి స్పెల్‌బీ గ్రాండ్ ఫినాలే AP కేటగిరీ–2
-
కోటీశ్వరుడు’కు అతిథిగా చిరంజీవి
బుల్లితెర వీక్షకులను అమితంగా ఆకర్షిస్తున్న షో - ‘మీలో ఎవరు కోటీశ్వరుడు?’ నాగార్జున తొలిసారిగా టీవీ రంగానికి వచ్చి, ఈ పాపులర్ ఫార్మట్ షోకు అతిథేయిగా వ్యవహరించడం జూన్ 9న ప్రారంభమైన ఈ కార్యక్రమానికి కొత్త అందం తెచ్చింది. విపరీతంగా వీక్షకాదరణ సాధించి, టి.ఆర్.పి.లు తెచ్చుకున్న ఈ కార్యక్రమం తొలి సీజన్ ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది. గురువారం రాత్రి 9 గంటలకు ‘మా’ టి.వి.లో ప్రసారం కానున్న 40వ ఎపిసోడ్‌తో ప్రస్తుతానికి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ వీక్షకులకు టాటా... వీడుకోలు చెప్పనుంది. ఈ చివరి భాగానికి చిరంజీవి విశిష్ట అతిథిగా రావడం విశేషం. సామాజిక మార్పు తేవాలన్న దృక్పథంతో చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ‘మా’ టీవీ వర్గాలు తెలిపాయి. అందుకు తగ్గట్లుగానే ఎంతోమంది సామాన్యుల కలల్ని ప్రతిఫలిస్తూ, జీవితాలను మార్చేందుకు తోడ్పడిన ఈ షోలో పాల్గొనేందుకు దాదాపు 11 లక్షల మంది దాకా ఆసక్తి చూపించారు. బిగ్ సినర్జీ సంస్థ ఈ 40 భాగాలను నిర్మించింది. ఈ తొలి సీజన్‌తో షో ముగిసిపోలేదనీ, కొద్ది నెలల విరామంతో రెండో సీజన్ వచ్చే ఏడాదిలో మొదలవుతుందనీ ‘మా’ టీవీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఏమైనా, నాగార్జున, చిరంజీవి కలసి కనిపించే రేపటి ఎపిసోడ్ వీక్షకుల ఆనందాన్ని రెట్టింపు చేయడం ఖాయం. అని వేరే చెప్పాలా?